సింహాద్రి (సినిమా)
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
సింహాద్రి (2003 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఎస్.ఎస్.రాజమౌళి |
నిర్మాణం | వి. విజయేంద్ర కుమార్ |
రచన | విజయేంద్ర ప్రసాద్ |
తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్ భూమిక అంకిత నాజర్ |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
విడుదల తేదీ | 9 జూలై 2003 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
పెట్టుబడి | 8.5 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సింహాద్రి 2003 లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన విజయవంతమైన చిత్రం. జూనియర్ ఎన్. టి. ఆర్, భూమిక ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
కథ[మార్చు]
నిర్మాణం[మార్చు]
అభివృద్ధి[మార్చు]
వసంత కోకిల సినిమా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ ను వదిలివెళ్ళిపోయిన సన్నివేశాన్ని గురించి మాట్లాడుకుంటూ "హీరోయిన్ హీరోని వదిలి వెళ్ళిపోతూంటే, గుండెల్లో గునపంతో పొడిచేసినట్టు లేదూ" అని విజయేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యతో ఈ సినిమా కథకు బీజం పడింది. ఆ మాట పట్టుకుని ఆయన అసిస్టెంట్ అమ్మ గణేశ్ హీరోని తాను అమితంగా ప్రేమిస్తున్న హీరోయిన్నే గుండెల్లో గునపంతో పొడిచినట్టుగా కథ రాసుకుందాం అనడంతో అలా చేసేందుకు దారితీసే కారణాలు ఏమిటన్న పద్ధతిలో ఈ కథ రాసుకున్నారు. అయితే కథలో కీలకమైన ఫ్లాష్ బాక్ కు వేరేదైనా ప్రదేశాన్ని నేపథ్యంగా తీసుకోవాలని భావించి కేరళను ఎంచుకున్నారు. ఈ కథని బాలకృష్ణ కథానాయకునిగా బి.గోపాల్ దర్శకత్వంలో సినిమాగా తీద్దామని భావించినా వారు వేరే కథను ఎంచుకోవడంతో దొరైస్వామిరాజా నిర్మాతగా ఈ సినిమా తీస్తానని ముందుకువచ్చారు. దాంతో జూనియర్ ఎన్.టి.ఆర్. కథానాయకునిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయింది.[1]
నటీ నటులు[మార్చు]
- జూనియర్ యన్టీఆర్
- భూమిక
- అంకిత
- నాజర్
- బ్రహ్మానందం
- భానుచందర్
- వేణు మాధవ్
- శరత్ సక్సేనా
పాటలు[మార్చు]
- అమ్మైనా నాన్నైనా
- ఏదేదో సెయ్యమాకే
- చిరాకు అనుకో పరాకు అనుకో
- చీమ చీమ చీమ చీమా
- చిన్నదమ్మే చీకులు కావాలా, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా
- సింగమలై
- నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి
సాంకేతిక సిబ్బంది[మార్చు]
- దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
- సంగీతం: ఎం.ఎం. కీరవాణి
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ సాక్షి, బృందం (8 డిసెంబర్ 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016. Check date values in:
|date=
(help)CS1 maint: discouraged parameter (link)
- CS1 maint: discouraged parameter
- విస్తరించవలసిన వ్యాసాలు
- 2003 తెలుగు సినిమాలు
- ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- జూనియర్ ఎన్.టి.ఆర్ సినిమాలు
- భూమిక నటించిన సినిమాలు
- నాజర్ నటించిన చిత్రాలు
- ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన చిత్రాలు