టికంగఢ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టికంగఢ్ జిల్లా
टीकमगढ़ जिला
మధ్య ప్రదేశ్ పటంలో టికంగఢ్ జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో టికంగఢ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుసాగర్
ముఖ్య పట్టణంటికంగఢ్
Government
 • లోకసభ నియోజకవర్గాలుటికంగఢ్
 • శాసనసభ నియోజకవర్గాలు1.టికంగఢ్, 2. పృథ్వీపూర్, 3. జతారా, 4. ఖర్గపూర్, 5. నివారీ
విస్తీర్ణం
 • మొత్తం5,048 కి.మీ2 (1,949 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం14,44,920
 • జనసాంద్రత290/కి.మీ2 (740/చ. మై.)
 • Urban
30.40%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత62.57%
 • లింగ నిష్పత్తి901
ప్రధాన రహదార్లుNH-12A, SH10
Websiteఅధికారిక జాలస్థలి
గర్ కుందర్ ప్రాంగణం, తికమ్‌గర్

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో టికంగఢ్ జిల్లా (హిందీ:टीकमगढ़ जिला) ఒకటి. టికంగఢ్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. టికంగఢ్ జిల్లా సాగర్ డివిజన్‌లో భాగం. జిల్లాలో యాదవులు అధికంగా నివసిస్తున్నారు.[1]

సరిహద్దులు

[మార్చు]

జిల్లా తూర్పు, ఆగ్నేయ సరిహద్దులో చత్తర్‌పూర్, పశ్చిమ సరిహద్దులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర లలిత్‌పూర్, ఉత్తర సరిహద్దులో ఝాన్సీ జిల్లాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 5,048 చ.కి.మీ.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

జిల్లాకేద్రం పేరు టికంగఢ్ జిల్లాకు నిర్ణయించబడింది. పట్టణం అసలు పేరు తిహ్రి. 1783లో అర్చా పాలకుడు విక్రమాజిత్ (1776- 1817) రాజధానిని అర్చా నుండి తిహ్రికి బదిలీ చేసాడు. తరువాత తిహ్రి టికంగఢ్ అయింది. (తికం అనేది కృష్ణుని నామాలలో ఒకటి)

చరిత్ర

[మార్చు]

సమైక్య భారతంలో విలీనం అయ్యేవరకు జిల్లా ప్రాంతం పూర్వం ఒర్చా రాజాస్థానంగా ఉండేది. రుద్రప్రతాప్ 1501లో ఒర్చా రాజ్యాన్ని స్థాపించాడు. సమైక్య భారతంలో విలీనం తరువాత ఈ ప్రాంతం విద్యప్రదేస్‌ 1948లో భాగం అయింది. తరువాత 1956 నవంబరు 1 లో మధ్యప్రదేశ్ రూపొందించబడిన తరువాత జిల్లా మధ్యప్రదేశ్ లో భాగం అయింది.

1501లో ఒర్చా రాజ్యం .[2] బుండేలా నాయకుడు రుద్ర ప్రతాప్ సింగ్ చేత స్థాపించబడింది. ఆయన ఈ ప్రాంతానికి మొదటి రాజు అయ్యాడు. (1501-1531) ఇక్కడ కోట నిర్మించబడింది. .[3] రాజ్యాన్ని స్థాపించిన ప్రతాపరుద్రుడు ఒక ఆవును సింహం నుండి రక్షించే ప్రయత్నంలో మరణించాడు. అక్బర్ కాలంలో ఒర్చా మహారాణి " చతుర్భుజ " ఆలయనిర్మాణం చేసింది. [4] రాజ్ మందిర్ మధుకర్ షా ( 1554 - 1591 )చేత నిర్మించబడింది.[5][6]

ముగలుల కాలంలో షాజహాన్ చక్రవర్తి సామంతుడు బీర్ సింగ్ దేవ్ (1605-1627) కాలంలో ఒర్చా ఉన్నత స్థాయికి చేరుకుంది. జహంగీర్ మహల్, (1605), సావన్ భదాన్ మహల్ వంటి భవనాలు నిర్మించబడ్డాయి.[7] 17 శశతాబ్దంలో జుఝర్ సింగ్ ముగల్ చక్రవర్తి షాజహాన్ మీద తిరుగుబాటు చేసాడు. 1635-1641 మధ్యకాలంలో ముగల్ సైన్యాలు రాజ్యాన్ని విధ్వశం చేసి ఒర్చారాజ్యాన్ని ఆక్రమించుకున్నాయి.

జుఝర్ సింగ్

[మార్చు]

17వ శతాబ్దంలో రాజా జుఝర్ సింగ్ ముగల్ చక్రవర్తి షాజహాన్ మీద తిరుగుబాటు చేసాడు. షాజహాన్ సౌన్యంరాజ్యాన్ని ధ్వంసం చేసాడు. 1635-1641 నాటికి ఈ ప్రాంతం అంతా ముగల్ పాలకుల వశం అయింది. 18వ శతాబ్ధానికి అర్చా, దతియా తప్ప మిగిలిన బుండేలా అంతటినీ మరాఠీపాలకుల వశం అయింది. 1783 లో తెహ్రి పట్టణం (టికంగఢ్) అర్చా రాజ్యానికి రాజధాని అయింది. తెహరీలో టికంగఢ్ కోట నిర్మించబడింది. తరువాత పట్టణానికి టికంగఢ్ పేరు నిర్ణయించబడుంది.[8]

హమీర్ సింగ్

[మార్చు]
Flag of princely state of orchha,TKG

( 1848 - 1874 ) మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన హమీర్ సింఘ్ 1865 నాటికి మాహారాజుగా అతస్థుకు చేరాడు. 1874లో మహారాజు మరణం తరువాత ఆయన వారసుడు మహారాజా హమీర్ సింగ్ (జననం1854-మరణం 1930) అధికారం చేపట్టాడు. ఆయన రాజ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి స్వయంగా ఇంజనీరింగ్, నీటిపారుల మార్గాలకు రూపకల్పన చేసాడు.

1901 నాటికి రాజ్య వైశాల్యం 2000 చ.కి.మీ,ంజనసంఖ్య 52,63. బుల్డానా రాజ్యాలలో ఇది అతిపురాతన రాజ్యంగానూ, ఉత్తమ శ్రేణికి చెందిన రాజ్యంగా గుర్తుంచబడింది. మహారాజా బుండేల్‌ఖండ్ రాజకుమారుడిగా గౌరవించబడ్డాడు. 1950 జనవరి 1 ప్రతాప్‌సింగ్ వారసుడు వీర్‌సింగ్ తనరాజ్యాన్ని సమైక్యభారతదేశంతో విలీనం చేసాడు. తరువాత జిల్లా వింధ్యప్రదేశ్‌లో భాగం అయింది. 1956లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగం అయింది. ప్రస్తుతం అర్చా అనామకంగా స్వల్పమైన జంఖ్య కలిగి ఉంది. అర్చాలోని పురాతన వారసత్వ భవనాలు, పర్యాటకం మాత్రమే గుర్తించబడుతుంది. ప్రాంతీయ దుకాణాలలో అర్చా చరిత్ర గురించిన పుస్తకాలు లభ్యం ఔతున్నాయి.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో టికంగఢ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[9] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[9]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,444,920,[10]
ఇది దాదాపు. స్విడ్జర్‌లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[11]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం.[12]
640 భారతదేశ జిల్లాలలో. 343వ స్థానంలో ఉంది.[10]
1చ.కి.మీ జనసాంద్రత. 286 [10]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.11%.[10]
స్త్రీ పురుష నిష్పత్తి. 901:1000 [10]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 62.57%.[10]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు

[మార్చు]

టికంగఢ్ భరియా భాష (ద్రావిడ భాషాకుటుంబానికి చెందిన భాష) వాడుక భాషగా ఉంది. ఈ భాషకు 2,00,000 మందికి (షెడ్యూల్డ్ తెగలకు) వాడుక భాషగా ఉంది. ఈ భాషను వ్రాతడానికి దేవనాగరి లిపిని వాడుతున్నారు.[13]

హాస్పిటల్ సౌకర్యాలు

[మార్చు]
  • రాజేంద్ర జిల్లా వైద్యశాల
  • రాయ్ సర్జికల్ హాస్పిటల్
  • గోవింద్ సాయి ప్రసూతి హోం
  • మత్రత్వ్య నర్సింగ్ హోమ్
  • సేవా నర్సింగ్ హోమ్
  • శ్రీరాం నర్సింగ్ హోమ్
  • లైఫ్ లైన్ నర్సింగ్ హోమ్
  • సుధా మెంట్ సేవాలయ నర్సింగ్ హోమ్

సమాచార రంగం

[మార్చు]

1897లో రాజస్థానంగా ఉన్న సమయంలోనే పోస్టేజ్ స్టాంపులు ముద్రించబడ్డాయి. అయినప్పటికీ ఇవి ఎప్పటికీ వినియోగించబడలేదు. 1913లో మొదటిసారిగా అర్చా రాజాస్థాన స్టాంపులు వినియోగించబడ్డాయి. 1950 ఏప్రిల్ 30 రాజాస్థానం సమైక్య భారతదేశంతో విలీనం చేయబడిన తరువాత ఇవి నిలిపివేయబడ్డాయి.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

టికంగఢ్ బస్ స్టాండు రాష్ట్రంలో పెద్దదిగా గుర్తించబడుతుంది.

Welcome gate at Jhansi Road In TKG

రహదారి

[మార్చు]

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు క్రమానుసార బసులు లభ్యం ఔతున్నాయి.

రైల్వే

[మార్చు]

2012లో టికంగఢ్ రైలుమార్గం నిర్మాణపు పనులు పూర్తి అయ్యాయి. 2013 ఏప్రిల్ 13న ఇక్కడి నుండి రైల్వే సర్వీసులు ఆరంభం అయ్యాయి. ఇక్కడి నుండి టికంగఢ్- లలిత్‌పూర్‌కు రైలు సర్వీసులు ఆరంభం అయ్యాయి. తరువాత లలిత్‌పూర్ - సింగ్రౌలి రైలు ప్రాజెక్టు మొదలైంది. ఇక్కడి నుండి మొదటి సారిగా ఝాన్సీ వరకు పాసుంజర్ రైలు నడుపబడింది. టికంగఢ్- లలిత్‌పూర్ రైలు మార్గం పొడవు 40 కి.మీ.

వాయుమార్గం

[మార్చు]

జిల్లాకు సమీపంలో ఉన్న విమానాశ్రయం : ఖజూరహో విమానాశ్రయం. ఇది జిల్లా కేంద్రానికి 125 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి నుండి ఢిల్లీ, ఆగ్రా లకు విమానసేవలు లభిస్తున్నాయి.

పర్యాటకం

[మార్చు]
Lakshmi Temple, Orchha.

టికంగఢ్ జిల్లాలో పలు పర్యాటక ఆలర్షణలు ఉన్నాయి.Shri Ajitnath Digambar Jain Atishaya Kshetra Bandhaji

  • ఓర్చా: - 'రామరాజ' ఆలయం ప్రసిద్ధి ప్రపంచ.
  • కుందేశ్వర్ : - శివుని గుడి ప్రసిద్ధి.
  • అహార్జి
  • Bandhaji:- ప్రపంచ ప్రసిద్ధ అజినాథ్ ఆలయం.
  • బాల్డియోగర్ : - బాల్డియోగర్ కి టాప్ (तोप) బుందేల్ఖండ్ ప్రాచుర్యంలో ఉంది.
  • అచ్చారు మాతా: - లార్డ్ దుర్గ ఆలయం ప్రసిద్ధి.
  • పాపొరాజి : - ప్రసిద్ధ జైన దేవాలయం
  • చకరధన్: - పురాణాలు దుర్గా దేవి అనారోగ్యం నుండి పిల్లలు సేవ్
  • బదగావ్ : - ప్రసిద్ధ జైన ఆలయం, హనుమాన్ టెంపుల్, శివాలయం, dhasan నది.

నిర్వహణ

[మార్చు]
టికంగఢ్ నగర అధికారులు
ఎం.పి వీరేంద్ర కుమార్‌ఖతిక్ [14]
ఐ.ఎ.ఎస్ ఎం.ఆర్. కెదర్ షర్మక్ [15]
ఐ.పి.ఎస్ ఆఫీసర్ ఎం.ఆర్. అనురాగ్ షర్మ [16]
ఎం.ఎ.ఎ. ఆఫ్ లెజిస్లేటివ్ అస్ంబ్లీ జాత్రా- దినేష్ అహిర్వర్ [15] తికమగర్- ఎం.ఆర్. కె.కె . శ్రీవాత్సవ [15] పృధ్విపుర్ - అనిత నాయక్ నివారి - ఎం.ఆర్. అనిల్ జైన్ ఖర్గపూర్ - చంద్రా రాణి గౌర్

భౌగోళికం

[మార్చు]

నదులు, సరోవరాలు

[మార్చు]

జిల్లాలో ఈశాన్య సరిహద్దులో బెత్వా నది ప్రవహిస్తుంది. బదగావ్‌ వద్ద ధసన్ నది ప్రవహిస్తుంది. ధాసన్ నది ఉపనదులలో ఒకటి జిల్లా తూర్పు సరిహద్దులో ప్రవహిస్తుంది. ఈ రెండు నదులు ఈశాన్య దిశగా ప్రవహిస్తున్నాయి. బెత్వా నది ఉపనదులైన జమ్ని, బగ్రి, బరుయా నదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

అర్చా ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక - చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. రాంరాజా ఆలయం సందర్శన కారణంగా జిల్లాకు విదేశీ మారకం అధికంగా లభిస్తుంది. అంతేకాక మరికొన్ని ఆలయాలు, కోటలు పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.

టికంగఢ్‌ల్‌లో ఉన్న గ్రామం కుండలేశ్వర్. ఇది టికంగఢ్‌కు 5కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ జంధార్ నదీతీరంలో పురాతనమైన కుందదేవ్ మహాదేవ్ ఆలయం ఉంది. పురాణకథనం అనుసరించి ఈ ప్రాంతం బాణాసురుని రాజధాని బాణపురమని భావిస్తున్నారు. రాక్షసరాజు బాణాసురుని కుమార్తె ఉషా దేవి ఈ శివలింగాన్ని ప్రదిదినం అర్ధరాత్రి వేళలో ఆరాధించింది. ఉషాదేవి అనిరుద్ధుని వివాహం చేసుకున్నది. అనిరుద్దుడు శ్రీకృష్ణుని మనుమడు ప్రధ్యుమ్నుని కుమారుడు. బగ్వార్ క్షత్రియ రాజపుత్ర వంశానికి చెందిన భూస్వామిణి కుందా ఈ శివలింగాన్ని ఆరాధించింది కనుక ఇది కుండలేశ్వర్ అయింది.

సుజ్రా ఆనకట్ట

[మార్చు]

ధాసన్ నదిమీద బదగావ్ సమీపంలో సుజ్రా ఆనకట్ట నిర్మించబడింది.

విభాగాలు

[మార్చు]
  • జిల్లా 3 ఉపవిభాగాలు ఉన్నాయి:- టికంగఢ్, నివారి, జతర
  • జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి :- టికంగఢ్, బదియోగావ్.నివారి, పృధ్విపూర్, జతర, పలెర.
  • టికంగఢ్ ఉపవిభాగంలో 2 తాలూకాలు ఉన్నాయి :- టికంగఢ్, బదియోగావ్
  • నివారి ఉపవిభాగంలో 2 తాలూకాలు ఉన్నాయి :- నివారి, పృధ్విపూర్.
  • జతర ఉపవిభాగంలో 2 తాలూకాలు ఉన్నాయి : జతర, పలెర.
  • జిల్లాలో 5 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి :- టికంగఢ్, నివారి, పృధ్విపూర్, జతర, ఖరగ్‌పూర్
  • పార్లమెంటు నియోజక వర్గం :- తికంఘర్

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2014-11-23.
  2. Orchha Tikamgarh district Official website.
  3. Mausoleum of Raja Rudra Pratap British Library.[permanent dead link]
  4. Orchha Archived 2009-02-07 at the Wayback Machine British Library.
  5. Genealogy of Orchha
  6. Raj Mandir Archived 2012-01-12 at the Wayback Machine British Library.
  7. Swan Bhadon Palace, Orcha Archived 2012-03-14 at the Wayback Machine British Library.
  8. Orchha state The Imperial Gazetteer of India, 1909, v. 19, p. 241.
  9. 9.0 9.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  11. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  12. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
  13. M. Paul Lewis, ed. (2009). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  14. "Indore Parshad/Mayor". Indore Municipal Corporation. 2010-08-08. Archived from the original on 2010-08-12. Retrieved 2010-08-08.
  15. 15.0 15.1 15.2 "From The Collector's Desk". Indore District Administration. 2010-03-17. Archived from the original on 2010-01-24. Retrieved 2010-05-13.
  16. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; From The Cqollector's Desk అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

వెలుపలి లింకులు

[మార్చు]