Jump to content

1711

వికీపీడియా నుండి

1711 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1708 1709 1710 - 1711 - 1712 1713 1714
దశాబ్దాలు: 1680లు 1700లు - 1710లు - 1720లు 1730లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
Spectator
  • జూలై 11: బ్రెజిల్‌లోని సావో పాలో పట్టణం నగర స్థాయికి ఎదిగింది.
  • జూలై 21: ఒట్టోమన్ సామ్రాజ్యం, రష్యా ల మధ్య ప్రూత్ ఒప్పందం కుదిరింది. దీంతో ప్రూత్ నది దండయాత్ర ముగిసింది.
  • జూలై 29: 17:50 వద్ద మొత్తం చంద్ర గ్రహణం సంభవించింది.
  • ఆగష్టు 1: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య నౌక జుయిట్‌డోర్ప్ నెదర్లాండ్స్ నుండి ఇండోనేషియాకు బయలుదేరింది. ఇందులో తాజాగా ముద్రించిన వెండి నాణేలున్నాయి. కల్బరి, షార్క్ బే మధ్య పశ్చిమ ఆస్ట్రేలియా వద్ద మునిగిపోయింది. 20 వ శతాబ్దం మధ్యకాలం వరకు శిథిలాల ప్రదేశం తెలియలేదు.
  • ఆగస్టు 11: కొత్తగా స్థాపించిన అస్కాట్ రేస్‌కోర్స్‌లో మొదటి గుర్రపు పందెం జరిగింది, ఇది ఇంగ్లాండ్‌లోని ప్రముఖ రేస్‌కోర్స్‌లలో ఒకటిగా మారింది.
  • ఆగస్టు 13: తమాచి రాయ్‌సింగ్‌జీ గుజరాత్‌లోని నవనగర్ రాజ్యానికి జామ్ సాహిబ్ (పాలక యువరాజు) అయ్యాడు.
  • ఆగస్టు 14: మాల్టాలోని గోజోలో కొత్తగా నిర్మించిన కేథడ్రల్ ఆఫ్ అజంప్షన్ ప్రారంభోత్సవం జరిగింది.
  • ఆగష్టు 22: క్వీన్ అన్నేస్ యుద్ధంలో భాగంగా క్యూబెక్‌పై దాడి చేయడానికి బ్రిటిష్ వారు చేసిన క్యూబెక్ దండయాత్ర, సెయింట్ లారెన్స్ నదిలో దాని 8 నౌకలు ధ్వంసమై 850 మంది సైనికులు మునిగిపోవడంతో విఫలమైంది.
  • డిసెంబర్ 12: 1690 లో స్థాపించబడిన బోలోగ్నా ఇన్స్టిట్యూట్ యొక్క అకాడమీ ఆఫ్ సైన్సెస్ కోసం ఒక రాజ్యాంగాన్ని ఆమోదించారు.
  • తేదీ తెలియనివి
    • ది స్పెక్టేటర్ దినపత్రిక ఇంగ్లాండులో స్థాపించబడింది. జోసెఫ్ ఎడిసన్ దీని వ్యవస్థాపకుడు.
    • జాన్ షోర్ ట్యూనింగ్ ఫోర్క్‌ను కనుగొన్నాడు .
    • లుయిగి ఫెర్డినాండో మార్సిలి పవాళం గతంలో అనుకున్నట్లు మొక్క కాదు, అది జంతువు అని చూపించాడు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=1711&oldid=3026640" నుండి వెలికితీశారు