Jump to content

జబల్‌పూర్

అక్షాంశ రేఖాంశాలు: 23°10′N 79°56′E / 23.167°N 79.933°E / 23.167; 79.933
వికీపీడియా నుండి
జబల్‌పూర్
జబ్బల్‌పూర్
మెట్రోపాలిటన్ నగరం
పైనుండి: శివాలయం కచనార్, మధ్య ప్రదేశ్ హైకోర్టు, జబల్‌పూర్ ఇంజనీరింగ్ కాలేజీ, ధువాధార్ జలపాతం
జబల్‌పూర్ is located in Madhya Pradesh
జబల్‌పూర్
జబల్‌పూర్
మధ్య ప్రదేశ్ పటంలో నగర స్థానం
Coordinates: 23°10′N 79°56′E / 23.167°N 79.933°E / 23.167; 79.933
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాజబల్‌పూర్
Government
 • Bodyజబల్‌పూర్ మునిసిపల్ కార్పొరేషను
విస్తీర్ణం
 • మెట్రోపాలిటన్ నగరం263 కి.మీ2 (102 చ. మై)
Elevation
412 మీ (1,352 అ.)
జనాభా
 (2011)[2][3][4]
 • మెట్రోపాలిటన్ నగరం12,67,564
 • Rank37th
 • జనసాంద్రత3,390/కి.మీ2 (8,800/చ. మై.)
 • Metro14,44,667
 • Metro rank
37th
Time zoneUTC+5:30 (IST)
PIN
482001 to 482011
టెలిఫోన్ కోడ్+91-761
ISO 3166 codeIN-MP
Vehicle registrationMP-20
లింగనిష్పత్తి929 /

జబల్‌పూర్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం ‌లోని నగరం. గతంలో దీనిని జబ్బల్‌పూర్ అని పిలిచేవారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఇది మధ్యప్రదేశ్‌లో మూడవ అతిపెద్ద పట్టణ సముదాయ. దేశంలో 38 వ అతిపెద్ద పట్టణ సముదాయం. రాయ్‌పూర్ తరువాత మధ్య భారతదేశంలో 2 వ అతిపెద్ద మహానగరం, జబల్‌పూర్. ఇక్కడికి దగ్గరలోని భేడాఘాట్ వద్ద ఉన్న వైట్ మార్బుల్ రాక్స్ కు ప్రసిద్ది చెందింది. స్నూకర్ ఆట జబల్‌పూర్ లోనే ఉద్భవించిందని సాధారణంగా అంగీకరించబడింది. భారతదేశంలోని 100 స్మార్ట్ సిటీలలో జబల్‌పూర్ ఒకటి.

జబల్‌పూర్ నగరం, జబల్‌పూర్ జిల్లాకు (మధ్యప్రదేశ్లో రెండవ అత్యధిక జనాభా కలిగిన జిల్లా) ముఖ్యపట్టణం. జబల్‌పూర్ డివిజనుకు ఇది పరిపాలనా ప్రధాన కార్యాలయం. చారిత్రికంగా,గోండు రాజవంశాలకు కేంద్రంగా ఉన్న ఈ నగరంలో తర్వాతి కాలంలో మొఘల్, మరాఠా పాలనలచే ప్రభావితమైన సమ్మేళన సంస్కృతి అభివృద్ధి చెందింది.

భౌగోళికం

[మార్చు]

జబల్‌పూర్ సముద్ర మట్టం నుండి 411 మీటర్ల ఎత్తున ఉంది. ఈ నగరం గుండా నర్మదా నది ప్రవహిస్తోంది. జబల్‌పూర్ కొండలు, వాటి యొక్క వివిధ రకాల ఖనిజాలతో, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలను, పురావస్తు శాస్త్రవేత్తలను ఆకర్షిస్తాయి. నగరం చుట్టూ ఎత్తు లేని, రాతి, బంజరు కొండలు ఉన్నాయి. నగరం లోని ప్రాథమిక జలాశయాలైన, ఖండారి, పరియత్‌లు నగరంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్నాయి. ప్రజారోగ్య శాఖ నర్మదా నది నుండి కూడా నీటిని తీసుకుంటుంది.

వాతావరణం

[మార్చు]
Jabalpur
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
19
 
24
8
 
 
16
 
28
11
 
 
16
 
34
16
 
 
5
 
39
21
 
 
11
 
42
26
 
 
169
 
38
26
 
 
382
 
31
24
 
 
458
 
29
23
 
 
188
 
31
23
 
 
39
 
32
19
 
 
12
 
29
12
 
 
11
 
25
9
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: IMD

జబల్‌పూర్‌‌లో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. వేసవి కాలం మార్చి చివరిలో ప్రారంభమై, జూన్ వరకు ఉంటుంది. మే అత్యంత వేడిగా ఉండే నెల. ఈనెలలో సగటు ఉష్ణోగ్రత 45 °C (113 °F) మించిపోతుంది . వేసవి తరువాత నైరుతి రుతుపవనాలు వచ్చి, అక్టోబరు ఆరంభం వరకు ఉంటాయి. సగటు వార్షిక వర్షపాతం 1386 మిమీ. శీతాకాలం నవంబరు చివరలో మొదలై మార్చి ప్రారంభం వరకు ఉంటుంది. జనవరి అతి శీతలమైన నెల. ఈ నెలలో సగటు రోజువారీ ఉష్ణోగ్రత 15 °C (59 °F) దగ్గరగా ఉంటుంది. జబల్‌పూర్ నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రత 3.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.

శీతోష్ణస్థితి డేటా - Jabalpur
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
[ఆధారం చూపాలి]

జనాభా

[మార్చు]
2011 తరువాత జనాభా పెరుగుదల[6]
సంవత్సరం జనాభా
2011
12,68,848
2012
12,95,000
2013
13,20,000
2014
13,60,000
2015
13,85,000
2016
14,00,000
2017
14,40,000
2018
14,50,000

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జబల్‌పూర్ నగరం (మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో) జనాభా 10,81,677. జబల్‌పూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం (పట్టణ సముదాయం) జనాభా 12,68,848.

పరిశ్రమలు

[మార్చు]

వస్త్ర తయారీ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, విద్య, విద్యుత్ వస్తువులు, సున్నపురాయి ఉత్పత్తులు, నిర్మాణ వస్తువులు, గాజుసామాను, టెలిఫోన్ భాగాలు, ఫర్నిచర్, ఆహార పదార్థాలు, ఉక్కు నిర్మాణాలు, సిమెంట్, పొగాకు ఉత్పత్తులు, పారిశ్రామిక-భద్రతా వస్తువులు, మెకానికల్ ఇంజనీరింగ్, సినిమా లు ఇక్కడి ప్రధానమైన పరిశ్రమలు. ఈ నగరం సల్వార్ సూట్లకు పెద్ద తయారీ కేంద్రం. తయారీదారులందరికీ ఉమ్మడి నెలవుగా ఉండే ఒక వస్త్ర క్లస్టరును కూడా స్థాపించారు. ఐటి కంపెనీలకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి బార్గి కొండల వద్ద ఒక టెక్నోపార్కును ఏర్పాటు చేసారు. 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & పార్క్

[మార్చు]

ఎంపి స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, బార్గి హిల్స్‌లో మొత్తం 60 ఎకరాల స్థలంలో ఐటి పార్క్ (టెక్నో పార్క్) ను ఏర్పాటు చేసింది. పేటిఎమ్‌ 2018 లో ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించింది.

ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు

[మార్చు]

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకు చెందిన వాహనం ఫ్యాక్టరీ‌, గ్రే ఐరన్ ఫౌండ్రి, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ‌, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు బుల్లెట్లు, హౌవిట్జెర్లు, క్షిపణులు, రాకెట్లు, బాంబులు, మందుపాతరలు, మోర్టార్లు, బాంబులు, షెల్స్, ట్రక్కులు, మందుపాతర నిరోధక వాహనాలు మొదలైనవాటిని తయారు చేస్తాయి. భారత సాయుధ దళాలు, భారత పారామిలిటరీ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట్ర సాయుధ పోలీసు దళాలు, భారతదేశ ప్రత్యేక దళాలకు వాడే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఇక్కద తయారౌతాయి. ఈ కంపెనీలు నగరంలో ప్రధానమైన ఉపాధి కల్పనాసంస్థలు. ఇతర అనుబంధ సంస్థల్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (DGQA), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తయారు చేసే పరికరాల నాణ్యతను తనిఖీ చేస్తుంది; సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో సాయుధ దళాలకు పరికరాలు, ఆయుధాలను నిల్వ చేస్తుంది, సరఫరా చేస్తుంది; 506 ఆర్మీ బేస్ వర్క్‌షాప్, ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు కాపలాగా బాధ్యత వహించే సాయుధ దళాలు, డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ కోసం పరికరాలను నిర్వహిస్తుంది. ఈ సంస్థలన్నిటిలో కలిపి లక్ష మందికి పైగా ఉద్యోగులున్నారు.

ప్రభుత్వ, ప్రజా సేవలు

[మార్చు]

పౌర పరిపాలన

[మార్చు]

జబల్‌పూర్ 263 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. జబల్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్ (జెఎంసి), నగర పౌర, మౌలిక సదుపాయాల ఆస్తుల పాలన నిర్వహిస్తుంది. కార్పొరేషన్‌కు రెండు అంగాలు ఉన్నాయి: పాలక, కార్యనిర్వాహక. ఎగ్జిక్యూటివ్ వింగ్ అధిపతి మునిసిపల్ కమిషనరు. వారు కార్పొరేషన్ యొక్క రోజువారీ కార్యకలాపాలకు బాధ్యత వహిస్తారు. నిర్ణయాత్మక ప్రక్రియలో పాలక విభాగానికి సహాయం చేస్తాడు. జెఎంసి కౌన్సిల్‌లో ప్రతి వార్డు నుండి ఒక ఎన్నుకోబడిన ప్రతినిధి (కార్పొరేటరు) ఉంటారు. కౌన్సిల్ ఎన్నికలు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి జరుగుతాయి. మెజారిటీ పార్టీకి చెందిన కార్పొరేటరును మేయర్‌గా ఎంపిక చేస్తారు.

డివిజన్ ప్రధాన కార్యాలయం

[మార్చు]

జబల్‌పూర్ ఎనిమిది జిల్లాలకు డివిజనల్ ప్రధాన కార్యాలయం. అవి - జబల్‌పూర్‌, సివ్‌నీ, మండ్లా, ఛింద్వారా, నర్సింగ్‌పూర్, కట్ని, దిండోరి, బాలాఘాట్. ఈ నగరం మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు, హోమ్ గార్డ్లు, ఇతర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాల ప్రధాన కార్యాలయాలకు నెలవు.

సైనిక సంస్థలు

[మార్చు]

జబల్‌పూర్ కంటోన్మెంట్ భారతదేశంలో అతిపెద్ద కంటోన్మెంట్లలో ఒకటి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలతో పాటు నగరంలో, హెచ్‌క్యూ మధ్య భారత్ ఏరియా, జమ్మూ & కాశ్మీర్ రైఫిల్స్ రెజిమెంటల్ సెంటర్, గ్రెనేడియర్స్ రెజిమెంటల్ సెంటర్, 1 సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్, కాలేజ్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో, 506 ఆర్మీ బేస్ వర్క్‌షాపు, మిలిటరీ హాస్పిటల్, హెచ్‌క్యూ చీఫ్ ఇంజనీర్ జబల్‌పూర్ జోన్, మిలిటరీ డెయిరీ ఫామ్, హెచ్‌క్యూ రిక్రూటింగ్ జోన్ వంటి ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖలో భాగమైన పౌర సంస్థలు కంటోన్మెంట్ బోర్డు, కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, డిఫెన్స్ స్టాండర్డైజేషన్ సెల్, క్యాంటీన్ స్టోర్స్ విభాగాలు కూడా జబల్‌పూర్‌లో ఉన్నాయి.

రవాణా

[మార్చు]

విమానిక సౌకర్యాలు

[మార్చు]
Long, low building with cars parked outside
విమానాశ్రయం టెర్మినల్ భవనం

జబల్‌పూర్ విమానాశ్రయం (జెఎల్ఆర్) నగర కేంద్రం నుండి సుమారు 20 కి.మీ. దూరంలో ఉంది. దీన్ని దుమ్నా విమానాశ్రయం అని కూడా అంటారు. ఇది 310 ఎకరాల్లో విస్తరించి ఉంది. అలయన్స్ ఎయిర్, ఇండిగో, స్పైస్ జెట్ లు ఇక్కడి నుండి న్యూ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌లకు విమానాలు నడుపుతున్నాయి.

రైలు

[మార్చు]
రైలు నిలయం

పశ్చిమ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం జబల్‌పూర్‌‌లో ఉంది. జబల్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, నాగ్‌పూర్, సూరత్, పూణే, పాట్నా, లూధియానా, జమ్మూ, వాస్కో-డా గామా, అమరావతి, కోయంబత్తూరు, భూపాల్, ఇండోర్, గౌలియార్, ఆగ్రా, మథుర, జైపూర్, వారణాసి, కాన్పూర్, వడోదర, భుబనేశ్వర్, లక్నో, పూరి, అలహాబాద్, నాసిక్, రాజ్కోట్, గౌహతి, అంబికాపూర్, బిలాస్పూర్, టాటానగర్, రాయ్పూర్, హరిద్వార్, రామేశ్వరం, కోయంబత్తూరు, విశాఖపట్నం, విజయవాడ, త్రివేండ్రం లకు రైళ్ళు నడుస్తున్నాయి.

రోడ్డు

[మార్చు]

జబల్‌పూర్‌కు వారణాసి, నాగ్‌పూర్, భోపాల్, జైపూర్, రాయ్‌పూర్, అలహాబాద్, హైదరాబాద్, బిలాస్‌పూర్, బెంగళూరులకు రోడ్డు సౌకర్యాలున్నాయి. భారతదేశపు అత్యంత పొడవైన జాతీయ రహదారి, జాతీయ రహదారి 7, నగరం గుండా వెళుతుంది. జైపూర్ వెళ్ళే జాతీయ రహదారి 12 జబల్‌పూర్‌లోనే ఉద్భవించింది. అనేక రహదారులను నాలుగు లేన్ల రహదారులుగా ఉన్నతీకరిస్తున్నారు. ఇండోర్, నాగ్‌పూర్, భోపాల్, వారణాసి, రాయ్‌పూర్, అమరావతి, చంద్రపూర్, అలహాబాద్‌లకు ప్రత్యక్ష సేవతో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని నగరాలకు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సిటీ బస్సులు నగరం లోపల రవాణా సేవలు అందిస్తాయి.

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Jabalpur City" (PDF). Retrieved 21 November 2020.
  2. "District Census Handbook, Indore" (PDF). Archived (PDF) from the original on 31 May 2016. Retrieved 23 July 2016.
  3. "Jabalpur district" (PDF). 2011 Census of India. Archived (PDF) from the original on 14 November 2015. Retrieved 20 October 2015.
  4. "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. p. 3. Archived (PDF) from the original on 13 November 2011. Retrieved 26 March 2012.
  5. "Presentation on Towns and Urban Agglomerations". Census of India 2011. Archived from the original on 14 మార్చి 2016. Retrieved 10 జనవరి 2021.
  6. "Major Agglomerations of the World - Population Statistics and Maps". www.citypopulation.de. Archived from the original on 13 September 2018. Retrieved 13 September 2018.