Coordinates: 24°02′N 75°05′E / 24.03°N 75.08°E / 24.03; 75.08

మంద్‌సౌర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంద్‌సౌర్
కాయంపూ
దశపురా
పట్టణం
గాంధి సాగర్ సంరక్షణాలయంలో చంబల్ నది
గాంధి సాగర్ సంరక్షణాలయంలో చంబల్ నది
Nickname: 
భక్తాపూర్
మంద్‌సౌర్ is located in Madhya Pradesh
మంద్‌సౌర్
మంద్‌సౌర్
Coordinates: 24°02′N 75°05′E / 24.03°N 75.08°E / 24.03; 75.08
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లామంద్‌సౌర్
Government
 • BodyMunicipal Council
Population
 (2011)[1]
 • Total1,41,468
భాష
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
458001/2
టెలిఫోన్ కోడ్07422
Vehicle registrationMP-14

మంద్‌సౌర్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం, మాల్వా ప్రాంతంలో మంద్‌సౌర్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్ల ముఖ్యపట్టణం. పురాతన పశుపతినాథ ఆలయానికి మంద్‌సౌర్ ప్రసిద్ధి.

మంద్‌సౌర్ అనే పేరు మార్హ్‌సౌర్ నుండి ఉద్భవించింది. ఇది మార్హ్, సౌర్ అనే రెండు గ్రామాల విలీనంతో ఏర్పడిన పట్టణం. పురాతన కాలంలో ఈ పట్టణాన్ని దశపుర అనేవారు. ఈ నగరంలో పది పురాలుండడం చేత దీనికి ఆ పేరు వచ్చింది.

చరిత్ర[మార్చు]

దశపురపు ఔలికారులు[మార్చు]

శాసనాల ఆవిష్కరణల వలన రెండు పురాతన రాజ వంశాలు వెలుగులోకి వచ్చాయి. వారు తమను ఔలికారులు అని పిలుచుకున్నారు. దశపుర (ప్రస్తుత మంద్‌సౌర్) నుండి పాలించారు. దశపురం నుండి పరిపాలించిన ఈ మొదటి రాజవంశం నుండి ఈ క్రింది రాజులు వారసత్వ క్రమంలో పాలించారు: జయవర్మ, సింహవర్మ, నరవర్మ, విశ్వవర్మ, బంధువర్మ. బంధువర్మ కుమారగుప్తుడు I కి సమకాలికుడు. మంద్‌సౌర్‌లో బంధువర్మ గురించి ఒక శాసనం ఉంది. పట్టు కార్మికులు ఇక్కడ సూర్య దేవాలయాన్ని నిర్మించారు. బంధువర్మ దీనికు సంవత్ 493 (సా.శ. 436) లో మరమ్మతులు చేయించాడు. సా.శ. 436 వరకు అతను అక్కడ ఉన్నట్లు ఇది సూచిస్తుంది. 1983 లో కనుగొన్న రిస్థల్ రాతి పలక శాసనం, మరొక ఔలికార రాజవంశాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులో ఈ క్రింది రాజులు వారసత్వ క్రమంలో వచ్చారు: ద్రుమవర్ధన, జయవర్ధన, అజితవర్ధన, విభీషణవర్ధన, రాజ్యవర్ధన, ప్రకాశధర్మ. ప్రకాశధర్ముడి తరువాత మంద్‌సౌర్‌ను యశోధర్ముడు పాలించాడు. ఇతడికి విష్ణువర్ధనుడు అనే పేరు కూడా ఉంది. ఇతడు భయనా వద్ద స్థూపాన్ని నిర్మించాడు.ఈ స్థూపం కారణంగా భయనాకు విజయగృహ మని పేరుమారింది. ఉన్న ఆధారాల ప్రకారం ఇతడు ప్రకాశధర్ముడి కుమారుడు, వారసుడు. యశోధర్మ విష్ణువర్ధనుడు, బంధువర్మ భూభాగాలను ఆక్రమించిన తరువాత సామ్రాట్ అనే బిరుదును స్వీకరించాడు. యశోధర్మ విష్ణువర్ధనుడు 'మహారాజాధిరాజ' లేదా చక్రవర్తి అనే బిరుదును స్వీకరించాడని కూడా ప్రస్తావించబడింది.

యశోధర్ముడి పాలన[మార్చు]

మాండ్‌సౌర్‌లోని సోందాని వద్ద యశోధర్మన్ విక్టరీ స్తంభం
మాండ్‌సౌర్‌లోని సోందాని వద్ద యశోధర్మన్ విక్టరీ స్తంభం సమాచారం

మంద్‌సౌర్ నుండి సుమారు 4 కి, మీ. దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం, సోంధాని. మాహు-నిమాచ్ రహదారిపై ఉంది. సా.శ. 528 లో యశోధర్ముడు ఇక్కడ రెండు ఏకశిలా స్తంభాలను నిర్మించాడు, ఇది హూణులపై అతడు సాధించిన విజయానికి సూచిక.[2][3] మిహిరకులుడిని ఓడించినందుకు యశోధర్ముడు ఈ శాసనంలో స్వయంగా తనను తాను కొనియాడాడు.[4]

మధ్యయుగ యుగం[మార్చు]

19 వ శతాబ్దంలో, మంద్‌సౌర్ గ్వాలియర్ రాజ్యంలో భాగంగా ఉండేది. 1818 లో మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం, పిండారి యుద్ధాన్ని ముగించిన ఇండోర్‌కు చెందిన హోల్కర్ మహారాజా చేసుకున్న ఒప్పందానికి మంద్‌సౌర్ ఒప్పందం అని పేరు వచ్చింది. 20 వ శతాబ్దం ప్రారంభంలో ఇది మాళ్వా ప్రాంత నల్లమందు వాణిజ్యానికి కేంద్రంగా ఉండేది.

జనాభా వివరాలు[మార్చు]

2011 జనగణన ప్రకారం [1] మంద్‌సౌర్ జనాభా 1,41,468. అందులో పురుషులు 72,370, స్త్రీలు 69,098. లింగనిష్పత్తి 898. జనాభాలో 15,721 (11.1%) మంది అరేళ్ళ లోపు పిల్లలు

రవాణా సౌకర్యాలు[మార్చు]

  • రోడ్డు: మంద్‌సౌర్ అజ్మీర్-లేబాద్ (ఇండోర్) జాతీయ రహదారి-79, 4 లేన్ల మౌ-నీమచ్ రాష్ట్ర రహదారి-31 లపై ఉంది.
  • రైల్: మంద్‌సౌర్ రైల్వే స్టేషన్ భారత రైల్వే యొక్క చిత్తౌర్‌గఢ్-రత్లాం మార్గంలో ఉంది. ఇది పశ్చిమ రైల్వేకు చెందిన రత్లాం విభాగంలో ఉంది. ప్రస్తుతం మంద్‌సౌర్ నుండి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, జైపూర్, నాథ్ద్వారా, ఓఖా, అజ్మీర్, ఉదయపూర్, ఆగ్రా, కోట, ఇండోర్, ఉజ్జయిని, భోపాల్, హర్దా, రత్లం, చిత్తోర్‌గఢ్, పూనా, బెంగళూరు నగరం, మైసాబాద్, సూరత్ నాగ్‌పూర్, రామేశ్వరం, విజయవాడ, చెన్నై, ఇండోర్, మోవ్ మొదలైన పట్టణాలను కలుపుతూ 12 రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Cities having population 1 lakh and above, Census 2011" (PDF). censusindia.gov. Retrieved 20 November 2020.
  2. Usha Agarwal:Mandsaur Zile Ke Puratatvik samarakon ki paryatan ki drishti se sansadhaniyata - Ek Adhyayan, Chirag Prakashan Udaipur, 2007, p. 19
  3. Mangal Mehta (Ed): Dashpur Janapada aur sanskriti, p. 142
  4. "Coin Cabinet of the Kunsthistorisches Museum Vienna". Archived from the original on 2019-11-01. Retrieved 2021-01-08.