జూన్ 20
స్వరూపం
జూన్ 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 171వ రోజు (లీపు సంవత్సరములో 172వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 194 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 325: ప్రారంభ క్రైస్తవ చర్చి తన మొదటి దశలో, ఈస్టర్ తేదీని లెక్కించటానికి “నికే” అనే ఒక సాధారణ మండలిని నియమించింది.
- 936: ఫ్రాన్స్ (ప్రాన్స్ కి తెలుగు పదము: : పరాసు) రాజుగా లూయిస్ IV యొక్క పట్టాభిషేకం.
- 1097: మొట్టమొదటగా జరిగిన మతయుద్ధంలో (క్రూసేడు) నిసీ (Nicea) అనే ప్రాంతాన్ని జయించారు.
- 1429 : జోన్ ఆఫ్ ఆర్క్ (జెన్నే డి ఆర్క్) ఓర్లీన్స్ (ఆర్లీన్స్) జయించింది. ఈ ప్రాంతం యుద్ధ తంత్ర రీత్యా, ఇరు పక్షాలకు ముఖ్యమైన ప్రాంతం. ఈ విజయానికి గుర్తు చేసుకుంటూ ఇప్పటీకీ ఆ ప్రాంతంలో జరుపుకుంటున్న వేడుకలు ఈ వీడియోలో
- 1498: మకియవెల్లిని సిగ్నోరియా ప్రాంతానికి కార్యదర్శిగా నియమించారు
- 1586: ఉత్తర కరోలినా లోని ఆంగ్లేయ వలస దారులు తమ దేశానికి (ఇంగ్లాండ్ ) కి తిరిగి వెళ్ళారు.
- 1586 : ఆంగ్లేయ వలస దారులు, ఇంగ్లాండు యొక్క శాశ్వత వలసలను నెలకొల్పటంలో ఓడిపోయి, ఉత్తర కరోలినా లోని రోనోక్ దీవినుంచి ఓడలలో తిరిగి ఇంగ్లాండుకు బయలుదేరారు.
- 1778: అమెరికా సర్వ సైన్యాధ్యక్షుడు అయిన జార్జ్ వాషింగ్టన్ యొక్క దళాలు చివరకు ఫోర్జ్ వేలీ నుంచి బయలుదేరాయి.
- 1846: మొదటి బేస్బాల్ గేమ్ - NY నైన్స్ 23, NY నికెర్బోకెర్స్ 1
- 1857: భారత స్వాతంత్ర్యోద్యమము: 1857 జూన్ 20 నాడు గ్వాలియర్లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణీ లక్ష్మీబాయి మరణించింది.
- 1862: అమెరికా సంయుక్త రాష్ట్రాలులో బానిసత్వం రద్దు అయ్యింది.
- 1863: ఉత్తర అమెరికా 35వ రాష్ట్రంగా పశ్చిమ వర్జీనియా రాష్ట్రం.
- 1875: ప్రెసిడియో అనే ప్రాంతంలో, అమెరికా మెరైన్ ఆసుపత్రిని ప్రారంభించింది.
- 1877: కెనడా లోని ఓంటారియో రాష్ట్రంలో అలెగ్జాండర్ గ్రాహంబెల్ చే మొట్టమొదటి వాణిజ్య టెలిఫోను సర్వీసు ప్రారంభం.
- 1910: ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం) ని మొదటిసారిగా స్పోకనే (వాషింగ్టన్ ) లో జరుపుకున్నారు
- 1931: మొట్టమొదటి ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ని వాణిజ్యపరంగా, వెస్ట్ హెవెన్, కనెక్టికట్ రాష్ట్రంలో (అమెరికా) ప్రవేశపెట్టారు.
- 1947: మొట్టమొదటి సారిగా గంటకి 600 మైళ్ళ (1004 కి.మీ) వేగంతో విమానం (ఎఫ్ – 80) ప్రయాణించింది. ఈ విమానాన్ని ఆల్బర్ట్ బోయ్ద్, అనే పైలట్, మురాక్ (కాలిఫోర్నియా) నడిపాడు.
- 1957: సోవియట్ రష్యా తొలి ఉపగ్రహం స్పుత్నిక్ 1ని అంతరిక్షంలోకి పంపింది.
- 1991: 10వ లోక్ సభ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటనతో, అమలు లోనికి వచ్చింది.
- 1991: పి.వి.నరసింహారావు ప్రధాన మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకి ప్రయత్నం జరిగింది.
- 2003: వికీమీడియా ఫౌండేషన్ స్థాపన.
- 2004 -
జననాలు
[మార్చు]- 1566: స్కాట్లాండ్ రాజు జేమ్స్ VI జననం. తరువాత జేమ్స్ 1 పేరుతో ఇంగ్లాండ్ రాజు అయ్యాడు (మ.1625).
- 1623: ఫ్రెంచ్ తత్వవేత్త, గణిత శాస్త్రవేత్త అయిన బ్లేజ్ పాస్కల్ పుట్టాడు (మ.1662).
- 1856: ఎల్బెర్ట్ హుబ్బార్డ్, రచయిత (మ.1915).
- 1889: చీరాల-పేరాల ఉద్యమనేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం (మ.1928).
- 1876: చందాల కేశవదాసు, గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు,, నాటకకర్త. (మ. 1956)
- 1900: గయాప్రసాద్ కటియార్, "హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్"కు చెందిన విప్లవ వీరుడు.(మ.1993)
- 1914: కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు. (మ.1972)
- 1939: రమాకాంత్ దేశాయ్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (మ.1998)
- 1945: అంగ్ సాన్ సూకీ, నోబెల్ శాంతి గ్రహీత.
- 1946: కుందూరు జానారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ హోంశాఖా మంత్రి.
- 1980: అప్పిరెడ్డి హరినాథరెడ్డి, సాహిత్య పరిశోధకుడు, 2014 కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత.
- 1980: సంపత్ నంది , తెలుగు చలన చిత్ర దర్శకుడు, రచయిత,నిర్మాత.
- 1984: నీతూ చంద్ర , సినీ నటి , నిర్మాత, నృత్యకారిని.
మరణాలు
[మార్చు]- 1919: కోలాచలం శ్రీనివాసరావు, నాటక రచయిత, న్యాయవాది. (జ.1854)
- 1986: ముర్రే పి హేడన్, కృత్రిమ గుండె గ్రహీత, కృత్రిమ గుండె పెట్టిన 16నెలల తరువాత, లూయిస్ విల్లే అనే చోట (కెంటకీ రాష్ట్రం) లో మరణించాడు
- 1972: కొచ్చెర్లకోట రంగధామరావు, స్పెక్ట్రోస్కోపీ రంగంలో పేరొందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1898)
- 1987: సలీం అలీ, భారత పక్షి శాస్త్రవేత్త. (జ.1896).
- 2013: ఆలూరు భుజంగ రావు, విరసం సీనియర్ సభ్యుడు, రచయిత, అనువాదకుడు. (జ.1928)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- 2010: తండ్రుల దినం (ఫాదర్స్ డే) ప్రతీ సంవత్సరం, జూన్ నెలలోని 3వ ఆదివారం భారత్ సహా 53 దేశాలలో జరుపుకుంటున్నారు (2009 జూన్ 21; 2010 జూన్ 20; 2011 జూన్ 19; 2012 జూన్ 17). ఇతర దేశాలలో మరొక రోజు జరుపుకుంటున్నారు.
- అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం .
- మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం .
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 20
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రోజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
- గతం చెప్పే సంగతి
జూన్ 19 - జూన్ 21 - మే 20 - జూలై 20 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |