Jump to content

బుర్హాన్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
బుర్హాన్‌పూర్ జిల్లా
తపతి నది
తపతి నది
మధ్య ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుఇండోర్
స్థాపన15 ఆగస్టు 2003 (2003-08-15)
ముఖ్యపట్టణంబుర్హాన్‌పూర్
జనాభా
 (2011)
 • మొత్తం7,57,847
జనాభా వివరాలు
 • అక్షరాస్యత65.28%
Time zoneUTC+05:30 (IST)

బుర్హాన్‌పూర్ జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాల్లో ఒకటి. బుర్హాన్‌పూర్ పట్టణం, జిల్లాకు ముఖ్యపట్టణం

ఖాండ్వా జిల్లా దక్షిణ ప్రాంతం నుండి కొంత భాగాన్ని విడదీసి బుర్హాన్‌పూర్ జిల్లాను 2003 ఆగస్టు 15 న ఏర్పాటు చేసారు. తప్తీ నది జిల్లా గుండా తూర్పు నుండి పడమరగా ప్రవహిస్తుంది. ఉత్తరాన ఈ జిల్లాను ఖాండ్వా జిల్లా నుండి సాత్పురా ప్రవత శ్రేణి ద్వారా విభజించబడింది, ఇది నర్మదా నది లోయ, తప్తీ లోయ మధ్య విభజన. బుర్హాన్‌పూర్, కలిపే Satpuras ద్వారా పాస్ ఖండ్వా కనెక్ట్ ఉత్తర, దక్షిణ భారతదేశం ప్రధాన మార్గాలు ఒకటి,, Asirgarh పాస్ ఆదేశాలను ఇది కోట, "కీకి అంటారు డెక్కన్ ".

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం బుర్హాన్‌పూర్ జిల్లా జనాభా 7,57,847.[1] ఇది జిబౌటి జనాభాకు,[2] అమెరికా రాష్ట్రమైన అలాస్కా జనాభాకూ సమానం.[3] జనాభా పరంగా ఇది భారతదేశ జిల్లాల్లో 490 వ స్థానంలో ఉంది. జిల్లా జనసాంద్రత 221. 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 19.23%. బురహన్పూర్‌లో లింగ నిష్పత్తి - 1000 మంది పురుషులకు 900 మంది స్త్రీలు. అక్షరాస్యత రేటు 65,28%. షెడ్యూల్డ్ కులాల జనాభా 8.5%, షెడ్యూల్డ్ తెగల జనాభా 30.4%.

2011 భారత జనగణన ప్రకారం, జిల్లాలో జనాభాలో 26,97% మంది మరాఠీ, 17,18% మంది హిందీ, 16,52% మంది ఉర్దూ, 10,42% మంది కోర్కు, 6.23% మంది బరేలి, 5.33% భిలాలీ, 3.78% మంది బంజారీ, 2.81% భిలీ, 2.54 గుజరాతీ తమ మొదటి భాషగా మాట్లాడుతారు.[4]

సంస్కృతి

[మార్చు]

జిల్లాలో ప్రధానంగా దావుదీ బొహ్రా సమూహానికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. జిల్లాలో పవిత్రమైనదీ , అతి విశాలైనదీ అయిన " దర్గా ఈ హకిమీ " మదీదు ఉంది. పాత బురహ్‌పూర్ ద్వారబంధాలతో కోటను తలపింపజేస్తూ ఉంటుంది.

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19011,06,985—    
19111,27,696+19.4%
19211,29,511+1.4%
19311,52,609+17.8%
19411,67,736+9.9%
19511,76,580+5.3%
19612,38,244+34.9%
19713,11,188+30.6%
19814,23,799+36.2%
19915,33,066+25.8%
20016,34,883+19.1%
20117,57,847+19.4%

మూలాలు

[మార్చు]
  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Djibouti 757,074 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 1 January 2011. Retrieved 2011-09-30. Alaska 710,231
  4. 2011 Census of India, Population By Mother Tongue