వెంకటగిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వెంకటగిరి
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో వెంకటగిరి మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో వెంకటగిరి మండలం యొక్క స్థానము
వెంకటగిరి is located in ఆంధ్ర ప్రదేశ్
వెంకటగిరి
వెంకటగిరి
ఆంధ్రప్రదేశ్ పటములో వెంకటగిరి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°58′00″N 79°35′00″E / 13.9667°N 79.5833°E / 13.9667; 79.5833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము వెంకటగిరి
గ్రామాలు 58
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 75,236
 - పురుషులు 38,319
 - స్త్రీలు 36,917
అక్షరాస్యత (2001)
 - మొత్తం 62.48%
 - పురుషులు 72.91%
 - స్త్రీలు 51.71%
పిన్ కోడ్ {{{pincode}}}

వెంకటగిరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక చారిత్రక పట్టణము మరియు అదే పేరుగల మండలము. పిన్ కోడ్ నం. 524132. వెంకటగిరి పట్టుచీర లకు చాలా ప్రసిద్ధి చెందినది. జనాభా లెక్కల ప్రకారం 2001 నాటికి 48,341 మంది వున్నట్లు సమాచారం. వెంకటగిరి ఆక్ష్యరాస్యత 67%. ఇది దేశ అక్షరాస్యత కంటే 8% ఎక్కువ. వెంకటగిరి భౌగోళికాంశాలు, అక్షాంశ రేఖాంశాలు 13.9667° N 79.5833° E[1]. ఈ పట్టణమునకు దగ్గరలో రేణిగుంట వద్ద తిరుపతికి అంతర్జాతీయ విమానశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.అంతేకాక ఇక్కడ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.

వెంకటగిరి పట్టణము నేత చీరలకు మరియు పోలేరమ్మ జాతరకు చాలా ప్రసిద్ధి. ఈ ముఖ్య పట్టణము లోని ప్రజలు ప్రతి సంవత్సరం పోలేరమ్మ జాతర చాలా భక్తి శ్రద్ధలతో వైభావంగా జరుపుకుందురు. ఈ జాతర ప్రతి సంవత్సరం వినాయక చవితి తరువాతి 3వ బుధవారం మరియు గురువారం న జరుపుకుంటారు.

చరిత్ర[మార్చు]

వెంకటగిరి చరిత్ర కలిగిన ముఖ్య పట్టణము. మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని 1600లో స్థాపించెను. కుటుంబ రికార్డుల ప్రకారం, చెవిరెడ్డి అనే జమీందారు, తన పొలం దున్నుతుండగా 9లక్షల ఖజానా దొరికింది. ఈ ధనంతో, వరంగల్ రాజు యొద్దకు మార్గము సుగమమం చేసుకుని అతనిని ప్రసన్నం చేసుకొని వెంకటగిరి కోట అధికారాన్ని పొందగలిగాడు. ఇతని వారసులు వెంకటగిరి జమీందారులుగా వెలుగొందుతూ వచ్చారు. 1802 లో లార్డ్ క్లైవు కాలంలో 'సనద్' ను పొందారు. తమ వంశం జమీందార్లు 'రాజా' అనే బిరుదును వాడుతూ వచ్చారు.

వెంకటగిరి జమీందారుల పూర్వీకుడైన యాచమనాయుడు 1614లో రెండవ తిరుమల దేవరాయల తర్వాతి విజయనగర సామ్రాజ్య వారసత్వంపై జరిగిన పోరాటంలో తిరుమల దేవరాయలు వారసునిగా నిర్ణయించిన శ్రీరంగరాయలకు అనుకూలంగా పోరాడారు. వారసత్వపు తగాదాల్లో జగ్గరాయుడు అనే రాచబంధువు శ్రీరంగరాయల కుటుంబాన్ని అంతా చంపేసినా, రంగరాయల కుమారుడు కుమారుడైన రామదేవరాయలను సింహాసనంపై నిలిపారు.[2]

వెంకటగిరి రాజ వంశం

మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని 1600లో స్థాపించెను. అతని వారసులు :

 • వెలుగోటి నిర్వాణ రాయప్ప (పెద్ద రాయుడు), 15వ రాజు (వెంకటగిరి), చికాకోల్ నవాబు షేర్ ముహమ్మద్ ఖాన్ 1652 లో రాజాం ఎస్టేటును వెలుగోటి నిర్వాణ రాయప్పకు బహూకరించి, చికాకోల్ కు ఇతని గౌరవార్థం 'బెబ్బులి' గా పేరు మార్చాడు. (తరువాత బొబ్బిలిగా రూపాంతరం చెందింది) 'రాజా' మరియు 'బహాదుర్' బిరుదులను ప్రదానం చేశాడు.
 • వెలుగోటి కుమార యాచమ నాయుడు (1777/1804) (జననం 1762 ఫిబ్రవరి 23) (మరణం 1804 మార్చి 18)
 • వెలుగోటి బంగారు యాచమ నాయుడు (1804/1847) (మరణం 1847 డిసెంబరు 25)
 • వెలుగోటి కుమార యాచమ నాయుడు (1848/1878) (జననం 1832 జనవరి 3, మరణం 1892.)
 • రాజగోపాల కృష్ణ యాచేంద్ర (qv)
 • రామకృష్ణ యాచేంద్ర, తరువాత శ్రీ రాజా రావు వెంకట సూర్య మహీపతి రామకృష్ణారావు బహదూర్ గా పేరుగాంచాడు. (పిఠాపురం 'రాజా' చే దత్తత తీసుకోబడ్డాడు).
 • రంగమన్నార్‌ కృష్ణ యాచేంద్ర, తరువాత మహారాజా వెంకట శ్వేతా చలపతి రంగా రావు గా పేరు గడించాడు, (బొబ్బిలి 'రాణి' చే దత్తత తీసుకోబడ్డాడు).
 • రాజా వేణుగోపాల్ బహదూర్, (జననం 12 ఫిబ్రవరి 1873) (జెట్టిప్రోలు కుటుంబంచే దత్తత తీసుకోబడ్డాడు).
 • రాజగోపాల కృష్ణ యాచేంద్ర (1878, జననం 1857)
  • ఇతర సభ్యులు :
 • వెలుగోటి గోవింద కృష్ణ యాచేంద్ర (1922)

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ నామ వివరణ[మార్చు]

వెంకటగిరి అనే గ్రామనామం వెంకట అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. వెంకట అనేది దైవ సూచి, శ్రీనివాసుని మరో పేరు వెంకట.[3]

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

వెంకటగిరి జాతర[మార్చు]

1920లో జస్టిస్ పార్టీ

కలిమిలి నామదేయంతో రాజ్యపాలన చేస్తున్న చంద్రగిరి రాజైన వెంకటపతి రాజు మామ గొబ్బూరి జగ్గరాజును కర్నూలు జిల్లా వెలుగోడు పాలకులు, శ్రీకృష్ణ దేవరాయ ప్రతినిధి అయిన వెలుగోటి వెంకటాద్రి నాయుడు గొబ్బూరి జగ్గరాజును దాడిచేసి కలిమిలి నుంచి వెళ్లగొట్టారు. తరువాత ఈచోటనే వైష్ణవ నామధేయమైన వెంకటగిరి పేరుతో కిశకం 1600 పూర్వం రాజ్య నిర్మాణం జరిగింది. వెంకటగిరి సంస్ధాధీశులు, కాకతీయుల లాగా పోలేరమ్మను ఇలవేల్పుగా భావించలేరు. అందువల్ల వెంకటగిరి సంస్ధానాధీశులు ఏ రీతుగా పోలేరమ్మకు జాతర చేస్తున్నారో తెలుసుకోవడం సందర్భోచితం.

వెంకటగిరి సంస్ధానం మాలవాడైన రేచడు బలిదానంతో కీశకం 1170 - 1210 ప్రాంతంలో తెలంగాణాలోని నల్గొండ జిల్లా ఆమనగల్లులో తొలి రాజ్యస్ధాపన జరిగింది. వెంకటగిరి సంస్ధానాదీశుల మూల పురుషుడు చెవిరెడ్డి. ఇతని పేరుతోనే వెంకటగిరిలో చెవిరెడ్డిపల్లి గ్రామం ఉంది. ఇతడు బేతాళుని అంశంతో ధన, ధాన్యరాశులు పొందటానికి సేద్యగాడైన రేచడు బలికావడం జరిగింది. తన బలికావడానికి ముందు చెవిరెడ్డి కొన్ని కోరికలు కోరడం జరిగింది. వాటిలో భాగమే తన పేరుతో వెంకటగిరి సంస్ధానాదీశులు గోత్రం ఏర్పాటుచేయడం, సంస్ధానాదీశుల వారసుల వివాహాల సందర్భంగా రేచడి జాతి వారికి వివాహం జరిపించి వారి అక్షింతలు చల్లుకోవడంతోపాటు తన ఇలవేల్పు, ఇష్ట దైవమైన పోలేరమ్మకు జాతర జరిపించేటట్లుగా వరం కోరినట్లుగా తెలుస్తున్నది. అందువల్లనే వెంకటగిరి సంస్ధానాదీశులు కీశకం 1601 ప్రాంతంలో నేటి బాలాయపల్లి మండలంలోని మన్నూరు గ్రామానికి యాచసముద్రం అనే పేరు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే జాతర ఇక్కడ చేస్తున్నారు. వెంకటగిరి సంస్ధానాదీశులలో 33తరాల వారు పోలేరమ్మ జాతరను జరిపించడం విశేషం. 1992 నుండి పోలేరమ్మ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి రాబడి, వారి ఆధ్వర్యంలో జాతర జరుగుతున్నది. పోలేరమ్మ జాతరపై తొలి పుస్తకం: వెంకటగిరి పోలేరమ్మ జాతర చరిత్రపై ప్రప్రథమంగా ‘‘ గ్రామశక్తి పోలేరమ్మ జాతర చరిత్ర ’’ పేరుతో ప్రముఖ న్యాయవాధి, పరిశోధకులు పెనుబాకు వేణు 2003వ సంవత్సరంలో రచించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇది జాతరపై సమగ్ర గ్రంథం. ఇది ఎందరో పరిశోధకులకు, విద్యార్థులకు జాతర ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. రచయిత పెనుబాకు వేణు కలం నుండి నెల్లూరుజిల్లా గ్రామనామ నిఘంటువు, అక్షరరూపం దాల్చనున్నది.

మండలంలోని పట్టణాలు[మార్చు]

 • వెంకటగిర
పాపమాంబాపురం ి


ప్రముఖులు[మార్చు]


రవాణా[మార్చు]

 • వెంకటగిరికి అతి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నైలో ఉంది. ఇప్పుడు రేణిగుంట విమానాశ్రయం కూడా అంతర్జాతీయ సేవలను ప్రారంబించింది.
 • వెంకటగిరిలో రెండు బస్టాండ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి తిరుపతి, నెల్లూరు, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుకు బస్సులు ఉన్నాయి. చుట్టుపక్కల చిన్న ఊర్లకు పల్లెలకు బస్సులు మాత్రమే కాక ఆటోలు, వ్యానులు ఉన్నాయి.
 • ఇక్కడ రైల్వేస్టేషను ఉంది. ఇది గూడూరు శ్రీకాళహస్తి మార్గ మధ్యలో వస్తుంది. దగ్గరలోని పెద్ద జంక్షన్ గూడూరు మరియు రేణిగుంట. పెద్ద స్టేషన్లు నెల్లూరు మరియు తిరుపతి.

గ్రామాలు[మార్చు]

 • జంగాలపల్లి
 • జువ్విమాని ఖండ్రిక (నిర్జన గ్రామము)
 • జె.అప్పలాచార్యుల ఖండ్రిక (నిర్జన గ్రామము)
 • తడికలపాడు ఖండ్రిక
 • తిమ్మాయగుంట
 • త్రిపురాంటక భట్లపల్లి
 • దాచెరువు
 • ధర్మచట్లవారి ఖండ్రిక
 • పంజాం
 • పరవోలు
 • పాట్రపల్లి (నిర్జన గ్రామము)
 • పాపమాంబాపురం
 • పాపమ్మచెరువు ఖండ్రిక (నిర్జన గ్రామము)
 • పాలకొండ సత్రం
 • పాలెంకోట
 • పూలరంగడుపల్లి
 • పెట్లూరు
 • పెద బండారుపల్లి (నిర్జన గ్రామము)
 • పోగులవారిపల్లి
 • బంగారుయాచసముద్రం (నిర్జన గ్రామము) }
 • బసవాయగుంట (నిర్జన గ్రామము)
 • బాలసముద్రం
 • బూసాపాలెం
 • బొమ్మగుంట (నిర్జన గ్రామము)
 • మడిచేను ఖండ్రిక (నిర్జన గ్రామము)
 • మనిగదరు ఖండ్రిక
 • మన్నెగుంట
 • ముద్దంపల్లి
 • మొక్కలపూడి
 • మొగళ్ళగుంట
 • యాచసముద్రం
 • యాటలూరు
 • రామశాస్త్రులవారి ఖండ్రిక
 • లక్ష్మీరాంపల్లి (నిర్జన గ్రామము)
 • లాలాపేట
 • లింగమనాయుడుపల్లి
 • వడ్డిపల్లి
 • వరదనపల్లి
 • వల్లివేడు
 • విద్వత్ కుమార యాచసముద్రం (నిర్జన గ్రామము)
 • విశ్వనాధపురం
 • సి.గుంటవెంగన్న ఖండ్రిక (నిర్జన గ్రామము)
 • సింగమాంబాపురం (నిర్జన గ్రామము)
 • సిద్ధవరం
 • సుంకరవారిపల్లి
 • సోమసానిగుంట (పాక్షిక)
 • చూడండి[మార్చు]

  మూలాలు[మార్చు]

  1. Falling Rain Genomics, Inc - Venkatagiri Town
  2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127 – 140. Retrieved 1 December 2014. 
  3. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 233. Retrieved 10 March 2015.   "https://te.wikipedia.org/w/index.php?title=వెంకటగిరి&oldid=2359409" నుండి వెలికితీశారు