సాంస్కృతిక పునరుజ్జీవనం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఐరోపాలో మధ్యయుగము తరువాత, రిఫార్మేషన్ ముందు (సుమారు 14 - 16వ శతాబ్దాల మధ్య) జరిగిన కాలాన్ని రెనసాన్స్ (ఫ్రెంచిలో పునర్జన్మ) అంటారు. ముఖ్యవైఖరుల లో
- మూలముల నుండి శాస్త్ర అధ్యయనము
- విజ్ఞాన శాస్త్రము ముందంజ వేయుట
- చిత్రలేఖనములో దృష్టి (perspective) పెరుగుట
- నాగరికమైన, పోపు సంబధమైన సంరక్షకత్వము పెరగడము
రెనసాన్స్ ఆత్మ జ్ఞానము
[మార్చు]15 వ శతాబ్దములో ఇటలీలో రచయతలు, చిత్రకారులు, శిల్పులు సమాజములో వస్తున్న మార్పులు గమనిస్తూ వారి వారి చాతుర్యాన్ని పురాతన పద్ధతి, రోమన్ పద్ధతిగా విభజించుకుంటూ వస్తున్నారు. వసారి రెనసాన్స్ ను మూడు దశలుగా విభజించాడు. మొదటి దశలో Cimabue, Giotto and Arnolfo di Cambio; రెండవ దశలో Masaccio, Brunelleschi and Donatello; మూడవ దశలో లియొనార్డో డావించీ, మైఖెలాంజిలో ముఖ్యులు. పద్ధతులు పాతవైపొయాయ్యని తెలియడముతో పాటు ప్రకృతిని అధ్యయనము చేసి అనుకరించాలన్న జిజ్ఞాస కూడా ఈ అభివృద్ధికి కారణము.
రెనసాన్స్ చారిత్రిక యుగము
[మార్చు]19వ శతాబ్దపు మొదలలో కాని రెనసాన్స్ ను చారిత్రిక యుగముగా గుర్తించలేదు. ఫ్రెంచ్ చారిత్రికుడు జూల్స్ మిషలె (1798-1874) రెనసాన్స్ లో సంస్కృతి, కళ లలో కంటే విజ్ఞానశాస్త్రములో నే ఆభివృదీ ఎక్కువ జరిగిందని భావించాడు. మిషలె లెక్క ప్రకారము రెనసాన్స్ కాలము క్రిష్టోఫర్ కొలంబస్ నుండి కోపర్నికస్, గెలీలియో ల వరకూ (అంటే 15-17 శతాబ్దాల మధ్య) .[1]. స్వీడన్ కు చెందిన చారిత్రికుడు [జేకబ్ బర్కాడ్ట్] వసారీ వలే (1818-1897) లో రెనసాన్స్ ను Giotto, మైఖెలాంజిలో ల మధ్య కాలముగా నిర్ణయించాడు. అతని పుస్తకము బాగా చదువబడి ఇటాలియన్ రెనసాన్స్ కు కొత్త అర్థాన్ని భావాన్ని తీసుకొచ్చింది.[2]. అర్కిటెక్చరులో పాల్ లెట్రావులీ (1795-1855) చిత్రించిన నూతన రోమ్ బిల్డింగుల ఫోలియో రెనసాన్స్ మీద ఆసక్తి పెరగడానికి కారణమైనది.
15, 16 వ శతాబ్దము ల లో ఐరోపా లో వివిధ దేశముల లో జరిగిన రెనసాన్స్ లు
[మార్చు]20వ శతాబ్దములో పండితులు రెనసాన్స్ ను, ప్రాంతీయ జాతీయ గమనములుగా విభజించారు
- ఇటాలియన రెనసాన్స్
- ఇంగ్లీషు రెనసాన్స్
- జర్మన్ రెనసాన్స్
- నార్తర్న్ రెనసాన్స్
- ఫ్రెంచ్ రెనసాన్స్
- డచ్ రెనసాన్స్
- పోలిష్ రెనసాన్స్
- స్పానిష్ రెనసాన్స్
- తూర్పు యూరపు లో ఆర్కిటెక్ఛర్ రెనసాన్స్
ఇవి కూడా చూడండి
[మార్చు]- బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము (బెంగాల్ రెనసాన్స్)
మూలాలు
[మార్చు]మూలములు
[మార్చు]- వెబ్
- లెక్సర్లు, గేలరీలు
- The Bagatti Valsecchi Museum Archived 2013-06-22 at the Wayback Machine
- The Idea of the Renaissance
- The Islamic Foundation of the Renaissance
- Leonardo da Vinci, Gallery of Paintings and Drawings Archived 2017-10-05 at the Wayback Machine
- Renaissance in the "History of Art" Archived 2021-03-12 at the Wayback Machine
- The Society for Renaissance Studies