జహందర్ షా
Jahandar Shah | |
---|---|
![]() | |
![]() | |
పరిపాలనా కాలం | 27 February 1712 – 11 February 1713 |
పట్టాభిషేకం | {{{Coronation}}} |
ముందువారు | Bahadur Shah I |
తర్వాతివారు | Farrukhsiyar |
జీవిత భాగస్వామి | Saidat-un-Nisa Begum Imtiaz Mahal Begum Anup Bai |
సంతతి | |
Muhammad Azhar-ud-Din Bahadur A'az-ud-Din Wali Ahd Bahadur Muhammad Aziz-ud-Din Bahadur Alamgir II Izz-ud-Din Bahadur Said-un-Nisa Begum Iffat Ara Begum Rabi Begum | |
పూర్తి పేరు | |
Mu'izz-ud-Din Jahandar Shah Bahadur | |
తండ్రి | Bahadur Shah I |
తల్లి | Nizam Bai |
జననం | Deccan, Mughal Empire | 9 మే 1661
మరణం | 12 ఫిభ్రవరి 1713 Delhi, Mughal Empire | (వయస్సు 51)
ఖననం | Humayun's Tomb |
మతం | Islam |
మొఘల్ చక్రవర్తి జహందర్ షా (మే 10, 1661 - ఫిబ్రవరి 12, 1713) స్వల్పకాలం మాత్రమే (1712-1713) రాజ్యపాలన చేసాడు. ఆయనకు " షహన్‌షా - ఐ - ఘజి అబ్దుల్ ఫాత్ ముఇజ్- ఉద్- దీన్ ముహమ్మద్ - జహందర్ - షా - సాహిబ్- ఐ- కురాన్ పాద్షా - జహన్ " (ఖుల్ద్ ఆర్ంగా) బిరుదు ఉంది.
ఆరంభకల జీవితం[మార్చు]
రెండవ బహదూర్ షాకు కుమారుడుగా జహందర్ షా 1661 మే10న జన్మించాడు. 1712 ఫిబ్రవరి 27న ఆయన తండ్రి మరణించిన తరువాత జహందర్ షా, ఆయన సోదరుడు ఆజం - ఉష్ - షా ఇద్దరూ వారికి వారే చక్రవర్తిలుగా ప్రకటించుకున్నారు. తరువాత వారసత్వ కలహాలు ఆరంభం అయ్యాయి. ఆజం - ఉష్ - షా 1712 మార్చి 17 న మరణించాడు. తరువాత జహందర్ షా సింహాసనం అధిష్టించి 11 మాసాల కాలం పాలన సాగించాడు. అధికారపీఠం అధిష్ఠించే ముందుగా జహందర్ షా హిందూ మాహాసముద్రంలో అధికంగా నౌకాయానం చేసాడు. జహందర్ షా చాలా సంపన్న వ్యాపారిగా గుర్తించబడ్డాడు. తరువాత సింధు ప్రాంతానికి సుబేదార్‌గా నియమించబడ్డాడు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో రెండవ ఆలంగీర్ మొఘల్ సామ్రాజ్యాన్ని 1754 - నుండి 1759 వరకు పాలించాడు.
Reign[మార్చు]
జహందర్ షా జీవితశైలి చాలా విలాసవంతంగా ఉండేది. ఆయన రాజసభ నృత్యగాన వినోదాలతో గడిచిపోయేది. ఆయన " లాల్ కుంవర్ " అభిమాన భార్యను ఎంచుకున్నాడు. ఆమె పట్టపురాణిగా ఎన్నికచేయడానికి ముందు ఆమె నృత్యకళాకారిణిగా ఉండేది. ఆమెను పట్టపురాణిగా చేయడానికి మొఘల్ రాజసభ దిగ్భ్రమకు గురైంది. జీవించి ఉన్న ఔరంగజేబు కుమార్తె " జినత్- ఉన్ - నిసా " అభ్యంతరం తెలిపింది.
కర్నాటకా నవాబు మొదటి మొహమ్మద్ సాధుల్లాహ్ ఖాన్ (ఒర్చాకు చెందిన డీ సింగ్‌ను చంపాడు) మొఘల్ చక్రవర్తిని జహందర్ షా అధికారాన్ని ఎదిరించాడు. కర్నాటకా నవాబు జింగీ కోటకు సరైన ఆధిపత్యం ఉందని భావించడమే అందుకు కారణం. అంతేకాక ముఘల్ సామ్రాజ్య ఆధిపత్యానికి జహందర్ షా తగని వాడని భావించాడు. జహందర్ షా తన అధికారాన్ని బలపరచుకోవడానికి ఓట్టోమన్ సుల్తాన్ మూడవ అహమ్మద్‌కు కానుకలు పంపాడు. .[1]
మరణం[మార్చు]
1713 జనవరి 10న ఆగ్రా యుద్ధంలో జహందర్ షాను ఆయన మేనల్లుడు " అజం - ఉష్- షా " సయ్యద్ సోదరుల సాయంతో ఓడించాడు. జహందర్ షా ఢిల్లీకి పారిపోయాడు. అక్కడ ఆయన పట్టుబడి కొత్త సుల్తానుకు అప్పగించబడ్డాడు. కొత్త నవాబు జహందర్ షాను ఆయన భార్య లాల్ కుంవర్‌తో సహా కారాగాంలో బంధించాడు. కారాగారంలో ఒక మాసం బంధించబడిన తరువాత జహందర్ షా 1713 ఫిబ్రవరి 11న హత్యకు గురైయ్యాడు.
మూలాలు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Jahandar Shah. |
అంతకు ముందువారు Bahadur Shah I |
Mughal Emperor 1712–1713 |
తరువాత వారు Farrukhsiyar |