Jump to content

సర్వజ్ఞ కుమార యాచమనాయుడు

వికీపీడియా నుండి

నెల్లూరు జిల్లా వెంకటగిరి జమీన్దారీని పరిపాలించిన వారిలో 27వ తరం జమీందారు సర్వజ్ఞ కుమార యాచమనాయుడు 1831 లొ జన్మించాడు. తండ్రి బంగారు యాచమ నాయయుడు అసమర్ధుడు, వ్యసనపరుడు. కానీ సర్వజ్ఞ కుమార యాచమనాయుడు తెలుగు, సంస్కృతం బాగా చదువుకొని పండితుడని 'సర్వజ్ఞ' కుమారుడని పేరుతెచ్చుకొన్నాడు.

తండ్రి కాలంలో అస్తవ్యస్తమయన జమీందారి ఆర్థిక పరిస్థితులను చక్కదిద్ది ఆంద్రదేశంలో వెంకటగిరి గొప్ప జమీందారీ అని పేరు తెచ్చాడు.

ఇతడు గోపినాథుని వెంకయ్య శాస్త్రిని ఆస్థాన కవిగా నియమికంచి ఆయన అనువదించిన రామాయణం అంకితం పొంది, దాన్ని 1887 అచ్చువేయించాడు. రాధాభక్తి తత్వానికి మూలకందమయిన బ్రహ్మ వయివర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మఖండాన్ని తెలుగుచేయించి అచ్చువేయించాడు.

ఇతని పాడిత్యం, కవిపండిత పోషణ వలన అనాటి పండితులు ఇతన్ని సర్వజ్ఞ కుమార యాచమనాయుడు అని వ్యవహరించారు. ఆపేరే స్థిరపడింది. ఇతని ఆస్థానంలో గొప్పగొప్ప కవిపండితులున్నారు. వెంకటగిరి సంస్థానం విద్వత్ సంస్థానమని ప్రసిద్ధి చెందింది.

ఇతని జీవిత కాలంలో ఎనిమిది పర్యాయాలు కాశీరామేశ్వర యాత్ర చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఇతన్ని 'స్టార్ ఆఫ్ ఇండియా' బిరుదుతో గౌరవించింది.

సర్వజ్ఞ కుమార యాచమనాయుడు ఆస్తికుడే అయినా హేతువాది, శాస్త్ర విగ్జానాన్ని అనుసరించేవాడు. ఇతనికాలంలో వెంకటగిరి సంస్థాన గ్రంథాలయం సరస్వతీనిలయం గొప్ప గ్రంథాలయంగా పేరుపొందింది. హిందీ, ఉర్దూ, పార్శీ, తెలుగు, సంస్కృతం రాతప్రతులను సేకరించి తన గ్రంథాలయంలో భద్రపరచాడు.

ఇతనికి స్త్రీ వ్యామోహం అధికం, తన శృంగార అనుభాలను గోపినాథుని వెంకయ్య శాస్త్రికి చెప్పి అయంచేత బ్రహ్మానంద శతకం అనే ఒక బూతు గ్రంథాన్ని రాయించాడు. అనుభవాలు తనవి, పద్యాలు మాత్రం వెంకయ్యశాస్త్రీవి. ఆ కాలంలో శతకం వెంకయ్య శాస్త్రి రాశాడని విమర్శకులు ఆయనను బూతుకవి అని అన్నారుగాని ఈయనను పల్లెత్తుమాట అనలేదు. 1972 జూన్ 6 న అరవయ్యవ ఏట ఇతను మద్రాసులో చనిపోయాడు.

ఇతను మనస్సాక్యము అనే స్వీయ మతాన్ని ప్రచారం చేశాడు. మనస్సాక్యష కూటం అనే ఒక ట్రస్ట్ నెలకొల్పి తన సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. ఇతను పండితుల అనేక రచనలు ఉదారంగా అచ్చువేయించాడు.

సర్వజ్ఞ కుమార యాచమనాయుని రచనలు.

  1. సారాంశపంచకం 2. గీతార్థ సార సంగ్రహం 3. హిందూమత విరోధభంజని 4. నీతి సూత్రము, సహేతుక నీతి సూత్రములు 5 . మనస్సాక్యము 6. రత్న షట్కాంగుళీయకము 7. సర్వమత సార సంగ్రహము, 8. నాస్తిక ద్వాంత భాస్కరము, 9. నిర్గుణవాద నిరాకరణము 10 సందిగ్ధ తత్వ రాద్ధాతము 11. నర్ హూనర్ 12. సభారంజని. 13మామూల్ నామా
  2. ఆకరాలు : A. Biographical sketches of the Venkatagiri Rajas, editor: T. Ramarao, 1867.B. Family History of Venkatagiri Rajas, Venkatanarayana, 1916. C. వెంకటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం , రచయిత; కాళిదాసు పురుషోత్తం, ఎమెస్కో ప్రచురణ, 2018.