1503

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1503 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1500 1501 1502 - 1503 - 1504 1505 1506
దశాబ్దాలు: 1480లు 1490లు - 1500లు - 1510లు 1520లు
శతాబ్దాలు: 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం

సంఘటనలు[మార్చు]

అన్నమాచార్య
  • జనవరి 20: కాస్టిల్ లోని సెవిల్లెకి కొత్త ప్రపంచంలో వాణిజ్యం చేసే ప్రత్యేక హక్కులను ఇచ్చారు .
  • జనవరి 24: వెస్ట్ మినిస్టర్ అబ్బే వద్ద హెన్రీ VII చాపెల్ నిర్మాణం ఇంగ్లీష్ గోతిక్ కళ యొక్క చివరి దశ యైన లంబ శైలిలో ప్రారంభమైంది.[1]
  • ఫిబ్రవరి 11: ఇంగ్లండ్‌కు చెందిన హెన్రీ VII భార్య యార్క్ రాణి ఎలిజబెత్ తన 37 వ పుట్టినరోజున మరణించింది. ఆమె కుమార్తె, వారం రోజుల పసిగుడ్డు, అంతకుముందు రోజే మరణించింది.
  • ఫిబ్రవరి 23: ఇటలీలో ఫ్రెంచ్-స్పానిష్ యుద్ధాలు – రువో యుద్ధం : స్పానిష్ ఫ్రెంచి వారిని ఓడించారు.
  • మే 10: క్రిస్టోఫర్ కొలంబస్ కేమన్ దీవులను కనుగొన్నాడు. అక్కడ కనిపించిన అనేక సముద్ర తాబేళ్ల పేరు మీదుగా అతడు దీనికి లాస్ టోర్టుగాస్ అని పేరు పెట్టాడు..
  • మే 13: నేపుల్స్ను స్పెయిన్ స్వాధీనం చేసుకుంది.
  • మే 20: పోర్చుగీస్ అడ్మిరల్ అఫోన్సో డి అల్బుకెర్క్ అసెన్షన్ ద్వీపాన్ని మొదటగా చూసాడు.
  • మే 28: స్కాట్లాండ్‌కు చెందిన జేమ్స్ IV, మార్గరెట్ ట్యూడర్ పోప్ అలెగ్జాండర్ VI చేత శాశ్వత శాంతి ఒప్పందం ప్రకారం వివాహం చేసుకున్నారని పాపల్ బుల్ తెలిపారు .
  • ఆగష్టు 20: ఒట్టోమన్ సామ్రాజ్యానికి వార్షిక నివాళి ఖర్చు సమర్పించుకునే షరతుతో మోల్దావియా స్వయం ప్రతిపత్తిని కాపాడేలా, మోల్దవియాకు చెందిన స్టీఫెన్ III సుల్తాన్ భయేజిద్ II తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.
  • సెప్టెంబర్ 22: పోప్ పియస్ III (ఫ్రాన్సిస్కో తోడెస్చిని పిక్కోలోమిని) అలెగ్జాండర్ VI తరువాత 215 వ పోప్ అయ్యాడు. కాని అతడు అక్టోబరు 18 న మరణించాడు. [2]
  • అక్టోబర్ 30: కొత్త ప్రపంచంలో స్వదేశీ ప్రజలపై హింసను స్పెయిన్ రాణి ఇసాబెల్లా I నిషేధించింది.
  • అక్టోబర్ 31: పోప్ జూలియస్ II పియస్ III తరువాత 216 వ పోప్ అయ్యాడు విజయం సాధించాడు
  • వాస్కో డా గామా కొచ్చిన్ వద్ద భారతదేశంలో మొట్టమొదటి పోర్చుగీస్ కోటను స్థాపించాడు.
  • లియోనార్డో డా విన్సీ బహుశా ఫ్లోరెన్స్‌లో మోనాలిసాను చిత్రించే పనిని ప్రారంభిస్తాడు.
  • గౌరవనీయ యూరోపియన్ సమాజంలో జేబు రుమాలు సాధారణ వాడుకలోకి వస్తాయి.
  • ఈ సంవత్సరం నుండి 1650 వరకు, 1.6 కోట్ల కిలోల వెండి, 1,85,000 కిలోల బంగారం సెవిల్లె నౌకాశ్రయంలోకి చేరుకుంటాయి.

జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Palmer, Alan; Veronica (1992). The Chronology of British History. London: Century Ltd. pp. 137–140. ISBN 0-7126-5616-2.
  2. Frieda 2013, p. 275 & 276.
"https://te.wikipedia.org/w/index.php?title=1503&oldid=3864809" నుండి వెలికితీశారు