1756
స్వరూపం
1756 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1753 1754 1755 - 1756 - 1757 1758 1759 |
దశాబ్దాలు: | 1730లు 1740లు - 1750లు - 1760లు 1770లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 14: భారతదేశం యొక్క పశ్చిమ తీరాన్ని ఒక శతాబ్దానికి పైగా నియంత్రించిన మరాఠా నావికాదళాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ నావికాదళం విజయదుర్గ్ యుద్ధంలో నాశనం చేదింది. రాయల్ నేవీ అడ్మిరల్ చార్లెస్ వాట్సన్ ఆదేశాల మేరకు, రాయల్ నేవీ ఒక మరాఠా నౌకను బంధించి, దానికి నిప్పంటించి, ఆపై మండే నౌకను అడ్మిరల్ తులజీ ఆంగ్రే ఓడలు లంగరేసి ఉన్నవిజయదుర్గ్ నౌకాశ్రయంలోకి తోసాడు. మంటలు వ్యాపించి, 74 ఫిరంగులున్న ఒక పెద్ద యుద్ధనౌక, ఎనిమిది సాయుధ నాశనం, ఒక్కొక్కటీ 200 టన్నుల బరువున్న 8 గురాబ్‌లు అరవై గల్బట్ నౌకలూ ధ్వంసమయ్యాయి.[1]
- ఏప్రిల్ 1: ఒట్టోమన్ సామ్రాజ్యపు గ్రాండ్ వజీర్ పదవికి యిర్మిసెకిజాడే మెహమెద్ సాయిద్ పాషా రాజీనామా చేశాడు. అతని స్థానంలో 1752 నుండి 1755 వరకు గ్రాండ్ వజీర్‌గా పనిచేసిన కోస్ బాహిర్ ముస్తఫా పాషా పదవి లోకి వచ్చాడు.
- మే 18: గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్‌పై యుద్ధం ప్రకటించినప్పుడు ఏడు సంవత్సరాల యుద్ధం అధికారికంగా ప్రారంభమైంది.[2]
- జూన్ 20 – కలకత్తాలోని బ్లాక్‌హోల్‌లో బ్రిటిష్ సైన్యాపు దండును ఖైదు చేశారు.[2]
- జూన్ 25: ప్రపంచంలోని పురాతన నౌకాదళ స్వచ్ఛంద సంస్థ మెరైన్ సొసైటీని లండన్‌లో స్థాపించారు.[3]
జననాలు
[మార్చు]- జనవరి 27 – వోల్ఫ్‌గ్యాంగ్ అమేడియస్ మొజార్ట్, ఆస్ట్రియన్ స్వరకర్త (మ .1791 )
- ఏప్రిల్ 17: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (మ. 1805)
మరణాలు
[మార్చు]- ఏప్రిల్ 18 – జాక్వెస్ కాసిని, ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త (జ .1677)
- డిసెంబర్ 11: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (జ.1694)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Anglo-Maratha Struggle for Empire: The Importance of Maritime Power, by Col. Anil Athale, in Indian Defence Review (Apr-Jun 2017)
- ↑ 2.0 2.1 Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. p. 318. ISBN 0-304-35730-8.
- ↑ "History". Marine Society. Archived from the original on 2012-01-21. Retrieved 2020-07-21.