ఎస్. ఎస్. రాజమౌళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్.ఎస్. రాజమౌళి
ముంబైలో జరిగిన బాహుబలి సినిమా ట్రైలర్ ఆవిష్కరణలో ఎస్. ఎస్. రాజమౌళి
జననం(1973-10-10)1973 అక్టోబరు 10 [1]
వృత్తిసినిమా దర్శకుడు, సినిమా నిర్మాత
జీవిత భాగస్వామిరమా రాజమౌళి
పిల్లలుకార్తికేయ/మయూశ

కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి (జననం: 1973 అక్టోబరు 10 ; వృత్తిపరంగా ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు) భారతీయ సినిమా దర్శకుడు, సినీ రచయిత. అతను ప్రధానంగా తెలుగు సినిమారంగంలో పని చేస్తాడు.[2] అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో అలరించిన మగధీర (2009), టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్గా నిలిచిన ఈగ (2012), అమెరికన్ సాటర్న్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి: ది బిగినింగ్ (2015), ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటర్న్, ఆస్ట్రేలియన్ టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డులనందుకున్న బాహుబలి 2: ది కంక్లూజన్ (2017) వంటి ఫాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ధి చెందాడు.[3][4][5] బాహుబలి ఫ్రాంచైజ్ దాదాపుగా ₹ 1,810 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా సిరీస్‌గా నిలిచింది.[6][7][8][9] అతన్ని భారతీయ చలనచిత్రరంగంలో ఉత్తమ దర్శకులలో ఒకడిగా తరచుగా పరిగణిస్తుంటారు.[10]

అతని ఇతర యాక్షన్ చిత్రాలు సై, విక్రమార్కుడు ప్రధాన స్రవంతి విభాగంలో భారతదేశం 37వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడ్డాయి.[11] మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛత్రపతి చిత్రాలు విజయవంతమైన సమీక్షలతో వివిధ భారతీయ భాషలలో రీమేక్ చేయబడ్డాయి.[12][13] రాజమౌళి మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నాలుగు దక్షిణ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఐదు రాష్ట్ర నంది పురస్కారలు, ఐఫా అవార్డు (IIFA), రెండు సైమా అవార్డులు, స్టార్ వరల్డ్ ఇండియా, 2012లో "ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్", 2015లో " సిఎనెన్-న్యూస్18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్" సహా పలు గౌరవాలు అందుకున్నాడు.[14][15][16] ఆయన కళారంగానికి చేసిన కృషికి ప్రభుత్వం 2016లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది.[17][18]

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌-2023లో రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (2022)కి రెండు నామినేషన్లు దక్కాయి. ఉత్తమ ఆంగ్లేతర చిత్రం విభాగంలోనూ, ఎం. ఎం. కీరవాణి స్వరపరిచిన ‘నాటు నాటు...’ పాటకిగానూ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలోనూ ఈ చిత్రం నామినేట్‌ అయ్యింది.[19] రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట, 2023 మార్చి 13 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[20][21]

జననం

[మార్చు]

తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతలకు 1973లో కర్నాటక రాష్ట్రంలో రాయచూరు జిల్లా అమరేశ్వరి క్యాంప్ లో రాజమౌళి జన్మించాడు. వీరి స్వస్థలం పశ్చమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం. విద్యాభ్యాసం కొవ్వూరు, ఏలూరు, విశాఖ పట్నం లలో జరిగింది. సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి ఇతనికి వరసకు అన్నయ్య అవుతాడు.[22]

సినిమారంగం

[మార్చు]

కె. రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో రాజమౌళి ఈటీవీలో తెలుగు సోప్ ఒపెరాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించాడు. తరువాత, అతను కె. రాఘవేంద్రరావు నిర్మించిన శాంతి నివాసం అనే టీవీ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. 2001 లో జూనియర్ ఎన్టీఆర్తో తీసిన స్టూడెంట్ నెం .1 తెలుగు చిత్రాలలో అతని మొదటి షాట్. రాజమౌళి తన రెండవ చిత్రం సింహాద్రికి రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. స్టూడెంట్ నెం .1, సింహాద్రి మధ్య రెండేళ్ల ఖాళీలో, రాజమౌళి తన మొదటి పౌరాణిక చిత్రాన్ని మలయాళ నటుడు మోహన్ లాల్‌తో ప్లాన్ చేసాడు, కానీ ఆ చిత్రం ఆగిపోయింది.[23] 2015 లో, బాహుబలి కోసం ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ మను జగత్, మోహన్ లాల్ ప్రాజెక్ట్ కోసం తాను గీసిన అనేక స్కెచ్‌లను విడుదల చేశాడు.[24] రాజమౌళి మూడో సినిమా సై, ఇందులో నటులు నితిన్, జెనీలియా డిసౌజా నటించారు. ఇది టాలీవుడ్‌లో ఈ తరహాలో వచ్చిన మొట్టమొదటి చిత్రం, రగ్బీ ఆట ఆధారంగా రూపొందించిన చిత్రం. కెకె సెంథిల్ కుమార్‌తో రాజమౌళి కలిసి పనిచేసిన మొదటి సందర్భం కూడా ఇదే.[25] అతని తదుపరి చిత్రం ఛత్రపతికి కూడా ఎం ఎం కీరవాణి సంగీత స్వరకర్త, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహకుడు.

భారీ విజయం

[మార్చు]

తన తదుపరి మాయాజాలాం విక్రమార్కుడులో రాజమౌళి రవితేజతో పనిచేశాడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది, కన్నడలో వీర మదకారి (2009), తమిళంలో సిరుతై (2011), హిందీలో రౌడీ రాథోర్ (2012) గా రీమేక్ చేయబడింది.[26] ఆ తర్వాత విమర్శకుల ప్రశంసలు పొందిన సోషియో ఫాంటసీ చిత్రం అయిన యమదొంగకు దర్శకత్వం వహించాడు. తరువాత చిత్రం రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ నటించిన ఫాంటసీ-యాక్షన్ చిత్రం మగధీర. మగధీర తెలుగు సినిమా పరిశ్రమలో భారీ వ్యాపార విజయం సాధించిన చిత్రాలలో ఒకటి. అది థియేటర్లలో నడిచిన చివరిరోజులకు అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రంగా నిలిచింది. మగధీరకు రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును, ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు-తెలుగును గెలుచుకున్నాడు. ఈ చిత్రం ఉత్తమ కొరియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలిచింది,[27] నటులను స్టార్‌డమ్‌లోకి ఎత్తింది. అతని యాక్షన్ హాస్య చిత్రం మర్యాద రామన్న (2010) హిందీలో సన్ ఆఫ్ సర్దార్‌గా, తమిళం, కన్నడ, బెంగాలీ, మలయాళం వంటి ఇతర భాషల్లోకి రీమేక్ చేయబడింది.[28][29] 2012 లో రాజమౌళి మా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలో మర్యాద రామన్న తనకు ఇష్టమైన సినిమా అని చెప్పాడు.

మక్కీ- (ఈగ (2012)కు హిందీ డబ్ వెర్షన్) ప్రత్యేక స్క్రీనింగ్ సమయంలో అజయ్ దేవ్గన్, నాని, రాజమౌళి.

రాజమౌళి 2012 యాక్షన్ - ఫాంటసీ చిత్రం ఈగ లె ఎస్ట్రాంజ్ ఫిల్మ్ ఫెస్టివల్లో విమర్శకుల ప్రశంసలను పొందింది.[30][31][32] తెలుగు వెర్షన్ 8వ వార్షిక టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యంత వాస్తవమైన చిత్రం, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ హాస్యం, ఉత్తమ పోరాటాలు, జనంతో చూడటానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ విలన్, ఉత్తమ హీరో అవార్డులను అందుకుంది.[33] అలాగే 2013 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో, 16వ షాంఘై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో, పుచోన్ అంతర్జాతీయ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క పనోరమా విభాగాంలో కూడా ప్రదర్శించబడింది.[34][35][36] ఈ చిత్రం బ్రెజిల్‌లోని ఫాంటాస్‌పోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ కళా దర్శకత్వ పురస్కారాన్ని అందుకుంది.[37] అలాగే, మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ సంగీత కంపోజర్, ఉత్తమ ఎడిటర్, ఉత్తమ సహాయ నటుడు సహా ఆరు అవార్డులకు నామినేట్ అయింది.[38] తమిళ వెర్షన్ నాన్ 10 వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[39][40]

బాహుబలి , రాబోయే ప్రాజెక్ట్‌లు

[మార్చు]
బాహుబలి 2: ది కంక్లూజన్ హిందీ వెర్షన్ ట్రైలర్ విడుదల సమయంలో (ఎడమ నుండి కుడి) అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రాజమౌళి, కరణ్ జోహార్, ప్రభాస్, రానా దగ్గుబాటి.

2015లో, అతను బాహుబలి: ది బిగినింగ్ అనే జానపద యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించాడు, ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా, భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.[41][42][43][44] 100 సంవత్సరాల భారతీయ సినిమాపై సంజీవ్ భాస్కర్ దర్శకత్వం వహించిన బిబిసి డాక్యుమెంటరీలో ఈ చిత్ర నిర్మాణాన్ని ఫీచర్ చేశారు.[45][46][47] ఇది రాజమౌళి డిజిటల్ కెమెరాతో తీసిన మొదటి చిత్రం,అరి అలెక్సా ఎక్స్.టి (XT) అనే కెమెరాను ఉపయోగించారు.[48][49] రాజమౌళి చిత్రాలను ది హాలీవుడ్ రిపోర్టర్, ది గార్డియన్, ది హఫింగ్టన్ పోస్ట్ వంటి అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి .[50][51] అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, హారర ఫిల్మ్స్ 42వ సాటర్న్ అవార్డులలో నాలుగు విభాగాలలో ఈ చిత్రం నామినేట్ అయింది.[52]

బాహుబలి: ది బిగినింగ్, ఓపెన్ సినిమా స్ట్రాండ్ ఆఫ్ బుసాన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ది హేగ్లో,[53] స్పెయిన్‌లో సిట్జెస్ ఫిల్మ్ ఫెస్టివల్లో,[54] ఫ్రాన్స్‌లో ఆదర్శధామ చలన చిత్రోత్సవంలో [55] తైవాన్లోని తైపీలో గోల్డెన్ హార్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో[56] ఎస్టోనియాలో ట్యాలిన్ బ్లాక్ నైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో,[57] పారిస్లో లె 'ఎస్ట్రాంజ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో,[58] పోలాండ్లో ఫైవ్ ఫ్లేవర్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో,[59] హానలూలూలో హవాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో, బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో బ్రస్సెల్స్ అంతర్జాతీయ ఫన్టాస్టిక్ ఫిల్ం ఫెస్టివల్,[60][61], కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది.[62][63] రెండవ భాగం బాహుబలి 2: ది కన్‌క్లూజన్ బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రదర్శించబడింది,[3][64], 39 వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రారంభ చలనచిత్రంగా ప్రదర్శించబడింది.[65][66][67]

రాజమౌళి రాబోయే చిత్రం ఆర్.ఆర్.ఆర్ (2021) భారతీయ విప్లవకారులు, అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఒక చారిత్రక డ్రామా. 400 కోట్ల బడ్జెట్తో నిర్మాణమవ్తున్న ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ జూనియర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ నటిస్తున్నారు.[68]

నటుడు మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి రాజమౌళి కట్టుబడి ఉన్నాడు. ఈ చిత్ర నిర్మాణం 2022 లో ప్రారంభమవుతుంది.[69] భవిష్యత్తులో హిందూ ఇతిహాసం మహాభారతం ఆధారంగా సినిమా చేయాలనే తన ఉద్దేశం గురించి కూడా రాజమౌళి ప్రస్తావించాడు.[70]

దర్శకత్వ శైలి

[మార్చు]

రాజమౌళి సినిమాలలో ఫాంటసీ, హిందూ పురాణాలకు సంబంధించిన ఇతివృత్తాలు ఉంటాయి. పునర్జన్మ ఆలోచనను మొదట మగధీరలో ఉపయోగించాడు, తరువాత ఈగలో కూడా. ఇండియా టుడేకి చెందిన దేవర్సి ఘోష్ గమనించి ఇలా అన్నారు "ఒక అనాథ కథానాయకుడు, ఒక రహస్య ముందుకథ, విడిపోయిన కుటుంబం, ఒక ముఖ్యపాత్ర అతని/ఆమె మూలాలను వెతకడం ఇవి రాజమౌళి చిత్రాలలో అధికంగా ఉంటాయి." [71]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రాజమౌళి 2001లో రమ రాజమౌళిని వివాహం చేసుకున్నాడు. రాజమౌళి చాలా సినిమాలకు రమ దుస్తుల డిజైనర్‌గా పనిచేసింది. రమకు ముందు వివాహంతో కలిగిన కుమారుడు కార్తికేయను రాజమౌళి దత్తత తీసుకున్నాడు. ఈ దంపతులకు దత్తపుత్రిక కూడా ఉంది.[72] కార్తికేయ తెలుగు నటుడు జగపతి బాబు మేనకోడలు పూజా ప్రసాద్‌ని వివాహం చేసుకున్నాడు.[73]

2017 ఏప్రిల్లో రాజమౌళి తాను నాస్తికుడిని అని చెప్పాడు. ఆయన ప్రకారం భక్తి, ఒక బలమైన భావం, దాన్ని తన చిత్రాలలో ఒక కథామూలకంగా ఉపయోగించుకుంటాడు.[74] 2017 మేలో రాజమౌళి తన కుటుంబంతో సహా మంత్రాలయాన్ని సందర్శించాడు, దీవెనల కోసం గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామిని ప్రార్థించాడు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, తన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నందుకు సంతోషంగా ఉందని, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని అన్నాడు.[75]

రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత.[76] ఎన్.టి.ఆర్ (జూనియర్)తో ఇతను తీసిన మూడు చిత్రాలూ అఖండ విజయాన్ని సాధించాయి. తన ప్రతి చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేత ధరింపజేస్తాడు. ఇతని భార్య రమా రాజమౌళి కూడా చిత్ర రంగంలో దుస్తుల రూపకర్తగా ఉంది.

రాజమౌళి తీసిన బాహుబలి (ది బిగినింగ్), బాహుబలి (ది కంక్లూజన్) సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. బాహుబలి (ది కంక్లూజన్) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా 1800 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం.

రాజమౌళి చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం నటీనటులు విశేషాలు
2001 స్టూడెంట్ నంబర్ 1 జూనియర్ ఎన్.టి.ఆర్., గజాలా, రాజీవ్ కనకాల, కోట శ్రీనివాసరావు
2003 సింహాద్రి జూనియర్ ఎన్.టి.ఆర్., భూమిక, అంకిత, నాజర్, ముఖేష్ రిషి
2004 సై నితిన్, జెనీలియా, శశాంక్, రాజీవ్ కనకాల, ప్రదీప్ రావత్
2005 ఛత్రపతి ప్రభాస్, శ్రియా, భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్
2006 విక్రమార్కుడు రవితేజ, అనుష్క శెట్టి, అజయ్, వినీత్ కుమార్, బ్రహ్మానందం
2007 యమదొంగ జూనియర్ ఎన్.టి.ఆర్., ప్రియమణి, మోహన్ బాబు, మమతా మోహన్ దాస్, బ్రహ్మానందం
2009 మగధీర రాం చరణ్ తేజ, కాజల్ అగర్వాల్, శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్
2010 మర్యాద రామన్న సునీల్, సలోని, నాగినీడు, సుప్రీత్, వేణుగోపాల్
2011 రాజన్న అక్కినేని నాగార్జున, స్నేహ, బేబీ అన్నీ పోరాట సన్నివేశాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు
2012 ఈగ నాని, సమంత, సుదీప్ తమిళంలో నాన్ ఈ పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది
2015 బాహుబలి:ది బిగినింగ్ ప్రభాస్, అనుష్క శెట్టి, దగ్గుబాటి రానా 2015 జూలై 10 విడుదలైనది
2017 బాహుబలి: ది కంక్లూషన్ ప్రభాస్, అనుష్క శెట్టి, దగ్గుబాటి రానా 2017 ఏప్రిల్ 28న విడుదలైంది
2021 ఆర్.ఆర్.ఆర్[77] జూ ఎన్టీఆర్,రాం చరణ్,

ఆలియా భట్, ఎడ్గార్‌ జోన్స్‌ ||2022 మార్చి 25 (ఇండియా)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళికు సెల‌బ్రిటీల బ‌ర్త్‌డే విషెస్". నమసతే తెలంగాణ. 10 అక్టోబరు 2020.[permanent dead link]
 2. "SS Rajamouli on Baahubali 2: Sreemukhi is a big fan of Punch Power A.V.S.R Pandu Ranga RaoThe Conclusion, being an atheist and his love for cinema". Firstpost. 27 April 2017. Retrieved 1 May 2017.
 3. 3.0 3.1 "Dangal and Baahubali won Telestra People's choice award in IFFM Melbourne". 12 August 2017.
 4. "63rd National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. 28 March 2016. Retrieved 28 March 2016.
 5. Dave McNary (2018-06-27). "'Black Panther' Leads Saturn Awards; 'Better Call Saul,' 'Twin Peaks' Top TV Trophies – Variety". Variety.com. Retrieved 2019-01-09.
 6. "Bahubali 2 Becomes Highest Grosser Of All Time In Five Days - Box Office India". www.boxofficeindia.com.
 7. "Why Business Of Dubbed Tamil Telugu Not Included - Box Office India". www.boxofficeindia.com.
 8. "Top GROSS Numbers - Hindi And All Languages - Box Office India". www.boxofficeindia.com.
 9. "Is Baahubali 2 a Hindu film? Dissecting religion, folklore, mythology in Rajamouli's epic saga". May 2017.
 10. Negi, Shrishti (2021-04-15). "If Rajamouli Can Cast Me As Naxalite, Why Can't Bollywood See Me Play UPite: Rahul Dev". News, Breaking News, Latest News, News Headlines, Live News, Today News CNN-News18. Retrieved 2021-05-17.
 11. "Directorate of Film Festival" (PDF). iffi.nic.in. Archived from the original (PDF) on 15 April 2016. Retrieved 30 January 2018.
 12. "South director SS Rajamouli wants to direct Aamir Khan - Indian Express". archive.indianexpress.com. Archived from the original on 15 October 2014.
 13. 'SOS' director wants SS Rajamouli to see his film – The Times of India.
 14. "Winner of Indian of the Year 2015 in the Entertainment category: SS Rajamouli". 9 June 2016.
 15. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; youtube1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 16. "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Retrieved 18 March 2013.
 17. "Baahubali director SS Rajamouli to receive Padma Shri Award".
 18. "Padma Awards 2016: Rajinikanth, Priyanka Chopra, Ujjwal Nikam, Saina Nehwal, Sania Mirzia, SS Rajamouli and others honoured". International Business Times, India Edition. 25 January 2016.
 19. "'ఆర్‌ఆర్‌ఆర్‌'కు మరో అంతర్జాతీయ పురస్కారం". web.archive.org. 2022-12-13. Archived from the original on 2022-12-13. Retrieved 2022-12-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 20. https://www.eenadu.net/telugu-news/movies/naatu-naatu-song-wins-oscar-award-2023/0210/123043452
 21. https://telugu.abplive.com/entertainment/cinema/oscar-awards-2023-naatu-naatu-song-from-rrr-movie-wins-95th-academy-award-for-best-original-song-82296
 22. News18 Telugu (18 March 2021). "Rajamouli Relatives: సినీ ఇండ‌స్ట్రీలో వీరంద‌రితో రాజ‌మౌళికి బంధుత్వం ఉంది తెలుసా". Archived from the original on 4 జూలై 2021. Retrieved 4 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 23. Years back S.S Rajamouli planned a movie with Mohanlal – Malayalam Movie News.
 24. Mohanlal SS Rajamouli team’s dropped film’s sketches came out from Manu Jagat.
 25. Son Of Sardar Review.
 26. "South director SS Rajamouli wants to direct Aamir Khan - Indian Express". archive.indianexpress.com. Archived from the original on 15 October 2014.
 27. "57th_National Film Awards" (PDF). Retrieved 28 April 2012.
 28. SS Rajamouli about Maryada Ramanna interview – Telugu Cinema interview Telugu film director.
 29. Singh song | Rajeev Masand – movies that matter : from bollywood, hollywood and everywhere else Archived 2013-03-12 at the Wayback Machine.
 30. "L'ETRANGE 2012: Review of EEGA". Quietearth.us. Archived from the original on 17 అక్టోబర్ 2012. Retrieved 21 October 2012. {{cite news}}: Check date values in: |archive-date= (help)
 31. "Eega Screened at a French Film Festival". chitraloka.com. Archived from the original on 13 జూలై 2015. Retrieved 25 August 2012.
 32. "Eega Gains International Recognition". cinemamama.com. Retrieved 21 July 2012.
 33. "Rajamouli's Eega continues to win awards". The Times of India. 3 November 2013. Retrieved 4 November 2013.
 34. "SS Rajamouli's Eega to be screened at Cannes, Shanghai film festivals". bollywoodlife.com. 15 May 2013. Retrieved 15 May 2013.
 35. "'Makkhi' Review: Revenge comes in all sizes!". Zeenews.india.com. Archived from the original on 14 అక్టోబరు 2012. Retrieved 13 October 2012.
 36. Eega to be screened at Cannes!. 123telugu.com.
 37. "Ravinder Reddy Wins Big in Brazil". indiaglitz.com. 10 August 2013. Retrieved 11 August 2013.
 38. Shiva Prasad (16 May 2013). "After Cannes; Eega heads to Madrid & Korea". The Times of India. Archived from the original on 2 November 2013. Retrieved 16 May 2013.
 39. "Rajamouli's Eega to be screened at Chennai Film Festival". 123telugu.com. Retrieved 5 November 2012.
 40. "Rajamouli's 'Eega' wins National Awards". 123telugu.com. 18 March 2013. Retrieved 18 March 2013.
 41. Cain, Rob (14 August 2015). "Oops... 'PK' Is Not Actually India's Top-Grossing Movie Ever". Forbes.
 42. 'Baahubali' Zooms Past 'Dhoom', Now India's All Time #3.
 43. India's most expensive film? | regional movies.
 44. Rajamouli's Bahubali is India’s costliest film?
 45. "Rajamouli-Prabhas new movie budget". The Times of India. 14 October 2012. Archived from the original on 3 May 2013. Retrieved 23 February 2013.
 46. "Baahubali's team gets a rare honour". The Times of India. 21 May 2014. Retrieved 19 July 2014.
 47. "Rajamouli's Bahubali finds place in BBC's documentary". The Hans India. 22 May 2014. Retrieved 19 July 2014.
 48. "Rajamouli goes digital for Bahubali". The Times of India. 26 June 2014. Retrieved 19 July 2014.
 49. "'Baahubali' movie release date". IndiaGlitz. 17 June 2014. Retrieved 23 June 2014.
 50. Tsering, Lisa (13 July 2015). "'Bahubali': Film Review". Retrieved 1 August 2015.
 51. McCahill, Mike (12 July 2015). "Baahubali: The Beginning review – fantastic bang for your buck in most expensive Indian movie ever made". the Guardian. Retrieved 1 August 2015.
 52. "'Baahubali: The Beginning' Review: A Giddy Spectacle, If Somewhat Uneven". The Huffington Post. Retrieved 1 August 2015.
 53. "Busan: Final 'Baahubali' Aims to Be Bigger, More Emotional". Variety. 5 October 2015. Retrieved 22 October 2015.
 54. "Sitges Film Festival » Baahubali – The Beginning". sitgesfilmfestival.com. Retrieved 22 October 2015.
 55. "BAAHUBALI : THE BEGINNING | Utopiales • International Festival of science fiction of Nantes". www.utopiales.org. Archived from the original on 31 January 2016. Retrieved 2015-11-10.
 56. "2015 台北金馬影展 Taipei Golden Horse Film Festival | 巴霍巴利王:創始之初". www.goldenhorse.org.tw. Retrieved 2015-11-10.
 57. "Baahubali: The Beginning — Special Screenings — Black Nights Film Festival Nov 13 - 29 nov 2015". 2015.poff.ee. Archived from the original on 2015-11-14. Retrieved 2015-11-13.
 58. "L'Étrange Festival — XXIe édition — Du 3 au 13 septembre 2015 - Baahubali: The Beginning". www.etrangefestival.com. Archived from the original on 5 March 2016. Retrieved 2015-12-06.
 59. "Festiwal Filmowy Pięć Smaków — Bahubali: Początek". www.piecsmakow.pl. Retrieved 2015-12-06.
 60. "Baahubali To Be Screened At Brussels International Fantastic Film Festival". FitnHit.com. Archived from the original on 2016-10-05. Retrieved 2021-09-12.
 61. "BAAHUBALI-THE BEGINNING - 2015 HIFF Fall Festival". program.hiff.org. Archived from the original on 17 November 2015. Retrieved 2015-11-15.
 62. "Baahubali: The Beginning team heads to Cannes". The Indian Express. 9 May 2016.
 63. "'Baahubali' nominated for Saturn Awards in five categories". The Indian Express. 27 February 2016.
 64. "Baahubali 2 premiere: Queen Elizabeth II will watch it before anybody else in India?". The Indian Express (in ఇంగ్లీష్). 2017-02-28. Retrieved 2020-10-05.
 65. "Baahubali 2 honoured again, to open Moscow International Film Festival". www.msn.com.
 66. "Baahubali 2 premiere: Queen Elizabeth II will watch it before anybody else in India?". 28 February 2017.
 67. "Baahubali, Bajrangi Bhaijaan: Meet the Rs 500 crore writer". India Today (in ఇంగ్లీష్). 2015-07-20. Retrieved 22 October 2018.
 68. Purushothaman, Kirubhakar (14 March 2019). "RRR: Story, budget, full cast and all you need to know about SS Rajamouli film". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-03-05.
 69. "SS Rajamouli confirms film with Mahesh Babu". The News Minute (in ఇంగ్లీష్). 2020-04-20. Retrieved 2021-03-05.
 70. "When S.S. Rajamouli talked about making a film on the epic Mahabharata". Zoom. Retrieved 2021-03-05.
 71. DelhiApril 25, Devarsi Ghosh New; April 25, 2017UPDATED; Ist, 2017 15:34. "How Baahubali's themes are tied to SS Rajamouli's entire filmography". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
 72. Kavirayani, Suresh (11 February 2014). "We are Family". Deccan Chronicle. Retrieved 11 May 2021 – via Pressreader.
 73. "Baahubali director SS Rajamouli's son Karthikeya to marry Pooja Prasad in Jaipur". India Today (in ఇంగ్లీష్). 28 December 2018. Retrieved 2020-12-04.
 74. "SS Rajamouli on Baahubali 2: The Conclusion, being an atheist and his love for cinema". Firstpost. 27 April 2017. Retrieved 1 May 2017.
 75. "Rajamouli visits Mantralayam". The Hans India. 16 May 2017.
 76. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-24. Retrieved 2013-06-22.
 77. "RRR Movie: SS Rajamouli's film is Back to the Shoot". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-06. Retrieved 2020-10-11.
 78. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
 79. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
 80. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
 81. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
 82. Andhra Jyothy (17 September 2023). "దక్షిణాది చిత్రాల ప్రతిభ పట్టం..!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.