Jump to content

జబల్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
జబల్‌పూర్ జిల్లా
जबलपुर जिला
మధ్య ప్రదేశ్ పటంలో జబల్‌పూర్ జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో జబల్‌పూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుJabalpur
ముఖ్య పట్టణంJabalpur
Government
 • లోకసభ నియోజకవర్గాలుJabalpur
విస్తీర్ణం
 • మొత్తం6,160 కి.మీ2 (2,380 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం24,60,714
 • జనసాంద్రత400/కి.మీ2 (1,000/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత82.47%
 • లింగ నిష్పత్తి925
Websiteఅధికారిక జాలస్థలి

జబల్‌పూర్ (హిందీ: जबलपुर)మధ్యప్రదేశ్ లోని ఒక పెద్ద నగరం. దీనిని పాలరాతి నగరం అని కూడా పిలుస్తారు. జబల్‌పూర్ నగరం జిల్లాకు కేంద్రంగా ఉంది.

భేదాఘాట్ మార్బుల్ రాక్స్ గుండా ప్రవహిస్తున్న నర్మదా

భౌగోళికం

[మార్చు]

జిల్లా వైశాల్యం 10,160. 2001 గణాంకాల ప్రకారం జనసంఖ్య 2,167,469. జబల్‌పూర్ జిల్లా మహాకోసల్ డివిజన్‌లో ఉంది. జిల్లాలో నర్మదానది, సన్ నది ప్రవహిస్తున్నాయి. జిల్లా అధికంగా నర్మదా నదీ లోయలో ఉపస్థితమై ఉంది. నర్మదానది ప్రఖ్యాత పాలరాతి లోయలలో ప్రవహిస్తూ ఉంటుంది. నది ఈశాన్య దిశ నుండి నైరుతీ దిశగా ప్రవహిస్తుంది. నర్మదా మైదానం పశ్చిమ, దక్షిణ భూభాగంలో సారవంతమైన మట్టి నిలువలు ఉన్నాయి. జబల్‌పూర్ జిల్లాలో నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి. అలాగే పుష్కలమైన జలవనరులు ఉన్నాయి. ఉత్తర, తూర్పు మదానంలో గంగా నది ఉపనది అయిన సన్ నది ప్రవహిస్తుంది. జిల్లాలో ముంబై, కొలకత్తా రైలు మార్గం పయనిస్తుంది. కట్నీ జంక్షన్ వద్ద ఈ రైలు మార్గంతో మరొక రెండు రైలు మార్గాలు కలుస్తున్నాయి. 2011 గణాంకాల ప్రకారం జబల్‌పూర్ జిల్లా జసంఖ్యాపరంగా మధ్యప్రదేశ్‌లో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఇండోర్ ఉంది.[1]

భౌగోళికం

[మార్చు]

జిల్లా జబల్‌పూర్ జిల్లాలో భాగం. 23°10′ నుండి 79°57′ ఉత్తర అక్షాంశం, / 23.17° నుండి 79.95° తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 411 మీటర్ల ఎత్తులో ఉంది.

ప్రముఖులు

[మార్చు]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,460,714,[1]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నెవాడా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 180వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 472 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.39%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 925:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 82.47%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు

[మార్చు]

జిల్లాలోని ప్రజలలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. హిందీ భాషను పోలి ఉన్న బఘేలి భాష 72.91% ప్రజలలో వాడుకలో ఉంది [4][5] ఈ భాష 7 800 000 మంది భగేల్‌ఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది .[4] అలాగే ద్రావిడ భాషలలో ఒకటైన భగియా భాష 2,00,000 మంది భగియా, షెడ్యూల్డ్ ప్రజలలో వాడుకగా ఉంది. దీనిని వ్రాయడానికి దేవనగరి లిపిని వాడుతున్నారు.

[6]

వాతావరణం

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Jabalpur
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 26.5
(79.7)
28.8
(83.8)
34.3
(93.7)
38.7
(101.7)
40.4
(104.7)
36.2
(97.2)
30.3
(86.5)
28.2
(82.8)
30.9
(87.6)
32.4
(90.3)
29.7
(85.5)
26.9
(80.4)
31.9
(89.5)
సగటు అల్ప °C (°F) 9.8
(49.6)
11.4
(52.5)
16.2
(61.2)
21.2
(70.2)
24.4
(75.9)
24.1
(75.4)
22.6
(72.7)
21.9
(71.4)
21.1
(70.0)
18.1
(64.6)
13.9
(57.0)
10.6
(51.1)
17.9
(64.3)
సగటు అవపాతం mm (inches) 4
(0.2)
3
(0.1)
1
(0.0)
3
(0.1)
11
(0.4)
136
(5.4)
279
(11.0)
360
(14.2)
185
(7.3)
52
(2.0)
21
(0.8)
7
(0.3)
1,062
(41.8)
సగటు అవపాతపు రోజులు 0.8 0.8 0.3 0.3 1.8 8.6 15.9 18.3 8.6 3.1 1.4 0.6 60.5
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు 288.3 274.4 288.3 306.0 325.5 210.0 105.4 80.6 180.0 269.7 273.0 282.1 2,883.3
Source: HKO

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01. Kuwait 2,595,62
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nevada 2,700,551
  4. 4.0 4.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  5. M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  6. M. Paul Lewis, ed. (2009). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]