బాలాఘాట్ జిల్లా
బాలాఘాట్ జిల్లా बालाघाट ज़िला | |
---|---|
![]() మధ్య ప్రదేశ్ పటంలో బాలాఘాట్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | జబల్‌పూర్ |
ముఖ్య పట్టణం | బాలాఘాట్ |
ప్రభుత్వం | |
• లోకసభ నియోజకవర్గాలు | బాలాఘాట్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 9,245 కి.మీ2 (3,570 చ. మై) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 17,01,156 |
• సాంద్రత | 180/కి.మీ2 (480/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 78.29% |
• లింగ నిష్పత్తి | 1021 |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
బాలాఘాట్ జిల్లా మహారాష్ట్ర రాష్ట్రంలోని జిల్లాలలో ఒకటి. జిల్లా కేంద్రంగా బాలాఘాట్ జిల్లా ఉంది.
పేరు వెనుక చరిత్ర[మార్చు]
బాలాఘాట్ జిల్లా 1867లో రూపొందించబడింది. భండారా, మండ్లా, సివ్‌నీ జిల్లాలలో కొంత భూభాగం వేరు చేసి ఈ జిల్లా రూపొందించబడింది. జిల్లాకేంద్రం ఆరంభంలో బుర్హా (బూరా) అని పిలువబడింది. తరువాత ఈ పేరు బాలాఘాట్‌గా రూపొందింది. జిల్లాకేంద్రం బాలాఘాట్ జిల్లాకు నిర్ణయించబడింది.జిల్లాలో 2 తాలూకాలు ఉన్నాయి. ఉత్తరంలో బైహర్ తాలూకా (ఇందులో పీఠభూమి ప్రాంతం ఉంది), దక్షిణ ప్రాంతంలో బాలాఘాట్ తాలూకా (ఇందులో దిగువభూములు ఉన్నాయి). జిల్లా నాగపూర్ డివిజన్‌లో భాగం.
1845లో డల్హౌసీ దత్తత సంప్రదాయం (గాడ్ లైన్ కీ ప్రథా). ఈ సంప్రదాయం ద్వారా గోండ్ రాజ్యాలు బ్రిటిష్ రాజ్యాలతో చేర్చబడ్డాయి. ఆసమయంలో ఈ ప్రాంతం " బారహ్ ఘాట్ " అని పిలువబడుతూ ఉండేది. 1911కు ముందు కొలకత్తా రాజధానికి ఈ పేరు నిర్ణయించబడింది. బారహ్ అంటే హిందీలో 12 అని అర్ధం. ఘాట్ అంటే కొండమార్గం అని ఒక అర్ధం. ఈ ప్రాంతంలో 12 కొండ మార్గాలు (మాసెన్ ఘాట్,కంజై ఘాట్, రాంరామా ఘాట్, బాసా ఘాట్, డొంగ్రీ ఘాట్, సెలాన్ ఘాట్, బైసనా ఘాట్, సాలెతెక్రీ ఘాట్, డొంగరియా ఘాట్, కవహ్ర్గాడ్ ఘాట్, అహ్మద్పూర్ ఘాట్,తీపాగడ్ ఘాట్) చాలా ప్రధానమైనవి. కొలకత్తాకు వెళ్ళినప్పుడు ఇది బారహ్ ఘాట్‌గా ఉండేది. కొలకత్తా నుండి అది తిరిగి వచ్చినప్పుడు బాలాఘాట్‌గా రూపాంతరం చెందింది.1956లో ఈప్రాంతం స్వతంత్ర జిల్లాగా రూపొందించబడింది.
చరిత్ర[మార్చు]
18వ శతాబ్దం ఆరంభంలో జిల్లాప్రాంతం రెండు గోదియా రాజ్యాల మద్య పంచబడింది. పశ్చిమంలో వైనగంగా తీరంలో ఉన్న భాగం దియోగర్ (మద్యప్రదేశ్), జిల్లా తూర్పు భాగం గర్హా - మండ్లా రాజ్యంలో భాగంగా ఉండేది. .[1]
దియోగర్ రాజ్యం[మార్చు]
1743లో దియోగర్ రాజ్యం నాగపూర్ సామ్రాజ్యానికి చెందిన బోంస్లే మారాఠీ రాజ్యంలో విలీనం చేయబడింది. తరువాత స్వల్పకాలంలోనే ఉత్తరభాగం మినహా మిగిలిన ప్రాంతం కూడా స్వాధీనం చేసుకొనబడింది. 1781లో ఈభూభాగం మిగిలిన గర్హా - మండ్లా రాజ్యం మరాఠీలకు చెందిన సౌగర్ ప్రొవింస్‌లో విలీనం చేయబడింది. తరువాత మరాఠీ పేష్వాల నియంత్రణలోకి మారింది.1798లో భోంస్లేలు మునుపటి గర్హా- మండ్లా భూభాగాలను స్వాధీనం చేసుకున్నారు..[1]
మూడవ ఆంగ్లో - మరాఠీ యుద్ధం[మార్చు]
1818లో " మూడవ ఆంగ్లో - మరాఠీ యుద్ధం " తరువాత నాగపూర్ బ్రిటిష్ " సంస్థానం " అయింది. 1853లో బ్రిటిష్ ప్రభుత్వం చేత నాగపూర్ రాజ్యంలో బాలాఘాట్ జిల్లా ప్రాంతం చేర్చబడింది. తరువాత జిల్లాప్రాంతం నాగపూర్ ప్రావిన్స్ అయింది. 1861లో నాగపూర్ ప్రావిన్స్ సెంట్రల్ ప్రావిన్స్ అని కూడా పిలువబడింది.[1]19వ శతాబ్దంలో జిల్లా ఎగువభాగంలో స్వల్పంగా జనసంఖ్య ఉండేది. అలాగే సుందరమైన బౌద్ధ ఆలయం ఉంది. ఇక్కడ విలసిల్లిన సంస్కృతి సమాజానికి దూరంగా ఉండి చరిత్రకాలం నాటికి అంతరించి పోయింది. [2] జిల్లా మొదటి డెఫ్యూటీ కమీషనర్ " కల్నల్ బ్లూంఫీల్డ్ " బైహర్ తాలూకా ప్రాంతంలోని సెటిల్మెంటుకు ప్రోత్సాహం అందించాడు. అదేసమయంలో పరస్వరా పీఠభూమిలో లక్ష్మణ్ నాయక్ మొదటి గ్రామాన్ని స్థాపించాడు. ఆసియన్ ప్రాంతంలో మలాంజ్ఖండ్ ప్రఖ్యాతి చెందిన రాగి గనిగా గుర్తించబడుతుంది..[1]
కరువు[మార్చు]
1868 - 1897లో వర్షలేమి కారణంగా దిగువభూములలో వరిపంట దిగుబడి క్షీణించి కరువు ఏర్పడింది. .[1] 1896-1897 మద్య కాలంలో జిల్లా ప్రాంతం మరొకసారి తీవ్రమైన క్షామానికి గురైంది.[2] ఆసమయంలో 17% పంటలు మాత్రమే చేతికి అందాయి. 1899-1900 ల మద్య కాలంలో జిల్లా మరొకసారి క్షామానికి గురైంది. 23% పంట మాత్రమే చేతికి అందింది. 1901 నాటికి జనసంఖ్య 326,521కు (కరువు కారణంగా 1801 - 1901 జనసంఖ్య కంటే 15% క్షీణించింది) చేరుకుంది. [1]
రహదారులు[మార్చు]
20వ శతాబ్దం ఆరంభంలో జిల్లాలో 15 కి.మీ పొడవైన పక్కా రహదారులు, 208 కి.మీ పొడవైన కచ్చా రహదారులు ఉండేవి. 1904లో జబల్‌పూర్ -గోందియా రైలు మార్గం నిర్మాణం పూర్తి అయింది. జిల్లాలోని ఈ మార్గంలో 6 స్టేషన్లు ఉన్నాయి.[1]
స్వతంత్రం తరువాత[మార్చు]
1947లో భారతదేశానికి స్వతంత్రం లభిచిన తరువాత సెంట్రల్ ప్రొవింస్ మధ్య ప్రదేశ్ రాష్ట్రంగా రూపొందింది. 1956లో బాలాఘాట్ జిల్లా జబల్‌పూర్ డివిజన్‌లో భాగం అయింది. బాలాఘాట్ దక్షిణ ప్రాంతం, గోందియా, భండారా, నాగపూర్ జిల్లాలు బాంబే ప్రొవింస్‌కు మార్చబడ్డాయి. .[citation needed] ప్రస్తుతం బాలాఘాట్ జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగం.[3]
కాలనీ పాలనలో[మార్చు]
1867-1873 మద్య కాలంలో బాలాఘాట్ జిల్లా ప్రాంతం భండారా, మండ్లా, సివ్‌నీ జిల్లాలలో భాగంగా ఉండేది. బాలాఘాట్‌కు కొండమార్గాల వలన ఈ పేరు నిర్ణయించబడింది. జిల్లాకేంద్రం గతంలో బుర్హా (బొరా) అని పిలువబడింది. అయినప్పటికీ కాలక్రమంలో ఈపేరు బాలాఘాట్‌గా మారింది. ఈ పేరే జిల్లాకు కూడా పెట్టారు. బాలాఘాట్ జిల్లా సహజసౌందర్యం కలిగి, ఖనిజసంపదతో, సమృద్ధమైన అరణ్యాలతో అలరారుతుంటుంది.
భౌగోళికం[మార్చు]
బాలాఘాట్ జిల్లా జబల్‌పూర్ డివిజన్ దక్షిణప్రాంతంలో ఉంది. జిల్లా సాత్పురా పర్వతశ్రేణి ఆగ్నేయభూభాగంలో ఉంది. అలాగే వైనగంగానది ఎగువ లోయలో ఉంది.జిల్లా 21-19 నుండి 22-24 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79-31 నుండి 81-3 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా మొత్తం వైశాల్యం 9,245 చ.కి.మీ.
సరిహద్దు[మార్చు]
బాలాఘాట్ ఉత్తర సరిహద్దులో మండ్లా జిల్లా, వాయవ్య సరిహద్దులో దిండోరీ జిల్లా, తూర్పు సరిహద్దులో రాజనందగావ్ జిల్లా (చత్తీస్‌గఢ్),దక్షిణ సరిహద్దులో గోందియా జిల్లా, భండారా జిల్లాలు (మహారాష్ట్ర), పశ్చిమ సరిహద్దులో సివ్‌నీ జిల్లా ఉన్నాయి.జిల్లా దక్షిణ సరిహద్దులో హిందీ, మరాఠీ భాషలు వాడుకలో ఉన్నాయి.
నదులు[మార్చు]
జిల్లాలో ప్రధానంగా వైనగంగా, దాని ఉపనదులు ప్రవహిస్తున్నాయి. జిల్లాకేంద్రం అయిన బాలాఘాట్ నగరం వైనగంగా నదీ తీరంలో ఉంది. ఇది ఉత్తర, దక్షిణ దిశలో ప్రవహిస్తుంది. అంతేకాక ఇది సివ్‌నీ జిల్లా సరిహద్దుగా ఉంది. అంతేకాక జిల్లాలో వైనగంగా ఉపనదులైన బాఘ్, నహ్రా, ఉస్కల్ నదులు ప్రవహిస్తున్నాయి. భవందడి, బాఘ్ నదులు మాహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దును ఏర్పరుస్తూ ఉన్నాయి.
పర్వతాలు[మార్చు]
జిల్లాలో వింద్యపర్వతశ్రేణిలో కొంతభాగం ఉంది. కతంగి నుండి పైభాగంలో ఉన్న ప్రాంతాన్ని భండార్ పర్వతశ్రేణి అంటారు. అక్కడ నుండి భూ బంధిత సిరాంపూర్ లోయలు, కైమూర్ పర్వతశ్రేణి ఉంటాయి.[4]
భౌగోళిక విభజన[మార్చు]
భౌగోళికంగా జిల్లా మూడు భాగాలుగా విభజించబడి ఉంది:
- దక్షిణ దిగువభూములు, కొంచం అసమానతలు కలిగిన మైదానం. వైన్‌గంగా, భాగ్,డియో,ఘిశ్రీ, సన్ నదుల పరీవాహక ప్రాంతంలో ఉన్న వ్యవసాయయోగ్యమైన సారవంతమైన భూమి. [2]
- సన్నని పొడనైన లోయ (మౌ తాల్లూకా): వైన్‌గంగా నది, కొండల మద్య ప్రాంతం. ఇక్కడ సన్నని పొడవైన అసమానతలు కలిగిన దిగువభూమి. మద్యలో దట్టమైన అరణ్యాలు కలిగిన కొండలు, శిఖరాలు ఉన్నాయి. ఇది ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉంది..[2]
- గంభీరమైన పీఠభూమి :- రాయ్గఢ్ బిచియా ట్రాక్ట్. ఇందులో అసమానతలు కలిగిన కొండలు, లోయలు ఉన్నాయి. సాధారణంగా ఇది తూర్పు, పడమరలుగా విస్తరించి ఉంది. ఇక్కడ జిల్లాలోని ఎత్తైన లాంజీ (సముద్రమట్టానికిఎత్తు 2300 లేక 2500) తెపగర్ శిఖరం (సముద్రమట్టానికి ఎత్తు 2600 మీ), భైంసఘాట్ పర్వతశ్రేణి (సముద్రమట్టానికి ఎత్తు 3000 మీ) ఉన్నాయి.
- జిల్లాలో నర్మదా నదీ ఉపనదులైన బంజర్, హలాన్, జమునియా నదులు ప్రవహిస్తున్నాయి.
ఆర్ధికరంగం[మార్చు]
భారతదేశంలోని 80% మాంగనినీస్ బాలాఘాట్ జిల్లాలో లభ్యం ఔతుంది. సమీపకాలంలో మలాంజ్‌ఖండ్ వద్ద రాగి నిల్వలు కనుగొనబడ్డాయి. అదనంగా జిల్లాలో బాక్సిట్, కియానైట్, పాలరాయి, డోలోమైట్, క్లే, లైంస్టోన్ మొదలైన ఇతర ఖనిజాలు లభ్యమౌతున్నాయి. 2006లో పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ బాలాఘాట్ జిల్లాను భారతదేశంలో 250 వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చింది.[5] " బ్యాక్ వార్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం " నుండి నిధిని అందుకుంటున్న 24 మధ్యప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో బాలాఘాట్ ఒకటి.[5]
విభాగాలు[మార్చు]
జిల్లా నిర్వహణాపరంగా 10 మండలాలుగా విభజించబడింది: వరసియోని, లాల్బుర్రా, బలాఘాట్, కతంగి, పరస్వాడా, బైహర్, ఖైర్లంజి, లాంజి, బిర్సా, కిర్నాపూర్..[citation needed]
ప్రయాణ సౌకర్యాలు[మార్చు]
జబల్‌పూర్ - బాలాఘాట్ జిల్లా " సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే "లో భాగం. ఇది జిల్లా ఉత్తర, దక్షిణాలుగా వైన్‌గంగా లోయ గుండా పయనిస్తుంది. ఆరంభంలో ఈ రైలు మార్గం " నేరో గేజ్ " మార్గంగా ఉండేది. (2 అడుగులు 6 అం (762 మిమీ)). 2005-2006 లో బాలాఘాట్ - గొందియా జిల్లా రైలుమార్గం బ్రాడ్‌గేజ్ మార్గంగా మార్చబడి మొదటిసారిగా బాలాఘాట్ జిల్లాను భారతీయ బ్రాడ్‌గేజ్ రైలుమార్గంతో అనుసంధానించబడింది. బాలాఘాట్- జబల్‌పూర్ రైలుమార్గం నిర్మాణదశలో ఉంది.పశ్చిమదిశలో బాలాఘాట్- కతంగి మార్గం భార్వెలి వరకు మాంగనీస్ రవాణా కొరకు నిర్మించబడింది.బాలాఘాట్ జిల్లా బసు మార్గంతో భోపాల్, నాగ్పూర్,గోందియా జిల్లా, జబల్‌పూర్, రాజ్‌పూర్ మొదలైన పెద్ద నగరాలతో అనుసంధానించబడి ఉంది.బాలాఘాట్ జిల్లాకు సమీపంలోని విమానాశ్రయం నాగపూర్ విమానాశ్రయం..[citation needed]
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,701,156,[6] |
ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[7] |
అమెరికాలోని. | నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[8] |
640 భారతదేశ జిల్లాలలో. | 288వ స్థానంలో ఉంది.[6] |
1చ.కి.మీ జనసాంద్రత. | 184 [6] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.56%.[6] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1021:1000 [6] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 78.29%.[6] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
1991-2001[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జనసంఖ్య | 14,97,968 |
గ్రామప్రాంత జనసంఖ్య | 12,36,083 |
నగరప్రాంత జనసంఖ్య | 1,29,787 |
షెడ్యూల్డ్ జాతులు | 1,13,105 |
షెడ్యూల్డ్ తెగలు | 2,98,665 |
పురుషులు | 6,82,260 |
స్త్రీలు | 6,83,610 |
వైశాల్యం | 9,245 |
జనసాంధ్రత | 162 |
1981-1991 జిల్లా జనసంఖ్య 1,365,870.
వృక్షజాలం , జంతుజాలం[మార్చు]
జిల్లాలో 52% అరణ్యంతో కప్పబడి ఉంది.[citation needed] అరణ్యప్రాంతంలో టేకు (టెక్టోనా గ్రాండీస్) సాల వృక్షాలు (షొరియా రోబస్టా), వెదురు, సాజా మొదలైన చెట్లు ఉన్నాయి. నెమలి, ఎర్ర బుల్‌బుల్, కోకిల మొదలైన పక్షులు ఉన్నాయి. జిల్లాలో " కంహా నేషనల్ పార్క్ "లో కొంత భాగం ఉంది.
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Balaghat district. |
మూలాల జాబితా[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 Hunter 1908,[page needed].
- ↑ 2.0 2.1 2.2 2.3 Chisholm 1911.
- ↑ "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
- ↑ Bhargava, Archana. "Resources and planning for economic development". p. 19. Google books. Retrieved 2010-07-11.
- ↑ 5.0 5.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Gambia, The 1,797,860 July 2011 est.
{{cite web}}
: line feed character in|quote=
at position 12 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Nebraska 1,826,341
{{cite web}}
: line feed character in|quote=
at position 9 (help)
మూలాలు[మార్చు]
- Hunter, William Wilson (Sir); et al. (1908). Imperial Gazetteer of India. Vol. 6. 1908-1931. Oxford: Clarendon Press. pp. ??.
{{cite book}}
: Explicit use of et al. in:|author2=
(help); Invalid|ref=harv
(help)
- Attribution
This article incorporates text from a publication now in the public domain: Chisholm, Hugh, ed. (1911). . Encyclopædia Britannica (11th ed.). Cambridge University Press.
{{cite encyclopedia}}
: Cite has empty unknown parameters:|HIDE_PARAMETER15=
,|HIDE_PARAMETER13=
,|HIDE_PARAMETER2=
,|separator=
,|HIDE_PARAMETER4=
,|HIDE_PARAMETER8=
,|HIDE_PARAMETER11=
,|HIDE_PARAMETER5=
,|HIDE_PARAMETER7=
,|HIDE_PARAMETER10=
,|HIDE_PARAMETER6=
,|HIDE_PARAMETER9=
,|HIDE_PARAMETER3=
,|HIDE_PARAMETER1=
,|HIDE_PARAMETER14=
, and|HIDE_PARAMETER12=
(help); Invalid|ref=harv
(help)
![]() |
మండ్లా జిల్లా | కబీర్‌ధాం జిల్లా, చత్తీస్‌గఢ్ | ![]() | |
సివ్‌నీ జిల్లా | ![]() |
రాజనందగావ్ జిల్లా, చత్తీస్‌గఢ్ | ||
| ||||
![]() | ||||
నాగ్పూర్ జిల్లా, మహారాష్ట్ర | భండారా జిల్లా, మహారాష్ట్ర | గోందియా జిల్లా, మహారాష్ట్ర |
- Wikipedia articles needing page number citations from April 2011
- Harv and Sfn no-target errors
- CS1 errors: invisible characters
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- Articles with short description
- Short description is different from Wikidata
- Infobox settlement pages with bad settlement type
- All articles with unsourced statements
- Articles with unsourced statements from April 2011
- Articles with unsourced statements from February 2007
- Commons category link is on Wikidata
- CS1 errors: explicit use of et al.
- CS1 errors: invalid parameter value
- CS1: long volume value
- CS1 errors: empty unknown parameters
- Wikipedia articles incorporating a citation from the 1911 Encyclopaedia Britannica with Wikisource reference
- మధ్య ప్రదేశ్ జిల్లాలు
- బాలాఘాట్ జిల్లా
- 1867 స్థాపితాలు
- భారతదేశం లోని జిల్లాలు