అజయ్ (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజయ్
జననం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
ఎత్తు6 అ. 3 అం. (191 cమీ.)
జీవిత భాగస్వామిశ్వేత
పిల్లలు2

అజయ్ తెలుగు సినీ నటుడు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలలోనూ, సహాయ పాత్రలు పోషించాడు.

అజయ్ విజయవాడలో జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా నెల్లూరు, తిరుపతి లకు బదిలీ కావడంతో అజయ్ విద్యాభ్యాసం ఈ ప్రాంతాల్లో సాగింది. 1995లో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం హైదరాబాదు, జూబిలీ హిల్స్ లోని ఓ కళాశాలలో చేరాడు. అక్కడే నటన మీద ఆసక్తితో మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరి నటనలో కోర్సు పూర్తి చేశాడు. [1]

కెరీర్

[మార్చు]

అజయ్ తండ్రికి దర్శకుడు వేమూరి జ్యోతి కూమార్ పరిచయం ఉండటంతో మొదటగా కౌరవుడు అనే సినిమాలో అవకాశం వచ్చింది. దాని తరువాత అవకాశాల కోసం తొమ్మిది నెలలు ఎదురు చూడాల్సి వచ్చింది. అంతకు మునుపు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బృందంలో పనిచేసిన శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి సహకారంతో ఖుషి సినిమా నటీనటుల సెలక్షన్ లో ఎంపికయ్యాడు. అందులో అజయ్ చేసిన ఆకతాయి పాత్ర మంచి గుర్తింపునిచ్చింది. [1]

ఖుషి తరువాత మరికొన్ని సినిమాలలో నటించినా అజయ్ కి బాగా గుర్తింపు సాధించిన చిత్రం ఒక్కడు. ఎమ్మెస్ రాజు, రాజమౌళి మొదలైన దర్శకులు తాము రూపొందించిన సినిమాల్లో అజయ్ కు మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించారు. మహేష్ బాబు కెరీర్లో మంచి విజయాల్ని సాధించిన మూడు సినిమాలు ఒక్కడు, అతడు, పోకిరి అన్నింటిలో అజయ్ నటించడం విశేషం.

నటించిన సినిమాలు

[మార్చు]

వెబ్ సిరీస్

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
  1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ఉత్తమ సహాయ నటుడు (ఇష్క్)[8][9][10]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఐడిల్ బ్రెయిన్ లో అజయ్ తో ముఖాముఖి
  2. K, Krishna. "Sneak Peek Into Naveen Chandra's 'Super Over'". TeluguStop.com. Retrieved 2021-02-11.
  3. సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 2020-01-24. Retrieved 24 January 2020.
  4. ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.
  5. The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
  6. Idlebrain, Movie Review (5 June 2009). "Aa Okkadu review". www.idlebrain.com. Archived from the original on 12 December 2019. Retrieved 29 May 2020.
  7. Great Andhra, Movie Review (5 June 2009). "'Aa Okkadu' Review: Not Upto Expectations". greatandhra.com. Venkat Arikatla. Retrieved 29 May 2020.
  8. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/. 2017-03-01. Retrieved 29 June 2020.
  9. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  10. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.

బయటి లింకులు

[మార్చు]