బర్వానీ జిల్లా
బర్వానీ జిల్లా
बड़वानी जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | ఇండోర్ |
ముఖ్య పట్టణం | బర్వానీ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,665 కి.మీ2 (1,415 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 13,85,659 |
• జనసాంద్రత | 380/కి.మీ2 (980/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 50.23% |
• లింగ నిష్పత్తి | 981 |
Website | అధికారిక జాలస్థలి |
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బర్వానీ జిల్లా (హిందీ:बड़वानी जिला) ఒకటి. బరేలి పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.జిల్లా వైశాల్యం 3,665 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 10,81,039.
సరిహద్దులు
[మార్చు]బరేలి జిల్లా ఉత్తర సరిహద్దులో నర్మదానది ప్రవహిస్తుంది. దక్షిణ సరిహద్దులో సప్తపురా పర్వతశ్రేణి ఉంది. జిల్లా దక్షిణ సరిహద్దులో మాహారాష్ట్ర రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో గుజరాత్ రాష్ట్రం, ఉత్తర సరిహద్దులో ధార్ జిల్లా, తూర్పు సరిహద్దులో ఖర్‌గోన్ జిల్లా ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]1948 సమైక్య భారతంలో బర్వానీ రాజాస్థానం విలీనం తరువాత ఈ ప్రాంతం సరికొత్తగా రూపొందించబడిన మధ్యభారత్ రాష్ట్రంలోని ఖర్‌గోన్ (పశ్చిమ నిమర్) జిల్లాలో భాగం అయింది. 1998 మే మాసంలో ఖర్‌గోన్ జిల్లాలో కొంత భూభాగం వేరు చేసి ఈ జిల్లా రూపొందించబడింది.
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బర్వానీ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]
విభాగాలు
[మార్చు]- జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి : బర్వని, సెంధ్వ
- జిల్లాలో 8 తాలూకాలు ఉన్నాయి : తాలూకాల్లో, బర్వని, సెంధ్వ, పన్సెమల్, నివలి, థికరి, పతి, అంజద్, రాజ్పూర్
- జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి : బర్వని, పతి, సెంధవ, పన్సెమల్, నివలి, థికరి, రాజ్పూర్.
- జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : పన్సెమల్ ( పన్సెమల్, నివాలి), బర్వానీ (బర్వాని, పతి) సెంధ్వ,, రాజ్పూర్ (రాజ్పూర్ + అంజద్ + థికరి).
- ఖర్గొనే పార్లమెంటు నియోజకవర్గం :-బర్వని, సెంధవ, పన్సెమల్, రాజ్పూర్
- జిల్లాలో 2 పురపాలితాలు ఉన్నాయి :- బర్వాని, సెంధ్వా.
జిల్లాలో 417 గ్రామ మపచాయితీలు, 646 గ్రామాలు, 576 రెవెన్యూలు, 70 ఆటవీ ప్రాంతాలు ఉన్నాయి. 560 జనావాస గ్రామాలు, 16 నిర్జన గ్రామాలు ఉన్నాయి.
ఆర్ధికం
[మార్చు]సెంధ్వా కాటన్ జిన్నింగ్ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. జిల్లాలో అదనంగా ఉన్న పత్తి పరిశ్రమలు వేలాది ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది. ఈ ప్రాంతంలో సంజయ్ కాటన్ ఫైబర్ అతిపెద్ద కాటన్ ఫ్యాక్టరీగా గుర్తినబడుతుంది.
ఆలయాలు
[మార్చు]- అంజాద్ :- వీరేశ్వర్ మహాదేవ్, గాయత్రి ఆలయం, మాతా నగరి మాత ఆలయం నగరంలో ప్రముఖ ఆలయాలుగా గుర్తినచబడుతున్నాయి.
- బవంగజ :- ఇది ఒక ప్రముఖ జైన ఆలయంగా గుర్తినబడుతుంది. బర్వానీ పట్టణానికి ఇది 6 కి.మీ దూరంలో ఉంది.
- ప్రపంచంలో అతిపెద్ద జైన శిల్పంగా గుర్తించబడుతున్న జైన తీర్ధంకర " అజిత్జీ " శిల్పం.
- జిల్లాలో 15వ శతాబ్ధానికి చెందిన హిందూ ఆలయాలు ఉన్నాయి. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు ఇక్కడ నిర్యాణం చెందారని విశ్వసిస్తున్నారు.
- సప్తపురా పర్వతావళిలో పురాతన భవర్ గర్ పురాతన కోట ఉంది.
- సెంధ్వాకు దక్షిణంగా 20కి.మీ దూరంలో సెంధ్వా సమీపంలో ఉన్న బీజసన్ ఆలయంలో బీజశని (దుర్గా) ప్రధాన దైవంగా ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 13,85,659, [2] |
ఇది దాదాపు. | స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | హవాయి నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 345 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 256 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 27.55%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 881:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 50.23%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు
[మార్చు]జిల్లాలోని ప్రజలలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. బరేలి పాల్యా, భిల్లు భాష 10,000 మంది ప్రజలలో వాడికలో ఉంది. ;[5] బరేలీ ప్యూరీ భాషకు 1,75,000 మంది వాడకందార్లు ఉన్నారు. దీనిని దేవనాగరి లిపిలో వ్రాస్తుంటారు.[6], బరేలి రాథ్వి భాష 64,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది. [7] భిలాలి భాష 1 150 000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[8]
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Swaziland 1,370,424
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Hawaii 1,360,301
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bareli, Palya: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bareli, Pauri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bareli, Rathwi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bhilali: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.