అలీరాజ్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలీరాజ్‌పూర్ జిల్లా
अलीराजपुर जिला
మధ్య ప్రదేశ్ పటంలో అలీరాజ్‌పూర్ జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో అలీరాజ్‌పూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుఇండోర్
ముఖ్య పట్టణంఅలీరాజ్‌పూర్
Government
 • లోకసభ నియోజకవర్గాలురత్లాం
 • శాసనసభ నియోజకవర్గాలు1. అలీరాజ్‌పూర్, 2. జోబాట్
Area
 • మొత్తం2,165 km2 (836 sq mi)
Population
 (2011)
 • మొత్తం7,28,677
 • Density340/km2 (870/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత37.22%
 • లింగ నిష్పత్తి1009
Websiteఅధికారిక జాలస్థలి
అలిరాజ్‌పూర్‌లో సాంప్రదాయ భిల్ జాతర

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో అలీరాజ్‌పూర్ జిల్లా (హిందీ:अलीराजपुर जिला) ఒకటి. 2008 మే 17న ఝాబువా జిల్లా నుండి కొంత భూభాగం (అలీరాజ్‌పూర్, జోబాట్, భబ్రా) వేరుచేసి ఈ జిల్లా రూపొందించారు. అలీరాజ్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011 గంణాంకాలను అనుసరించి జిల్లా జనాభా 728,677. వైశాల్యం 2,165 చ.కి.మీ. 76.5% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఈ జిల్లా, భారతదేశంలో కెల్లా అత్యంత పేద జిల్లా. [1][2]

పేరు వెనుక చరిత్ర[మార్చు]

జిల్లా కేంద్రం అలీరాజ్‌పూర్ కారణంగా జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ భూభాగం మునుపటి అలీరాజ్‌పూర్ రాజాస్థానంగా ఉండేది. అలీరాజ్‌పూర్ రాజాస్థానానికి ముందు అలి రాజధానిగా ఉండేది. ఆనంద్ దేవ్ 1437లో స్థాపించిన అలీరాజ్‌పూర్ రాజాస్థానానికి అలి పట్టణంలో కోట నిర్మించబడింది. తరువాత రాజాస్థానానికి రాజధాని రాజ్‌పూర్‌కు మార్చబడింది. రెండు రాజధానుల పేరు అలి రాజ్పూర్ పేర్లను సమైక్యంగా జిల్లాకు నామకరణం చేయబడింది.[3]

చరిత్ర[మార్చు]

1947లో భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు అలిరాజ్‌పూర్ భోపవర్ అజెంసీలో భాగంగా ఉండేది. భోపవర్ ఏజెంసీ " సెంట్రల్ ఇండియా అజెంసీ"లో భాగంగా ఉండేది. భోపవర్ ఏజెంసీని 1437లో స్థాపించబడింది. స్వతంత్రం వచ్చిన తరువాత ఇది సమైక్య భారత దేశంలో విలీనం చేయబడింది. 1948లో ఈ భూభాగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా మారింది.

విభాగాలు[మార్చు]

 • జిల్లా 3 తాలూకాలు ఉన్నాయి : అలీరాజ్‌పూర్, జొబాట్ , భబ్రా.
 • జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :- అలీరాజ్‌పూర్ , జోబాట్.

.[4]

 • జిల్లాలోని 2 తాలూకాలు రత్లాం పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 7,28,677,[5]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[6][7]
640 భారతదేశ జిల్లాలలో. 498వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 229 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.4%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 1009:1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 37.22 [5][8]
జాతియ సరాసరి (72%) కంటే. అల్పం

మూలాలు[మార్చు]

 1. "Alirajpur is the Black Hole of Indian Democracy - Politics News , Firstpost". Firstpost. 2019-04-19. Archived from the original on 2021-01-01. Retrieved 2021-01-01.
 2. "Alirajpur district in Madhya Pradesh poorest in the country: Global report". www.downtoearth.org.in (in ఇంగ్లీష్). Archived from the original on 2021-01-01. Retrieved 2021-01-01. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2020-10-18 suggested (help)
 3. "Ali Rajpur". Imperial Gazetteer of India, vol. 5, p. 223.
 4. "District/Assembly List". Chief Electoral Officer, Madhya Pradesh website. Archived from the original on 1 డిసెంబరు 2015. Retrieved 16 April 2010.
 5. 5.0 5.1 5.2 5.3 5.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
 6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Bhutan 708,427
 7. "2010 Resident Population Data". US Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. Alaska 710,231
 8. Dhar, Aarti (31 March 2011). "Significant boost in literacy: 2011 census". The Hindu. New Delhi. Retrieved 1 April 2011.