Jump to content

భోపాల్

అక్షాంశ రేఖాంశాలు: 23°15′35.6″N 77°24′45.4″E / 23.259889°N 77.412611°E / 23.259889; 77.412611
వికీపీడియా నుండి
Bhopal
Official logo of Bhopal
Nickname: 
The City of Lakes
Bhopal is located in Madhya Pradesh
Bhopal
Bhopal
Bhopal is located in India
Bhopal
Bhopal
Coordinates: 23°15′35.6″N 77°24′45.4″E / 23.259889°N 77.412611°E / 23.259889; 77.412611[1]
Country India
State Madhya Pradesh
DistrictBhopal
RegionBhopal Division
Ward85 wards[1]
Named afterRaja Bhoja
ప్రభుత్వం
 • రకంMayor–Council
 • సంస్థBhopal Municipal Corporation
 • MayorMalti Rai (BJP)
 • Member of ParliamentAlok Sharma (BJP)
విస్తీర్ణం
 • Metropolis
463 కి.మీ2 (179 చ. మై)
 • Metro648.24 కి.మీ2 (250.29 చ. మై)
ఎత్తు
518.73 మీ (1,701.87 అ.)
జనాభా
 (2011)[4]
 • Metropolis
17,98,218
 • స్థానం20th
 • సాంద్రత3,900/కి.మీ2 (10,000/చ. మై.)
 • Metro

(Bhopal + Arera Colony + Berasia urban areas)
19,17,051
 • Metro density3,000/కి.మీ2 (7,700/చ. మై.)
 • Metro rank
18th
DemonymBhopali
కాల మండలంUTC+5:30 (IST)
Pincode
462001 to 462050
Telephone0755
Vehicle registrationMP-04
Per capita GDP$2,087 or ₹1.47 lakh[6]
GDP Nominal (Bhopal District)44,175 crore (US$5.5 billion) (2020–21)[7]
Official languageHindi
Literacy Rate (2011)80.37%[8]
Precipitation1,123.1 మిల్లీమీటర్లు (44.22 అం.)
Avg. high temperature31.7 °C (89.1 °F)
Avg. low temperature18.6 °C (65.5 °F)
HDI (2016)0.77 (High)[9]

భోపాల్ మధ్య భారతదేశంలోని ఒక నగరం. మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజధాని, 'భోపాల్ డివిజనుకు ప్రధాన కేంద్రం. మధ్య ప్రదేశ్లో ఇండోర్ తరువాత రెండవ పెద్ద నగరం.భోపాల్ భారతదేశములో 17 వ అతిపెద్ద నగరం, ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో 131 వది.భోపాల్ లో అనేక జాతీయ విద్యాపరిశోధన సంస్థలు, ఉన్నాయి. వాటీలో IISER, MANIT , AIIMS, NLIU, SPA, IIIT ముఖ్యమైనవి. భోపాల్ కు "సరస్సుల నగరం" "మసీదుల నగరం అని పేరు. దీని భౌగోళికం ప్రకృతి సరస్సులు, మానవ నిర్మిత సరస్సులతో నిండియున్నది.[10]

గ్యాస్ దుర్ఘటన

[మార్చు]

1984 డిసెంబరు రెండోతేదీ: యూనియన్‌ కార్బైడ్‌ పరిశ్రమనుంచి టన్నుల కొద్దీ లీకైన మిథైల్‌ ఐసోసైనేట్‌ (మిక్‌) మూడువేల నిండు ప్రాణాల్ని కబళించింది. కంటిచూపు పోయినవారు, వూపిరితిత్తులకు తూట్లు పడ్డవాళ్లు, జీవచ్ఛవాలుగా మిగిలినవాళ్లెందరో లెక్కే లేదు. పాతికవేలమంది నేల రాలిపోయారు. అయిదున్నర లక్షల మందికిపైగా అనారోగ్య పీడితులయ్యారు.నేటికీ అక్కడి గాలిలో, నీటిలో, భూగర్భంలో విషపదార్థ నిక్షేపాలు పుట్టబోయేవారినీ శాపగ్రస్తులు చేస్తున్నాయి.ఆ సంస్థ సారథి ఆండర్సన్‌ 1984 డిసెంబరులో పట్టుబడినా, భారత్‌కు తిరిగి వస్తానన్న హామీతో బురిడీ కొట్టించి దేశం దాటి మళ్లీ ఇటువైపు తొంగిచూడనే లేదు. ఆండర్సన్‌ను అప్పగించాల్సిందిగా ఆరేళ్లక్రితం భారత్‌ చేసిన అభ్యర్థనను అమెరికా నిష్కర్షగా తోసిపుచ్చింది. విపరీత కాలహరణం జరిగాక ఒక్కో బాధితుడికీ సగటున విదిపింది రూ.12,410. కేంద్ర న్యాయమంత్రి వీరప్ప మొయిలీ భోపాల్‌ విషవాయు ఉదంతంలో న్యాయమే సమాధి అయిందన్నారు.

చరిత్ర

[మార్చు]

భోపాల్ నగరాన్ని భూపాల్ షాహి సలం అనే గోండు రాజు స్థాపించాడు ఇతని పేరు తోనే ఈ నగరానికి భూపాల్ అనేే పేరు వచ్చింది కాలక్రమంలో బ్రిటిష్ వాళ్ళ ఉచ్ఛారణలో తేడాల వల్ల భూపాల్ నుండి భోపాల్ గా మారింది. 18 వ శతాబ్దం లో ఈ నగరాన్ని పాలించిన గోండు రాణి కమలపతి చివరి గోండు రాణి గా పరిగణిస్తారు

భౌగోళికం

[మార్చు]

భోపాల్ సముద్రమట్టానికి 500 మీటర్ల సరసరి ఎత్తున ఉంది.భోపాల్ మద్యభారతదేశములో వింద్య పర్వతలకు సమీపంలో మాల్వా పీఠభూమి మీద ఊంది. భోపల్ తేమ ఉపఉష్ణమండల వాతావరణం వుండడం వల్ల చలిగా, శీతకాలంలో పొడీగా వేసవికాలంలో వేడీగా వుంటూంది.వేసవికాలం మార్చి నెల చివరి నుండి జూన్ నెల మద్య వరకు వుంటూంది, అధిక ఉష్ణోగ్రతలు మే నెలలో 40°C లను దాటుతాయి. మిగతా నెలల్లో ఉష్ణోగ్రత సరసరిగా సుమారు 25°C (77°F) వుంటూంది.వర్షాకాలంలో తేమ అధికంగా వుండీ వర్షపాతం సుమారుగా (1020mm) వుంటూంది.

మూలాలు

[మార్చు]
  1. "History". Bhopal Municipal Corporation. Retrieved 13 November 2021.
  2. "BMC". Retrieved 19 November 2020.
  3. "BMC Plan". Retrieved 19 November 2020.
  4. 4.0 4.1 "District Census Handbook – Bhopal" (PDF). Census of India. p. 35. Archived (PDF) from the original on 7 August 2015. Retrieved 22 September 2015.
  5. "Cricket Exchange Live – Online Cricket Betting Casino". #.
  6. "District Domestic Product Per Capita". Retrieved 8 January 2023.
  7. Records, Official. "Estimates of District Domestic Product Madhya Pradesh" (PDF). Department of Planning, Economics & Statistics, Govt. of Madhya Pradesh. Directorate of Economics and Statistics, Madhya Pradesh. Retrieved 2 January 2023.
  8. "Madhya Pradesh Literacy Rate 2021". indiacensus.net. Retrieved 13 November 2021.
  9. "The Madhya Pradesh Human Development Index" (PDF). 20 March 2016. Archived from the original (PDF) on 20 March 2016.
  10. "City of Lakes". Archived from the original on 2006-11-01. Retrieved 2007-04-12.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=భోపాల్&oldid=4429857" నుండి వెలికితీశారు