రెండవ అక్బర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Akbar II
16th Mughal Emperor
పరిపాలన19 November 1806 – 28 September 1837
Coronation19 November 1806 at Red Fort, Delhi
పూర్వాధికారిShah Alam II
ఉత్తరాధికారిBahadur Shah II
జననం22 April 1760 (1760-04-22)
Mukundpur, Mughal Empire
మరణం1837 సెప్టెంబరు 28(1837-09-28) (వయసు 77)
Delhi, Mughal Empire
Burial
వంశము14 sons including Bahadur Shah II
Mirza Jahangir shah
Mirza Jahan Shah
Mirza Babur
Mirza Salim Shah
Mirza Nazim Shah
8 daughters
Names
'Abu Nasir Mu'in ud-din Muhammad Akbar Shah II
రాజవంశంTimurid
తండ్రిShah Alam II
తల్లిQudsia Begum (3rd wife of Shah Alam II)
మతంIslam

రెండవ అక్బర్ (1760 ఏప్రిల్ 22- 1837 సెప్టెంబరు 28) (రెండవ అక్బర్ షా అని కూడా పిలువబడ్డాడు) మొఘల్ చక్రవర్తిలలో చివరి నుండి రెండవవాడు. రెండవ షా ఆలం కుమారుడైన రెండవ అక్బర్ 1806-1837 వరకు పాలనసాగించాడు. ఆయన కుమారుడు " రెండవ బహదూర్ షా " కుమారుడు.

బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో భారతదేశం లోని అత్యధికభాగం యునైటెడ్ కింగ్డం స్వాధీనం చేసుకున్నందున బ్రిటిష్ అధికారం అధికమౌతూ రెండవ అక్బర్ అధికారం పరిమితంగా మారింది. ఆయన మరణించడానికి కొంతకాలానికి ముందు ఆయన రాజారాంమోహన్ రాయ్‌ను బ్రిటన్‌కు దూతగా పంపాడు. ఆయన పాలనాకాలంలో 1835లో ఈస్టిండియా కంపెనీ తనకుతాను మొఘల్ చక్రవర్తి లెఫ్టినెంట్జుగా పేర్కొనడం నిలిపివేసింది. తరువాత మొఘల్ చక్రవర్తి పేరుతో నాణ్యాలను ముద్రించడం నిలిపివేసింది. కంపెనీ ముద్రించే నాణ్యాలలో పర్షియన్ అక్షరాలను ముద్రించడం నిలుపబడింది.

రెండవ అక్బర్ మరణం తరువాత ఆయన ఢిల్లీ లోని మెహరౌలి వద్ద సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి సమీపంలో మొదటి బహదూర్ షా, షా ఆలం, రెండవ షా ఆలం సమాధుల సమీపంలో సమాధి చేయబడ్డాడు.

ఆరంభకాల జీవితం

[మార్చు]
Silver coin issued by Akbar II, Indian Museum
The crown prince seated next to his blinded father Shah Alam II (c. 1800)

రాకుమారుడు మిర్జా అక్బర్వ్ 1760 ఏప్రిల్ 22 న రేవా ఆస్థానంలోని ముకుంద్పూర్ వద్ద షా ఆలానికి జన్మించాడు. ఆయన జన్మించే సమయంలో తండ్రి షా ఆలం అజ్ఞాతంలో ఉన్నాడు. మిర్జా అక్బర్ 1781 మే 2న తన అన్న మరణించిన తరువాత ఎర్రకోటలో యువరాజుగా అభిషేకించబడ్డాడు. యువరాజ పట్టాభిషేకం తరువాత " వాలి అహ్ద్ బహదూర్ " బిరుద నామంతో పిలువబడ్డాడు. మిర్జా అక్బర్ చిన్నతనంలో సహ మొఘల్ రాకుమారులు, రాకుమార్తెలతో కలిసి తప్పనిసరిగా " నౌచ్" నృత్యం చేసేవాడు. ఆసమయంలో ఆయన రాకుమారుల మధ్య ఉండే విధ్వేషాలను గ్రహించాడు. నాల్గవ జహాన్ షా సింహాసనాన్ని వదిలి వెళ్ళిన తరువాత రెండవ అక్బర్ షా తాత్కాలిక మొఘల్ చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్టించాడు. ఆయన 1788 డెసెంబర్ వరకు పాలన కొనసాగించాడు.

పాలన

[మార్చు]
The tombs of Akbar II and his father Shah Alam II in Mehrauli, Delhi

రెండవ అక్బర్ చక్రవర్తి నామమాత్రపు చక్రవర్తిగా అధికకాలం పాలించినా ఢిల్లీ, ఎర్రకోట మీద ఆయన ప్రభావం మాత్రం స్వల్పంగానే ఉంది. అయినప్పటికీ ఢిల్లీ సాంస్కృతిక జీవనశైలి వర్ధిల్లింది. అయినప్పటికీ బ్రిటిష్ ఇండియా అధికారి లార్డ్ హేస్టింగ్స్ పట్ల రెండవ అక్బర్ వ్యవహరించిన తీరు బ్రిటిష్ వారికి ఆగ్రహం తెప్పించింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను భరణం తీసుకుంట్జున్న రాజుగా మాత్రమే భావించింది. 1835 నుండి బ్రిటిష్ ప్రభుత్వం రెండవ అక్బర్ చక్రవర్తి నామమాత్రపు అధికారాన్ని మరింత తగ్గిస్తూ ఆయన అధికారం " ఢిల్లీ రాజా " ఢిల్లీ వరకు పరిమితం చేసింది. నాణ్యాల మీద పర్షియన్ స్థానంలో ఆగ్లం ముద్రించడం ఆరంభించింది. ఇతని దగ్గరున్న గులాం ముర్తజా ఖాన్ అనే చిత్రకారుడు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఛాయాచిత్రాలు గీశాడు.[1]

మొఘల్ చక్రవర్తుల అధికారాన్ని, అంతస్తులను మరింతగా తగ్గించడానికి బ్రిటిష్ అవధ్ నవాబు, నిజం నవాబు (హైదరాబాద్) లను రాయల్ బిరుదులను తీసుకోవడానికి ప్రోత్సహించింది. అయినప్పటికీ మొఘల్ చక్రవర్తి ప్రాభవం సింధ్ ప్రమ్ంతంలో పూర్వంలా కొనసాగింది. సింధు ప్రాంతాన్ని పాలిస్తున్న కల్హోరా పాలకులతో ఘోరయుద్ధం సాగించి విజయం సాధించిన తాల్పూర్ గిరిజనుల ప్రతినిధి " మిర్ ఫతేహ్ అలీ ఖాన్ "ను సింధు ప్రాంతానికి కొత్త నవబుగా నియమించి రెండవ అక్బర్ షా సింధు ప్రాంతం మీద తమకున్న ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు. [2]

రెండవ అక్బర్ షా బెంగాల్ సంఘసంస్కర్త రామోహన్ రాయ్‌ను దూతగా బ్రిటన్‌కు పంపాడు. తరువాత రామోహన్ రాయ్‌ ఇంగ్లాండుకు పంపబడ్డాడు. రామోహన్ రాయ్ మొఘల్ దూతగా ఎస్.టి జేంస్ కోర్టులో ప్రవేశించి చక్రవర్తి తరఫున వాదించాడు. అయినప్పటికీ సరైన ఫలితం లభించలేదు.

రెండవ అక్బర్ మరణం తరువాత ఆయన ఢిల్లీ లోని మెహరౌలి వద్ద సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి సమీపంలో మొదటి బహదూర్ షా, షా ఆలం, రెండవ షా ఆలం సమాధుల సమీపంలో సమాధి చేయబడ్డాడు.

వంశస్థులు

[మార్చు]

రెండవ అక్బర్ (బహదూర్ షా జాఫర్) కుమారుడు మిర్జా ముఘల్ తిరుగుబాటు తరువాత రాకుమారుడు మిర్జా మొఘల్‌ను బ్రిటిష్ సైన్యాలు పట్టుకున్నారని తెలిసి రెండవ అక్బర్ తప్పించుకుని పొరుగు ప్రాంతాలకు వెళ్ళాడు. మొఘల్ వారసుడు యుద్ధంలో మరణించాడు. మిగిలిన రాకుమారులు భారతదేశంలోని పలు ప్రాంతాలలో స్థిరపడ్డారు. కొంత మంది మాత్రం బర్మా మరియ్ బెంగాల్‌లో స్థిరపడ్డారు. చక్రవర్తి రెండవ బహదూర్ షాతో రాజకుటంబానికి చెందిన పలువురు సభ్యులు రంగూంకు వెళ్ళారు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The Asia Society – Princes and Painters Exhibit". Retrieved 13 August 2021.
  2. Qammaruddin Bohra, City of Hyderabad Sindh 712–1947 (2000).
  • The New Cambridge History of India.
  • Akbar Shah's Rule: Coins Of India.

వెలుపలి లింకులు

[మార్చు]

Media related to రెండవ అక్బర్ at Wikimedia Commons

రెండవ అక్బర్
Born: 1760 Died: 1837
Regnal titles
అంతకు ముందువారు
Shah Alam II
Mughal Emperor
Mughal Emperor
1806–1837
తరువాత వారు
Bahadur Shah II