సైఫ్ అలీ ఖాన్
స్వరూపం
సైఫ్ అలీ ఖాన్ | |
|---|---|
జూలై 2012, ఇంపీరియల్, కొత్త ఢిల్లీ వద్ద ఖాన్ | |
| జననం | సాజిద్ అలీ ఖాన్ 1970 ఆగస్టు 16 |
| జాతీయత | |
| వృత్తి | నటుడు, నిర్మాత |
| క్రియాశీలక సంవత్సరాలు | 1992–present |
| భాగస్వామి | అమృతా సింగ్ (1991–2004; విడాకులు) కరీనా కపూర్ (2012–ఇప్పటి వరకు) |
| పిల్లలు | 2 |
| Parent(s) | మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, షర్మిలా ఠాగూర్ |
| బంధువులు | సాబా అలీ ఖాన్ |
సైఫ్ అలీ ఖాన్ భారతీయ నటుడు, నిర్మాత. ఇతను సుప్రసిద్ద క్రికెట్ ఆటగాడు, భారత జట్టు మాజీ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, హిందీ నటి షర్మిలా టాగోర్ ల కుమారుడు.
నేపధ్యము
[మార్చు]ఇతని పూర్వీకులు పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు[1][2]. ఇతని ముత్తాత ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ, తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడిలు నవాబులుగా ప్రకటించబడ్డారు. ఇతని తండ్రి మరణం తర్వాత ఇతడిని పటౌడీ సంస్థాన తదుపరి నవాబుగా ప్రకటించారు.[3].
కుటుంబము
[మార్చు]ఇతనికి ఇద్దరి సోదరీమణులు. సబా అలీ ఖాన్, సోహా అలీ ఖాన్. పెద్ద సోదరి ఆభరణాల రూపకల్పనలోను, చిన్న సోదరి నటి గానూ స్థిరపడ్డారు.[4] ఇతని మొదటి వివాహము ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్తో 1991లో జరిగింది. వీరికి ఇద్దరు సంతానము.2004 లో వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ని వివాహమాడాడు.
చిత్రాలు
[మార్చు]| సంవత్సరము | చిత్రము | మూలం |
|---|---|---|
| 1996 | తూ చోర్ మైఁ సిపాహి | |
| 2009 | లవ్ ఆజ్ కల్ | |
| 2012 | ఏజెంట్ వినోద్ | |
| 2012 | కాక్‍టైల్ | |
| 2013 | గో గోవా గాన్ | |
| 2021 | బంటీ ఔర్ బబ్లీ 2 | |
| 2020 | తానాజీ | |
| 2022 | ఆదిపురుష్ | |
| 2022 | విక్రమ్ వేద | |
| 2024 | దేవర | [5] |
| 2025 | జ్యువెల్ థీఫ్ |
మూలాలు
[మార్చు]- ↑ ‘Religion played a major role in my upbringing’ Archived 2011-06-06 at the Wayback Machine Sabrang Communications & Publishing Pvt Ltd.
- ↑ Santhanam, Kausaliya (August 3, 2003). "Royal vignettes: Pataudi: The Afghan connection". Chennai, India: The Hindu. Archived from the original on 2010-10-28. Retrieved 2010-07-25.
- ↑ "Saif Ali Khan is now the 10th Nawab of Pataudi – The Times of India". The Times Of India.
- ↑ "Kareena Kapoor, Soha Ali Khan bonded over wedding celebrations". Archived from the original on 2012-11-03. Retrieved 2013-02-14.
- ↑ Namasthe Telangana (16 August 2023). "భైరాగా సైఫ్ అలీఖాన్.. ఫస్ట్‌లుక్ మాములుగా లేదుగా..!". Archived from the original on 16 August 2023. Retrieved 16 August 2023.