మనీలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనీలా నగరం
Lungsod ng Maynila
(From top, left to right): Skyline as seen from the Manila Bay, Manila Central Post Office, Manila City Hall, Rizal Monument, Binondo, Malacañang Palace, Manila Bay, Church of Tondo
(From top, left to right): Skyline as seen from the Manila Bay, Manila Central Post Office, Manila City Hall, Rizal Monument, Binondo, Malacañang Palace, Manila Bay, Church of Tondo
Flag of మనీలా నగరం
Official seal of మనీలా నగరం
Nickname(s): 
Pearl of the Orient[1]
The City of Our Affections
Distinguished and Ever Loyal City
Map of Metro Manila showing the location of the city of Manila
Map of Metro Manila showing the location of the city of Manila
Country Philippines
RegionNational Capital Region
Districts1st to 6th districts of Manila
Kingdom of Maynila1500s
Spanish City of Manilaజూన్ 24, 1571
Barangays897
Government
 • TypeMayor–council
 • మేయరుJoseph Estrada (UNA)
 • ఉప మేయరుIsko Moreno (UNA)
 • Representatives
City Representatives
 • మనీలా సిటీ కౌన్సిల్
Councilors
Area
 • రాజధాని38.55 km2 (14.88 sq mi)
 • Urban
1,474.82 km2 (569.43 sq mi)
 • Metro
638.55 km2 (246.55 sq mi)
Elevation
16.0 మీ (52.5 అ.)
Population
 (2010)[3]
 • రాజధాని16,52,171
 • Density42,858/km2 (1,11,000/sq mi)
 • Urban
2,19,51,000
 • Urban density15,400/km2 (40,000/sq mi)
 • Metro
1,18,55,975
 • Metro density18,567/km2 (48,090/sq mi)
Demonym(s)Manileño (m) / Manileña (f), Manilan
Time zoneUTC+8 (PST)
ZIP code
0900 to 1096
Area code2

మనీలా (ఆంగ్లం: Manila; English: /məˈnɪlə/; మూస:Lang-fil, మూస:IPA-tl) ఫిలిప్పైన్స్ దేశానికి రాజధాని, రెండవ అతిపెద్ద నగరం. ఈ దేశంలోని 16 మహానగరాలలో ఒకటి, జాతీయ రాజధాని ప్రాంతంగా మెట్రో మనీలా సుమారు 12 మిలియన్ల జనాభా కలిగివున్నది. ఈ మనీలా నగరం మనీలాఖాతానికి తూర్పు తీరంలో ఉంది.

మనీలా నగరం మనీలాఖాతం తూర్పుతీరంలో ఉంది. నగర ఉత్తర సరిహద్దులలో నవోటాస్, కాలూకాన్, వాయవ్యంలో క్యూజాన్ నగరం, ఈశాన్యలో శాన్ జాన్, తూర్పున మండలుయాంగ్, ఆగ్నేయంలో మకాటి, దక్షిణంలో పాసే నగరాలున్నాయి.

2010 గణాంకాలను అనుసరించి మనీలా మొత్తం జనసంఖ్య 16,52,171. మనీలా ఫిలిప్పైంస్‌లో అత్యంత జనసాంద్రత కలిగిన నగరాలలో రెండవది. మొదటి స్థానంలో క్యూజాన్ నగరం ఉంది. నగరవైశాల్యం 38.55 చదరపు కిలోమీటర్లు.

నగరం 6 లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థానాలుగా విభజించబడి ఉంది. నగరంలో బినోడో, ఎర్మిలా, ఇంట్రామురోస్, మేలేట్ పాకో, పాండగాన్, పోర్ట్ ఏరియా, క్యుజాపో, శాంపలాక్, శాన్ ఆండ్రెస్, శాన్ మికేల్, శాన్ నికోలస్, శాంటా అనా, శాంటా క్రజ్, శాంటా మెసా, టోండో అనే ప్రధాన ప్రాంతాలున్నాయి. మనిలా నగరంలా వ్యాపార సందడి అలాగే అత్యంత చారిత్రక ప్రాధాన్యం, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన గుర్తింపుపొందిన ప్రాంతాలు ఉన్నాయి. అలాగే నగరంలో ప్రభుత్వ నిర్వహణ, న్యాయవ్యవస్థ ప్రధాన శాఖలున్నాయి.

మనీలా నగరంలోణ్అనేక ప్రసిద్ధ సైన్సు, విద్యాసంస్థలు, అసంఖ్యాకమైన క్రీడా వసతులు అలాగే సాంస్కృతిక, చారిత్రక వేదికలున్నాయి. అంతర్జాతీయ నగరాల శ్రేణిలో చేరిన మనీలా నగరంలోని కళలు, వాణిజ్యం, విద్య, వినోదం, ఆర్థికం, ఆరోగ్య సంరక్షణ, మాధ్యమం, వృత్తిపరమైన సేవలు, పరిశోధన, అభివృద్ధి, పర్యాటకం, రవాణా వంటి సౌకర్యాలు నగరాన్ని చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా, ఆర్థికాభివృద్ధి మనీలా నగరాన్ని ఫిలిప్పైన్ దేశంలో ప్రధాన కేంద్రగా మార్చింది. మనీలా గురించి లభించిన వ్రాతపూర్వక ఆధారాలలో మొదటిది 10వ శతాబ్ధపు లగుణా తమ్రపత్రాలలోని వ్రాతలు భారతీయ రాజ్యానికి మెడాంగ్ సామ్రాజ్యానికి ఉన్న దౌత్యసంబంధాలు తెలియజేస్తున్నాయి. బ్రూనై సుల్తాన్ బొకాయా ఈ నగరం మీద దాడిచేసాడు. మనీలా 15 వ శతాబ్ధలో స్పానిష్ విజేతలు నగరంలో ప్రవేశించే నాటికి ఇస్లామిక్ నగరంగా మార్చబడింది. తరువాత మనీలా సుదూర తూర్పుప్రాంతాల స్పానిష్ రాజ్యాంగ కేంద్రంగా మారింది. అలాగే లాటిన్ అమెరికా- ఆసియాలను అనుసంధానం చేసే మనీలా-అకపుల్కో గాలెన్ ట్రేడ్ మార్గం ఒక చివరగా ఉంది. పసిఫిక్ సముద్ర వాణిజ్య మార్గంలో మద్యలో ఉన్న కారణంగా మనిలా నగరానికి " పీర్ల్ ఆఫ్ ఓరియంట్ " అనే పేరు వచ్చింది. తరువాత పలు చైనాచొరబాటుదార్లు, ప్రాంతీయ తిరుగుబాటుదార్లు, బ్రిటిష్ ఆక్రమణ, సెపాయ్ తిరుగుబాటు కూడా వంటి సంఘటనలు సంభవించాయి. అమెరికన్ల రాక తరువాత ఫిలిప్పైన్ తిరుగుబాటుకు మనీలా ప్రముఖకేంద్రంగా మారింది. అమెరికన్లు చేపట్టిన నగరరూపకల్పన, అభివృద్ధి రెండవ ప్రపంచ యుద్ధంతో వ్యర్ధం అయ్యింది. అయినప్పటికీ తరువాతి కాలంలో నగరం పునర్నిర్మించబడింది.

చరిత్ర[మార్చు]

చరిత్రకాలానికి ముందు[మార్చు]

మినీలా యొక్క ఈ ప్రాంతంలోని అతిపురాతన మానవనివాస ఆధారాలు క్రీ.పూ 3000 " అంగోనో పెట్రోగ్లిప్స్ " వద్ద లభించాయి. అదనంగా నెగ్రిటోస్ అనబడే ఆస్ట్రలాయిడ్ తరగతికి చెందిన ప్రజలు ఫిలిప్పైన్ ద్విపాలకు ప్రాంతపు పూర్వీక సంతతికి చెందిన ప్రజలుగా భావించబడుతున్నారు. వారు ఈ ప్రాంతానికి వలస వచ్చిన మలాయో-పాలినెసియన్లకు ముందే ల్యూజాన్ ప్రాతంలో నివసించినట్లు కనుగొనబడింది.

భారతీయ ప్రభావం[మార్చు]

మనీలా ఆరంభంలో జింటో (బంగారం) లేక సువర్ణద్వీప అని పొరుగున ఉన్న వలస ప్రజలచేత పిలువబడుతూ అలాగే అధికారికంగా మేనీలా రాజ్యంగా నామకరణం చేయబడింది. మింగ్ సామ్రాజ్యం కాలంలో చైనాతో నేరుగా వ్యాపారసంబంధాలు ఉన్న కారణంగా సంపదలతో వర్ధిల్లింది. పురాతన సామ్రాజ్యానికి టోండో సర్వాధికారం కలిగిన రాజూకు సంప్రదాయక రాజధానిగా ఉంటూవచ్చింది. అప్పుడు వారిని పగుయన్ లేక పంగునూన్ (ప్రభువులు) ; అనాక్ బంవా (స్వర్గాధిపతి కుమారుడు) ; లేక లకందులా (ప్రాంతానికి ప్రభువు ) అనేవారు. 13వ శతాబ్దంలో శక్తివంతమైన వలసలు, పురాతన నగరంలోని నదీతీరాలలో వ్యాపార స్థావరాలు ప్రారంభం అయ్యాయి. ఇండియన్ మజాపహిత్ సామ్రాజ్య చక్రవర్తి మనీలా నగరం మీద దండెత్తినట్లు యులజి కావ్యంలోని నగరక్రేతగామా పద్యంలో లభించిన ఆధారాలు మొదటిసారిగా లభించిన లిఖితపూర్వక ఆధారాలుగా భావిస్తున్నారు. అందులో మహారాజా హయం వురుక్ మనిలాను జయించాడని వర్ణించబడింది. సాలూడంగ్ లేక సెలూరంగ్ అనేది గతంలో మనీలా చారరిత్రక నామంగా ఉంటూ వచ్చింది.

ఇస్లామిక్ పాలన[మార్చు]

1485-1521 వరకు సాగిన సుల్తాన్ బొల్కాయా పాలనా సమయంలో బ్రూనై సుల్తానేట్ చైనా వ్యాపారంలో టాండోల ఆధిపత్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తూ కోటా సలుడాంగ్ (ప్రస్తుత మనీలా) ను బ్రూనై దూరప్రాంత రాజ్యంగా స్థాపించింది. టోండోలోని " హౌస్ ఆఫ్ లకండులా "ను సవాలుచేస్తూ ఇస్లాం రాజైన సలాలియా పాలనతో సరికొత్త సామ్రాజ్యం స్థాపించబడింది. వ్యాపారులరాక , ఇండోనేషియా, మలేషియా నుండి వచ్చిచేరిన మతమార్పిడిదారులతో మనీలాలో ఇస్లాం మతం మరింతగా బలపడింది. స్పెయిన్ కాలనీ స్థానంగా మారడానికి ముందుగా మనీలాను చైనాకు చెందున ప్రైవేట్ - వార్‌లార్డ్ తాత్కాలికంగా ఆక్రమించుకున్నాడు.

న్యూవ ఎస్పెన విజయం[మార్చు]

1571 జూన్ 24న స్పెయినుకు చెందిన సాహసయాత్రికుడు " మిక్వెల్ లోపెజ్ లెగాజ్పి " న్యూవా ఎస్పెనో (ప్రస్తుతం మెక్సికో) నుండి బయలుదేరి మినీలాకు చేరాడు. తరువాత మిక్వెల్ లోపెజ్ లెగాజ్పి స్పెయిన్ నగరమైన మనీలాలో రాజ్యం స్థాపించి న్యూవా ఎస్పెనో భూభాగంగా పాలన సాగించాడు. మిక్వెల్ లోపెజ్ ప్రస్తుత ఇంట్రామరస్ డిస్ట్రిక్‌లో సిటీకౌంసిల్ స్థాపించాడు. జపాను వ్యాపారులు, బ్రూనై సుల్తానేట్‌కు చెందిన ల్యూజెన్ రాజులు పలు విసయన్ డాటస్ ప్లస్లతో చేరి టోండో సాగించిన కుట్రలో భాగంగా చేసిన స్పెయిన్ ప్రజలు వారితో ఉన్న అమెరికన్ ఇండియన్లు , బానిసలతో చేర్చి సాగించిన మూకుమ్మడి హత్యల కుట్ర భగ్నం అయిన తరువాత మిక్వెల్ లోపెజ్ లీ లెగాజ్పీ ప్రాతియరాజరిక వ్యవస్థను ఏర్పాటు చేసాడు. విజయం సాధించిన స్పెయిన్ పాలకులు స్పెయిన్ ఈస్టిండీస్‌ , ఫిలిప్పైనుకు మనీలాను రాజధానిగా చేసారు. తరువాత మినీలాలో 1565 నుండి 1898 వరకు దాదాపు మూడు శతాబ్ధాల కాలం స్పెయిన్ పాలన కొనసాగింది.

మనీలా - అకాపుల్కో గాలియన్ వ్యాపారం సమయంలో మనీలా ప్రసిద్ధి మరింతగా వృద్ధిచెందింది. మూడు శతాబ్ధాల కాలం ఐరోపా, అమెరికా, ఆఫ్రికా , లాటిన్ అమెరికా నుండి వస్తువులను పసిఫిక్ ద్వీపాలు , దక్షిణాఅసియాకు చేరవేసారు. అంతకు ముందు నుండి భారతదేశం, ఇండోనేషియా , చైనాల నుండి వస్తువులు మనీలాకు సరఫరా ఔతూ వచ్చాయి. వస్తుమార్పిడి కూడా విస్తృత ప్రచారంలోకి వచ్చింది. మెక్సికోలోని గనుల నుండి ఉత్పత్తి అయిన వెండిని ఇచ్చి చైనీయుల పట్తు, భారతీయుల నవరత్నాలు , దక్షిణాసియా సుగంధద్రవ్యాలు కొనుగోలు చేసి కొన్ని వస్తువులు ఐరోపా‌కు సరఫరాచేయబడ్డాయి. ఐరోపా‌ , దక్షిణ ఆఫ్రికాలో ఉత్పత్తి చేయబడిన ఆలివ్ , వైన్‌లు మెక్సికో మీదుగా మనీలాకు చేరవేయబడ్డాయి.

బ్రిటిష్ ఆక్రమణ[మార్చు]

స్పెయిన్, ఫ్రాన్స్- గ్రేట్బ్రిటన్ మద్య ఏడు సంవత్సరాల కాలం కొనసాగిన యుద్ధంలో భాగంగా 1762 నుండి 1764 మద్యకాలంలో గ్రేట్ బ్రిటన్ మనీలాను ఆక్రమించుకున్నది. బ్రిటన్ గవర్నర్ డాసన్నే డ్రేక్ ఆధ్వర్యంలో మనీలా ఫిలిప్పైన్ రాజధానిగా ఉంటూవచ్చింది. అయినప్పటికీ రాజ్య సంరక్షణార్ధం " ఒయిడర్ డాన్ సైమన్ డీ అండా వై సలాజర్ " ఆధ్వర్యంలో బ్రిటిష్ సైన్యం పంపంగా వద్ద కేంద్రీకృతం చేయబడింది. ఆక్రమణ సమయంలో పట్టుబడిన సులు సుల్తాన్ ఆజిం ఉద్ -దిన్ ఐ బ్రిటిష్ , స్పెయిన్ మద్య తాకట్టుగా ఉపయోగించబడ్డాడు. అలాగే బినాండో వద్ద చైనీయులు మొదట స్పెయిన్ మీద తిరుగుబాటు సాగించి తరువాత బ్రిటన్‌కు చెందిన భారతీయ కిరాయి సైనికుల తిరుగుబాటును తిప్పికొట్టారు. అయినప్పటికీ " బ్రిటన్ ట్రీటీ ఆఫ్ పారిస్ " లో జరిగిన ఒప్పందాలకు తిలోదకాలిచ్చింది. అయినప్పటికీ సిపాయిలకు అలాగే చైనీయులు ఇక్కడ ఉండడానికి అనుమతి లభించింది. తరువాత వారు కైంటా, రిజాల్ ప్రాంతంలో స్థిరపడ్డారు. తరువాత స్పెయిన్ ఫిరంగులు చైనా నుండి ఎదురుచూసిన తిరుగుబాటును అణచడానికి వీలుగా బినాండో (ప్రపంచపు పురాతన చైనా టౌన్ ) వైపు మళ్ళించబడ్డాయి.

స్పెయిన్ పాలన[మార్చు]

బ్రిటిష్ ఆక్రమణ తరువాత స్పెయింతో నేరుగా వ్యాపార సంబంధాల కొరకు సూయజ్ కాలువ తెరవబడింది. స్పెయిన్ వైశ్రాయి మూలంగా పరోక్షపాలన శ్సాగించింది. తుదకు మెక్సికన్ స్వాతంత్ర్యం తరువాత స్పెయిన్ నేరుగా పాలనసాగించవలసిన అవసరం ఏర్పడింది. స్పెయిన్ పాలనలో బ్యాకింగ్, పరిశ్రమలు, విద్య గత రెండు శతాబ్ధాలకంటే అధికంగా అభివృద్ధి చెందుంది. మనీలాలో జరిగిన అభివృద్ధి భారతీయులు, చైనీయులు, లాటిన్ ప్రజలు, యురేపియన్లు, ఫిలిప్పైన్ భూభాగం నుండి మనీలాకు వచ్చి చేరిన ప్రజలను ఆకర్షించింది. సంప్రదాయాలకు అత్తీతంగా వారందరూ సమైక్యంగా ఫిలిప్పైన్ పౌరసత్వాన్ని స్వీకరించారు. అభివృద్ధి ప్రజల మనోప్రవృత్తిలో మార్పును తీసుకువచ్చి ప్రజలలో స్వాతంత్ర్యేచ్చ అభివృద్ధి చెంది స్పెయిన్ ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యం కోరుతూ ఉద్యమించేలా ప్రేరణ కలిగించింది. ఫిలిప్పైన్ రిపబ్లిక్ అవతరుంచే సమయానికి సమగ్రమైన అభివృద్ధి జరిగి తలసరి జి.డి.పి అభివృద్ధి జపాను దేశంతో పోటీచేసింది.

అమెరికన్ల వలసరాజ్యం[మార్చు]

1898లో స్పానిష్ - అమెరికన్ యుద్ధంలో ఓడిపోయిన స్పైన్ ఫిలిప్పైన్‌ను అమెరికాకు వదులుకుంది. అలాగే ఇతర భూభాగాలు కూడా స్వాధీనపరచుకొనబడ్డాయి. పారిస్ ఒప్పందంలో భాగంగా మానిటరీ 20 మిలియన్లకు కొనుగోలు చేయబడింది. స్పైన్ నుండి స్వాతంత్ర్యం లభించిన తరువాత 1899-1902 మద్య కాలంలో తిరుగుబాటుదార్లు ఫిలిప్పైన్-అమెరికన్ యుద్ధంలో ఫిలిప్పైన్‌లోని అమెరికన్ సైన్యం మీద ఆయుధదాడులు చేసారు. ఈ యుద్ధంలో దాదాపు 15 లక్షల మంది ఫిలిప్పైన్ పౌరులు మరణించడమే కాక మొదటి ఫిలిప్పైన్ రిపబ్లిక్ కరిగిపోయింది.

అమెరికన్ ఆధ్వర్యంలో సరికొత్త ప్రభుత్వానికి గవర్నర్ - జనరల్ విలియం హోవర్డ్ టాఫ్ట్ నాయకత్వం వహించాడు. విలియం హోవర్డ్ టాఫ్ట్ నగర నిర్మాణ నిపుణుడైన డానియల్ బంహాన్ని మనీలా నగరానికి కొత్త అందాలు తీసుకు వచ్చే బాధ్యతను అప్పగించాడు. జలాశయతీరాలను అభివృద్ధిచేయడం, ఉద్యానవనాల నిర్మాణం, పార్క్‌వేస్, పలు కార్యక్రమ నిర్వహణ కొరకు పలు భవనాలను నిర్మించడం వంటివి ఈ అభివృద్ధిలో భాగంగా ఉంటూ వచ్చింది. తరువాత వాలెస్ ఫీల్డ్ ప్రభుత్వకేంద్రంగా మారి అది ప్రస్తుత ల్యూనేటా నుండి ప్రస్తుత టాఫ్ట్ అవెన్యూ వరకు పొడించబడింది. ఫిలిప్పైన్ రాజధాని టాఫ్ట్ అవెన్యూతో ఆరంభమై ఫీల్డ్ వద్ద ముగుస్తుంది. పలు ప్రభుత్వ కార్యాలయాలు నలుచదరంగా ఉన్న నీటి మడుగు చుట్టూ నిర్మించబడిన ఈ భవనసమూహంలో ల్యూనెటా చివరలో జోస్ రైజాల్ స్మారకచిహ్నంతో ఈ భవనసమూహం సముద్రతీరం, చిన్న అటవీ ప్రాంతాలతో సుందరవాతావరణంలో ఉన్నాయి. రెండవప్రపంచయుద్ధం ఆరంభమైన సమయంలో బర్న్‌హాం ప్రతిపాదనతో గవర్నమెంట్ సెంటర్, ది లెజిస్లేటివ్ భవనంలోని మూడువిభాగాలు, ఫైనాంస్ భవనం (బిల్డింగాఫ్ ఫైనాంస్), వ్యవసాయశాఖ కార్యాలయాలు ఉన్నాయి.

జపాన్ దండయాత్ర[మార్చు]

ఫిలిప్పైన్ మీద జపాన్ దండయాత్ర చేసిన సమయంలో 1941 డిసెంబరు 24 న నగరం నుండి వెలుపలికి వెళ్ళమని అలాగే సైనిక శిబిరాలను తొలగించమని అమెరికన్ సైన్యాలకు ఆఙలు జారీ చేయబడ్డాయి. జపాన్ మనీలా నగరం మీద బాంబులను ఎడతెగకుండా వేసే సమయంలో నగరంలో సంభవించే మరణాలు, విధ్వశం నివారించడానికి జనరల్ డగ్లస్ మ్యాక్‌ఆర్థర్ ఈ ఆఙలను జారీచేసాడు. 1942 జనవరి 2న మనీలాను జపాన్ సైన్యం వశపరచుకున్నది.

రెండవప్రపంచ యుద్ధంలో రక్తపాతం అధికంగా సంభవించిన ప్రాంతాలలో మనీలా ఒకటి. జపాన్ సామ్రాజ్యానికి వశమైన తరువాత 1945 ఫిబ్రవరి 3 నుండి మార్చి 3 వరకు సాగించిన యుద్ధానంతరం అమెరికన్, ఫిలిప్పో సైన్యాలు మనీలాను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకువచ్చాయి. 1945 ఫిబ్రవరిలో మనీలా నగరంలో 1,00,000 పౌరులు చంపబడ్డారు. రెండవప్రపంచ యుద్ధంలో అత్యధికంగా నాశనం అయిన నగరాలలో మనీలా నగరం రెండవ స్థనంలో ఉంది. మొదటి స్థానం వార్సానగరానిది. రెండవ ప్రపంచయుద్ధం ముగుసే సమయానికి మనీలా నగరం ప్రత్యేకంగా ఇంట్రూమరస్ ప్రాంతంలోని నిర్మాణాలు దాదాపు పూర్తిగా ధ్వంసం చేబడినప్పటికీ యుద్ధానంతరం పునరుద్ధరణ ప్రయత్నాలు చేపట్టబడ్డాయి.

స్వతంత్ర ఫిలిప్పైంస్[మార్చు]

1948లో అధ్యక్షుడు ఎల్పిడో క్యురినో ఫిప్పైన్ ప్రభుత్వస్థానానం క్యుజాన్ సిటీకి పంపబడ్డాడు. సరికొత్త రాజధాని నగరమైన క్యుజాన్ సిటీ మనీలాకు ఈశాన్యంలో మునుపటి అధ్యక్షుడైన మాన్యుయల్ ఎల్.క్యూజాన్ చేత 1948లో రూపుదిద్దబడింది. మాన్యుయల్ ఎల్.క్యూజాన్ తరువాత ఈ నగరానికి ఆయనపేరు స్థిరీకరించబడింది. బంహాం ప్రణాళికలో భాగంగా గవర్నమెంట్ కేంద్రం ల్యూనెటాలో రూపుదిద్దుకోవడంతో ఈ కార్యక్రమం ముగింపుకు వచ్చింది.

1952లో ఆర్సెనియో లాక్సన్ మొదటిటి మేయర్‌గా ఎన్నిక చేయబడ్డాడు. అప్పటి వరకు మేయర్లు నియమించబడ్డాడు. తరువాత మనీలా నగరం స్వర్ణయుగంలోకి ప్రవేశించింది. తరువాత మనీలా నగరం పునరుజ్జివనం పోసుకుని రెండవప్రపంచ యుద్ధానికి ముంద ఉన్నట్లుగా తిరిగి " పీర్ల్ ఆఫ్ ఓరియంట్ "గా మారింది. 1950 తరువాత మనీలా నగరానికి గవర్నర్ మాక్‌సన్ వెన్నంటి 1960 వరకు అంటానియో విల్లెగాస్ నాయకత్వంలో ముందుకు సాగింది. తరువాత రామన్ బగత్సింగ్ నాయకత్వంలో 1970 వరకు దాదాపు ఒక దశాబ్ధకాలం కొనసాగింది. 1986లో పీపుల్ పవర్ ఉద్యమం ఆయనను దీర్ఘకాల మేయర్‌గా గుర్తించేలా చేసింది. మేయర్ లాక్సన్, విల్లెగస్ , భగత్సింగ్ తరచుగా " బిగ్‌త్రీ ఆఫ్ మనీలా " ప్రశన్శించబడ్డారు. దాదాపు నిరంతరంగా ( 1952-1986) మూడు దశాబ్ధాల కాలం పదవిలో కొనసాగుతూ నగరాభివృద్ధికి తోడ్పడిన బిగ్‌త్రీ నిర్వహణలో వారు తమ శయశక్తులా నగరాభివృద్ధికి, ప్రజల జీవనప్రమాణ అభివృద్ధికి , మనీలా నగర ప్రజల సౌఖ్యాల కొరకు కృషిచేసారు.

అధ్యక్షుడైన ఫర్దినంద్ మేక్రోస్ నియతృత్వంలో 1975 నవంబరు 7న ప్రెసిడెంషియల్ డిక్రీ నంబరు 824 ప్రకారం మనీలా మహా నగరం సమైక్యభూభాగంగా మార్చబడింది. నాలుగు నగరాలు , సమీపంలోని 13 టౌన్లు కలిపి ప్రత్యేక ప్రభుత్వ భూభాగంగా మార్చబడింది. 1976 జూన్ 24 న నగరం స్థాపించిన 405 వ జన్మదిన సందర్భంలో మాక్రోస్ తిరిగి ఫిలిప్పైన్ రాజధానిగా ప్రకటించబడింది. మనీలా స్పెయిన్ కాలం నుండి మనీలా ప్రభుత్వ స్థానంగా గుర్తింపు పొందింది. ప్రెసిడెంషియల్ డిక్రీ నంబరు 940 ప్రకారం ప్రపంచదృష్టిలో మనీలా ఫిలిప్పైన్ నగరంగాను గుర్తింపబడుతూ వ్యాపారం, ఆర్థికం, విద్య , సాంస్కృతిక కేంద్రంగా ఉంటూ వచ్చింది.

1942లో అల్ఫెర్డో లిం మేయర్ అయ్యాడు. లింను వెన్నంటి అప్పటికి వైస్ మేయర్‌గా ఉన్న అటియంజా మేయర్ అయ్యాడు. అటియంజా " భుహయన్ అంగ్ మనీలా " (మనీలా పునరుద్ధరణ ) నినాదంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. అటియంజా మనీలా నగరంలో పలు ఉద్యానవనాలు రూపుదిద్దుకొనబడడమే కాక క్షీణించిన నగరసౌకర్యాలు పునర్నిర్మించబడ్డాయి. ఆయన మూడు పర్యాయాలు మేయరుగా ఎన్నిక చెయ్యబడ్డాడు. 2007లో అటియాంజా కుమారుడైన అలిని ఓడించి అల్ఫెర్డో లిం మరొకసారి మేయర్‌గా ఎన్నిక చేయబడ్డాడు. తరువాత అటియాంజా ప్రణాళికలను వెంటనే తారుమారు చేసాడు. అటియాంజా ప్రణాళికలు అగరాభివృద్ధికి స్వల్పంగా మాత్రమే తోడ్పడగలవని అభిప్రాయం వెల్లడించాడు. రెండు పార్టీల మద్య సంబంధాలు విషమస్థితికి చేరాయి. 2010 ఎన్నికలలో ఒకరిని ఒకరు దూషించుకున్నారు. తుదకు లిం అటియాంజాను ఓడించి మేయర్‌గా ఎన్నిక చెయ్యబడ్డాడు.

లిం నిర్వహణ మానవహక్కుల ఉల్లంఘన వంటు అనేక విమర్శలను ఎదుర్కొన్నది. 2008 లో కౌంసిలర్ అల్కొరెజా, నగర అధికారులు ఆయన మీద పలు ఫిర్యాదులు చేసారు. లిం పోలీస్ బలగాలు వేధింపులకు గురుచేసాయి అని పేర్కొంటూ 24 మంది నగర అధికారులు తమ పదవులకు రాజీనామా చేసారు. తాకట్టు సంక్షోభంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఆయనను తీవ్రవిమర్శకు గురిచేసింది. ఫిలిప్పైన్ చరిత్రలో తాకట్టు సంక్షోభం అతిదారుణమైనదిగా భావించబడింది. లంచగొండితనం పెరగడానికి కారణమయ్యాడని కూడా లిం నిందించబడ్డాడు. లిం నగరం నిలువుదోపిడీకి కారకుడయ్యడని ప్రజలు విశ్వసించారు. 2013 ఎన్నికలలో మునుపటి అధ్యక్షుడైన జోసెఫ్ ఎస్టాడా లింను ఓడించి మేయర్‌గా ఎన్నికయ్యాడు.

భౌగోళికం[మార్చు]

మనీలాఖాతం తూర్పుతీరంలో మనీలా నగరం ఉపస్థితమై ఉంది.అలాగే ల్యూజాన్ పడమటి తీరంలో ఉంది. ప్రధాన ఆసియా భుభాగానికి 800 మైళ్ళు (1,300 చదరపు కిలోమీటర్లు) దూరంలో ఉంది. పాసిగ్ నది తీసుకువచ్చిన ఒండ్రుమట్టి నిలువలు చారిత్రక కాలానికి ముందు నుండి నగరాన్ని సారవంతం చేయడమేగాక మనీలాబే నుండి కొంత భూభాగాన్ని నగరంలో చేర్చింది. అమెరికన్ కాలనీ కాలం నుండి జాశయతీరాల వెంట ఉన్న భూములు గణనీయంగా అభివృద్ధి చేయబడి మానవనివాసయోగ్యంగా మార్చబడ్డాయి. సహసిద్ధమైన భౌగోళికపరిస్థితులు కొన్ని నగారాభివృద్ధిలో భాగంగా సమైక్యపరచబడ్డాయి. నగరవైశాల్యం 38.55 చదరపు కిలోమీటర్లు (14.88 చదరపు మైళ్ళు). నగరం 897 బరంగేలుగా (ఫిలిప్పైన్‌లోని అతి చిన్న ప్రభుత్వవిభాగాలు) విభజించబడి ఉంది. ఒక్కో బరంగేకు ఒక్కో చైర్‌పర్సన్ ఉంటాడు. నిర్వహణా సౌలభ్యం కొరకు బరంగేలు మొత్తం 100 భూభాగాలుగా చేయబడ్డాయి. ఈ విభాగాలకు ప్రత్యేకంగా ప్రభుత్వాధికారులు ఉండరు. మనీలలో అంతర్భాగంగా ఉన్న 16 మునుపటి టౌంస్, పురపాలకాలను 19వ శతాబ్దంలో మనీలా మహానగరంలో సమ్మిశ్రితం చేయబడ్డాయి. ఈ భూభాలు ప్రస్తుతం నగరంలోని ప్రాంతాలుగా గుర్తించబడుతున్నాయి. అదనంగా మనీలా నగరం 6 ఎజిస్లేటివ్‌లుగా విభజించబడ్డాయి.

వాతావరణం[మార్చు]

పర్యావరణ వివాదాలు[మార్చు]

పారిశ్రామిక వ్యర్ధాలు, అధికంగా ఆటోమొబైల్ రంగానికి చెందిన వ్యర్ధాలు నగరానికి హానికలిగించడమేగాక నగరం మరింతగా వాయుకాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్నది. నగరప్రజలను పొగమంచు 98% బాధిస్తున్నది. ఫలితంగా మనీలా నగరంలో 4,000 మరణాలు సంభవించాయి. నగరంలో బహిరంగ మురికిగుంటలు, పారిశ్రామిక వ్యర్ధాలు అత్యధికంగా ఉన్నాయి. మనీలాలో ఉన్న పలు నదులు ఇప్పటికే మరణావస్థను చేరుకున్నాయి. 2003 గణాంకాలను అనుసరించి గృహాలనుండి వెలువడుతున్న 150 టన్నుల చెత్త, 75 టన్నుల పారిశ్రామిక వ్యర్ధాలు ప్రతిరోజూ పాసిగ్ నదిలో విడువబడుతున్నాయని తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా కలుషితమైన నదులలో పాసింగ్ నది ఒకటని భావించబడింది. నగరానికి అవసరమైనంతగా మౌలికసదుపాయాలు అభివృద్ధి జరగనందున నగరంలో కాలుష్యం అధికంగా ఉంటుంది. మనీలాలోని ఎర్మిటా ప్రాంతం నగరంలో అత్యధిక కలుషిత ప్రాంతంగా భావించ్బడుతుంది. పునరావాస ప్రణాళికలకు జలాశయతీరాల తీరాలను ఎన్నుకుంటున్నారు. ది పాసిగ్ రిహాబిలిటేషన్ కమిషన్ పాసిగ్ నదిని శుభ్రపరచి రవాణా, పురుత్సాహ కేంద్రాలు, పర్యాటకాకర్షణ కేంద్రంగా మార్చబడుతుంది. మనీలలో పునరావాస ప్రయత్నాలలో భాగంగా మినీలా నగరంలోని పలు జలాశయాలు అనతకు ముందున్న మురికివాడల స్థానంలో ప్రస్తుతం శుభ్రపరచబడి తీరం వెంట చెట్లను, మొక్కలను, పూలచెటను నాటి సుందరంగా, ఆహ్లాదకరంగా మార్చబడుతున్నాయి. .

గణాంకాలు[మార్చు]

2010 గణాంకాలను అనుసరించి 16,52,171 జనసంఖ్యతో మనీలా ఫిలిప్పైన్ దేశంలో జనసంద్రతలో రెండవస్థానంలో ఉంది. ఏకీభవించిన మనీలా మహానగరంలోని 17 నగరాలలో మనీలా కూడా ఒకటి. ఏకీభవించబడిన 17 నగరాలను ఎన్.సి.ఆర్ ( నేషనల్ కాపిటల్ రీజియన్) అని పులువబడుతుంది. 2010 గణాంకాలను అనుసరించి మనీలా మహానగర జనాభా 87,00,000. ఏకీభవించిన 17 నగరాలలో అత్యధిక జనాభా కలిగిన నగరం 2010 గణాంకాలను అనుసరించి 26,00,000 జనాభా కలిగిన ఒకప్పుడు రాజధానిగా ఉన్న క్యూజాన్. ఉత్తర-దక్షిణాలుగా నాలుగు ప్రాంతాలను కలుపుకున్న మెగా-మనీలాను ప్రాంతీయ వాసులు అధికరించబడిన నగరంగా పేర్కొంటుంటారు. మెగా-మనీలాలో బుల్కాన్, రిజాల్, కేవైట్ అరియు లగునా ప్రాంతాలు విలీనం చెయ్యబడ్డాయి. 2010 గణాంకాలను అనుసరించి మెగా-మనీలా జనసంఖ్య 17,00,000.

మనీలా నగరం చదరపు కిలోమీటరుకు 43,079 జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనసాద్రత కలిగిన నగరంగా గుర్తింపు పొందింది. చదరపు కిలోమీటరుకు 63,266 జనసాంద్రత కలిగిన 6 డిస్ట్రిక్ నగరంలో అత్యధిక జనసాంరత అలిగిన ప్రాంతం కాగా దీనిని వెన్నంటి 64,936 జనసాంద్రతతో 1 డిస్ట్రిక్, 64,710 జనసాంద్రతతో 2 వ డిస్ట్రిక్ ఉండగా 19,235 జనసాంద్రతతో 5 వ డిస్ట్రిక్ మాత్రం అత్యల్ప జాసాంద్రత కలిగి ఉంది. మనీలా జసాంద్రత చదరపు కిలోమీటరుకు 27,774 జనసాంద్రత కలిగిన కొలకత్తా, చదరపు కిలోమీటరుకు 22,937 జనసాంద్రత కలిగిన ముంబాయి, చదరపు కిలోమీటరుకు 20,164 జనసాంద్రత కలిగిన పారిస్, చదరపు కిలోమీటరుకు 16,364 జనసాంద్రత కలిగిన సంఘై (సంఘై నగరలోని నాంషి డిస్ట్రిక్ జనసంఖ్య 56,785), చదరపు కిలోమీటరుకు 10,087 జనసాంద్రత కలిగిన టోకియో మొదలైన నగరాలు చిన్నవిగా మారాయి.

ఫిలిప్పినో వర్నాక్యులర్ భాషకు సమీపప్రాంతాలలోని టాఘ్‌లాగ్ భాష ఆధారంగా ఉంది. మనీలా ఆధారిత టాఘ్‌లాగ్ భాష లింగుయా ఫ్రాంకా ఆఫ్ ది ఫిలిప్పైన్ అని పులువబడుతుంది. టాఘ్‌లాగ్ భాషను మాస్ మీడియా, వినోదం మూలంగా ఆర్చిపెలాగో అంతటా వ్యాప్తిచెందింది. మనీలా మహానగరం అలాగే ఫిలిప్పైన్ దేశమంతటా విద్య, వ్యాపారం, దినసరి అనుసంధానభాషగా అధికంగా ఆంగ్లభాషను ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ చిరకాల నివాసులలో కొంతమంది మాత్రం సాధారణంగా స్పెయిన్ భాషను మాట్లాడుతుంటారు. ఫిలిప్పైన్‌లో అధికారభాషగా కూడా స్పెయిన్ భాష ఎన్నుకొనబడడమేకాక విశ్వవిద్యాలయాలు, కాలేజులు, జపానీస్ ఫిలిప్పినో, ఇండియన్ ఫిలిప్పినో, ఇతర వలస ప్రజల సంతతివారు కూడా స్పెయిన్ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. వలసప్రజలు వారి నివాసాలలో మాతృభాధను ఉపయోగిస్తున్నా దినసరి అవసరాలకు ఆంగ్లం, ఫిలిప్పినో ఉపయోగించబడుతుంది. చైనీస్ ఫిలిప్పినో ప్రజలు మిన్నన్ చైనీస్ (ఇది లాంగాంగ్-వీ ) భాషలో సంభాషిస్తుంటారు.

ఆర్ధికం[మార్చు]

మనీలా ఆర్థికరంగం బహుముఖాల విస్తరించింది. చక్కగా సంరక్షించబడుతున్న మనీలా హార్బరు ఫిలిప్పైన్‌లో ప్రధాన నౌకాశ్రయంగా భావించబడుతుంది. వివిధ పరిశ్రమల నుండి రసాయనాలు, వస్త్రాలు, దుస్తులు, విద్యుత్‌పరికరాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఆహారౌత్పత్తులు, మద్యం, పొగాకు కూడా ఉత్పత్తి చేయబడుతుంది. ప్రాంతీయ వ్యాపారులు ప్రధానంగా తాళ్ళు, ప్లేవుడ్, రిఫైండ్ షుగర్, కొబ్బరి, కొబ్బరి నూనెల వంటి నిత్యావసర వస్తువులను ఎగుమతి కొరకు ఉత్పత్తి చేస్తున్నారు. ఫిలిప్పైన్‌లో మనీలా ప్రధాన ప్రచురణాకేంద్రంగా ఉంది.

డివిసోరియాతో చేర్చి బినాండో ప్రాంతాలు తిరిగి ఉపయోగంలోకి తీసుకురాబడి పెద్ద ఎత్తున నివాసగృహాలు, కర్యాలయాలు నిర్మించబడ్డాయి. విదేశీవాణిజ్యం (బి.పి.ఒ) అభివృద్ధిచేయడానికి ఏర్పాటు చేయబడిన చైనాటౌన్ మనీలా ప్రభుత్వ చేయూతతో వ్యాపారకేంద్రంగా అభివృద్ధిచేయబడింది. ఇప్పటికే 30 భవనాలు బి.పి.ఒ కార్యాలయాలుగా మార్చబడ్డాయి. బినాండో లోని ఎస్కోల్టాలో ఉన్న ఈ భవనాలు ప్రస్తుతానికి ఇంకా ఉపయోగంలోకి రాకున్నా భవిష్యత్తులో బి.పి.ఒ కార్యాలయాలుగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి.

మనీలా పర్యాటకరంగం సంవత్సరానికి దాదాపుగా 10 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఇంట్రామరస్ లోని వాలెడ్ సిటీ, " ది నేషషనల్ మ్యూజియం ఆఫ్ ది ఫిలిప్పైంస్ " వంటి మ్యూజియాలు, ఎర్మిటా, మలాటే, శాంటా క్రజ్, ది మనీలా జూ, ది సిటీ చైనాటౌన్, ఫీస్ట్ ఆఫ్ బ్లాక్ నజారినే, రిజాల్ పార్క్‌లో నిర్వహించబడుతున్న ఉచిత ప్రదర్శనలు, కల్చరల్ సెంటర్ ఆఫ్ ది ఫిలిప్పైంస్ వద్ద నిర్వహించబడే ఉత్సవాలు, వంటివి ఇతర పర్యాటక ప్రదేశాలు ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. ప్రధాన పర్యాటక ఆకర్షణలలో రిజాల్ పార్క్ ఒకటి. మనీలా నైట్‌లైఫ్ గురించి తెలుసుకోవడానికి అవకాశం కలిగిస్తున్న ఎర్నిటా, మలాటే ప్రయాటకులను మరొకవైపు ఆకర్షిస్తున్నాయి. అదనంగా ప్రాంతీయంగా పైతరగతి ప్రజలను ఆకర్షిస్తున్న డివిసోరియా షాపింగ్ మాల్ అదనపు ఆకర్షణలలో ఒకటి.

2011లో నగరం ద్రవ్యం పరిస్థితి 1.6 బిలియన్లు ఉండగా నిర్వహణా వ్యయం మాత్రం 2.97 బిలియన్లు ఉంది. ఆరోగ్యసంరక్షణకు అత్యధికంగా నిధిని మంజూరు చేసే నగరాలలో మనీలా ఒకటి. అత్యధికంగా ఆదాయం కలిగిన నగరాలలో కూడా మనీలా ఒకటిగా గుర్తింపు పొంది ఉంది. అలాగే నగరాంతర్గత ఆదాయం అత్యధికంగా కలిగిన నగరాలలో కూడా మనీల ఒకటి.

సంస్కృతి కళలు[మార్చు]

నగరలోని నివాసులు ప్రధానంగా క్రైస్తవులు అయినప్పటికీ నగరం ప్రజలందరి మతవిశ్వాలకు ఆదరుస్తుంది. ప్రజలలో రోమన్ కాథలిక్కుల శాతం 93%, తరువాత ఫిలిప్పైన్ ఇండిపెండెంట్ చర్చి శాతం 2.4%, తరువాత ఇగేసియా నీ క్రిస్టో శాతం 1.9%, తరువాత ప్రొటెస్టెంట్లశాతం 1.8%, బౌద్ధుల శాతం 1.1% ఉన్నారు. ఇతర అతస్తులంతా కలిసి 1.4% ఉన్నారు. రోమన్ మనీలా దేశంలోని పురాతన ఆర్డియోసెస్ స్థానాలలో " రోమన్ కాథలిక్ ఆర్డియోసెస్ ఆఫ్ మనిలా " ఒకటి. అలాగే ఇమ్మాక్యులేట్ కాంసెప్శ్హన్‌లో ఉన్న మినార్ బాసిలికా వద్ద కార్యాకయాలున్న " ప్రైమేట్ ఆఫ్ ఫిలిప్పైన్ " స్థానాలలో కూడా ఒకటి. 3 బాసిలికాలకు, మనీలా కాథడ్రెల్ మనీలా పుట్టినిల్లు. అవి వరుసగా ది మీనార్ బాసిలికా ఆఫ్ ది బ్లాక్ నజారెనే, మినార్ బాసిలికా ఆఫ్ సెయింట్ లోరెంజో రూయిజ్, ది బాదిలికా మినోర్ డీ శాన్ సబస్టీన్. గతకొన్ని శతాబ్దాలుగా స్పెయిన్ వలసరాజ్య ప్రభుత్వ స్థానంగా మనీలాలో ఫిలిప్పైనుకు చెందిన రోమన్ కాథలిక్కు మిషనరీలు ఉన్నాయి.

నగరంలో ఉన్న ఇతర గుర్తించతగిన చర్చీలలో ఇంట్రూమర్స్ వద్ద ఉన్న శాన్ అగస్టిన్ చర్చ్, యునెస్కో వారసత్వ సంపదలలో ఒకటైన ది ష్రైన్ ఆఫ్ ది క్రౌండ్ ఇమేజ్ ఆఫ్ న్యూస్ట్రా సెనోరా డీ కంసొలృషన్ వై కొరియా, ప్రజలలో పలువురికి అభిమాన వివాహవేదిక, పూర్తిగా ఎయిర్ కండీషన్ చేయబడిన రెండు చర్చీలలో ఒకటైన " ది బినాబ్డో చర్చ్" ( ఇది మినార్ బాసిలికా ఆఫ్ సెయింట్ లోరెంజో రూయిజ్ అని కూడా పిలువబడుతుంది ) మొదలైనవి. మాలేట్ చర్చ్, ది ష్రైన్ అఫ్ న్యూస్ట్రా సెనోరా డీ రెమిడియోస్, ఫిలిప్పైన్ లోని మారియన్ పురాతన దంత శిల్పం కలిగి ఉన్న ఎర్మిటా చర్చ్, న్యూసెట్రా సెనోరా డీ గుయా, ఒక శతాబ్ధపు పురాతనమైన స్టో.నినో దంతశిల్పం ఉన్న టోండో చర్చ్ (చైల్డ్ జీసస్), న్యూస్ట్రా సెనోరా డీ లాస్ డెసాంపరేడస్ కిరీటం ధరించి ఉన్న చారిత్రామక చిత్రం ఉన్న స్టా.అనా చర్చ్ ఉన్నాయి. ఎవాన్‌జెలికల్ క్రైస్తవులతో మనీలా ప్రొటెస్టెంలకు కూడా జన్మస్థానమే.సెయింట్ స్టిఫెన్ యొక్క ది-ప్రొ కాథడ్రల్, మద్య ఫిలిప్పైన్ వద్ద ఉన్న ఎపిస్కోపల్ డియోసెస్ కాఏంద్రం ఉన్న ఎపిస్కోపల్ చర్చ్ మొదలైనవి మనీలా నగరంలో స్థాపించబడ్డాయి. ప్రధానంగా ఫిలిప్పినో రివల్యూషనరీ చర్చ్ లెగేషియా ఇండిపెండెంట్ చర్చ్ (దీనిని ఫిలిప్పినో ఇండిపెండెంట్ చర్చ్ లేక అగ్లిపాయన్ చర్చ్ అని కూడా అంటారు) ప్రధాన కార్యాలయం కూడా మనీలాలో ఉంది. అంతేకాక కాథడ్రల్ ఆఫ్ పారిస్ ప్రధాన కార్యాలయం కూడా మనీలాలో ఉంది.

మనీలా ఇతర మతస్థులకు కూడా ఆతిథ్యం ఇస్తుంది. మనీలాలో ఉన్న చైనీయులు బౌద్ధ, తాయ్ ఆలయాలు నిర్మించారు. గణనీయమైన సంఖ్యలో ముస్లిం ప్రజలు నివసిస్తున్న క్యుయాజోలో అల్-దాహబ్ మసీదు నిర్మించబడి ఉంది. అంతేకాక మనీలాలో భారతీయ ప్రజల కొరకు బృహత్తరమైన హిందూ దేవాలయాలు, సిక్కుల దేవాలయాలు కూడా నిర్మించబడి ఉన్నాయి. ఇంట్రూమర్స్‌తో చేర్చి ఎర్మిటా, మాలేట్ ప్రాంతాలు మనీలా నైట్ లైఫ్ కేంద్రాలుగా ఉన్నాయి. బినాండో ప్రాంతంలో ఉన్న చైనాటౌన్ కూడా అనేక మంది ప్రజలను ఆకర్షిస్తూ ఉంది. ఇతర గుర్తించతగిన ప్రాంతాలలో నౌకాకేంద్రాలైన క్యుయాపో, డివిసోరాలలో వస్తువులను బేరసారాలు సాగిస్తూ కొనుగోలు చేయవచ్చు. ఎర్మిటా, మాలేట్ ప్రాంతాలు ప్రబలమైన పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి. ఇక్కడ విస్తారంగా హోటెళ్ళు, రెస్టారెంట్లు, క్లబ్బులు, బార్లు, కేఫులు, కళలు, పురాతన వస్తువిక్రయశాలలు ఉన్నాయి. నైట్ లైఫ్ కేంద్రాలలో సాంస్కృతిక ప్రదర్శనలు, డిస్కోలు, కాసినోలు, వినోదాత్మక కేంద్రాకు, అత్యాధునిక కేఫులు ఉన్నాయి.

సవత్సర సాంస్కృతిక ఉత్సవాలు[మార్చు]

మనీలా నగరంలో పౌర సబంధిత, దేశీయ శలవుదినాలు మంజూరు చేయబడతాయి. మనీలా నగర స్థాపన దినమైన " మనీలా డే "ను అప్పటి వైశ్రాయి అయిన హెర్మినియో ఎ. అస్టోర్గా 1962 జూన్ 24న ప్రకటించి ప్రతిసంవత్సరం వేడుకగా జరుపుకునేలా చేసాడు. నగరంలోని ప్రతి డిస్ట్రిక్‌లోని ప్రజలు వారి ప్రత్యేక ఉత్సవాలను జరుపుకుంటారు. మనీలా జనవరి 9న " ఫీస్ట్ ఆఫ్ ది బ్లాక్ నజరెనే "కు ఆతిథ్యం ఇస్తుంది. ఈ ఉత్సవాలకు మిలియన్ల కొలది కాథలిక్కులు విచ్చేస్తుంటారు.

మ్యూజియంలు[మార్చు]

ఫిలిప్పైన్ సాంస్కృతిక కేంద్రం అయిన మనీలాలో అనేక వస్తుసంగ్రహణాలయాలు ఉన్నాయి. మనీలాలోని ప్రముఖ వస్తుసంగ్రహణాలయాలలో ఒకటైన బహాయ్ సినాయ్‌లో చైనీయుల జీవితసంబధిత వ్రాతపతులు , ఫిలిప్పైన్ చారిత్రక సంఘటనల సంబంధిత వస్తువులు బధ్రపరచబడిఉన్నాయి. ది ఇంట్రూమర్స్ లైట్ అండ్ సౌండ్ మ్యూజియం చారిత్రాత్మక రిజాల్ , ఇతర ఉద్యమనాయకుల ఆధ్వర్యంలో ఫిలిప్పైన్లు సాగించిన స్వాతంత్ర్యసమర సంబంధిత విషయాలు ప్రదర్శించబడతాయి. ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ మనీలా ఫిలిప్పైన్ కళలు, సంస్కృతి , చరిత్ర సంబంధిత వస్తువులను బధ్రపరచబడి ఉన్నాయి. మనీలాలో పిల్లల కొరకు ఏర్పాటు చేసిన ది మ్యూజియం పంబటా, దేశంలో జరిగిన గుర్తించతగిన రాజకీయ పరిణామాలను ప్రదర్శించే " ది మ్యూజియం ఆఫ్ ఫిలిప్పైన్ పొలిటికల్ హిస్టరీ ", ఫిలిప్పైన్ ప్రజల జీవితం, సంస్కృతి , దేశీయ చరిత్రను ప్రదర్శించే " ది నేషనల్ మ్యూజియం ఆఫ్ ఫిలిప్పైన్ " ( ఇందులో " మ్యూజియం ఆఫ్ ఫిలిప్పినో పీపుల్స్ " కూడా ఉంది), నిర్లక్ష్యం చేయబడిన " ది పారిష్ ఆఫ్ అవర్ లేడీ " , మతసంబంధిత వస్తువులను ప్రదర్శిస్తున్న శాన్ అగస్టన్ చర్చ్ మ్యూజియం, ప్రభుత్వ మ్యూజియం అయిన ప్లాజా శాన్ లూయిస్, కళలు , సైన్సు సంబంధిత యు.ఎస్.టి మ్యూజియం , సమకాలీన కళలు , డిజైన్ సంబంధిత వస్తువులను ప్రదర్శించబడుతున్న డి.ఎల్.ఎస్ -సి.ఎస్.బి మ్యూజియాలు ఉన్నాయి

ఇతర ఆసక్తులు[మార్చు]

షాపింగ్ మాల్స్[మార్చు]

మనీలాలో ఉన్న షాపింగ్ సెంటర్లు దేశంలోనే ప్రాబల్యం సంతరించుకున్నాయి. మనిలాలో ఉన్న షాపింగ్ సెంటర్లు ఆసియాలో ప్రఖ్యాత షాపింగ్ గమ్యంగా విలసిల్లుతున్నాయి. మనిలా నగరమంతా విస్తరించి ఉన్న ప్రంతీయ , సంప్రదాయ షాపింగ్ సెంటర్లతో కలిసి ప్రబలమైన షాపింగ్ మాల్స్ కూడా అగరమంతటా ఉన్నాయి. నగరంలోని అతిపెద్ద షాపింగ్ సెంటర్‌గా రాబింసన్ ప్లేస్ మాల్ గుర్తింపు పొందింది. ఇది మనీలా హృదయస్థానంలో ఉపస్థితమై ఉంది. ఈ మాల్‌లో విస్తారమైన ప్రాంతీయ , అంతర్జాతీయ వస్తువులు రిటైల్‌గా లభిస్తాయి. భోజనసామాగ్రి, వినోదత్మక సౌకర్యాలు , సర్వీస్ సెంటర్లు, రాబింసన్ సూపర్ మార్కెట్, రాబింసన్ డిపార్ట్‌మెంట్ స్టోర్స్, రాబింసన్ సినిమా వంటి ఏంకర్ షాపులు ఉన్నాయి. ఇతర షాపింగ్ మాల్స్‌లో నగరంలో మొదటి సారిగా ఎస్.ఎం సూపర్‌మార్కెట్ ప్రారంభించిన " ఎస్.ఎం. సిటీ మనీలా " ఒకటి ఇందులో ప్రధానంగా ఎస్.ఎం. బ్రాండు వస్తువులను విక్రయించే ఎస్.ఎం డిపార్ట్మెంటల్ స్టోర్, ఎస్.ఎం సూపర్ మార్కెట్, ఎస్.ఎం సినిమాలు , ఫుడ్‌కోర్ట్ ఉన్నాయి. ఇది మనీలా సిటీ హాకుకు కుడివైపు ఉంది. 2008లో ఈ మాల్‌కు అదనపు హంగులను సమకూర్చారు. మనీలాలో రెండవస్థానంలో ఉన్న సూపర్ మార్కెట్ ఎస్.ఎం సిటీ శాన్ లాజారో సూపర్ మార్కెట్ ఒకటి.ఇది శాంటా క్రజ్ డిస్ట్రిక్‌లో ఉంది. ఈ మాల్ గతంలో శాన్ హిప్పోడ్రోం రేస్ కోర్ట్ ఉన్న ప్రదేశంలో నిర్మించబడింది.

డివిసోరియా, బినాండో , క్యుయాపోలలో సంప్రదాయక షాపులలో ప్రాంతీయ వాదులకు , కొత్తదనంకోరేవారికి ఆసక్తికామైన షాపింగ్ వినోదాన్ని ఇస్తాయి. ఇక్కడ బేరసారాలతో వస్తువులను చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ఫిలిప్పైన్ ఆహారాలు, కళాఖండాలు , ఇతర సున్నితమైన అలంకరణ సామాగ్రి లభిస్తుంది. క్యుయాపోను " ఓల్డ్ డౌన్‌టౌన్ "గా పేర్కొంటారు. ఇక్కడ కూడా వస్తువులు చౌకగా లభిస్తాయి. బినాండో ప్రపంచంలో పురాతన చైనాటౌన్‌గా భావించబడుతుంది. ఇక్కడ అన్ని విధాలైన చైనా -ఫిలిప్పైన్ వర్తకులు విక్రయించే అనేక వస్తువులు లభిస్తాయి కనుక ఇది ప్రధాన వ్యాపారకూడలిగా భావించబడుతుంది. ఇక్కడ చైనీయుల రెస్టారెంట్లు, చైనా స్టోర్స్ ఉంటాయి. మనీలాలో ఉన్న పలు ప్లాజాలు విజిటర్ల సౌకర్యార్ధం ఫ్లియా మార్కెట్లు ఉంటాయి.

పార్కులు , రిక్రియేషన్లు[మార్చు]

మనీలా సాంస్కృతిక, బిజినెస్ డిస్ట్రిక్ రిజాల్ పార్క్ ఉంది. ఈ పార్క్ దేశం యొక్క జాతీయనాయకుడైన జోస్ రిజాల్ గౌరవార్ధం రిజాలుకు అంకితమిస్తూ నిర్మించబడింది. రిజాల్ ఉరితీయబడిన ప్రదేశంలో స్పెయిన్ వారిచే ఈ పార్క్ మనీలా పలు ప్లాజాలకు కూడా పుట్టినిల్లుగా ఉంది. ప్లాజా బలాటస్, ప్లాజా మిరండా మీద 1971 రాజకీయ సంబంధంగా బాంబులు వేయబడ్డాయి. గుర్తించతగిన పార్కులలో కల్చరల్ సెంటర్ ఆఫ్ ది ఫిలిప్పైంస్, ది రాజా దులేమాన్ పార్క్, మనీలా బోర్డ్‌వాక్, లివసంగ్ బొనిఫేషిషియో, మేహన్ గార్డెన్, పాకో పార్క్, రెమెడియోస్ సర్కిల్, ది మనీలా జూలాజికల్, బొటానికల్ గార్డేన్, పాండన్ లైనియన్ పార్క్, మలాకానాగ్ గార్డెన్ వంటి పార్కులు ప్రధానమైనవి. మనీలాలో ఉన్న మరుభూములలో చైనీస్ శ్మశానం, లా లోమా శ్మశానం, ది మనీలా సౌత్ గ్రీన్ పార్క్, ది మనీలా నార్త్ గ్రీన్ పార్క్ మొదలైనవి గుర్తించతగినవి. మిగిలిన పలు చారిత్రాత్మక వ్యక్తులకు సంబంధించిన పలు చారిత్రాత్మక సమాధుకు మనీలా మహానగరంలో అతి పెద్ద శ్మశానభూమిగా ఉంది. మనీలా దక్షిణ, ఉత్తర గ్రీన్ పార్కులు నగరప్రభుత్వానికి స్వంతమైన శ్మశానభూమిగా ఉంది.

ప్రభుత్వ, ప్రైవేట్ రిక్రియేషనల్ ప్రాంతాలు నగరమంతటా కనిపిస్తున్నాయి. అలాగే నగరంలో పలు ప్లేగ్రౌండ్స్ కూడా నిర్మించబడి ఉన్నాయి. వీటిలో అత్యధికమైనవి వాణిజ్యకేంద్రాలుగా మార్చబడ్డాయి. నగరంలో పలు ఆలయ సంబంధిత ప్లస్జాలు కూడా ఉన్నాయి. అలాగే పలు చారిత్రాత్మక స్మారకచిహ్నాలు ఉన్నాయి. ప్లాజాలలో పలు షానెస్ స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆహుతులకు ప్లాజాలు, పార్కుల వంటి ప్రదేశాలు, పచ్చదనం అనగా లేని ఇటుకలతో నిర్మించబడిన మార్గాలు ఉన్నాయి. నగరంలోని ప్లాజాలు వ్యాపార కూడళ్ళు, ఆలయాలు, పారిశ్రామిక ప్రదేశాలలో ఉన్న పార్కులలో షియాంగ్ కంటే పచ్చదనం అధికంగా ఉంటుంది.

విద్య[మార్చు]

మనీలాలో కాలనీ కాలం నుండి ప్రధానంగా ఇంట్రూమరస్ ఫిలిప్పైన్ దేశానికి విద్యాకేంద్రంగా ఉంది. ఇక్కడ పురాతనమైన పలు విశ్వవిద్యాలయాలు, కాలేజులు ఉన్నాయి. వీటిలో యూనివర్శిటీ ఆఫ్ శాంటో తోమస ( 1611), కాఏజ్ డీ జాన్ డీ లాటరన్ (1962), ఆటెనియో డీ మనీలా యూనివర్శిటీ ( 1859) ప్రధానమైనవి. ఇంట్రూమరస్‌లో కోలేజియో డీ శాన్ జుయాన్ డీ లెట్రన్ (1620) మాత్రమే ఉంది. యూనివర్శిటీ ఆఫ్ ది శాంటో తోమస్ 1927లో శాంపలాక్ వద్దకు మార్చబడింది. అయినప్పటికీ ఆటెనియో (ఇది ఇప్పటికీ " డీ మనీలా "గా ఉన్నది) మాత్రం 1927 నుండి క్యూజాన్ సిటీలోని ఇట్రూమస్ వద్ద ఉన్న లయోలా హైట్స్ వద్ద ఉంది.

ఇంట్రూమరస్‌ వద్ద ది యూనివర్శిటీ ఆఫ్ ది సిటీ ఆఫ్ మనీలా ఉంది మరుయు యూనివర్శిటీ డీ మనీలా లొకేటెడ్ వాలెడ్ సిటీకి కొంచం వెలుపల ఉంది. మనీలా ప్రభుత్వానికి స్వంతమైన ఇవి రెండు మనీలా నిర్వహణలో పనిచేస్తున్నాయి. ఫిలిప్పైన్ లోని పురాతనమైన విశ్వవిద్యాలయం , హెల్త్ సైంసెస్ ఎడ్యుకేషన్ కేంద్రమైన " యూనివర్శిటీ ఆఫ్ ది ఫిలిప్పైంస్ మనీలా " జాతీయ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. విద్యార్థుల సంఖ్యలో దేశంలో అతిపెద్ద పాలిటెక్నిక్ యునివర్శిటీ ఆఫ్ ది ఫిలిప్పైంస్ మనీలా నగరంలోనే ఉంది.

శాన్ మైక్వెల్, క్యుయాపో, శాంప్లాక్ డిస్ట్రిక్‌ల కూడలిలో కాలేజీల సమూహం ఉంది. ఎస్పెనా బౌల్వర్డ్ పడమట, నికేనర్ రియాస్ ఎస్.టి ( సాధారణంగా దీనిని మొరేటా ఎస్.టి అంటారు ) క్లారో ఎం.రెక్టో అవెన్యూ తూర్పున ( సాధారణంగా దీనిని అజ్కరగ అంటారు), లెగార్డా అవెన్యూ, మెడియోలా స్ట్రీట్,, వివిధ వీధులలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి కాలేజ్, యూనివర్శిటీ ఒకదానికి ఒకటి నడిచిపోయే దూరంలోనే ఉంటాయి. మిగిలిన కాలేజీలు పాసిగ్ నదికి దక్షిణతీరాన అధికంగా ఇంట్రూమరస్, ఎర్మిటా డిస్ట్రిక్కులలో ఉన్నాయి. స్వల్పమైన మిగిలిన కాలేజీలు మలాటే దక్షిణంలో పాసే సరిహద్దులో ఉన్నాయి. ఉన్నత విద్యాలయాలు అధికంగా ఉన్న మనీలా దేశానికి విద్యాకేంద్రంగా విలసిల్లుతుంది.

ది సిటీస్ త్రీటైర్ సిస్టం అనే విద్యావ్యవస్థలో నగరంలోని పాఠశాలా విభాగంళొ భాగంగా సిటీ సూల్స్ ఆఫ్ మనీలా పనిచేస్తుంది. ఈ సంస్థ 71 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలాను, 32 ఉన్నత పాఠశాలలను అలాగే రెండు నగరానికి స్వంతమైన విశ్వవిద్యాలయాలను నిర్వహిస్తుంది. నగరంలో అదనంగా మనీలా సైన్సు ఉన్నత పాఠశాల, ది పైలట్ సైన్సు ఉన్నత పాఠశాల ఆఫ్ ది ఫిలిప్పైంస్, స్పోలేరియం జ్యూయాన్ ల్యూనా ఉన్న ది నేషనల్ మ్యూజియం, మోడ్రెన్ ఆర్ట్స్, సమకాలీన విషయుయల్ ఆర్ట్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే ది ప్రీమియర్ మ్యూజియం, డిస్కవరీ సంబంధిత ది మ్యూసియో పంబాటా, ది చిల్డ్రన్ మ్యూజియం, దేశం సాంస్కృతిక వారసత్వం, ఇతర సాహిత్య సమాచార సబంధిత అచ్చుప్రతులు, రికార్డులు బధ్రపరచబడిన నేషనల్ లైబ్రరీ మొదలైనవి ఉన్నాయి.

మౌలిక వసతులు[మార్చు]

మనీలాలో ఉన్న ప్రయాణసౌకర్యాల విధానాలలో జీప్నీ ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికన్ సైనిక జీపులను యుద్ధం నిలిపివేయబడిన వెంటనే రవాణాకు అనుకూలంగా తీర్చిదిద్దబడ్డాయి. ప్రస్తుతం టయోటా కిజాంగ్ మూడవతరం వాహనాలైన టమరా ఎఫ్.ఎక్స్ వాహనాలు జీప్నీ వాహనాలకు పీటీగా నిలిచాయి. బసులతో జీప్నీలు, టామరోలు నిర్ధారిత మార్గాలలో నిర్ధారిత రుసుముతో నిర్వహించబడుతున్నాయి.

మనీలాలో బాడుగ ఆధారితంగా పలు టాక్సీలు ప్రజలకు ప్రయాణవసతులు కలిగిస్తున్నాయి. ట్రైసైకిల్స్ ( సిడ్ కార్లున్న మోటార్ సైకిళ్ళు, ఫిలిప్పైన్ తరహా ఆటోరిక్షాలు), ట్రిస్కాడ్స్ లేక సికాడ్స్ ( సైడు కారున్న బైసైకిల్, ఫిలిప్పైన్ తరహా పెడికాబ్స్) కూడా ప్రయాణ వసతి కల్పిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా డివిసోరియా డిస్ట్రిక్కులో మోటరైజ్డ్ పెడికాబ్స్ చాలా ప్రజాదరణ కలిగి ఉన్నాయి. స్పెయిన్ -కాలంనాటి-గుర్రాలతో నడుపబడే కలేసాస్ బినాండో, ఇంట్రూమరస్ వీధులలో ఇప్పటికీ నగరానికి విచ్చేసే పర్యాటకులకు ఆకర్షణగా ఉన్నాయి. నగరంలోని ప్రభుత్వవాహనాలు అన్నీ ప్రైవేట్ యాజమాన్యానికి చెందినవైనా ప్రభుత్వం ఫ్రాంచిస్‌గా నడుపబడుతున్నాయి.

మనీలాలో " ది మనీలా లైట్ రైల్ ట్రాంసిస్ట్ సిస్టం " ( సాధారణంగా వీటిని ఎల్.ఆర్.టి అంటారు) ప్రయాణ వసతులు కల్పిస్తుంది. మనీలా మహానగరంలోని ఇతర ప్రాంతాలలో " మనీలా మెట్రో రైల్ ట్రాంసిస్ట్ సిస్టం" (ఎం.ఆర్.ట్) ప్రజలకు ప్రయాణ వసతి కలిగిస్తుంది. మార్కో పాలనలో 1970 నుండి మనీలాలో రైల్వే విధానం అమలులోకి తీసుకురాబడింది. దక్షిణాసియాలో లైట్ రైల్ ట్రాంసిస్ట్ మొదటిసారిగా మనీలాలో ఆరంభించబడింది. ఎల్.ఆర్.టి, ఎం.ఆర్.టి అనేక బిలియన్ల ఖర్చుతో నిర్వహించబడుతుంది. నగరంలో ప్రయాణ వసతులు అందిస్తున్న రెండు రైలు సర్వీసులలో ఎల్.ఆర్.టి-1 (ఎల్లో లైన్) లో టాఫ్ట్ అనెన్యూలో (ఆర్-2, రిజాల్ అవెన్యూలో (ఆర్-9), ది ఎం.ఆర్.టి-2 లైన్‌ ( పర్పుల్ లైన్) లో రామన్ మెగసేసే బౌల్వర్డ్ నుండి శాంటా క్రజ్ వరకు క్యూజాన్ సిటీ మీదుగా (ఆర్-6), పాసిగ్‌లో శాన్‌టలోన్ వరకు నడుపబడుతున్నాయి.

ఫిలిప్పైన్ రైల్వ ప్రధాన గమ్యం (టెర్మినల్) మనీలా నగరం నుండి ఆరంభం ఔతుంది. రైల్వే మార్గాలు మనిలా నగర ఉత్తరభాగంలో ఉన్న పంపాంగా లోని శాన్ ఫెర్నాండో నుండి మనీలా దక్షిణ ప్రాంతంలోని ఆల్బే లోని లెగాజ్పీ వరకు పొడిగించబడ్డాయి. ఫిలిప్పైన్ ప్రధాన నౌకాశ్రయమైన మనీలా హార్బరు మనీలాబే సమీపంలో ఉంది. అలాగే ఇది డేశానికి సింహద్వారంగా ఉండడమేకాక అనతర్జాతీయంగా ప్రధాన్యత కలిగి ఉంది. నగరంలో పాసిగ్ నది ఫెర్రీలు కూడా ప్రజలకు ప్రయాణ వసతులు కలిగిస్తుంది. నగరంలో ఉన్న " నినాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ " ప్రజలకు వాయుమార్గంలో ప్రయాణ వసతులు కలిగిస్తుంది. 2006లో ఫోర్బ్స్ మాగజిన్ మానీలాను " ది వరల్డ్స్ మోస్ట్ కంజెస్టెడ్ సిటీ "గా వర్ణించింది. మనీలాలోని వాహనరద్దీ , జనసాంద్రత ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంది.

ఆరోగ్యసంరక్షణ[మార్చు]

" వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ " వెస్ట్రన్ పసిఫిక్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం, ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫిలిప్పైన్ దేశీయ కార్యాలయం, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యాలయం , పలు ప్రైవేట్ , ప్రభుత్వ హాస్పిటల్స్ , మెడికల్ కేంద్రాలు మనీలాలోనే ఉంది. పర్యాటకశాఖకు చెందిన పలు కార్యక్రమాలలో ఒకటైన ఫిలిప్పైన్ మెడికల్ పర్యాటకం కూడా మనీలాలో ఉంది. మనీలాలో పలు వెల్నెస్ సెంటర్లు , స్పా ఫెసిలిటీలు ఉన్నాయి. మనీలానగర ప్రభుత్వ ఆరోగ్యసంరక్షణా పధకాలను ప్రణాళిక , అమలుచేసే బాధ్యతను " ది మనీలా హెల్త్ డిపార్ట్మెంట్ " వహిస్తుంది. ఇది నగరంలో 44 ఆరోగ్యసంరక్షణా కేంద్రాలను నిర్వహిస్తుంది. మనీలాలో హాస్పిటల్సును డాక్టర్స్ హాస్ఫిటల్, యూనివర్శిటీ ఆఫ్ ది ఫిలిప్పైంస్, ఫీప్పైన్ జనరల్ హాస్పిటల్, చైనీస్ జనరల్ హాస్పిటల్, మెడికల్ సెంటర్, డాక్టర్. జోస్. ఆర్. రేస్ మెమోరియల్ మెడికల్ సెంటర్, అవర్ లేడీ ఆఫ్ లౌర్డెస్ హాస్పిటల్, శాన్ లాజారో హాస్పిటల్, ది యూనివర్శిటీ ఆఫ్ శాంటో తోమస్ హాస్పిటల్, నగరానికి స్వంతమైన ఎన్.జి ఎడికల్ సెంటర్ ఉన్నాయి.

వెలుపలి లింకులు[మార్చు]

en:మనీలా

మూలాలు[మార్చు]

  1. "'PEARL OF ORIENT' STRIPPED OF FOOD; Manila, Before Pearl Harbor, Had Been Prosperous—Its Harbor One of Best Focus for Two Attacks Osmeña Succeeded Quezon". New York Times. 1945-02-05. Retrieved 2018-06-10. Manila, modernized and elevated to the status of a metropolis by American engineering skill, was before Pearl Harbor a city of 623,000 population, contained in an area of fourteen square miles.
  2. "Cities". Quezon City, Philippines: Department of the Interior and Local Government. Archived from the original on 9 మార్చి 2013. Retrieved 30 November 2012.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; 2010 census అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
"https://te.wikipedia.org/w/index.php?title=మనీలా&oldid=3866136" నుండి వెలికితీశారు