దీపికా పడుకోణె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీపిక పదుకొణె
Padukone in 2009.jpg
జననం (1986-01-05) 1986 జనవరి 5 (వయస్సు 35)
Copenhagen, Denmark
క్రియాశీలక సంవత్సరాలు 2004–ప్రస్తుతం
భార్య/భర్త రణ్ వీర్ సింగ్
Filmfare Awards
Best Female Debut
2008: Om Shanti Om
Face of the Year
2008: Om Shanti Om

దీపిక పడుకోన్ లేదా దీపికా పడుకోణె (కన్నడ): ದೀಪಿಕಾ ಪಡುಕೋಣೆ; పుట్టిన తేది జనవరి 5, 1986) భారతీయ సూపర్ మోడల్, బాలీవుడ్ నటి. 2018 లో నటుడు రణ్ వీర్ సింగ్ ని వివాహమాడింది.

బాల్యము, విద్య[మార్చు]

పడుకోణె డెన్మార్క్ లోని కోపెన్ హగెన్లో ఉజ్వల, ప్రకాష్ పడుకోనె దంపతులకు జనవరి 5, 1986లో జన్మించింది. ఆమె కుటుంబం ఇండియాలోని బెంగుళూరుకు మారినపుడు ఆమెకు పదకొండు నెలలు.[1] ఆమె తలిదండ్రులు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కుందపురా తాలుకాకు చెందిన పడుకోణె అనే ఊరికి చెందినవారు.[2] ఆమె తండ్రి, ప్రకాష్ పడుకోణె, అంతర్జాతీయ ఖ్యాతిగల బ్యాడ్మింటన్ ఆటగాడు, తల్లి ఒక ట్రావెల్ ఏజెంట్. పడుకోణెకి 1991లో పుట్టిన అనిష అని ఒక చెల్లి, 1993లో పుట్టిన ఆదర్శ అని తమ్ముడు ఉన్నారు.[3]

పడుకోణె బెంగుళూరులోని సోఫియా ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ఆమె బెంగుళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ కోర్సు చదువు పూర్తి చేసింది.[4] హైస్కూల్లో ఉన్నపుడు ఆమె తన తండ్రిలానే రాష్ట్రస్థాయిలో బ్యాడ్మింటన్ ఆడింది. అలాగే, తన తండ్రి బ్యాడ్మింటన్ క్లబ్‌లో సభ్యురాలు.[5] కానీ, తన కెరీర్‌ని ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా మలచుకోవడంపై ఆసక్తి లేకపోవడం, తన ఐసిఎస్ఇ (ICSE) పరీక్షలపై దృష్టితో దాన్ని వదిలేసింది.[6]

కెరీర్[మార్చు]

మోడలింగ్[మార్చు]

కాలేజీ రోజుల్లో ఉండగా పడుకోణె మోడలింగ్‌ని కెరీర్‌గా ఎంచుకుంది.[7] కొద్ది సంవత్సరాల్లో, ఆమె ప్రముఖ ఉత్పత్తులైన లిరిల్ (Liril), డాబర్ (Dabur), లాల్ పౌడర్, క్లోసప్ టూత్ పేస్టు, లిమ్కాలకి మోడలింగ్ చేసింది. ఇండియా రిటైల్ జ్యువెలరీ షో యొక్క ఆభరణములకు "బ్రాండ్ అంబాసిడర్"గా కూడా వ్యవహరించింది.[ఆధారం చూపాలి]మేబెల్లిన్ (Maybelline) అనే కాస్మెటిక్స్ కంపెనీ ఆమెను అంతర్జాతియ అధికార ప్రతినిధిగా నియమించుకుంది.[ఆధారం చూపాలి]

అయిదవ వార్షిక కింగ్ ఫిషర్ (Kingfisher) ఫ్యాషన్ అవార్డులలో ఆమెకు "మోడల్ అఫ్ ది ఇయర్" అవార్డు లభించింది.[ఆధారం చూపాలి]కొన్నాళ్ళలోనే, కింగ్ ఫిషర్ స్విం సూట్ కాలెండరు 2006కి ఒక మోడల్‌గా తీసుకునబడింది, ఐడియా జీ ఫ్యాషన్ అవార్డులలో రెండు ట్రోఫీలు గెలిచింది: "ఫిమేల్ మోడల్ అఫ్ ది ఇయర్ - (కమర్షియల్ అసైన్ మెంట్స్)", "ఫ్రెష్ ఫేస్ అఫ్ ది ఇయర్".[ఆధారం చూపాలి]పడుకోణె కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ (Kingfisher Airlines), ఆ తరువాత లేవి స్ట్రాస్ (Levi Strauss), టిస్సోట్ ఎస్ ఎ (Tissot SA) లకు బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకొనబడింది.[8]

నటన[మార్చు]

మోడలింగ్‌లో విజయవంతమైన తరువాత, పడుకోణె నటన వైపు దృష్టి సారించింది. ఆమె హిమేష్ రేషమ్మియా తీసిన స్వతంత్ర ఆల్బం ఆప్ కా సురూర్ (Aap Kaa Surroor)లోని నాం హై తేరాఅనే పాటకి మ్యూజిక్ వీడియోలో నటించడం ద్వారా తన కెరీర్‌ని మొదలుపెట్టింది.

2006లో, పడుకోణె ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా ఐశ్వర్యతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె 2007లో షారుఖ్ ఖాన్ హీరోగా ఫరాఖాన్ తీసిన విజయవంతమైన బాలీవుడ్ (Bollywood) చిత్రం ఓం శాంతి ఓం (Om Shanti Om)లో నటించింది.[9][10] ఆ సినిమాలో ఆమె 1970లలో సినీతార శాంతిప్రియగాను ఆ తరువాత అచ్చం శాంతి ప్రియని పోలి ఉండే సంధ్య అనే యువతిగాను చూపించ బడింది. ఆమె ప్రదర్శనకు గాను సానుకూల స్పందన లభించి, ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు (Filmfare Best Female Debut Award) సంపాదించి పెట్టింది. ఆలానే ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి (Filmfare Best Actress)కి గాను నామినేట్ అయింది. ఇండియాఎఫ్ఎం (indiaFM)కి చెందిన తరణ్ ఆదర్శ్ (Taran Adarsh) ఇలా అన్నాడు, "ఒక పెద్ద స్టార్ అవడానికి దీపికకు అన్ని అర్హతలు ఉన్నాయి - వ్యక్తిత్వం, కనిపించే తీరు, ఇంకా ఆమె ఎంతో ప్రతిభావంతురాలు కూడా."యస్ ఆర్ కె తో కలిసి ఒకే ఫ్రేములో నిలబడటం, దాన్ని సరిగ్గా చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఆమె వస్తుంటే స్వచ్ఛమైన చిరుగాలి వస్తున్నట్టుగా ఉంటుంది!"[11]

ఆ తరువాత పడుకోణె సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) సినిమా బచ్నా ఏ హసీనో (Bachna Ae Haseeno) (2008) లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)తోనూ, వార్నర్ బ్రదర్స్ (Warner Bros.)-బాలీవుడ్ కలిసి తీసిన, జనవరి 16, 2009లో విడుదల అయిన చాందిని చోవ్క్ టు చైనా (Chandni Chowk To China)లోనూ కనిపించింది. జనవరి 2009 గాను, ఆమె ఇంతియాజ్ అలీ (Imtiaz Ali) సినిమా లవ్ ఆజ్ కల్ (Love Aaj Kal)లో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)తో కలిసి చేస్తుంది.

అవార్డులు, నామినేషన్లు[మార్చు]

ఫిల్మ్ ఫేర్ అవార్డులు[మార్చు]

విజేత

నామినేట్ అయినది

స్టార్ స్క్రీన్ అవార్డులు[మార్చు]

విజేత

జీ సినీ అవార్డులు (Zee Cine Awards)[మార్చు]

విజేత

నామినేట్ అయ్యెను

ఐ ఐ యఫ్ ఎ అవార్డులు (IIFA Awards)[మార్చు]

విజేత

నామినేట్ అయ్యెను

స్టార్ డస్ట్ అవార్డులు (Stardust Awards)[మార్చు]

నామినేట్ అయ్యెను

అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులు[మార్చు]

విజేత

 • 2008: అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులు ' బెస్ట్ ఫిమేల్ డిబట్; ఓం శాంతి ఓం (Om Shanti Om)[20]

ఇతర అవార్డులు[మార్చు]

 • 2007: స్టార్స్' సబ్సే ఫేవరేట్ కౌన్ అవార్డులు, సబ్సే ఫేవరేట్ నయీ హీరోయిన్; ఓం శాంతి ఓం (Om Shanti Om)[21]
 • 2007: ఎచ్ టి కేఫ్ ఫిల్మ్ అవార్డులు, బెస్ట్ న్యూకమర్ అవార్డు (ఫిమేల్) ; ఓం శాంతి ఓం (Om Shanti Om)[22]
 • 2008: రీబక్ జూమ్ గ్లాం అవార్డులు, గ్లాం డెబ్యూటంట్ (ఫిమేల్) ; ఓం శాంతి ఓం (Om Shanti Om)[23]
 • 2008: అన్యుఅల్ సెంట్రల్ యురోపియన్ బాలీవుడ్ అవార్డులు, బ్రేక్ త్రూ రోల్ (ఫిమేల్) ; ఓం శాంతి ఓం (Om Shanti Om)[24]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరము సినిమా పాత్ర ఇతరములు
2006 ఐశ్వర్య (Aishwarya) ఐశ్వర్య కన్నడ (Kannada) సినిమా
2007 ఓం శాంతి ఓం (Om Shanti Om) శాంతిప్రియ
సంధ్యా (స్యాండీ)
డబుల్-విన్నర్, ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డిబట్ అవార్డు (Filmfare Best Female Debut Award) &
సోనీ హెడ్ అండ్ శోల్డర్స్ ఫ్రెష్ ఫేస్ అఫ్ ది ఇయర్.
ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డు (Filmfare Best Actress Award)కి నామినేట్ అయింది.
2008 బచ్నా ఏ హసీనో (Bachna Ae Haseeno) గాయత్రి
rowspan="3" 2009 చాందిని చోవ్క్ టు చైనా (Chandni Chowk To China) సఖి/మ్యావ్ మ్యావ్ ద్విపాత్రాభినయం
బిల్లు (Billu) ఆమెకు లానే లవ్ మేరా హిట్ హిట్ పాటలో ప్రత్యేక ప్రదర్శన
లవ్ ఆజ్ కల్ (Love Aaj Kal) మీరా చిత్రీకరణలో ఉంది

ఇతరములు[మార్చు]

 1. "A smashing success". Newindpress.com. Retrieved 2005-06-24.[permanent dead link]
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-16. Retrieved 2009-06-16.
 3. "'I'm completely charmed by Ranbir'". Times of India (Chaturvedi, Vinita). Retrieved 2008-08-29.
 4. http://entertainment.oneindia.in/celebrities/star-profile/deepika-padukone-profile-040907.html
 5. "Transcript of LIVE CHAT with Model, Deepika Padukone at 12 noon on Thursday, March 3, 2005 in Mumbai". Indiatimes.com. Archived from the original on 2007-12-19. Retrieved 2005-03-03.
 6. "Deepika Padukone - Biography". DeepikaPadukone.com. Archived from the original on 2008-04-10. Retrieved 2008-04-12.
 7. "Smash hit on the ramp". Indiatimes.
 8. "Buy Deepika Padukone's pair of jeans". oneindia.com.
 9. "Box Office 2007". BoxOffice India.com. Archived from the original on 2012-07-30. Retrieved March 7. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help); Check date values in: |accessdate= (help)
 10. "Overseas Earnings (Figures in Ind Rs)". BoxOffice India.com. Archived from the original on 2012-05-25. Retrieved March 7. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help); Check date values in: |accessdate= (help)
 11. Adarsh, Taran (November 7, 2007). "Movie Review: Om Shanti Om". IndiaFM. Retrieved 2007-12-18.
 12. 12.0 12.1 Bollywood Hungama News Network (February 23, 2008). "Winners of 53rd Fair One Filmfare Awards". IndiaFM. Archived from the original on 2008-02-25. Retrieved 2008-02-23.
 13. Bollywood Hungama News Network (February 6, 2008). "Nominees - 53rd Annual Filmfare Awards". IndiaFM. Archived from the original on 2008-02-15. Retrieved 2008-02-06.
 14. 14.0 14.1 IBNLive.com (January 10, 2008). "Taare... sweeps Screen Awards, but Chak De named best film". CNN-IBN. Retrieved 2008-01-10.
 15. Bollywood Hungama News Network (April 27, 2008). "Winners of the Zee Cine Awards 2008". IndiaFM. Archived from the original on 2011-08-14. Retrieved 2008-04-27.
 16. Nijjar, Lucky (March 29, 2008). "ZEE Cine Awards nominations list announced". Biz Asia. Archived from the original on 2011-07-16. Retrieved 2008-04-01.
 17. "And the award goes to..." IBNLive. June 9, 2008. Retrieved 2008-06-08.
 18. Bollywood Hungama News Network (April 16, 2008). "Nominations for the IIFA Awards 2008". IndiaFM. Archived from the original on 2008-07-25. Retrieved 2008-06-08.
 19. IndiaFM News Bureau (December 25, 2007). "Nominations for Max Stardust Awards 2008". IndiaFM. Archived from the original on 2008-05-23. Retrieved 2007-12-31.
 20. PTI (March 31, 2008). "'Chak De..' has a field day at Producers Guild Awards". The Hindu. Archived from the original on 2013-10-23. Retrieved 2008-04-01.
 21. Indiantelevision.com Team (December 24, 2007). "SRK is Star Gold's 'Sabsey' favourite hero". Indiantelevision.com. Retrieved 2007-12-24.
 22. Kotwani, Hiren (December 30, 2007). "Starry debut for HT Café Film Awards". Hindustan Times. Archived from the original on 2012-06-30. Retrieved 2007-12-31.
 23. TNN (January 16, 2008). "Deepika:2008 Glam Debutante". The Times of India. Retrieved 2008-01-15.
 24. IANS (March 11, 2008). "OSO sweeps Central European Awards". Sify. Archived from the original on 2008-03-14. Retrieved 2008-03-11.

ఇది కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]