అక్షాంశ రేఖాంశాలు: 21°49′12″N 75°37′07″E / 21.82°N 75.6187°E / 21.82; 75.6187

ఖర్‌గోన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖర్‌గోన్
పట్టణం
నగరపాలక సంస్థ కార్యాలయం
నగరపాలక సంస్థ కార్యాలయం
ఖర్‌గోన్ is located in Madhya Pradesh
ఖర్‌గోన్
ఖర్‌గోన్
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 21°49′12″N 75°37′07″E / 21.82°N 75.6187°E / 21.82; 75.6187
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాఖర్‌గోన్
ప్రాంతంనిమార్
Elevation
258 మీ (846 అ.)
జనాభా
 (2011)
 • పట్టణం1,06,454
 • Metro
1,33,368
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
451001
టెలిఫోన్ కోడ్07282
Vehicle registrationMP 10
ClimateCwa / Aw (Köppen)

ఖర్‌గోన్ మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది ఖర్‌గోన్ జిల్లా ముఖ్యపట్టణం. గతంలో ఈ జిల్లాను పశ్చిమ నిమార్ అనేవారు. కలెక్టరేట్, పోలీసు, టెలికం, అనేక ఇతర ప్రభుత్వ సంస్థలతో సహా ఖర్‌గోన్ జిల్లాలోని అనేక ప్రధాన పరిపాలనా కార్యాలయాలు పట్టణంలో ఉన్నాయి. ఈ పట్టణం కుందా నది ఒడ్డున ఉంది. పత్తి, మిరప ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. ఇది నవగ్రహాల (తొమ్మిది గ్రహాలు) కూడా ఇది ప్రసిద్ది చెందింది. రెండు లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో 'అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పట్టణం' గా ఇది జాతీయ అవార్డు అందుకుంది. 2018 లో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణలో పట్టణం భారతదేశంలోకెల్లా పరిశుభ్రమైన పట్టణాల్లో 15 వ స్థానంలో నిలిచింది [2] స్వచ్ఛ సర్వేక్షన్ 2017 లో 17 వ స్థానంలో ఉంది. [3] ఖర్‌గోన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 23 వ అతిపెద్ద పట్టణం.

గ్రామాల ద్వారా

ఖర్‌గోన్ బర్వానీ నుండి 90 కి.మీ., ఖండ్వా నుండి 80 కి.మీ., ఇండోర్ నుండి 140 కి.మీ., ముండి నుండి 120 కి.మీ.దూరంలో ఉంది. పట్టణం నుండి ఇండోర్, ఖండ్వా, ముండి, బర్వానీ, ధార్, ఝాబువా, జల్గావ్, ధులియాలకు రోడ్డు సౌకర్యం ఉంది. ఖాండ్వా-వడోదర జాతీయ రహదారి 347B, చిత్తోర్‌గఢ్ - భూసావల్ జాతీయ రహదారి 347C లు పట్టణం గుండా పోతున్నాయి. ఆగ్రా-ముంబై జాతీయ రహదారి 3 జిల్లా గుండా వెళుతుంది. సమీప రైల్వే స్టేషన్ ఖాండ్వా జంక్షన్. సమీప విమానాశ్రయాలు ఇండోర్, ఖాండ్వా వద్ద ఉన్నాయి.

జనాభా

[మార్చు]

ఖర్‌గోన్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. జేతాపూర్ వంటి అనేక గ్రామాలు పట్టణంలో కలిసిపోయాయి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [4] ఖర్‌గోన్ జనాభా 1,16,150. జనాభాలో పురుషులు 51.44% ఉండగా, ఆడవారు 49.46% ఉన్నారు. ఖర్‌గోన్ అక్షరాస్యత 80.9%. ఇది జాతీయ సగటు 74.04% కన్నా ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 87.84%, స్త్రీల అక్షరాస్యత 75.73%. జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

ఖర్‌గోన్‌లో మతం
మతం శాతం
హిందూ మతం
  
61.50%
ఇస్లాం
  
37.23%
జైనమతం
  
0.56%
ఇతరాలు†
  
0.8%
క్రైస్తవం
  
0.18%
ఇతరాల్లో
సిక్కుమతం (0.38%), బౌద్ధం (0.5%) ఉన్నాయి

మూలాలు

[మార్చు]
  1. "Population of Madhya Pradesh (2021)".
  2. "Swach Sarvekshan movement". Archived from the original on 2020-11-11. Retrieved 2021-01-07.
  3. "Swachh Bharat rankings 2017: Here are the top 100 cities ranked on cleanliness". The Indian Express. 4 May 2017.
  4. "Check out the census website of India". Census Commission of India. Archived from the original on 2017-12-01. Retrieved 2008-11-01.
"https://te.wikipedia.org/w/index.php?title=ఖర్‌గోన్&oldid=3883300" నుండి వెలికితీశారు