సోహా అలీ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోహా అలీ ఖాన్
Pataudi in 2018
జననం
సోహా అలీ ఖాన్ పటౌడీ

4 October 1978 (1978-10-04) (age 45)
జాతీయతఇండియన్
విద్యఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ
విద్యాసంస్థలండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు1
తల్లిదండ్రులు
బంధువులు

సోహా అలీ ఖాన్ పటౌడీ (జననం 1978 అక్టోబరు 4) హిందీ, బెంగాలీ, ఆంగ్ల చిత్రాలలో నటించే భారతీయురాలు. ఆమె ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి కుమార్తె. నటుడు సైఫ్ అలీ ఖాన్ చెల్లెలు. ఆమె రొమాంటిక్ కామెడీ చిత్రం దిల్ మాంగే మోర్ (2004)తో తన నటనా వృత్తిని ప్రారంభించింది. 2006లో, వచ్చిన రంగ్ దే బసంతిలో ఆమె పాత్రకు ప్రసిద్ధి చెందింది.

2017లో, ఆమె ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్ మోడరేట్లీ ఫేమస్ అనే పుస్తకాన్ని రచించింది, అది 2018లో క్రాస్‌వర్డ్ బుక్ అవార్డును గెలుచుకుంది.[1][2]

విద్యాభ్యాసం[మార్చు]

ఆమె న్యూ ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్‌లో చదివింది. ఆ తరువాత, ఆక్స్‌ఫర్డ్‌లోని బల్లియోల్ కాలేజీలో ఆధునిక చరిత్రలో డిగ్రీ పట్టాపొందింది.[3] లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసింది.[4]

కెరీర్[మార్చు]

ఆమె బాలీవుడ్ చిత్రం దిల్ మాంగే మోర్‌ (2004)తో అరంగేట్రం చేసింది. ఆమె బెంగాలీ చిత్రం అంతర్ మహల్ (2005)లో నటించింది. 2006లో రంగ్ దే బసంతి లో నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు సానుకూల సమీక్షలు లభించాయి. అంతేకాకుండా ఉత్తమ సహాయ నటిగా ఆమెకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA) పురస్కారంతో పాటు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్ పొందింది.

ఆమె ఖోయా ఖోయా చంద్, 99, తుమ్ మైల్ తదితర చిత్రాలలో నటించింది. ఆమె గోద్రేజ్ ఖేలో జీతో జియో గేమ్ షోను హోస్ట్ చేసింది. ఆమె మిస్టర్ జో బి. కార్వాల్హో చిత్రంలో కూడా నటించి మెప్పించింది.[5]

ఆమె తొలి పుస్తకం, ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్ మోడరేట్లీ ఫేమస్, ఇందులో రాజ యువరాణిగా ఆమె జీవితం గురించిన హాస్య కథనాల సమాహారం 2017లో ప్రచురించబడింది.[6] 2017లో, ఆదిత్య కేల్‌గాంకర్ దర్శకత్వం వహించిన సౌండ్‌ప్రూఫ్ అనే షార్ట్ ఫిల్మ్‌లో ఆమె నటించింది. ఇది వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్[7], ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ హ్యూస్టన్[8], ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్‌[9]లో అవార్డులను గెలుచుకుంది.

షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ[10], బెల్గాం ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్[11] లలో ఈ చిత్రం ప్రదర్శిచబడి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.

వ్యక్తిగతం[మార్చు]

ఆమె 1978 అక్టోబరు 4న న్యూఢిల్లీలో పటౌడీ కుటుంబంలో పటౌడీస్ నవాబ్‌గా జన్మించింది.[12] పష్టూన్ వంశానికి చెందిన ఆమె, పటౌడీ 9వ నవాబ్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, భారతీయ నటి షర్మిలా ఠాగూర్‌ల చిన్న కుమార్తె.[13] ఆమె తండ్రి, తాత ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ ఇద్దరూ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు[14] కాగా, ఆమె అమ్మమ్మ సాజిదా సుల్తాన్ పటౌడీ భోపాల్‌కు చెందిన బేగం.[15][16]

ఆమె అన్నయ్య సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ నటుడు. ఆమె అక్క సబా అలీ ఖాన్ జ్యువెలరీ డిజైనర్, ఔకాఫ్-ఎ-షాహీ ముతవల్లి.[17] ఆమెకు అబిదా సుల్తాన్ అత్త కాగా కరీనా కపూర్‌కి మరదలు.[18][19]

సోహా అలీ ఖాన్ పటౌడీ జూలై 2014లో పారిస్‌లో నటుడు కునాల్ ఖేముతో నిశ్చితార్థం చేసుకుంది.[20] 2015 జనవరి 25న ముంబైలో వారి వివాహం[21] జరుగగా 2017 సెప్టెంబరు 29న కుమార్తె ఇనాయా నౌమి ఖేముకు జన్మించింది.[22]

మూలాలు[మార్చు]

  1. "Sudha Murthy, Ruskin Bond, Snigdha Poonam among winners of this year's Crossword Book Awards". Scroll.in. December 20, 2018. Retrieved 1 January 2023.
  2. "Shashi Tharoor, Sudha Murty, Ruskin Bond, Soha Ali Khan , Benyamin & Prayaag Akbar win big at the 16th Crossword Book Award". The Hans India (in ఇంగ్లీష్). 22 December 2018. Retrieved 1 January 2023.
  3. "Mom wants me to have a regular job like others: Soha Ali Khan". NDTV Movies. Mid-day.com. 9 January 2013. Retrieved 14 May 2016.
  4. "Soha Ali Khan: I Would Like My Daughter to Go to the Oxford University". News18. Retrieved 2019-05-25.
  5. "Soha Ali Khan wears a bikini for 'Mr Joe B Carvalho'". Mid-Day.com. 16 November 2013. Retrieved 16 November 2013.
  6. "Soha Ali Khan's debut book launched at a starry evening - Times of India". The Times of India. Retrieved 2018-09-04.
  7. "18th Annual NEW YORK INDIAN FILM FESTIVAL SCREENING SCHEDULE Friday May 11". New York Indian Film Festival. Retrieved 28 January 2020.
  8. "Indian Film Festival of Houston SOUND PROOF – Short Film". The Indian Film Festival of Houston. Retrieved 28 January 2020.
  9. "Welcome to the 2nd OIFFA 72-Hour Short Film Challenge!" (PDF). Ottawa Indian Film Festival Awards. Archived from the original (PDF) on 28 జనవరి 2020. Retrieved 28 January 2020.
  10. "Awards -11th International Documentary & Short Film Festival of Kerala". International Documentary & Short Film Festival of Kerala. Retrieved 28 January 2020.
  11. "Belgaum International Short Film festival successfully hosted". Inbelagavi.com. Archived from the original on 28 జనవరి 2020. Retrieved 28 January 2020.
  12. "Soha Ali Khan khemu turns 34!". Rediff. 4 October 2012. Retrieved 14 May 2016.
  13. Roy Chowdhury, Rishita (September 20, 2021). "Soha Ali Khan poses with mom Sharmila and daughter Inaaya in beautiful family pic". India Today (in ఇంగ్లీష్). Retrieved 29 December 2022.
  14. Pathak, Rohan (16 March 2017). "5 Facts You Need to Know About Iftikhar Ali Khan Pataudi". The Quint (in ఇంగ్లీష్). Retrieved 29 December 2022.
  15. "Begums of Bhopal: 107 Years of Golden Reign". INDIAN CULTURE (in ఇంగ్లీష్). Retrieved 29 December 2022.
  16. Bin Jung, Saad (20 November 2012). Subhan and I: My Adventures with Angling Legend of India. New Delhi: Roli Books. ISBN 9789351940326.
  17. "Meet Saba Ali Khan – Saif Ali Khan and Soha's lesser-known sibling". The Times of India (in ఇంగ్లీష్). 18 February 2021. Retrieved 29 December 2022.
  18. Gupta, Abhijit Sen (18 December 2021). "Mansur Ali Khan Pataudi--the hero who conquered setbacks of fate". The Siasat Daily. Retrieved 29 December 2022.
  19. "Sara Ali Khan's aunt Saba Ali Khan upset with actor's fanpage, vows never to share her baby pics again". Hindustan Times (in ఇంగ్లీష్). 16 July 2021. Retrieved 29 December 2022.
  20. "Soha Ali Khan, Kunal Khemu get engaged". The Hindu. Press Trust of India. 24 July 2014. Retrieved 14 May 2016.
  21. Prashar, Chandni (25 January 2015). "Soha Ali Khan Marries Kunal Khemu, Saif-Kareena Play Hosts". NDTVMovies.com. Retrieved 14 May 2016.
  22. "Soha Ali Khan, Neha Dhupia post adorable pics on Inaaya Naumi Kemmu's first birthday. See here". Hindustan Times. Retrieved 29 September 2018.