సై
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
సై | |
---|---|
దర్శకత్వం | రాజమౌళి |
నిర్మాత | ఎ. భారతి |
రచన | రత్నం (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | రాజమౌళి |
కథ | కె. వి. విజయేంద్ర ప్రసాద్ |
నటులు | నితిన్ జెనీలియా డిసౌజా శశాంక్ ప్రదీప్ రావత్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
ఛాయాగ్రహణం | సెంథిల్ కుమార్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
నిర్మాణ సంస్థ | శ్రీ భారత్ ఎంటర్ ప్రైజెస్ |
పంపిణీదారు | శ్రీ భారత్ ఎంటర్ ప్రైజెస్ |
విడుదల | సెప్టెంబరు 23, 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఖర్చు | ₹8 crore (equivalent to ₹23 crore or US$3.2 million in 2019)[1] |
బాక్సాఫీసు | ₹12 crore (equivalent to ₹34 crore or US$4.8 million in 2019)(share) |
సై 2004 లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. నితిన్, జెనీలియా, శశాంక్ ప్రధాన పాత్రలు పోషించారు.[2]
కథ[మార్చు]
పృథ్వి, శశాంక్ హైదరాబాదులోని ఓ కళాశాలలో రెండు విద్యార్థి వర్గాలకు నాయకులు. ప్రతి విషయంలోనూ పోటీ పడుతూ ఒకరిని ఓడించడానికి ఒకరికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. వీళ్ళకి రగ్బీ ఆట అంటే ఇష్టం. ఒక రోజు లోకల్ మాఫియా డాన్ అయిన భిక్షు యాదవ్ వచ్చి ఆ కళాశాల స్థలాన్ని దాని వారసుల నుంచి కొన్నట్లుగా లీగల్ నోటీస్ చూపిస్తాడు. అప్పటి దాకా ఒకరంటే ఒకరికి పడని పృథ్వి, శశాంక్ కాలేజీ స్థలాన్ని కాపాడుకోవడానికి చేతులు కలుపుతారు. తమ స్థలాన్ని తమకు వదిలేయమని తమ తెలివి తేటలు ఉపయోహించి భిక్షు యాదవ్ ని నానా రకాలుగా ఇబ్బందులు పెడతారు. ఇది సహించలేని భిక్షు యాదవ్ రగ్బీ ఆటలో తమను ఓడిస్తే స్థలాన్ని అలాగే వదిలేస్తానని సవాలు విసురుతాడు. పృథ్వి అతని బృందం కలిసి భిక్షు యాదవ్ ని ఓడించి ఎలా తమ కాలేజీని సొంతం చేసుకున్నారన్నది మిగతా కథ.
తారాగణం[మార్చు]
- పృధ్వి గా నితిన్
- జెనీలియా
- శశాంక్ గా శశాంక్
- భిక్షు యాదవ్ గా ప్రదీప్ రావత్
- నల్ల బాలు గా వేణు మాధవ్
- రాజీవ్ కనకాల
- తనికెళ్ళ భరణి
- నాజర్
- సమీర్
- సుప్రీత్
- అజయ్
- ప్రీతి నిగమ్[3][4]
పాటలు[మార్చు]
ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.
- చంటైనా బుజ్జైనా
- గూట్లో ఉంది బెల్లం ముక్క
- నల్ల నల్లని కళ్ళ
మూలాలు[మార్చు]
- ↑ http://www.idlebrain.com/movie/postmortem/chatrapati.html
- ↑ జి. వి., రమణ. "సై సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 19 November 2017.
- ↑ సాక్షి, ఆంధ్రప్రదేశ్ (13 November 2014). "నా జీవితమే ఓ పుస్తకం". Sakshi. Archived from the original on 18 May 2020. Retrieved 18 May 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (17 November 2015). "విలన్‌గా భయపెడుతున్నా". andhrajyothy.com. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020. Check date values in:
|archivedate=
(help)