Jump to content

1781

వికీపీడియా నుండి

1781 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1778 1779 1780 - 1781 - 1782 1783 1784
దశాబ్దాలు: 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
యురేనస్ గ్రహం
  • జనవరి: విలియం పిట్ ది యంగర్ 21 సంవత్సరాల వయస్సులో గ్రేట్ బ్రిటన్ పార్లమెంటులోకి ప్రవేశించాడు. తరువాతి కాలంలో అతడు గ్రేట్ బ్రిటన్ కు ప్రధానమంత్రి అయ్యాడు.
  • జనవరి 1: పారిశ్రామిక విప్లవం : ఇంగ్లాండ్‌లోని సెవెర్న్ నదికి ఇనుప వంతెనను తెరిచారు.[1]
  • జనవరి 6: జెర్సీ యుద్ధం : ఛానల్ దీవులలో జెర్సీని ఆక్రమించకుండా బ్రిటిష్ దళాలు ఫ్రెంచ్ దళాల‌ను నిరోధించాయి.
  • ఫిబ్రవరి 3: నాల్గవ ఆంగ్లో-డచ్ యుద్ధం – సింట్ యుస్టాటియస్ ఆక్రమణ: బ్రిటిష్ దళాలు డచ్ కరేబియన్ ద్వీపం సింట్ యుస్టాటియస్ను స్వాధీనం చేసుకున్నాయి.
  • మార్చి 13: సర్ విలియం హెర్షెల్ యురేనస్ గ్రహాన్ని కనుగొన్నాడు. వాస్తవానికి అతను దీనిని గ్రేట్ బ్రిటన్ రాజు జార్జ్ III గౌరవార్థం జార్జియం సిడస్ (జార్జ్ స్టార్) అని పేరు పెట్టాడు
  • మే 18: లిమా నుండి పంపిన స్పానిష్ సైన్యం ఇన్కా తిరుగుబాట్లను అణిచివేసింది. టుపాక్ అమారు II ను బంధించి క్రూరంగా చంపేసింది.
  • సెప్టెంబర్ 4: కాలిఫోర్నియాలోని 44 మంది స్పానిష్ వలస వాసుల బృందం లాస్ ఏంజలెస్‌‌ నగరాన్ని స్థాపించింది. వారు దానికి పెట్టిన పేరు ఎల్ ప్యూబ్లో డి న్యుస్ట్రా సెనోరా లా రీనా డి లాస్ ఏంజిల్స్ డి పోర్సియున్‌కులా .
  • నవంబర్ 29: ఆంగ్ల బానిస వ్యాపారులు అక్రాలో తీసుకున్న సుమారు 142 మంది బానిసలను కరేబియన్ సముద్రంలోకి బ్రతికి ఉండగానే బానిస ఓడ జోంగ్ నుండి సముద్రం లోకి తోసెయ్యడం మొదలుపెట్టారు. మిగిలి ఉన్నవారికి ఆహారాన్నొఇ సర్దుబాటు చేసేందుకు ఈ పని చేసారు. ఆ తరువాత వారి యజమానులు తమకు జరిగిన నష్టంలో కొంత భాగాన్ని బీమా సంస్థల నుండి తిరిగి పొందటానికి ప్రయత్నించారు.[2]
  • తేదీ తెలియదు: కార్ల్ విల్హెల్మ్ షీలే టంగ్స్టన్‌ను కనుగొన్నాడు.
  • తేదీ తెలియదు: చార్లెస్ మెస్సియర్ మెస్సియర్ వస్తువుల తుది జాబితాను ప్రచురించాడు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 333–334. ISBN 0-304-35730-8.
  2. "BBC History British History Timeline". Retrieved 2007-09-03.
"https://te.wikipedia.org/w/index.php?title=1781&oldid=4309038" నుండి వెలికితీశారు