ఖర్‌గోన్ జిల్లా
ఖర్‌గోన్ జిల్లా
खरगोन ज़िला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Indore |
ముఖ్య పట్టణం | Khargone |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Khargone |
విస్తీర్ణం | |
• మొత్తం | 8,030 కి.మీ2 (3,100 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 18,72,413 |
• జనసాంద్రత | 230/కి.మీ2 (600/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 63.98% |
• లింగ నిష్పత్తి | 963 |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో ఖర్‌గోన్ జిల్లా (హిందీ:खरगोन ज़िला) ఒకటి (ఇది గతంలో పశ్చిమ నిమర్ (హిందీ : पश्चिम निमाड़ ज़िला) అని పిలువబడింది) . ఖర్‌గోన్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఖర్‌గోన్ జిల్లా ఇండోర్ డివిజన్‌లోని నిమర్ రీజియన్‌లో భాగం.
చరిత్ర
[మార్చు]జిల్లాకు దీర్ఘకాల చరిత్ర ఉంది. పురాతన కాలంలో మహిష్మతి (ప్రస్తుత మహేశ్వరి) సామ్రాజ్యానికి చెందిన హైహయులు ఈ ప్రాంతాన్ని పాలించారు. మధ్యయుగ ఆరంభంలో ఈ ప్రాంతం పరమర వంశస్థుల ఆధీనంలో ఉంది. మద్యయుగ చివరి కాలంలో ఈ ప్రాంతం మండూకు చెందిన మాల్వా సుల్తానేట్‌లో భాగం. 1531లో ఈ ప్రాంతం గుజరాత్ సుల్తాన్ బహదూర్ షాహ్ ఆధీనంలోకి చేరింది. 1562లో అక్బర్ మాల్వా సామ్రాజ్యంతో ఈ ప్రాంతం కూడా ముగల్ సామ్రాజ్యంలో విలీనం చేయబడింది. 1740లో పేష్వా నాయకత్వంలో ఈ ప్రాంతం మరాఠీల వశం అయింది. 1778లో పేష్వా ఈ ప్రాంతాన్ని ఇండోర్‌కు చెందిన హోల్కర్లకు, గ్వాలియర్‌కు చెందిన పాంవార్లకు ఈ ప్రాంతం విభజించి ఇవ్వబడింది. స్వాతంత్ర్యం తరువాత ఈ ప్రాంతం స్వతంత్ర భారతంలో విలీనం చేయబడింది. స్వాతంత్ర్యం తరువాత ఈ ప్రాంతం ముద్యభారత్ లోని పశ్చిమ నిమర్ జిల్లాలో భాగంగా ఉండేది. ఖర్‌గోన్ జిల్లా నెర్బుధా డివిజన్‌లోభాగంగా ఉండేది. [1] 1956 నవంబరు1 ఈ జిల్లా కొత్తగా రూపొందించిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా మారింది. 1998 మే 25న పశ్చిమ నిమర్ జిల్లాను ఖర్‌గోన్, బర్వానీ జిల్లాలుగా విభజించారు.
భౌగోళికం
[మార్చు]జిల్లా వైశాల్యం 8030 చ.కి.మీ. 21°22' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 22°35' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.
సరిహద్దులు
[మార్చు]జిల్లా ఉత్తర సరిహద్దులలో మహారాష్ట్ర రాష్ట్రం లోని ధార్ జిల్లా, ఇండోర్ జిల్లా, దేవాస్ జిల్లా, దక్షిణ సరిహద్దులలో ఖంద్వా జిల్లా, తూర్పు సరిహద్దులలో బురహన్పూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులలో బర్వానీ జిల్లా ఉన్నాయి. ఈ నగరాన్ని రాకుమారి దీపాలి పాలించింది.
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఖర్‌గోన్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర .. జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]
విభాగాలు
[మార్చు]- జిల్లాలో 5 బిభాగాలు ఉన్నాయి : బర్వాహ్, బికంగావ్, కస్రవద్, ఖర్‌గోన్,
- బర్వాహ్ ఉపవిభాగంలో 1 తాలూకా ఉంది : సంవద్
- బికంగావ్ ఉపవిభాగంలో 2 తాలూకాలు ఉన్నాయి : బికంగావ్ మరియ్ ఝిరన్య
- కస్రవద్ ఉపవిభాగంలో 1 తాలూకా ఉంది : కస్రవద్.
- ఖర్‌గోన్ ఉపవిభాగంలో 4 తాలూకా ఉంది : ఖర్‌గోన్, గొగవన్, భగవాన్‌పురా, సెగావ్.
- మండలేశ్వర్ ఉపవిభాగంలో 1 తాలూకా ఉంది : మహేశ్వర్
- జిల్లాలో 9 తాలూకాలు ఉన్నాయి :
- జిలాకేంద్రగా ఖర్‌గోన్ పట్టణం ఉంది.
- జిల్లాలో ఇతర ప్రధాన పట్టణాలు : మహేశ్వర్, కస్రావాద్, సెగయొన్, భగ్వంపుర, ఝిరన్య, భికంగయొన్, గొగవన్, బర్వహ్.
- పురాతన రాజాస్థానాలైన హైహయ, హోల్కార్లకు మహేశ్వర్ రాజధానిగా ఉండేది.
- జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :
- ఖాండ్వా పార్లమెంటరీ నియోజకవర్గంలో : భుకన్‌గావ్, బద్వాన్
- ఖర్‌గోన్ పార్లమెంటరీ నియోజకవర్గంలో : మిగిలిన జిల్లాలోని భాగం.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,872,413,[3] |
ఇది దాదాపు. | కొసొవొ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 252వ స్థానంలో ఉంది..[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 233 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 22.81%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 963:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 63.98%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు
[మార్చు]బరేలి పాల్యా భాషను నిమడి ప్రాంతంలో మాట్లాడుతుంటారు. బరేలి, భిల్ భాషలు జిల్లాలో 10,000 ప్రజలలో వాడుకలో ఉంది.[6] మరొక బిల్ భాష అయిన బరేలి రాత్వి భాష జిల్లాలో 64,000 మంది ప్రజలకు వాడుక భాషగా ఉంది. ఈ భాష వ్రాయడానికి దేవనాగరలిపిని వాడుతుంటారు.[7] మరొక భిల్లు భాష భిలై 1,50,000 మంది ప్రజలకు వాడుకలో ఉంది. [8]
మూలాలు
[మార్చు]- ↑ Hunter, William Wilson, Sir, et al. (1908). Imperial Gazetteer of India, Volume 6. 1908-1931; Clarendon Press, Oxford
- ↑ 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Kosovo 1,825,632 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
West Virginia 1,852,994
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bareli, Palya: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bareli, Rathwi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bhilali: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.
వెలుపలి లింకులు
[మార్చు]- Official "Khargone District" website in Hindi language
- [1] list of places in Khargone