Jump to content

1717

వికీపీడియా నుండి

1717 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1714 1715 1716 - 1717 - 1718 1719 1720
దశాబ్దాలు: 1690లు 1700లు - 1710లు - 1720లు 1730లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
GodfreyKneller-IsaacNewton-1689
  • జనవరి 1: బ్రిటిష్ సింహాసనానికి వారసుణ్ణని చెప్పుకుంటున్న జేమ్స్ ఫ్రాన్సిస్ ఎడ్వర్డ్ స్టువర్ట్‌కు సహాయం చేయడానికి కుట్ర పన్నినందుకు గ్రేట్ బ్రిటన్ రాజ్యానికి స్వీడన్ రాయబారి కౌంట్ కార్ల్ గిల్లెన్‌బోర్గ్‌ను లండన్‌లో అరెస్టు చేశారు.[1]
  • జనవరి 4: గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, డచ్ రిపబ్లిక్ లు ట్రిపుల్ అలయన్స్‌పై సంతకం చేశాయి [1]
  • ఫిబ్రవరి: ఫ్రాన్స్, బ్రిటన్ మధ్య జరిగిన ఒప్పందం తరువాత, జేమ్స్ స్టువర్ట్ ఫ్రాన్స్‌ను విడిచిపెట్టి, పోప్ క్లెమెంట్ XI వద్ద ఆశ్రయం పొందాడు.[1]
  • ఫిబ్రవరి 26మార్చి 6: ఈశాన్య యునైటెడ్ స్టేట్స్ వరసబెట్టి వచ్చిన మంచు తుఫానులలో కూరుకుపోయి, స్తంభించిపోయింది
  • మే 27: స్పెయిన్ తన దక్షిణ అమెరికా వలసలన్నిటినీ ఏకం చేసి న్యూ గ్రెనడా వైస్రాయల్టీ అని పేరుపెట్టింది.
  • ఆగష్టు 22: స్పానిష్ దళాలు సార్డీనియాలో అడుగుపెట్టాయి .
  • సెప్టెంబర్ 29: గ్వాటెమాలా భూకంపం : 7.4 తీవ్రతతో భూకంపం ఆంటిగ్వా గ్వాటెమాలాను తాకి, నగరాన్ని చాలావరకు నాశనం చేసింది. గ్వాటెమాలా రాజధానిని వేరే ప్రదేశానికి తరలించాలని అధికారులు ఆలోచించారు.
  • డిసెంబర్ 2425: నెదర్లాండ్స్, డెన్మార్క్ మధ్య ఉత్తర సముద్ర తీరంలో ఘోరమైన వరద; వేలాది మంది చనిపోయారు, ఇళ్లను కోల్పోయారు.
  • తేదీ తెలియదు: ఫర్రుక్‌సియార్ పాలనా కాలంలో బ్రిటిష్ ఇండియా కంపెనీ బెంగాల్ పన్ను రహిత వాణిజ్య హక్కులను 3,000 రూపాయల వార్షిక చెల్లింపుతో కొనుగోలు చేసింది.
  • తేదీ తెలియదు: సర్ ఐజాక్ న్యూటన్ వెండి, బంగారం మధ్య ఒక కొత్త నాణెం నిష్పత్తిని ఆవిష్కరించాడు.
  • తేదీ తెలియదు: 1717 బహ్రెయిన్‌పై ఒమనీ దాడి
  • తేదీ తెలియదు: మణిపూర్ మహారాజా పంహీబాను శాంతిదాస్ గోస్వామి హిందూ మతంలోకి మార్చాడి. దానిని తన రాజ్యంలో అధికారిక మతంగా ప్రకటించారు.
  • తేదీ తెలియదు: ముర్షిద్ కులీ ఖాన్ తనను తాను బెంగాల్ సుబాకు మొదటి నవాబుగా ప్రకటించుకున్నాడు. మొఘల్ సామ్రాజ్యానికి నామమాత్రంగా విధేయత చూపిస్తూ ఈ నవాబులు బెంగాల్‌కు సార్వభౌమ పాలకులుగా పాలించారు.[2]

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 295–296. ISBN 0-304-35730-8.
  2. Chowdhury, Sushil. নবাবি আমলে মুর্শিদাবাদ (Nababi Amole Murshidabad). ISBN 9788177564358.
"https://te.wikipedia.org/w/index.php?title=1717&oldid=3049186" నుండి వెలికితీశారు