1762
స్వరూపం
1762 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1759 1760 1761 - 1762 - 1763 1764 1765 |
దశాబ్దాలు: | 1740లు 1750లు - 1760లు - 1770లు 1780లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 4 – స్పెయిన్, నేపుల్స్‌పై బ్రిటన్ చేసిన ఏడు సంవత్సరాల యుద్ధం మొదలైంది.
- ఫిబ్రవరి 5: పంజాబ్‌లో అహ్మద్ షా అబ్దాలి బలగాలు సిక్కులను ఊచకోత కోసాయి. మొత్తం మీద, ఈ ఊచకోతలో సుమారు 30,000 మంది పురుషులు, మహిళలు, పిల్లలు మరణించారు.
- మార్చి 20: వినూత్న ప్రచురణకర్త శామ్యూల్ ఫర్లే న్యూయార్క్ నగరంలో ఏడవ వారపత్రిక ది అమెరికన్ క్రానికల్ను ప్రారంభించాడు.[1]
- ఏప్రిల్ 2: ఆధునిక బంగ్లాదేశ్, మయన్మార్ ల మధ్య సరిహద్దులో ఒక శక్తివంతమైన భూకంపం వలన బంగాళాఖాతంలో సునామీ వచ్చింది. ఇందులో కనీసం 200 మంది చనిపోయారు.[2]
- ఆగష్టు 13 – ఏడు సంవత్సరాల యుద్ధంలో స్పెయిన్, హవానాను గ్రేట్ బ్రిటన్కు అప్పగించడంతో రెండు నెలల కన్నా ఎక్కువ కాలం సాగిన హవానా యుద్ధం ముగిసింది
- సెప్టెంబర్ 24 – అక్టోబర్ 6: మనీలా యుద్ధం : బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలు మనీలాను స్పానిష్ నుండి చేజిక్కించుకున్నాయి. దీంతో బ్రిటిష్ వారు మనీలాను ఆక్రమించుకుని దీనిని బహిరంగ నౌకాశ్రయంగా మార్చారు.
- తేదీ తెలియదు: నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II హైదరాబాదు నిజామయ్యాడు
- తేదీ తెలియదు: తత్వవేత్త జీన్-జాక్వెస్ రూసో రాసిన ది సోషల్ కాంట్రాక్ట్ (డు కాంట్రాట్ సోషల్, ప్రిన్సిపెస్ డు డ్రోయిట్ పాలిటిక్), ఎమిలే, లేదా ఆన్ ఎడ్యుకేషన్ (ఎమిలే, డి డి'ఎడ్యుకేషన్) లను ఆమ్స్టర్డామ్, ది హేగ్‌లలో ప్రచురించారు. జెనీవా, పారిస్ లలో వాటిని నిషేధించారు. బహిరంగంగా తగలబెట్టారు.
జననాలు
[మార్చు]- ఫిబ్రవరి 23: వెలుగోటి కుమార యాచమ నాయుడు, వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (మ.1804)
- ఏప్రిల్ 26: శ్యామశాస్త్రి, ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827)
- మే 19 – జోహన్ గాట్లీబ్ ఫిచ్టే, జర్మన్ తత్వవేత్త (మ .1814 )