Jump to content

1760

వికీపీడియా నుండి

1760 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1757 1758 1759 - 1760 - 1761 1762 1763
దశాబ్దాలు: 1740లు 1750లు - 1760లు - 1770లు 1780లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
1894 లో పాండిచ్చేరి
  • జనవరి 9: బరారి ఘాట్ యుద్ధంలో, ఆఫ్ఘన్ దళాలు మరాఠాలను ఓడించాయి.
  • జనవరి 22: ఏడేళ్ళ యుద్ధం - వాండివాష్ యుద్ధం: మార్క్విస్ డి బుస్సీ-కాస్టెల్నావ్ ఆధ్వర్యంలోని ఫ్రెంచివారిపై బ్రిటిష్ జనరల్ సర్ ఐర్ కూటే విజయం సాధించాడు. [1]
  • ఏప్రిల్ 11: రాజు అలాంగ్‌పాయా నేతృత్వంలోని బర్మా సైన్యం, సయాం రాజధాని ఆయుత్తాయా శివార్లలో చేరుకుంది. కానీ నగరాన్ని ముట్టడించకుండా వెనక్కి వెళ్లిపోయింది. [2]
  • ఏప్రిల్ 30: స్విస్ గణిత శాస్త్రజ్ఞుడు డేనియల్ బెర్నౌల్లి పారిస్‌లోని ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఒక కాగితాన్ని సమర్పించాడు. దీనిలో "అంటు వ్యాధి యొక్క జనాభా గతిశీలతను అధ్యయనం చేయడానికి గణిత నమూనాను మొదటిసారి ఉపయోగించారు." [3]
  • మే 11: బర్మారాజు అలాంగ్‌పాయా ఆయుత్తాయా నుండి వెనక్కి మార్తాబన్ వెళ్తూ మార్గమధ్యంలో కిన్యా గ్రామంలో ఆగినపుడు మరణించాడు. అతని కుమారుడు నాంగ్డావ్గి బర్మా కొత్త రాజు అయ్యాడు. [4]
  • సెప్టెంబర్ 8 – ఏడు సంవత్సరాల యుద్ధం : జెఫరీ అమ్హెర్స్ట్ నేతృత్వం లోని బ్రిటిష్ దళాలు మాంట్రియల్‌ను ఫ్రెంచి వారి నుండి స్వాధీనం చేసుకుని, కెనడాను పూర్తిగా బ్రిటిష్ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి. [5]
  • అక్టోబర్ 25 – గ్రేట్ బ్రిటన్కు చెందిన జార్జ్ II మరణించాడు; అతని 22 ఏళ్ల మనవడు జార్జ్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్, కింగ్ జార్జ్ III గా సింహాసనమెక్కాడు. 1820 జనవరి 29 న మరణించే వరకు 59 సంవత్సరాలు పాలించాడు.
  • డిసెంబర్ 6: బ్రిటిషు సైన్యం లెఫ్టినెంట్ జనరల్ ఐర్ కూటే భారతదేశంలో ఫ్రాన్స్‌కు బలమైన కోట అయిన పాండిచేరి ముట్టడిని ప్రారంభించాడు. ఫ్రెంచ్ కమాండర్ జనరల్ థామస్ లాలీ చివరకు 1761 జనవరి 15 న పాండిచేరిని బ్రిటిషు వారికి అప్పగించవలసి వచ్చింది. [6]

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 320. ISBN 0-304-35730-8.
  2. William J. Topich and Keith A. Leitich, The History of Myanmar (ABC-CLIO, 2013) pp38-39
  3. Charles Roberts, Ordinary Differential Equations: Applications, Models, and Computing (CRC Press, 2011) pp139-140
  4. William J. Topich and Keith A. Leitich, The History of Myanmar (ABC-CLIO, 2013) pp38-39
  5. Palmer, Alan; Palmer, Veronica (1992). The Chronology of British History. London: Century Ltd. p. 222. ISBN 0-7126-5616-2.
  6. "Carnatic Wars", in Wars That Changed History: 50 of the World's Greatest Conflicts, ed. by Spencer C. Tucker (ABC-CLIO, 2015) p222
"https://te.wikipedia.org/w/index.php?title=1760&oldid=3846052" నుండి వెలికితీశారు