1509

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1509 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరం.

Vijayanagara

సంఘటనలు

[మార్చు]
 • ఫిబ్రవరి 3: డయ్యు యుద్ధం : పోర్చుగీస్ వారు భారతీయులు, ముస్లింలు, ఇటాలియన్ల కూటమిని ఓడించారు.
 • ఏప్రిల్ 21హెన్రీ VIII తన తండ్రి హెన్రీ VII మరణం తరువాత ఇంగ్లాండ్ రాజయ్యాడు. 38 సంవత్సరాల పాటు పాలించాడు [1]
 • ఏప్రిల్ 27: రోమగ్నాలో కొంత భాగాన్ని తన నియంత్రణ లోకి ఇవ్వడానికి నిరాకరించినందుకు గాను, పోప్ జూలియస్ II వెనిస్ను నిషేధించి, వెలివేసాడు.[2]
 • మే 14: అగ్నాడెల్లో యుద్ధం : ఫ్రెంచ్ దళాలు వెనీషియన్లను ఓడించాయి.
 • జూన్ 11: ఇంగ్లాండ్‌కు చెందిన హెన్రీ VIII అరగోన్‌కు చెందిన కేథరీన్‌ను వివాహం చేసుకున్నాడు.
 • జూన్ 19: చెషైర్‌లోని ప్రెస్ట్‌బరీకి చెందిన సర్ రిచర్డ్ సుట్టన్, లింకన్ బిషప్ విలియం స్మిత్ లు ఆక్స్‌ఫర్డ్‌లోని బ్రాసెనోస్ కాలేజీని స్థాపించారు
 • జూలై 26: కృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యం సింహాసనాన్ని అధిష్టించారు.
 • సెప్టెంబర్ 10: కాన్స్టాంటినోపుల్ భూకంపంలో 109 మసీదులు ధ్వంసమయ్యాయి. 10,000 మంది మరణించారు.
 • సెప్టెంబర్ 11: పోర్చుగీసు ఫిడాల్గో డియోగో లోప్స్ డి సిక్వేరా బంగాళాఖాతం దాటి మలక్కాకు చేరుకున్న మొదటి యూరోపియన్ అయ్యాడు.
 • నవంబర్ 4: అఫోన్సో డి అల్బుకెర్కీ భారతదేశంలో పోర్చుగీస్ స్థావరాల గవర్నర్ అయ్యాడు.
 • ఎరాస్మస్ తన అత్యంత ప్రసిద్ధ రచన ఇన్ ప్రెయిజ్ ఆఫ్ ఫాలీ రాసాడు.
 • లండన్ సెయింట్ పాల్స్ కేథడ్రల్‌ డీన్ అయిన జాన్ కోలెట్, సెయింట్ పాల్స్ స్కూల్‌ను స్థాపించాడు.
 • రాబర్ట్ బెకింగ్‌హామ్ వీలునామా ప్రకారం, ఇంగ్లాండ్‌లోని గిల్డ్‌ఫోర్డ్‌లో రాయల్ గ్రామర్ స్కూల్‌ను స్థాపించారు.
 • అబ్బాయిల కోసం క్వీన్ ఎలిజబెత్ గ్రామర్ స్కూల్, బ్లాక్బర్న్ లో స్థాపించారు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. Cheney, C. R.; Cheney, Christopher Robert; Jones, Michael (2000). A Handbook of Dates: For Students of British History (in ఇంగ్లీష్). Cambridge University Press. pp. 37–38. ISBN 9780521778459.
 2. "On April 27, 1509, Pope Julius II excommunicated the..." (in ఇంగ్లీష్).
"https://te.wikipedia.org/w/index.php?title=1509&oldid=3883113" నుండి వెలికితీశారు