Jump to content

1582

వికీపీడియా నుండి

1582 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు: 1579 1580 1581 - 1582 - 1583 1584 1585
దశాబ్దాలు: 1560లు 1570లు - 1580లు - 1590లు 1600లు
శతాబ్దాలు: 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
హోన్నే-జి సంఘటన
  • ఫిబ్రవరి 24 :గ్రెగేరియన్ కేలండర్ మొదలైన సంవత్సరం. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ 13 తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది. ఇటలీ, పోలాండ్, పోర్చుగల్, స్పెయిన్లలో, ఈ సంవత్సరం అక్టోబర్ 4 తరువాత నేరుగా అక్టోబర్ 15 వస్తుంది.
  • ఏప్రిల్ 3: టెమ్మోకుజాన్ యుద్ధం : టకేడా వంశం పతనం తిప్పికొట్టలేక, టకేడా కట్సుయోరి, అతని ఇంటి సభ్యులూ ఆత్మహత్య చేసుకున్నారు.
  • ఏప్రిల్ 14 స్కాట్లాండ్ రాజు జేమ్స్ VI టౌనిస్ కాలేజీని సృష్టించే చార్టర్‌పై సంతకం చేశాడు, ఇదే తరువాత ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంగా మారింది .
  • ఏప్రిల్ 16: స్పానిష్ దండయాత్రికుడు హెర్నాండో డి లెర్మా అర్జెంటీనాలోని సాల్టా స్థావరాన్ని స్థాపించాడు.
  • ఏప్రిల్: హషీబా హిడెయోషి తకామాట్సు కోట ముట్టడిని ప్రారంభించాడు.
  • జూన్ 21: జపాన్లోని క్యోటోలో హోన్నే-జి సంఘటన జరిగింది.
  • జూలియన్ క్యాలెండర్ యొక్క డిసెంబర్ 9 (ఆదివారం) : గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈనాటి తరువాతి రోజును డిసెంబర్ 20 సోమవారంగా ప్రకటించింది.
  • టిబెట్‌లో కుంబుమ్ ను స్థాపించారు.
  • మింగ్ రాజవంశపు చైనాలో :
    • జెస్యూట్ మాటియో రిక్కీకి దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారు.
    • బీజింగ్‌లోని ప్రైవేట్ వార్తాపత్రికల ప్రచురణకు తొలి ఆధారాలు.
  • మహారాణా ప్రతాప్, దావర్ వద్ద ఉన్న మొగలు స్థావరంపై దాడి చేసి ఆక్రమించాడు
  • సాది షిరాజి రచించిన గులిస్తాన్ (పూల తోట) కు చిత్రాలు సమకూర్చారు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=1582&oldid=3845600" నుండి వెలికితీశారు