1775
స్వరూపం
1775 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1772 1773 1774 - 1775 - 1776 1777 1778 |
దశాబ్దాలు: | 1750లు 1760లు - 1770లు - 1780లు 1790లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 17: కెప్టెన్ జేమ్స్ కుక్ తన రెండవ సముద్రయానంలో గ్రేట్ బ్రిటన్ రాజ్యం కోసం దక్షిణ జార్జియాను స్వాధీనం చేసుకున్నాడు.
- ఫిబ్రవరి 9: అమెరికన్ విప్లవం : మసాచుసెట్స్ బే ప్రావిన్స్ తిరుగుబాటు చేసిందని గ్రేట్ బ్రిటన్ పార్లమెంట్ ప్రకటించింది.
- ఫిబ్రవరి 26: బాలంబంగన్ ద్వీపంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కర్మాగారాన్ని మోరో పైరేట్స్ ధ్వంసం చేసారు. [1]
- మార్చి 6: మరాఠా సామ్రాజ్యపు పేష్వా రఘునాథరావు, బొంబాయిలోని బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్‌తో సూరత్ ఒప్పందంపై సంతకం చేసి, సల్సెట్, బస్సేన్ భూభాగాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు. సైనిక సహాయానికి బదులుగా సూరత్, భరూచ్ జిల్లాల నుండి వచ్చే ఆదాయంలో కొంత భాగంకూడా బ్రిటిషు వారికి ఇవ్వాలి. ఇది బ్రిటిష్. మరాఠాల మధ్య మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధానికి దారితీసింది. 1782లో సల్బాయి ఒప్పందంతో ముగిసింది.
- ఏప్రిల్ 19 – అమెరికన్ విప్లవం: బ్రిటన్‌కు, దాని అమెరికన్ వలసలకూ మధ్య ఉన్న తగాదాలు లెక్సింగ్టన్, కాంకర్డ్ యుద్ధాలతో రక్తపాతానికి దారితీసాయి. అమెరికన్ విప్లవం మొదలైంది.
- జూలై 30 – జేమ్స్ కుక్ రెండవ సముద్రయానం: HMS రిసొల్యూషన్ కెప్టెన్ కుక్ తూర్పు దిశగా చేసిన మొదటి ప్రపంచ ప్రదక్షిణను పూర్తి చేశాడు.
తేదీ తెలియనివి
[మార్చు]- గ్రేట్ బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం .
- జేమ్స్ వాట్ యొక్క 1769 ఆవిరి ఇంజిన్ పేటెంటును 1800 జూన్ వరకు పార్లమెంట్ చట్టం ద్వారా పొడిగించారు. దాని క్రింద మొదటి ఇంజన్లను నిర్మించారు. [2] [3]
- జాన్ విల్కిన్సన్ కొత్త రకమైన బోరింగ్ యంత్రాన్ని కనుగొని పేటెంట్ పొందాడు.
- న్యూ ఇంగ్లాండ్లో మశూచి మహమ్మారి ప్రారంభమైంది.
- కలకత్తా థియేటర్ ప్రారంభోత్సవం.
జననాలు
[మార్చు]- మార్చి 24: మన్మధ నామ సంవత్సరం ఫాల్గుణమాసము: ముత్తుస్వామి దీక్షితార్, కర్ణాటక సంగీత చక్రవర్తి.
- డిసెంబరు 16: జేన్ ఆస్టిన్, ఆంగ్ల నవలా రచయిత్రి. (మ. 1817)
మరణాలు
[మార్చు]- జనవరి 1: అహమ్మద్ షా బహదూర్, 13 వ మొఘల్ చక్రవర్తి. (జ.1725)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Warren, James Francis (1981). The Sulu Zone, 1768-1898: The Dynamics of External Trade, Slavery, and Ethnicity in the Transformation of a Southeast Asian Maritime State. Singapore: NUS Press. p. 36.
- ↑ Scherer, F. M. (1965). "Invention and Innovation in the Watt-Boulton Steam-Engine Venture". Technology and Culture. 6 (2): 165–87. doi:10.2307/3101072. JSTOR 3101072.
- ↑ "The Invention of the Steam Engine: The Life of James Watt. Part 4: The Steam Engine Gains Popularity".[permanent dead link]