ప్రభాస్
ప్రభాస్ | |
|---|---|
ప్రభాస్ | |
| జననం | ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు 1979 అక్టోబరు 23 భీమవరం, ఆంధ్రప్రదేశ్ |
| ఇతర పేర్లు | డార్లింగ్, ప్రభాస్ |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2002–ఇప్పటివరకు |
| ఎత్తు | 6′ 2½”[1][2] |
| Parent(s) | సూర్యనారాయణ రాజు శివ కుమారి |
ప్రభాస్గా సుపరిచితుడైన ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక సినీ నటుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.[3]ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు తన స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. నటులు గోపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్ కు మంచి స్నేహితులు. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి.ఎన్.ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తిచేశారు. బి.టెక్ హైదరాబాద్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తిచేశారు.[4] ప్రభాస్ చదువులో సగటు విద్యార్థి. బాస్కెట్ బాల్, వాలీబాల్ లాంటి ఆటల మీద ఆసక్తి చూపేవాడు.[5]
సినీ జీవితం
[మార్చు]2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేసాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో ఇది తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిష సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్ కు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్ కు నటుడిగా మంచి గుర్తింపు లభించినా పరాజయం పాలయ్యాయి. 2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ శ్రియా సరసన ఛత్రపతి సినిమాలో నటించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ప్రభాస్ ను తెలుగులో ఒక నటుడిగా నిలబట్టింది. కానీ ఆ తర్వాత విడుదలైన పౌర్ణమి, యోగి సినిమాలు పరాజయం చెందాయి. ఆ తర్వాత ప్రభాస్ ఇలియానా సరసన పైడిపల్లి వంశీ దర్శకత్వంలో మున్నా సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2008లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరియర్ లో రెండో సారి బుజ్జిగాడు సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా విజయం సాధించింది.
2009లో మెహెర్ రమేష్ దర్శకత్వంలో అనుష్క, నమితల సరసన బిల్లా సినిమాలో నటించాడు. ఒక క్రూరమైన డాన్ మరియూ అతనిలాగే ఉండే ఒక చిల్లరదొంగ పాత్రల్లో ప్రభాస్ నటించాడు. ఈ సినిమా తనకు గుర్తింపునిచ్చినా సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విడుదలైన ఏక్ నిరంజన్ కూడా పరాజయం పాలైంది. 2010లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సరసన డార్లింగ్ సినిమాలో నటించాడు. తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ తో కలిసి దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలో నటించాడు ప్రభాస్. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.
2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమన్నా, దీక్షా సేథ్ దర్శకత్వంలో రెబెల్ సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా కథ బాగున్నప్పటికి పరాజయం పాలైంది. 2013లో రచయిత కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొవటంతో పాటు ప్రభాస్ ను ఒక కొత్తగా చూపించడం జరిగింది. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతో కలసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం "బాహుబలి - ది బిగినింగ్" తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో జూలై 10 న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. ప్రస్తుతం ప్రభాస్ 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రం 2019లో విడుదలయింది. 2021 లో ప్రభాస్ నటించిన రాథే శ్యామ్ విడుదల కానుండగా, 2022 లో సలార్, ఆదిపురుష్ సినిమాలు విడుదల కానున్నాయి.[6] మరో వైపు వైజయంతీ బ్యానర్ పై దీపికా పడుకోణె తో కలిసి సినిమా చేయనున్నారు, దీనికి వర్కింగ్ టైటిల్ గా ప్రాజెక్ట్ కె అని పెట్టడం జరిగింది. సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని రెండు భాగాలుగా మన ముందు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక రెండవ పార్ట్ శౌర్యంగపర్వం[7] అనే టైటిల్ తో సలార్ సినిమా కి కొనసాగింపుగా మన ముందు వస్తుంది ఇక ఈ సినిమా గురించి అతి త్వరలో మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి.

రాబోయే ప్రాజెక్టులు
[మార్చు]ప్రభాస్ నిర్మాణంలో వివిధ దశల్లో అనేక రాబోయే చిత్రాలు ఉన్నాయి. ఏప్రిల్ 2025లో, అతను కన్నప్ప అనే పౌరాణిక నాటకంలో అతిధి పాత్రలో మరియు ది రాజా సాబ్ అనే రొమాంటిక్ హర్రర్-కామెడీలో నటించనున్నాడు, ఇందులో అతను పూర్వీకుల ఆస్తి వివాద కథలో ప్రధాన పాత్రను పోషిస్తాడు. 2026లో, ప్రభాస్ సాలార్: పార్ట్ 2 - శౌర్యాంగ పర్వం, సాలార్ యొక్క సీక్వెల్; మరియు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యాంటీ-హీరో గ్రైండ్‌హౌస్ డ్రామా స్పిరిట్. 2027లో, అతను ఇతిహాస డిస్టోపియన్ సైన్స్-ఫిక్షన్ కల్కి 2898 AD - పార్ట్ 2లో ప్రధాన కథానాయకుడిగా తన పాత్రను తిరిగి పోషించబోతున్నాడు, ఇందులో భైరవ మరియు కర్ణుడి ద్విపాత్రాభినయం; మరియు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన దేశభక్తి చారిత్రక యాక్షన్-డ్రామా చిత్రం ఫౌజీ ఉన్నాయి.
KGF, కాంతారా, మరియు సాలార్ వంటి ప్రముఖ విజయాలకు కారణమైన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ భాగస్వామ్యం 2026లో సాలార్: పార్ట్ 2 - శౌర్యాంగ పర్వం తో ప్రారంభమవుతుంది, తరువాత పేరులేని చిత్రాలు 2027 మరియు 2028లో విడుదల కానున్నాయి.
నటించిన చిత్రాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర (లు) | భాష | ఇతర విశేషాలు |
|---|---|---|---|---|
| 2002 | ఈశ్వర్ | ఈశ్వర్ | తెలుగు | |
| 2003 | రాఘవేంద్ర | రాఘవేంద్ర | తెలుగు | |
| 2004 | వర్షం | వెంకట్ | తెలుగు | |
| 2004 | అడవి రాముడు | రాము | తెలుగు | |
| 2005 | చక్రం | చక్రం | తెలుగు | |
| 2005 | ఛత్రపతి | శివాజి
ఛత్రపతి |
తెలుగు | |
| 2006 | పౌర్ణమి | శివకేశవ | తెలుగు | |
| 2007 | యోగి | ఈశ్వర్ ప్రసాద్
యోగి |
తెలుగు | |
| 2007 | మున్నా | మున్నా | తెలుగు | |
| 2008 | బుజ్జిగాడు | బుజ్జి
లింగరాజు |
తెలుగు | |
| 2009 | బిల్లా | బిల్లా, రంగా |
తెలుగు | |
| 2009 | ఏక్ నిరంజన్ | నిరంజన్, ఛోటు | తెలుగు | |
| 2010 | డార్లింగ్ | ప్రభాస్ | తెలుగు | |
| 2011 | మిస్టర్ పర్‌ఫెక్ట్ | విక్కీ | తెలుగు | |
| 2012 | రెబెల్ | ఋషి | తెలుగు | |
| 2013 | మిర్చి | జయ్ | తెలుగు | |
| 2015 | బాహుబలి:ద బిగినింగ్ | అమరేంద్ర బాహుబలి, శివుడు | తెలుగు, తమిళం, హిందీ మలయాళం | |
| 2017 | బాహుబలి 2: ది కన్ క్లూజన్ | అమరేంద్ర బాహుబలి, శివుడు | తెలుగు, తమిళం, హిందీ |
|
| 2019 | సాహో | సిద్ధార్ధ్ నందన్ సాహో | తెలుగు, హిందీ, తమిళం, మలయాళం | |
| 2022 | రాధే శ్యామ్[8] | విక్రమాదిత్య | ||
| 2023 | ఆదిపురుష్ | రాఘవ (శ్రీరాముడు) | ||
| సాలార్ | దేవరత "దేవ" రైసార్ అలియాస్ సాలార్ | తెలుగు | ||
| 2024 | కల్కి 2898 ఏ.డీ | భైరవ మరియు కర్ణ | ||
| 2025 | కన్నప్ప | రుద్ర | అతిధి పాత్ర | |
| మిరాయ్ | కథకుడు | వాయిస్ ఓవర్ | ||
| 2025 | బాహుబలి: ది ఎపిక్ | అమరేంద్ర బాహుబలి & మహేంద్ర బాహుబలి | బాహుబలి: ది బిగినింగ్ & బాహుబలి 2: ది కన్‌క్లూజన్ సంయుక్త పునఃవిడుదల వెర్షన్ ; పోస్ట్-ప్రొడక్షన్ మెరుగుదలలు ఉన్నాయి. | [9] |
| 2026 | ది రాజా సాబ్ † | టిబిఎ | పోస్ట్-ప్రొడక్షన్ | |
| 2026 | ఫౌజీ † | జై అహ్లావత్ | చిత్రీకరణ | |
| ఆత్మ † | ACP అర్జున్ ఖన్నా | ప్రీ-ప్రొడక్షన్ | ||
అవార్డులు & పురస్కారాలు
[మార్చు]| సంవత్సరం | అవార్డ్ | క్యాటెగరీ | చిత్రం | ఫలితం |
|---|---|---|---|---|
| 2004 | సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ యువ నటుడు | వర్షం | విజేత |
| 2004 | దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | వర్షం | పేర్కొనబడ్డాడు |
| 2005 | దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | ఛత్రపతి | పేర్కొనబడ్డాడు |
| 2009 | దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | ఏక్ నిరంజన్ | పేర్కొనబడ్డాడు |
| 2010 | సినీ"మా" అవార్డ్స్ | ఉత్తమ నటుడు - జ్యూరీ | డార్లింగ్ | విజేత |
| 2011 | దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | మిస్టర్ పర్‌ఫెక్ట్ | పేర్కొనబడ్డాడు |
| 2012 | దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్స్ | ఉత్తమ నటుడు | మిస్టర్ పర్‌ఫెక్ట్' | పేర్కొనబడ్డాడు |
| 2013 | నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు | ఉత్తమ నటుడు[10][11][12][13] | మిర్చి | విజేత |
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-10. Retrieved 2018-01-31.
- ↑ [1]
- ↑ "ప్రభాస్ రాజు ఉప్పలపాటి". Short Bio. Archived from the original on 2013-09-26. Retrieved 2013-10-11.
- ↑ [2][3][permanent dead link]
- ↑ "Prabhas: 'నువ్వు హీరో ఏంట్రా బాబూ అన్నాడు'.. ప్రభాస్ గురించి మీకివి తెలుసా?". EENADU. Retrieved 2024-10-23.
- ↑ "Prabhas Upcoming Movies List". Tollywood Ace (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-07-25.
{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ sravya (2023-12-23). "సలార్ పార్ట్ 2 టైటిల్ విన్నారా..? ఎంత పవర్ఫుల్ గా వుందో... స్టోరీ ఏమిటంటే..?". Telugu Action (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-12-23. Retrieved 2023-12-23.
- ↑ Boy, Zupp (2020-07-10). "RadheShyam first look: Prabhas-Pooja Hedge pair looks Romantic". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-11-12. Retrieved 2020-10-11.
- ↑ "A decade of 'Baahubali': SS Rajamouli's two-part saga set for re-release" (in Indian English). The Hindu. 10 July 2025. Archived from the original on 15 October 2025. Retrieved 15 October 2025.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
[[వర్గం:సినీ వారసత్వం గల తెలుగు సినిమా వ్యక్తులు]