శ్రీధర లక్ష్మీనరసింహం
ఈ వ్యాస విషయం వికీపీడియా జీవిత చరిత్రల విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా లేనట్లుగా తోస్తోంది. (ఆగస్టు 2022) |
శ్రీధర లక్ష్మీనరసింహం ప్రముఖ రంగస్థల నటులు. ఇతని తండ్రి శ్రీధర వెంకటసుబ్బయ్య, తల్లి రామలక్ష్మమ్మ. ఈయన జననం గుంటూరు జిల్లా ఆలవాల గ్రామంలో 1929 డిసెంబర్ 27వ తారీకను. ఇతని తండ్రి వేంకటగిరి రాజాగారి ఆలయాలమీద అములుదారు అనే ఉద్యోగి. నరసింహం హైస్కూల్ చదువు వెంకటగిరి టౌన్.లో సాగింది. ఇంటర్మీడియట్ గుంటూరు హిదూ కాలేజీలో, బీకామ్ ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నంలో సాగింది.
వెంకటగిరి నాటక ప్రదర్శనలకు, నాటక సంస్థలకు ప్రసిద్హి. ఆ ప్రభావాలతోనే నరసింహం విద్యార్ధి దశనుంచి నాటకాలలో వేషాలు వేశాడు. ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గోపాలస్వామి నాయుడు ఇతనిలోని నటనా శక్తులను గమనించి ప్రోత్సహించడంవల్ల విశ్వవిద్యాలయం నాటకాల్లో, అంతర్. కళాశాలల నాటక పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నాడు.
నరసింహం 1950లో ఎడురీతతో నాటక ప్రవేశం చేసాడు. వెంకటగిరి కల్చరల్ ఆర్ట్స్ ధియటర్సు, తిరుపతిలో పోస్టల్ శాఖ రిక్రియేషన్ క్లబ్బు, తిరుపతి ప్రగతి ఆర్ట్స్ దియేటర్సు, తిరుపతి పద్మశ్రీ నాట్యకళామండలి సంస్థలలో సభ్యుుడుగా, అనేక నాటక ప్రదర్శనలలో పాల్గొన్నాడు. పోస్టల్ శాఖలో చేరి నెల్లూరు, చెన్నూరు, కోట,రాపూరు, వెంకటగిరి మొదలయినచోట్ల పోస్టుమాస్టర్.గ చేస్తూ పోస్టల్ శాఖ యాజమాన్యంలో ఏటా జరిగే సాంస్కృతికోత్సవాల్లో నాటక ప్రదర్శన, లలిసంగీతం, జానపద సంగీతపోటీల్లో, ఏకపాత్రాభినయంలో పాల్గొని అనేక సంవత్సరాలు పురస్కారాలు పొందాడు. వరూధిని ప్రవరాఖ్యం పేరుతొ స్వీయరచనను ఏకపాత్రాభినయంగా ప్రదర్శిచేవాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.పెద్దకుమారుడు డాక్టర్ సత్యనారాయణ M.D., భారత సైన్యంలో మేజర్.గా చేసి పదవీవిరమణ చేసాడు.
లక్ష్మీనరసింహం తిరుపతిలో పోస్టల్ శాఖ పబ్లిక్ రిలేషన్స్ ఇన్స్పెక్టర్.గ ఉన్న సమయంలో, డిపార్టుమెంట్ సాంస్కృతిక ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తూ తాను స్వయంగా నాటక ప్రదర్శనల్లో పాల్గొనేవాడు. ఎదురీత, కాళరాత్రి, లోకం పోకడ, దిష్టిబొమ్మలు, బంగారు సంకెళ్ళు, చైర్మన్, అన్నచెల్లెళ్ళు, మండువాలోగిలి, జీవితాలు, మొదలయిన సామజిక రూపకాలు, గయోపాఖ్యానం, నేటి నలుడు, నిరాశా ప్రొడక్షన్స్ నెంబర్ వన్, హౌస్ ఫర్ సేల్, పగ, గాలివాన, రాజీవం, రెండు రెళ్ళు ఆరు, అడ్రెస్ లేని మనుషులు, చూడు చూడు నీడలు, సమాజం చావనివ్వదు, ఇదం అహం, సర్పయాగం, ఎంతెంత దూరం, ప్రాణం ఖరీదు, తోలుబొమ్మలు, వంశవృక్షం, ఏక్ దిన్ కా సుల్తాన్, వగయిరా రూపకాలలో వివిధ పాత్రలు ధరిచాడు. ఇతను ఆకాశవాణి కడప కేంద్రంలో జీవితానికో మలుపు, సన్మానము చేయబడును రేడియో నాటకాలలో గాత్రధారణ చేశాడు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రసారం చేసిన జాహ్నవి నాటికలో గాత్రధారణ చేసాడు. పులికంటి కృష్ణారెడ్డి రచన పెండ్లిపిలుపు టివి నాటకంలో పాత్ర ధరించాడు. ఈ నాటకం మద్రాసు టివి కేంద్రం ప్రసారం చేసింది. నటుడుగా తను సాధించిన విజయాలకు తిరుపతిలో ఘన సన్మానం అందుకొన్నాడు. ఆ రోజుల్లోనే దాసరి నారాయణరావు దర్శకుడుగా, నారాయణరావు స్వయంగా నటించిన "[[మామగారు" (1991 సినిమాలో ముఖ్యమైన మామగారు పాత్రదరించాడు.తర్వాత సినిమాలలో అవకాశాలు వచ్చినా, పిల్లల చదువుల బాధ్యతలతో సినిమాలకు వీడ్కోలు చెప్పాడు.
1987లో పదవీవిరమణ తర్వాత, ఆధ్యాత్మిక సంగీతం మీద దృష్టిపెట్టి, షిర్డీసాయి భక్తులయి, బాబాగారి మీద పాటలు రచించి రికార్డు చేసాడు. వెంకగిరి రాజా డాక్టర్ భాస్కర సాయికృష్ణ యాచేంద్ర సంగీత గేయధార ప్రక్రియ ప్రదర్శనకు ముందు ప్రదర్శనను పరిచయం చేస్తూ రాజాగారి వెంట దేశమంతా పర్యటించాడు. 92వ ఏట 2021 సెప్టెంబర్ 9న అనాయాసంగ చనిపోయాడు.
మూలాలు: 'సూర్య' శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎడిషన్, సోమవారం 10 మే 2010 పత్రికలో "ఎస్ఎల్. నరసింహం నటజీవితనికి ఆదర్శం" సచిత్ర వ్యాసం. 2. పున్నమి, నెల్లూరు దినపత్రిక, 10,మే 2010."కళాకారులు శ్రీ లక్ష్మీనరసింహం మృతి" శీర్షికతో మరణవార్త. 3.జమీన్ రయితhttps://www.zaminryot.com/2021/10092021/index.html#ు 10-9-2021, మరణవార్త, పుట 14.