Jump to content

1566

వికీపీడియా నుండి

1566 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1563 1564 1565 - 1566 - 1567 1568 1569
దశాబ్దాలు: 1540లు 1550లు - 1560లు - 1570లు 1580లు
శతాబ్దాలు: 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
  • జనవరి 7: పోప్ పియస్ IV తరువాత, పయస్ V 225 వ పోప్ అయ్యాడు .
  • ఫిబ్రవరి 24: జపాన్‌లో తుపాకీతో కాల్[పులు జరిపి చేసిన తొలి హత్య నమోదైంది. మిమురా ఇచికాను ఇద్దరు సోదరులు (ఎండో మాతాజిరో, యోషిజిరో) లు కాల్చి చంపారు. ఈ హత్యకు హతుడి ప్రత్యర్థి ఉకితా నవోయి పురమాయించాడు.
  • మార్చి 28: మాల్టా యొక్క సావరిన్ మిలిటరీ ఆర్డర్ యొక్క గ్రాండ్ మాస్టర్ జీన్ పారిసోట్ డి వాలెట్ మాల్టా రాజధాని నగరంగా మారే వాలెట్టాకు పునాది రాయి వేసాడు.
  • ఆగష్టు 6: ఒట్టోమన్ సుల్తాన్ సులైమాన్, సిజిట్వర్ ముట్టడిని ప్రారంభించారు.
  • సెప్టెంబర్ 7: సిజిట్వర్ ముట్టడిలో ఉండగా సుల్తాన్ సులేమాన్ తన గుడారంలో మరణించాడు. సెలిమ్ II అతని తరువాత ఒట్టోమన్ సామ్రాజ్యానికి సుల్తాన్ గా వచ్చాడు.
  • సెప్టెంబర్ 8: సిజిట్వర్ ముట్టడి యుద్ధంతో ముగిసింది. సోకోలు మెహమెద్ పాషా ఆధ్వర్యంలోని ఒట్టోమన్ సామ్రాజ్యానికి చెందిన 90,000 మంది సైన్యం, 2,300 హంగేరియన్, క్రొయేషియన్ రక్షకులను, వారి జనరల్, నికోలా ఉబిక్ జిరిన్స్కితో సహా నిర్మూలించింది.
  • 1566 జూలై 19, 1567 జూలై 7 ల మధ్య: మోస్టార్ వద్ద నేరెట్వా నదిపై మొదటి వంతెన (ఆధునిక బోస్నియా హెర్జెగోవినాలో ఉంది) నిర్మాణాన్ని ఒట్టోమన్ సామ్రాజ్యం పూర్తి చేసింది. ఈ తెలుపు పాలరాయి వంతెనను స్టార్రి మోస్ట్ (పాత వంతెన) అని పిలుస్తారు.

జననాలు

[మార్చు]
  • మే 26: మెహమెద్ III, ఒట్టోమన్ సుల్తాన్ (మ .1603 )
  • జూన్ 19: స్కాట్లాండ్ రాజు జేమ్స్ VI / ఇంగ్లాండ్, ఐర్లాండ్ ల రాజు జేమ్స్ I (మ .1625 ) [1]
  • జూన్ 20: పోలాండ్, స్వీడన్ రాజు సిగిస్మండ్ III వాసా (మ .1632 )

మరణాలు

[మార్చు]
నోస్ట్రడామస్

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "James I and VI". Retrieved 2 April 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=1566&oldid=3845920" నుండి వెలికితీశారు