గులాం ముర్తజా ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గులాం ముర్తజా ఖాన్
జననం1760
మరణం1840 (వయసు 80)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
చిత్రకారుడు
గుర్తించదగిన సేవలు
మొఘల్ చిత్రకళ
శైలిమొఘల్

గులాం ముర్తజా ఖాన్ (1760-1840) 19వ శతాబ్దంలో మొఘల్ శకంలో ఢిల్లీకి చెందిన చిత్రకారుడు. మొఘల్ చక్రవర్తి రెండవ అక్బర్ ఆస్థానంలో పనిచేశాడు.[1] బ్రిటిష్ అధికారులైన స్కిన్నర్, విలియం ఫ్రేజర్ దగ్గర కూడా పనిచేశాడు. ఇతని పెయింటింగ్ శైలిని కంపెనీ స్టైల్ అంటారు.[2][3]

గులాం ముర్తజా ఖాన్ చిత్రించిన దిల్లీ దర్బార్

జననం[మార్చు]

గులాం ముర్తజా ఖాన్ 1760లో ఢిల్లీలో జన్మించాడు.

కళారంగం[మార్చు]

గులాం ముర్తాజా ఖాన్ ఢిల్లీ రాజ కుటుంబానికి సంబంధించిన ఛాయాచిత్రాలు వేసేవాడు. 1803లో జరిగిన దాడిలో ఢిల్లీని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ అధికారుల వద్ద కూడా ఉద్యోగం చేశాడు. ఇతని మేనల్లుడు మొఘల్ రాజ్య చిత్రకారుడు గులాం అలీ ఖాన్ క్లాసిక్, ఫ్రేజర్ ఆల్బమ్‌లో పనిచేశాడు.[4] పదిహేడవ శతాబ్దపు మొఘల్ శైలిలోనే ఇతను చిత్రాలు గీశాడు. ఇతని శైలి చక్రవర్తి షాజహాన్ హయాంలోని లాంఛనప్రాయమైన సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

మరణం[మార్చు]

గులాం ముర్తజా ఖాన్ 1840లో ఢిల్లీలో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "The Asia Society – Princes and Painters Exhibit". Retrieved 13 August 2021.
  2. "Visual Tour of White Mughal India". Retrieved 13 August 2021.
  3. "Paintings bring Moghul Delhi alive". 16 July 2007. Retrieved 13 August 2021 – via The Hindu.
  4. "Art and an empire". 6 February 2013. Retrieved 13 August 2021 – via The Hindu.