మొహమ్మద్ షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Muhammad Shah Rangeela
12th Mughal Emperor
Reign27 September 1719 – 26 April 1748
Coronation29 September 1719 at Tajpur
PredecessorShah Jahan II
SuccessorAhmad Shah Bahadur
RegentSyed Brothers (1719–1722)
జననం17 August 1702
Fatehpur, Mughal Empire
మరణం26 April 1748 (aged 45)
Delhi, Mughal Empire
Burial
Mausoleum of Muhammad Shah, Nizamuddin Awliya, Delhi
ConsortBadshah Begum
WivesSahib Mahal
Safiya Sultan Begum
Qudsia Begum
IssueShahriyar Shah Bahadur
Ahmad Shah Bahadur
Taj Muhammad
Anwer Ali
Badshah Begum
Jahan Afruz Banu Begum
Hazrat Begum Sahiba-uz-Zamani
Names
Roshan Akhtar Bahadur
రాజవంశంTimurid
తండ్రిKhujista Akhtar Jahan Shah
తల్లిQudsiya Begam
మతంIslam

షాహంషా నాసిర్ - ఉద్- దిన్ ముహమ్మద్ షా, అబు - ఫతాహ్ నాసిర్ - ఉద్-దీన్- రోషన్ అక్తర్ ముహమ్మద్ షా (రోషన్ అక్తర్) (1702 ఆగస్టు 7 - 1748 ఏప్రిల్ 26) (ఉర్దూ: محمد شاه) మొఘల్ చక్రవర్తుల్లో ఒకరు. ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని (1719-1748) వరకు పాలించాడు. [1][2][3] ఆయన జహన్ షా కుజిస్తా అక్తర్ కుమారుడు. మొదటి బహదూర్ షా నాల్గవ కుమారుడు. ఆయనకు 17వ సంవత్సరంలో సయ్యద్ సోదరుల సహాయంతో మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషేకం అయింది. ఆయన తరువాత మొదటి అసఫ్ షా సహాయంతో సయ్యద్ సోదరుల పిడి నుండి తప్పించుకున్నాడు. 1720లో హుస్సైన్ అలి ఖాన్ ఫతేపూర్ సిక్రీలో హత్యచేయబడ్డాడు. 1722లో సయ్యద్ హాసన్ ఖాన్ బహ్రా మీద విషప్రయోగం జరిగింది.[4] ముహమ్మద్ షాహ్ గొప్ప కళాభిమాని. ఆయనకు సంగీతం, సాంస్కృతిక అభివృద్ధికి విశేషంగా కృషిచేసాడు.[5] ఆయన గొప్ప కళాభిమాని. ఆయన పాలనా కాలంలో మొఘల్ సామ్రాజ్యం అధికంగా పతనం కావడం మొదలైంది. అంతకు కొంత కాలం ముందే మొఘల్ సామ్రాజ్య పతనం ఆరంభం అయింది. పర్షియా నుండి నాదిర్ షా చేసిన దండయాత్ర తరువాత మొఘల్ రాజధాని ఢిల్లీని లూటీ చేయడం ప్రజలలో భయాందోళనలకు కారణం అయింది. ఈ సంఘటనలు మొఘల్ పాలకులను దిగ్భ్రాంతికి గురిచేయడం కాక బ్రిటిష్ రాజ్ మొదలైన విదేశీ దండయాత్రదారుల దృష్టి భారత్ వైపు మరలడానికి దారితీసింది.

ఆరంభకాల జీవితం[మార్చు]

The Mughal Emperor Muhammad Shah with his Falcon visits the imperial garden at sunset on a palanquin.

రోషన్ అక్తర్ రోషన్ అక్తర్ 1702లో ఘజ్నలో (ఆధునిక ఆఫ్ఘన్ స్థాన్) రాకుమారుడు రెండవ జహన్ షాకు (ఖుజిస్త అక్తర్) జన్మించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనా కాలంలో 1707లో ఆయన తాత మొదటి బహదూర్షా 1707 జూన్ 19 జాజౌ యుద్ధంలో ఆయన సోదరుడు ముహమ్మద్ ఆజం షాను ఓడించి తొలగించాడు. ఆయన తాత మరణించిన తరువాత మరొక వారసత్వపు యుద్ధం జరిగింది. యుద్ధంలో రోషన్ అక్తర్ మరణించాడు. 12 సంవత్సరాల రాకుమారుడు రోషన్ ఆయన తల్లితో సహా ఆయన అంకుల్ జహందర్ షా ఖైదు చేసాడు. రాకుమారుడు మరణం నుంచి తప్పించుకున్నాడు. తండ్రి పాలనా బాధ్యతలో మునిగి ఉండగా సునిసిత బుద్ధి కలిగిన రాకుమారునికి ఆయన తల్లి చక్కని విద్యాశుక్షణ ఇచ్చింది. 1719లో ఫర్రుక్ సియార్‌ పదవి నుండి తొలగించబడిన తరువాత మొఘల్ చక్రవర్తులు స్వల్పకాలం పదవి వహించారు. చివరికి సయ్యద్ సోదరులు 17 సంవత్సరాల రోషన్ అక్తర్‌ను సింహాసనాధిష్టుని చేసారు.

రాజ్యపాలనము(Reign)[మార్చు]

1719 సెప్టెంబరు 29న రాకుమారుడు రోషన్ అక్తర్‌ " అబు ఆల్ - ఫతాహ్ నాసిర్ - ఉద్- దీన్ రోషన్ అక్తర్ ముహమ్మద్ షా " ఎర్రకోటలో ప్రసిస్ద్ధ " మయూర సింహాసనం " మీద పట్టాభిషిక్తుడయ్యాడు. ఆమె తల్లి ఖర్చులకు గాను మాసానకి 15వేలు రూపాయలు ఇవ్వబడ్డాయి. సయ్యద్ సోదరులు కొత్త చక్రవర్తిని కఠిన నియమాల మధ్య తమ పర్యవేక్షణలో ఉంచుకున్నారు.

మొఘల్ సామ్రాజ్య ప్రధాన వజీరు " సయ్యద్ హాసన్ అలి ఖాన్ బహ్రా " ఆయన సోదరుడు కమండర్ సయ్యద్ హుస్సేన్ అలీ ఖాన్ బర్హా మొదటి అసఫ్ జా, ఆయన మిత్రులు కుమరుద్దీన్ ఖాన్, జైన్ ఉద్ - దీన్ అహ్మద్ ఖాన్ " పట్ల చాలా అప్రమత్తంగా ఉన్నాడు. వారు సయ్యద్ సోదరుల ఆధిపత్యాన్ని తొలగించగలరని సందేహపడ్డాడు. సయ్యద్ సోదరులు శీఘ్రగతిలో పరిణితి చెందని దశలో ఉన్న రాకుమారుడు ముహామ్మాద్ ఇబ్రహీంను చక్రవర్తిని చేసారు. ఆయన త్వరలోనే 1720 నవంబరు చక్రవర్తి ముహమ్మద్ షా విశ్వాసుల చేతిలో ఓటమి పాలయ్యాడు.

1720 లో మొఘల్ సైనికాధికారి సయ్యద్ హిస్సేన్ అలి ఖాన్ బర్హా 1720 అక్టోబరు తోబా భీం శిబిరంలో హత్య చేయబడ్డాడు. తరువాత మొఘల్ చక్రవర్తి అహమ్మద్ షా సైన్యాద్జికారాన్ని నేరుగా వహించాడు. తరువాత ముహమ్మద్ షా పంపి దక్కన్ లోని 6 ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి మొదటి అసఫ్ షాను దక్కన్‌కు పంపాడు. ముహమ్మద్ అమీన్ ఖాన్ తురానీ 8,000 మందికి మన్సబ్దార్ నియమితుడయ్యాడు. ప్రధాన వజీరు సయ్యద్ హుస్సేన్ అలి ఖాన్ బర్హాను ఓడించడానికి ముహమ్మద్ అమీన్ ఖాన్ తురానీ పంపబడ్డాడు. ప్రధాన వజీరు సయ్యద్ హుస్సేన్ అలి ఖాన్ బర్హా " హాస్ ంపూర్ యుద్ధంలో " ముహమ్మద్ అమీన్ ఖాన్ తురానీ, మీర్ ముహమ్మద్ అమీర్ ఇరానీ, హైదర్ బెగ్ చేతిలో ఓడిపోయి 1720 నవంబరు 15న ముహమ్మద్ షాకు పట్టుబడ్డాడు. తరువాత 2 సంవత్సరాలకు మరణశిక్షకు గురయ్యాడు. ముందుగా 1720 నవంబరు 13న ముహమ్మద్ షాతో ముహమ్మద్ ఇబ్రహీం యుద్ధం చేసి ఓడిపోయాడు. 1721 లో ముహమ్మద్ షా మునుపటి మొఘల్ చక్రవర్తి ఫర్రుక్‌సియార్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు.

1722 ఫెబ్రవరి 21న మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా మొదటి అసఫ్ షాను మొఘల్ సామ్రాజ్యానికి ప్రధాన వజీరుగా నియమించా డు. మొదటి అసఫ్ షా అక్బర్ చక్రవర్తిలా జాగరూకతతో మరుయు ఔరంగజేబు చక్రవర్తిలా ధైర్యసాహసాలతో ఉండమని సలహా ఇచ్చాడు. అలాగే పర్షియాకు చెందిన రెండవ తహ్ంసాప్‌కు సహకరించమని కూడా సలహా ఇచ్చాడు. మొదటి తహ్ంసాప్‌ మొఘల్ చక్రవర్తి హుమాయున్‌కు అవసర సమయంలో సహకారం అందించాడు. తరువాత చక్రవర్తి ముహమ్మద్ షా తన సైనిక నిర్వహణను నిర్లక్ష్యం చేసాడని మొదటి అసఫ్ షా ప్రధాన వజీరు పదవి నుండి విరమించాడు. తరువాత ఇవాజ్ ఖాన్‌కు ఔరంగాబాదు వద్ద సైన్యాలకు అధిపతిని చేసాడు. రవాణాపతమైన బాధ్యతలు ఇనాయుతుల్లా కాశ్మీరి వహించాడు. [6] మొదటి అసఫ్ జా అసహనతతో మొఘల్ రాజ్యసభను వదిలి వెళుతూ సహాయ సైనికాధికారి కుమరుద్దీన్ ఖాన్‌ను తరువాత మొఘల్ సామ్రాజ్యానికి ప్రధాన వజీరుగా నియమించాడు. తరువాత మొదటి అసఫ్ జా 1773లో దక్కన్ ప్రాంతంలో దండయాత్రకు సమాయత్తం చేసుకున్నాడు. దక్కన్‌లో అసఫ్ జా మొఘల్ సుబేదార్ ముబరిజ్ ఖాన్ మీద దండయాత్ర చేసాడు. ముబరిజ్ ఖాన్ సంప్రదాయక బలహీనతను ఆసరాగా చేసుకున్న మొదటి అసఫ్ జా ఆయనను ఓడించి 1725లో హైదరాబాదు నిజాంను సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

The imperial Diwan of the Mughal Emperor Muhammad Shah.

ఈ సమయంలో మొఘల్ - మరాఠీ యుద్ధాలు (1728-1763) [7] బలహీనంగా నిర్వహించబడుతున్న మొఘల్ సామ్రాజ్య భూభాగాలను కోలుకోలేనంతగా విధ్వంసం చేసాయి. తరువాత 1774లో అవధ్ నవాబు, మొదటి సలాదత్ అలి ఖాన్, బెంగుళూరుకు చెందిన మొఘల్ సుబేదార్ దిలావర్ ఖాన్ (1726-1724)ల నుండి తురుగుబాటు మొదలైంది. మొఘల్ సామ్రాజ్యంలోని రంగుపూర్ ఫౌజుదార్ ముహమ్మద్ అలీ ఖాన్, ఆయన మిత్రదేశాధిపతి దీనా నారాయణన్‌లు హిందూ ప్రజానాయకుడు ఉపేంద్ర నారాయణన్ చేసిన మెరుపు దాడితో కోచ్ బీహారును వదిలారు.

మిఫాం వంగూ (1729-1736) మద్య భూటాన్ పాలకుడు అలీ ముహమ్మద్ ఖాన్ రొహిల్లా రోహిల్‌ఖండ్‌లో బరోంస్ స్థాపించాడు. 1728లో మొఘల్ సామ్రాజ్యం నియమించిన భోపాల్ నవాబు యార్ ముహమ్మద్ ఖాన్ బహదూర్‌ మీద మాల్వాలో మరాఠీలు వరుసదాడులు చేసారు. 1742 నాటికి భోపాల్ నవాబు సగం భూభాగాలు మరాఠీల వశం అయ్యాయి.

పంజాబులో సిక్కులు మొఘల్ సుబేదారుల మీద యుద్ధం ప్రకటించారు. సిక్కులు వారియర్లతో కూటమి ఏర్పరచుకున్నారు.

ఆజ్మీరులో అజిత్ సింగ్ విస్తారమైన భూభాగాలు స్వాధీనం చేసుకుని మరాఠీలతో కూటమిని ఏర్పరచుకున్నాడు. దక్కన్‌లో మరాఠీలు మొఘల్ కోటలను ధ్వంసం చేసారు. ఇలాంటివన్ని మొఘల్ సామ్రాజ్యం పతనానినికి దారితీసాయి.

మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షాహ్ అసమర్ధులైన ముగ్గురు ప్రధాన వజీరులను మార్చిమార్చి నియమించిన తరువాత రాజాస్థానాల నిర్వహణ గురించి తెలుసుకున్నాడు. చక్రవర్తికి కోకీజీ (పెంపుడు సహోదరి), రోషన్ - ఉద్- దౌలా (ఆయన వాణిజ్య సహచరుడు), థట్టా సుఫీ అబ్దుల్ ఘఫూర్ ఆయనకు శ్రేయోభిలాషులుగా సహకరించారు. 1737లో మరాఠీలు భాజీరావు నాయకత్వంలో గుజరాత్‌, మాల్వా, బుండేల్ ఖండులను విలీనం చేసుకుని మొఘల్ రాజధాని ఢిల్లీ మీద దండయాత్ర చేసాడు.

1739లో నాదిర్ షా మొఘల్ సంపద మీద చేత ఆకర్షించబడి మొఘల్ సామ్రాజ్య బలహీనత గ్రహించి మొఘల్ తూర్పు సరిహద్దులలో తిరుగుబాటును, వారి నిర్లక్ష్యాన్ని ఆధారం చేసుకుని మొఘల్ సామ్రాజ్యం మీద దండయాత్రకు ప్రణాళిక వేసుకున్నాడు. తరువాత మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఘజ్ని, కాబూల్, లాహోర్, సింధ్, కాశ్మీర్ మీద దండయాత్ర చేసాడు. తరువాత ఆయన కమల్ యుద్ధం ద్వారా మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షాతో యుద్ధం చేసి ఓడించాడు. పర్షియన్లు మూడు గంటలకంటే తక్కువ సమయం లోనే మొఘల్ సైన్యాలను విధ్వంసం చేసారు.,[8] తరువాత మొఘల్ రాజధాని ఢిల్లీ వైపు ముందుకు సాగి ఢిల్లీని పూర్తిగా దోచుకుని అత్యంత విలువైన సంపదని పర్షియాకు తీసుకు వెళ్ళాడు. ఈ సంఘటన మొఘల్ సామ్రాజ్యాన్ని మరింత బలహీనం చేసింది. అది మరింత మంది దండయాత్రదారుల మార్గాన్ని సుగమం చేసింది. చివరికి బ్రిటిష్ రాజ్ మొఘల్ సామ్రాజ్యం మీద ఆధిక్యత సాధించింది.

లాహోర్ వద్ద షహనవాజ్ ఖాన్ ఓడించబడిన తరువాత 1748లో ఆఫ్ఘ స్థాన్ పాలకుడు అహ్మద్ షా దుర్రానీ మొఘల్ సమ్రాజ్యం మీద దండయాత్ర చేసాడు. మొఘల్ సామ్రాజ్య తరువాత వారసుడు అహమ్మద్ షా, ప్రధాన వజీరు, కుమరుద్దీన్ ఖాన్, ఆయన కుమారుడు ముయిన్ ఉల్- ముల్క్ (మీర్ మన్ను), మూడవ ఘజీ ఉద్ - దిన్ ఖాన్ ఫెరోజ్ జంగ్, సఫ్దర్ జంగ్ 75,000 సైన్యాలతో దురానీ (12,000 సైన్యం) మీద దాడి చేసి ఓడించారు. ఇది మొఘల్ సామ్రాజ్యంలో తిరిగి నూతనోత్సాహం కలిగింది. .

ప్రత్యేకతలు[మార్చు]

During his reign Muhammad Shah had numerous subjects throughout the empire.

పాలన , సాంస్కృతిక అభివృద్ధి[మార్చు]

The phrase Zuban-i Urdū-yi Muʿallá ("Language of the exalted Horde") written in Nastaʿlīq script.
Baagh e Naazir was built by Muhammad Shah the year 1748.

ముహమ్మద్ షా పాలనకు ముందే ఉర్దూ భాష రూపొందించబడింది. ముహమ్మద్ షా పాలనకు ముందు ప్రజా బాహుళ్యంలో వాడుకలో ఉన్న ఉర్దూ ముహమ్మద్ షా పాలనలో రాజ్యసభలో ప్రవేశపెట్టబడింది కొందరు అభిప్రాయపడినప్పటికీ పలువురు రచయితల అభిప్రాయం అనుసరించి ఉర్దూ భాష బ్రిటిష్ కాలంలో అధికారభాష చేయబడిందని అయినా ఉర్దూ ఎప్పుడూ మొఘల్ పాలనలో రాజ్యసభలో ప్రవేశపెట్టలేదని భావిస్తున్నారు.

సంగీతం[మార్చు]

చక్రవర్తి ముహమ్మద్ షా పాలనలో ఖవాలీ మొఘల్ సభలో తిరిగి ప్రవేశపెట్టబడింది. తరువాత క్వాలీ భాష అంతకు ముందు కంటే శీఘ్రగతిలో దక్షిణాసియా దేశాలన్నింటిలో వ్యాప్తి చెందింది. సంగీతంతో కలిసి సరోద్, సుర్‌బహర్, సితార్, సుర్‌సింగర్ వంటి సంగీత సాధనాలు సంప్రదాయసిద్ధమైన తంబురా, వీణ,తబల లను అధిగమించాయి. [9]

మతం[మార్చు]

ముహమ్మదు షా "మకతాబ్ " అనే ఇస్లాంమత సంబంధిత విద్యాసంస్థలను స్థాపించాడు. ఆయన పాలన కాలంలోలో ఖురాన్ను పర్షియన్, ఉర్దూ భాషలలో అనువదించబడింది. మొఘల్ సంపన్న కుటుంబాలకు చెందిన ప్రముఖులు మతసంబంధమైన తుకిక్ దుస్తులు ధరించేవారు. ముహమ్మద్ షా కాలంలో మొఘల్ సప్రదాయ వస్త్రాలు సమర్క్వండ్ స్థానంలో షెర్వాని ప్రవేశించింది.

ముహమ్మద్ షాకు నృత్యం, సంగీతం అంటే అభిమానం ఉండదు. ఆయన పాలనలో రాజ్యనిర్వహణలో కళలకు ముఖ్యత్వం ఇవ్వబడింది. ఒకవైపు ముహమ్మద్ షా పాలమలో మొఘల్ సామ్రాజ్యం పతనం కొనసాగినప్పటికీ చక్రవర్తి కళాపోషణ కొరకు నిధమల్ [1735-75), చితర్మన్ (వారి చిత్రాలు మొఘల్ రాజ్యసభను అలంకరించాయి) వంటి కళాకారులను శిక్షణకు నియమించాడు. రాజసభలో వేట, హోళీ ఉత్సవాలు చోటుచేసుకున్నాయి.[10] ముహమ్మద్ షా కాలంలో మొఘల్ రాజ్యసభలో నియామత్ ఖాన్ (సదరంగ్), ఆయన మేనల్లుడు ఫిరోజ్ ఖాన్ (అదరంగ్) సంగీతం కూర్చున ఖాయల్, తప్ప గీతలు ప్రజాదరణ చూరగొన్నాయి. ఈ భరతీయ సాంస్కృతిక సంగీతం మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా ఆభిమానాన్ని చూరగొన్నది.[11]

శాస్త్రీయ అభివృద్ధి[మార్చు]

మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా కాలంలో రెండవ జై సింగ్ (అంబర్) 1727-1735 మద్య కాలంలో జిజ్- ఐ- ముహమ్మద్ షాహి పుస్తకం పూర్తి చేసాడు. అందులో 400 పుటలు ఉన్నాయి. [12]

మొఘల్ - మరాఠీ యుద్ధాలు[మార్చు]

Elephants pushing Mughal artillery cannons drawn also by bullocks.[13]

మొదటి అసఫ్ జా ఢిల్లీని వదిలి వెళ్ళిన తరువాత మరాఠీలు నర్మదా వరకు తమభూభాగాలను విస్తరించారు. 1723లో వారు సంపన్నమైన మాల్వా మీద దండెత్తారు. మొఘల్ చక్రవర్తి మాల్వా సంరక్షణ బాధ్యత మాల్వా గవర్నర్‌కు ఇచ్చాడు. గవర్నర్ మాల్వాను రక్షించడంలో విఫలం అయ్యాడు. తరువాత అదే సంవత్సరం శీతాకాలానికి మరాఠీలు మల్వా రాజధాని ఉజ్జయిని చేరుకున్నారు.

1725లో గుజరాత్ గవర్నర్ పదవి సర్బులంద్ ఖాన్‌కు బదిలీ చేయబడింది. మొఘల్ చక్రవర్తి చర్యలకు రెచ్చిపోయిన మరాఠీలు గుజరాత్ మీద దండయాత్ర చేసారు. అయినప్పటికీ సర్బులంద్ ఖాన్ సైన్యాలు మరాఠీలను ఓడించారు. ఆసమయంలో మరాఠీ నాయకుడు మొదటి భాజీరావు హైదరాబాదులో జ్మొదటి అసఫ్ జాతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. హైదరాబాదు యుద్ధం మాత్రం మరాఠీలకు అనుకూల ఫలితాలనుఇచ్చింది.

1728లో పాల్ఖెడ్ యుద్ధంలో మొదటి అసఫ్ షా మరాఠిలను ఓడించాడు.1728 లో మరాఠీ సైన్యాలు మొదటి భాజీరావు ఆయన సోదరుడు చిమ్నాజీ అప్పా నాయకత్వంలో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన మాల్వా భూభాగం మీద దండయాత్ర చేసి మొఘల్ సుబేదార్ గిరిధర్ బహదూర్‌ను (అంఝెరా యుద్ధంలో బృహత్తరమైన మొఘల్ సైన్యాలను నడిపించాడు) సవాలు చేసాయి. యుద్ధంలో గిరిధర్ బహదూరు ఆయన బంధువు, విశ్వాసపాత్రుడు అయిన దయా బహదూర్ ఓడిపోయి మరణించారు. నవంబరు 29న చిమంజీ అప్పా మాల్వా మీద చేసిన దాడి విఫలం అయింది.[14]

1731లో మొదటి అసఫ్ జా హైదరాబాద్ నిజాం మరాఠీలను వదిలి మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షాతో చేతులు కలుపుతామని బెదురిస్తున్న శక్తివంతమైన మరాఠీ నాయకులైన త్రింబక్ రావు దభాడే, సంభోజీలను తన వైపు తిప్పుకున్నాడు. ఈ సంఘటనను అంగీకరించలేని మొదటి భాజీ రావు, చిమ్నాజీ అప్పా త్రింబక్ రావు, సంభోజీలను అడ్డగించడానికి బృహత్తర సైన్యాలను నడుపుతూ చేసిన యుద్ధం ధభోజీ యుద్ధంగా పిలువబడింది. యుద్ధంలో త్రింబక్ రావు, సంభోజీ ఓడిపోయి మరణించారు. [14] తరువాత భాజీ రావు గుజరాత్ మీద మొత్తం సైనిక శక్తితో దాడిచేసి 1735 నాటికి సర్బులద్ ఖాన్‌ను గుజరాత్ నుండి బయటకు పంపాడు.

An elephant and its mahout in service of the Mughal Emperor Muhammad Shah.

1736లో మురద్ - జంజిరా సిదిలు భాజీరావు స్వాధీనంలో ఉన్న రాజఘర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడామికి సన్నాహాలు చేసుకున్నారు. రివాస్ యుద్ధంలో చిమ్నాజీ సిద్ది సైనిక శిబిరాల మీద దాడిచేసాడు. యుద్ధం ముగిసే సమయానికి 15,00 సైనికులతో వారి నాయకుడు సిద్ధి సత్ మరణించాడు. తరువాత 1736 సెప్టెంబరులో సిద్దీలు మరాఠీల మద్య శాంతి ఒప్పందం కుదిరిన తరువాత సిద్దీల రాజ్యం జంఝిర, గోవల్కాట్, అంజంవాల్ వరకు పరిమితం అయింది. . 1737లో మొదటి హైదరాబాదు నిజాం అసఫ్ ఖాన్ నాయకత్వంలో మొఘల్ సైన్యాలు భోపాల్ నవాబు యార్ ముహమ్మదుకు సాయంగా సైన్యాలను నడిపాడు. అయినప్పటికీ భాజీరావు నాయకత్వంలో 80,000 మంది మరాఠీ సైన్యాలు భోపాల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. తరువాత భోపాల్ యుద్ధం కొనసాగిస్తూ మల్హర్ రావు హోల్కర్ నాయకత్వంలో మరాఠీ సైన్యం సఫ్దర్ జంగ్, అతడి సైన్యాలను తరిమికొట్టాయి. తరువాత జరిగిన శాంతి ఒప్పందం ద్వారా మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా మాలవాను మరాఠీలకు వదిలింది. .[14] 1737 మరాఠీ రాజప్రతినిధి మొదటి భాజీరావు మొఘల్ సామ్రాజ్య రాజధాని ఢిల్లీ మీద దాడిచేసి అమీర్ ఖాన్ బహదూర్ నాయకత్వంలో యుద్ధం చేసిన మొఘల్ సైన్యాలను ఓడించింది. అయినప్పటికీ మొఘల్ ప్రధాన వజీరు కుమరిద్దీన్ సైన్యాలు మరాఠీల ప్రయత్నాన్ని విఫలం చేస్తూ వారిని ఢిల్లీ పొలిమేర నుండి వెలుపలికి తరిమి వేసింది. మొదటి భాజీరావు, ఆయన సైన్యం ఆగ్నేయం పారిపోయి బాద్షాపూర్ చేరుకుంది. అక్కడ జరిగిన శాతిఒప్ప్ందంలో మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా మరాఠీలకు మాల్వా భూభాగాల ఆధిపత్యం లభించింది.[14] మొఘల్ సామ్రాజ్యానికి విశ్వాసపాత్రురాలైన మధురై నాయకర్ రాణి మీనాక్షి దిండిగు కోట నుండి కర్నాటక్ భూభాగలలో మరాఠీలతో యుద్ధం చేస్తున్న మొఘల్ సైన్యాలకు పలుమార్లు సహకారం అందించింది.

1740 లో కర్నాటక నవాబు దోస్త్ అలీ ఖాన్, చందా సాహెబ్ ఛత్రపతి షాహుకు స్వంతమై రఘోజీ నాయకత్వంలో దండెత్తిన మరాఠీ సైన్యాలను ఎదుర్కొన్నారు. 1740 మే 20 న దామల్ చెర్రీ యుద్ధంలో ఆర్కాటును రక్షిస్తూ దోస్త్ అలీ ఖాన్ ప్రాణాలను వదిలాడు. తరువాత ఆర్కాటు దోపిడీకి గురైంది. చందా సాహెబ్ ససైన్యంగా ఓడిపోయి పట్టుబడి సతారాలో బంధించబడ్డాడు. 1741లో త్రిచినోపోలీ ఆక్రమణలో చందాసాహెబ్ సైన్యాలు వారి భూభాగాలను మరాఠీల నుండి రక్షించుకోవడానికి తీవ్రంగా పోరాడారు. మరాఠీల ప్రయత్నాలు ఫ్రెంచ్ ఈస్టిండియా కంపెనీ అధికారి జోసెఫ్ ఫ్రాంచిస్ డూప్లియక్స్‌ను ఆకర్షించాయి.[15] మరాఠీలు కర్నాటక నవాబు నుండి భూభాగాలను స్వాధీనం చేసుకున్న తరువాత మొదటి అసఫ్ షా నాయకత్వంలో నడిచిన మొఘల్ సైన్యంతో రెండవ ముహమ్మద్ సాదతుల్లా ఖాన్, అంవరుద్దీన్ ముహమ్మద్ ఖాన్‌ల సాయంతో ఆర్కాటుతో కూడిన కర్నాటక భుభాగాలను 1743 త్రిచినోపోలీ ఆక్రమణ ద్వారా తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. తరువాత 5 మాసాలకు మురారి రావు ఘొర్పాడే నాయకత్వంలో మరాఠీ సేన కర్నాటక భుభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాది. .[15]

1747లో మరాఠీలు రఘోజీ నాయకత్వంలో పిల్లాగే మీద దాడి చేసి బెంగాల్ నవాబు అలివర్దీ ఖాన్ భూభాగాలను తమ భూభాగాలతో విలీనం చేసుకుంది. మరాఠీలు ఒరిస్సా మీద దండయాత్ర చేసిన సమయంలో సుబేదార్ మీర్ జాఫర్ సైన్యాలు పూర్తిగా విఫలమైనప్పటికీ తరువాత అక్కడికి చేరుకున్న అలివర్ధీ ఖాన్, ముఘల్ సైన్యాలు బుర్ద్వాన్ యుద్ధంలో రఘోజీ నాయకత్వంలో నడిచిన మరాఠీ సైన్యాలను వెలుపలికి తరిమాయి. తరువాత అలివర్ధీ ఖాన్ మీర్ జాఫర్‌ను పదవి నుండి తొలగించాడు. తరువాత 4 సంవత్సరాలకు మొఘల్ చక్రవర్తి ఒరిస్సాను మరాఠీలకు వదిలాడు. .[14]

మొఘల్ సైన్యం[మార్చు]

Jaivana Cannon – World's largest Cannon on wheels, was cast during the reign of the Mughal Emperor Muhammad Shah by his Qiladar Jai Singh II.

1739 ముందు మొఘల్ సామ్రాజ్య సైనికదళంలో 2,00,000 పదాతి దళం, 1,500 ఏనుగులు ఉండేవి.మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా వెంట 8,000 ఆయుధాలు ఉండేవి. వాటిని ఏనుగులు, ఎద్దుల చేత లాగించబడేవి.[16]

నాదిర్ షా దండయాత్ర[మార్చు]

Combat between the Afsharid forces of Nadir Shah and the Mughal Army.
Koh-i-Noor

1739 ఫిబ్రవరి 13న పర్షియన్లు సైనిక నిపుణుడు నాదిర్ షా (అఫ్షర్దీ కమాండర్) నాయకత్వంలో సఫావిద్ రాజవంశాన్ని తొలగించి అలాగే పర్షియా శత్రువైన ఓట్టామన్ సామ్రాజ్యాన్ని ఓటమి పాలు చేసి వారి రాజ్యాన్ని సురక్షితం చేసుకున్నారు. తరువాత నాదిర్షా దృష్టి సంపన్నమై అదే సమయంలో బలహీనపడి ఉన్న మొఘల్ సంపద మీద పడింది. 1739లో నాదిర్ షా భారతదేశంలోని మొగల్‌ సామ్రాజ్యం మీద దండేత్తి " కర్నాల్ యుద్ధం "లో మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షాను 3 గంటలలో ఓడించాడు. [8] తరువాత మొఘల్ రాజధాని ఢిల్లీ వైపు ముందుకు సాగాడు. తరువాత జరిగిన వరుస సంఘటనలలో ఢిల్లీని పూర్తిగా దోపిడీ చేసారు. తరువాత నాదిర్ షా మొఘల్ సామ్రాజ్యంలోని చాలా భాగాన్ని ఆక్రమించాడు.

కారణాలు[మార్చు]

నాదిర్ షా ఘాజీ నాయకత్వంలో ఆఫ్ఘన్ స్థాన్ కాందహార్ ప్రాంతంలో తిరుగుబాటు చేస్తున్న తిరుగుబాటుదారులను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. .[17][మూలాన్ని నిర్థారించాలి] తరువాత ఆయన కాబూల్, ఇండస్ వెల్లీ సరిహద్దులను మూసివేయమని ముహహమ్మద్ షాను కోరుకున్నాడు. అందువలన తిరుగుబాటుదారులు పారిపోవడానికి అవకాశం లేక ఆశ్రయం కోరుకున్నారు. ముహమ్మద్ షా నాదిర్ షాకు స్థిరమైన సమాధానం చెప్పినప్పటికీ ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రాంతీయ సుబేదారులు, ఫౌజీదార్లు ఆఫ్ఘన్ల మీద సానుభూతితో పర్షియన్ల కోరికకు మద్దతు ఇవ్వలేదు. ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులు మొఘల్‌ సామ్రాజ్యంలోకి పారిపోయారు. ఈ చర్యతో ఆగ్రహానికి గురైన నాదిర్ షా తిరుగుబాటుదారులను అప్పగించమని మొఘల్ చక్రవర్తి మిహమ్మద్ షా వద్దకు దూతను పంపాడు. ముహమ్మద్ షా పర్షియన్ దూతకు అనుకూల సమాధానం ఇవ్వకుండా వారిని సంవత్సరం అంతటా ఢిల్లీకి వెలుపల ఉంచాడు. ముహమ్మద్ షా చర్యలు నాదిర్ షాను మరింత ఆగ్రహానికి గురిచేసాయి. నాదిర్ షా ముహమ్మద్ షా తిరుగుబాటుదారులను అప్పగించలేదన్న నెపంతో బలహీనమైనా, సంపన్నమైన మొఘల్‌ సామ్రాజ్యం మీద దండెత్తాడు.

రాజధాని మీద దండయాత్ర[మార్చు]

పైన చెప్పిన కారణాలతో నాదిర్ షా మొఘల్ సామ్రాజ్యం మీద దండెత్తడానికి నిశ్చయించుకుని ఆఫ్ఘన్ నుండి దాడి మొదలుపెట్టాడు. 1738 మే మాసంలో నాదిర్ షా ఉత్తర ఆఫ్ఘన్ మీద దండయాత్ర చేసాడు. అదే మాసం నాదిర్ షా ఘాజీని స్వాధీనం చేసుకున్నాడు. జూన్ మాసంలో కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నాడు. సెప్టెంబరు మాసం జలాదాబాదును ఆక్రమించాడు. నవంబరు మాసంలో పెషావర్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత ఖైబర్ పాస్ యుద్ధంలో విజయం సాధించాడు.

1739లో జనవరి నాదిర్ షా లాహోరును స్వాధీనం చేసుకున్నాడు. తరువాత పూర్తిగా మొఘల్ వైస్రాయ్, జకరియా ఖాన్ బహదూర్, ఆయన 25,000 సైన్యాలను స్వాధీనం చేసుకున్నాడు.[18] తరువాత చీనాబ్ నదీతీరంలో ఉన్న సిక్కు తిరుగుబాటుదారులు అఫ్షరిద్ మీద దండయాత్ర చేసారు. .[18]

Iranian Afsharid forces of Nadir Shah negotiate with a Mughal Nawab.

నాదిర్ షా దాడిచేసిన మార్గంలో ఉన్న భూభాగాలను అన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. ముహమ్మద్ షా, ఆయన రాజ్యాంగ సభ్యులు సమీపిస్తున్న ఆపదను గ్రహించలేక పోయారు. వారు చివరికి నాదిర్ షా కేవలం దండయాత్ర మాత్రమే చేయడని దోపిడీ చేయడానికి అవకాశం ఉందని గ్రహించారు. నాదిర్ షా డిల్లీ మీద దండయాత్ర పూర్తి చేయగానే ఢిల్లీని పూర్తిగా దోచుమున్నాడు. వజిరాబాద్, ఎమనాబాదు, గుజరాత్ నగరాలు దోపిడీతో ఆగక నేలమట్టం చేయబడ్డాయి. లర్కానా సమీపంలో అఫ్షరిద్ సైన్యాలు మొఘల్ సామ్రాజ్యానికి చెందిన సింధ్ నవాబు సైన్యాలను పూర్తిగా దోచుకున్నాయి. మైన్ నూర్ మొహమ్మద్ కల్హొరొ అయన కుమారులిద్దరూ కూడా చివరికి శత్రువులకు పట్టుబడ్డారు.

Darya-e-Noor

1739 ఫిబ్రవరి నాదిర్ షా సిర్హింద్‌ను స్వాధీనం చేసుకుని కర్నాల్ భూభాగాల వైపు ముందుకు సాగాడు. కర్నాల్ యుద్ధం మొఘలుల అపజయంతో ముగిసింది. ఫిబ్రవరి 13న కర్నాల్ యుద్ధం జరిగింది. ఒక లక్ష సైన్యం కలిగిన ముహమ్మద్ షా నాదిర్ షా 55 వేల సైన్యంతో 3 గంటల సమయంలో ఓడించాడు. ఈ సంఘటనలో ఖాన్ దౌరాన్ మరణించాడు. నాదిర్ షా దోచుమున్న సంపదలతో వెనుదిరుగాడు. కర్నాల్ యుద్ధం ముగిసిన 13 రోజుల తరువాత ముహమ్మద్ షాకు గత్యంతరం లేని సమయంలో అఫ్షరిద్ శిబిరాల వద్ద నాదిర్ షాకు లొంగిపోయాడు. మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా ఢిల్లీ ద్వారం తాళాన్ని నాదిర్ షాకు ఇచ్చి నాదిర్ షా వెంట బందీలా ఢిల్లీకి వెళ్ళాడు. తరువాత ఢిల్లీ పూర్తిగా దోచుకొనబడింది.

దోపిడీ[మార్చు]

ఢిల్లీలో ప్రవేశించిన తరువాత నాదిర్ షా మొఘల్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడం మొదలు పెట్టాడు. మతపరమైన విద్వేషాలకు అతీతంగా దక్కన్ నుండి మరాఠీలు ఢిల్లీ నుండి పర్షియన్ సైన్యాలను తరుమి వేయడానికి డిల్లీకి పయనమయ్యారు. అయినప్పటికీ నాదిర్ షా మొఘల్ సామ్రాజ్యానికి కూడదీసుకోవడానికి వీలుకాని ఆపద కలిగించాడు. .[19][20]

చక్రవర్తిలు ఇరువురి నడుమ మర్యాదపూర్వమైన చర్యలు ఆరంభం అయ్యాయి. అయినప్పటికీ నాదిర్ షా చంపబడ్డాడు అన్న పుకారులు చెలరేగాయి. ప్రజలు పర్షియన్ సైన్యాల మీద తిరగబడి కొందరు సైన్యాలను చంపారు. ఆగ్రహించిన నాదిర్ షా ఆగ్రహించి ప్రజలను హతమార్చమని ఆదేశించాడు. 30,000 మంది ప్రజలు వధించబడిన తరువాత చక్రవర్తి మొదటి అసఫ్ షా, ప్రధాన వజీరు కుమరుద్దీన్ ఖాన్ నాదిర్ షా క్షమాభిక్ష కోరారు. నాదిర్ షా ప్రజాహత్యను నిలుపుదల చేసి మొఘల్ ఖజానా దోపిడీ మొదలు పెట్టాడు. .[21] ప్రముఖ మయూర సింహాసనం, దరియా - ఐ- నూర్ వజ్రం, వెలకట్టడానికి సాధ్యం కాని మొఘల్ సంపద దోపిడీకి గురైంది. అదనంగా ఏనుగులు, గుర్రాలు, ఇతర సంపదలు దోపిడీకి గురైయ్యాయి. ముహమ్మద్ షా తన కుమార్తె జహన్ అఫ్రుజ్ భానును నాదిర్ షా చిన్న కుమారుడికి ఇచ్చి వివాహం చేసాడు. మొదటి అసఫ్ షా పదవి నుండి వైదొలగి మూడవ ఘాజీ ఉద్- దీన్- ఖాన్‌ను ప్రధాన కమాండరుగా నియమించాడు. తరువాత విశ్వాసపాత్రుడైన కుమరుద్దీన్ ఖాన్ ప్రధాన వజీరుగా నియమించబడ్డాడు. [22]

ఈ సంఘటన తరువాత నాదిర్ షా స్వయంగా ముహమ్మద్ షాను మే 12న తిరిగి చక్రవర్తిగా అభిషేకించాడు. బదులుగా ముహమ్మద్ షా సింధునది పశ్చిమ తీరంలో ఉన్న భూభాగాలను నాదిర్షాకు ఇచ్చాడు. అయినప్పటికీ సింధ్ నవాబు ఖల్హొరా అఫ్షరీద్లతో యుద్ధం కొనసాగించాడు. నాదిర్ షా ఆయన పర్షియన్ సైన్యం కోహినూర్ వజ్రం, విస్తారమైన సంపదతో వెనుదిరిగాడు. .

తరువాత[మార్చు]

నాదిర్ షా దండయాత్రతో మొఘల్ సమ్రాజ్యంలో మిగిలి ఉన్నదంతా తుడిచి పెట్టుకు పోయిసమ్రాజ్యం ముగింపు సమీపానికి చేరుకుంది. తరువాత మొఘల్ సమ్రాజ్యం శీఘ్రంగా పతనావస్థకు చేరుకుంది. ఈ దండయాత్ర మొఘల్ సైనిక బలహీనతను బహిర్గతం చేసింది.నవాబులు పట్టుబడిన తమ రాజధాని నగరం ఢిల్లీని విడిపించలేక పోయారు. మొఘల్ ప్రజలు పూర్తిగా దోచుకొనబడ్డారు. తిరుగుబాటు, అవిశ్వాసత సర్వసాధారణం అయింది.

విదేశీ సంబంధాలు[మార్చు]

Provinces of the Mughal Empire in the year 1740.

నాదిర్ షా దండయాత్ర తరువాత పర్షియా శత్రువు ఓట్టమన్ సామ్రాజ్యం త్వరలో దోపిడీకి గురైంది. తూర్పు సరిహద్దులోని మొఘల్ భూభాగంలో పర్షియన్ సైనికులను నియమించారు. మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా పాలనా కాలంలో ఓట్టమన్‌లో జరుగుతున్న చర్యలను నిశితంగా గమనించాడు. ముహమ్మద్ షా ఓట్టమన్ దూత హాజీ యూసఫ్‌ ఆఘాకు 1748లో చక్రవర్తి మరణించే వరకు సహకారం అందించాడు.[17]

రాజ కుటుంబం[మార్చు]

The Mughal Emperor Muhammad Shah and his family.

చక్రవర్తి ముహమ్మద్ షాకు నలుగురు భార్యలు ఉన్నారు. వారిలో బాద్షా బేగం ఆయనకు అతిప్రీతిపాత్రమైన రాణిగా అలాగే పట్టపు రాణిగా ఉంది. బాద్షా బేగం మొఘల్ చక్రవర్తి ఫర్రుక్‌సియార్ కుమార్తె. ఆమె ముహమ్మద్ షాకు కజిన్. ఆమె చక్రవర్తిని 1721 డిసెంబరు 8 న ఢిల్లీలో వివాహం చేసుకుంది. ఆమెకు " మల్లిక- ఉజ్- జమాని " (శతాబ్ధపు రాణి) బిరుదనామం ఇవ్వబడింది. ఈ సందర్భంలో ఒక వారం కాలం గొప్ప ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. ఆమె చక్రవర్తికి మొదటి కుమారునిగా " షహ్రియార్ షా బహదూర్ " ఇచ్చింది. షహ్రియార్ షా బహదూర్ 1724 జూలై 19న మరణించాడు. ఆమె మిగిలిన భార్యలకంటే అధికమైన ఆధిక్యత కలిగి ఉంది. ఆమె ప్రభావం చక్రవర్తి మీద మరింతగా ఉండేది. తరువాత చక్రవర్తి షాహిబ్ మహల్‌ను రెండవ భార్యను వివాహం చేసుకున్నాడు. ముహమ్మద్ షా మూడవ భార్యగా నృత్యకళాకారిణి ఉధం బాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె కుమారుడు తరువాత మొఘల్ చక్రవర్తి సింహాసనం అధిష్ఠించాడు. 1725 23న ఆమెకు కుమారుడు జన్మించగానే చక్రవర్తి ముహమ్మద్ షా కుమారుని తీసుకుని బాద్షా బేగానికి ఇచ్చాడు. బాద్షా బేగం కుమారుని తన స్వంత కుమారుడు అని విశ్వసించేలా పెంచింది. బాద్షా బేగం ప్రయత్నంతో అహమ్మద్ షా భవిష్యత్తులో మొఘల్ సింహాసనం అధిష్ఠించాడు.[23] ముహమ్మద్ షా షఫియా సుల్తాన్ బేగాన్ని తన నాలుగవ భార్యగా వివాహం చేసుకున్నాడు. 1789 డిసెంబరు 14న బాద్షా బేగం మరణించింది. ముహమ్మద్ షాకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1748లో అహమ్మద్ షా అబ్దాలి ముహమ్మద్ షా మీద తిరుగుబాటు చేసి పదవి నుండి తొలగించిన సమయంలో ఆయన కుమారుడు అన్వర్ అలి తన గ్రాండ్ ఆంట్, రాజకుమారి జహనా బేగం వద్దకు పారిపోయి అరాహ్ (అరాహ్ ఎలుగుబంట్లకు స్థావరంగా మారిన కారణంగా తరువాత దానిని భలూహిపూర్ అని పిలిచారు) వద్ద తలదాచుకున్నాడు.

Mughal princesses learning Islamic calligraphy.

ముహమ్మద్ షా మరణించిన తరువాత అహమ్మద్ షా దుర్రానీ 1757లో హజరత్ బేగాన్ని వివాహం చేసుకున్నాడు. .[24]

మరణం[మార్చు]

Funeral.

1748లో మణిపూర్ యుద్ధంలో ప్రధాన వజీర్ కుమరుద్దీన్ ఖాన్ ఫిరంగుల పేల్చివేతలో మరణం వెలగా చెల్లించిన తరువాత మొఘల్ సామ్రాజ్యం విజయం ఫలంగా లభించింది. ఆరంభంలో ప్రధాన వజీర్ కుమరుద్దీన్ ఖాన్ మరణం రహస్యంగా ఉంచబడింది. ఈ సమాచారం అహమ్మద్ షాకు చేరిన వెంటనే ఆయన దీనిని విని దిగ్భ్రమకు గురై క్రుంగి క్రమంగా రోగగ్రస్థుడు అయ్యాడు. తరువాత మూడు రోజుల వరకు తన నివాసానికి చేరుకోలేదు. ఈ సమయంలో ముహమ్మద్ షా ఆహారం కూడా స్వీకరించ లేదు. ఆయన సేవకులు " ఇలాంటి విశ్వాసపాత్రుని ఇక మీదట నేను ఎలా తీసుకురాగలను " అని బిగ్గరగా విలపించాడని వివరించారు. చివరికి ఈ దిగులుతో ముహమ్మద్ షా 1748 ఏప్రిల్ 26న మరణించాడు.ఆయన అంత్యక్రియలకు మక్కా నుండి వచ్చిన ఇమామ్‌ల పర్యవేక్షణలో జరిగింది.[25][26]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Buyers, Christopher. "India, The Timurid Dynasty genealogy". The Royal Ark, Royal and Ruling Houses of Africa, Asia, Oceania and the Americas. Retrieved 12 June 2009.
  2. Rai, Raghunath (2006). History For Class 12: Cbse. Economics/vk India Enterprises. p. 3. ISBN 8187139692.
  3. Keene, H. G. (2004). The Fall of the Moghul Empire of Hindustan, Ch. III, 1719–48. Kessinger Publishing. ISBN 1419161849. Available here Archived 2009-09-26 at the Wayback Machine on Project Gutenberg.
  4. The Begums of Bhopal (illustrated ed.). I.B.Tauris. 2000. p. 18. ISBN 978-1-86064-528-0.
  5. "Sitar - Google Search". google.com.pk. Retrieved 17 January 2014.
  6. Mehta, J.L. (2005). Advanced Study in the History of Modern India 1707-1813. New Dawn Press, Incorporated. ISBN 9781932705546.
  7. Tony Jaques (2007). Dictionary of Battles and Sieges: A-E. Dictionary of Battles and Sieges: A Guide to 8,500 Battles from Antiquity Through the Twenty-first Century. Vol. 1. Greenwood Publishing Group. p. xxxix. ISBN 0313335370.
  8. 8.0 8.1 Later Mughal. Retrieved 26 May 2014.
  9. Miner, A. (1997). Sitar and Sarod in the 18th and 19th Centuries. Motilal Banarsidass Publishers Pvt. Limited. ISBN 9788120814936.
  10. Princes and Painters in Mughal Delhi, 1707–1857, Asia Society exhibition
  11. The life of music in north India: the organization of an artistic tradition, Daniel M. Neuman
  12. http://books.google.com.pk/books?id=740AqMUW8WQC&pg=PA278&dq=zij-i-muhammad+shahi&hl=en&sa=X&ei=AlEtVOzBB83natiygZgL&ved=0CCUQ6AEwAg#v=onepage&q=zij-i-muhammad%20shahi&f=false
  13. Unknown. "Elephants pushing cannons drawn by bullocks, Kota". Archived from the original on 2014-12-23. Retrieved 2015-04-10.
  14. 14.0 14.1 14.2 14.3 14.4 Jaques, T. (2007). Dictionary of Battles and Sieges: A-E. Greenwood Press. ISBN 9780313335372.
  15. 15.0 15.1 Jaques, T. (2007). Dictionary of Battles and Sieges: P-Z. Greenwood Press. ISBN 9780313335396.
  16. https://www.google.ca/search?q=size+of+the+mughal+army+during+the+battle+of+karnal&oq=size+of+the+mughal+army+during+the+battle+of+karnal&aqs=chrome..69i57.11006j0j4&sourceid=chrome&ie=UTF-8#q=size+of+the+mughal+army+during+the+battle+of+karnal&tbm=bks
  17. 17.0 17.1 Farooqi, Naimur Rahman (1989). Mughal-Ottoman relations: a study of political & diplomatic relations between Mughal Empire and the Ottoman Empire, 1556–1748. Idarah-i Adabiyat-i Delli. ASIN: B0006ETWB8. See Google Books search.
  18. 18.0 18.1 Chhabra, G.S. (2005). Advance Study in the History of Modern India (Volume-1: 1707-1803). Lotus Press. ISBN 9788189093068.
  19. Frances Pritchett. "part2_19". columbia.edu. Retrieved 17 January 2014.
  20. Muhammad Latif, The History of the Panjab (Calcutta, 1891), p. 200.
  21. Soul and Structure of Governance in India. Archived from the original on 14 జూలై 2014. Retrieved 26 May 2014.
  22. H. G. Keene (1866). Moghul Empire. Allen &co Waterloo Place Pall Mall. Retrieved 2020-07-13.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)
  23. Latif, Bilkees I. (2010). Forgotten. Penguin Books. p. 49. ISBN 9780143064541.
  24. Hoiberg, D.; Ramchandani, I. (2000). Students' Britannica India. Encyclopaedia Britannica (India). ISBN 9780852297605.
  25. name="Mughal-Ottoman relations Sharif of Mecca"
  26. Farooqi, N.R. (1989). Mughal-Ottoman relations: a study of political & diplomatic relations between Mughal India and the Ottoman Empire, 1556-1748. Idarah-i Adabiyat-i Delli.

వెలుపలి లింకులు[మార్చు]

Media related to Muhammad Shah at Wikimedia Commons

అంతకు ముందువారు
Shah Jahan II
Mughal Emperor
1719–1748
తరువాత వారు
Ahmad Shah Bahadur