మోనాలిసా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోనాలిసా లేదా లా జియోకొండో (1503–1505/1507)

మొనాలిసా ఇటలీకి చెందిన లియోనార్డో డావిన్సీ అనే ప్రాచీన చిత్రకారుడు చిత్రించిన చిత్రపటం. దీనిని 16వ శతాబ్దంలో ఇటలీ పునరుజ్జీవన కాలంలో తెల్లని పానెల్ మీద ఆయిల్ పెయింటింగ్ గా చిత్రించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు.

ఈ చిత్రంలో ఉన్నది ఇటలీలో కులీన వర్గానికి చెందిన లీసా గెరార్డిని అనే మహిళ అని అభిప్రాయపడుతున్నారు. ఈమె ఫ్రాన్సెస్కో లా జియోకొండో అనే వ్యక్తి భార్య. ఈ చిత్రాన్ని 1503 నుంచి 1506 సంవత్సరాల మధ్య చిత్రించబడినట్లు అంచనా వేశారు. కానీ లియోనార్డో 1517 సంవత్సరం వరకు దాని మీదనే పనిచేసినట్లు కూడా కొన్ని వాదనలున్నాయి. ఇటీవలి సైద్ధాంతిక పరిశోధనల ప్రకారం 1513 సంవత్సరం కంటే ముందు ఈ చిత్రం ప్రారంభం అయిఉండటానికి ఆస్కారం లేదు.[1][2][3][4] ఇది తొలుత ఫ్రాన్సు రాజైన ఫ్రాన్సిన్ - 1 ఆధీనంలో ఉండగా ప్రస్తుతం ఫ్రాన్సు ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుని 1797 నుంచి ప్యారిస్ లోని లౌరీ మ్యూజియంలో ఉంచారు.[5]

ఈ చిత్రపటం ప్రపంచంలో అత్యంత విలువైనదిగా భావించబడుతోంది. 1962లో దీని బీమా విలువ 100 మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడి ప్రపంచ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.[6]

మూలాలు[మార్చు]

  1. Pedretti, Carlo (1982). Leonardo, a study in chronology and style. Johnson Reprint Corporation. ISBN 978-0384452800.
  2. Vezzosi, Alessandro (2007). "The Gioconda mystery – Leonardo and the 'common vice of painters'". In Vezzosi; Schwarz; Manetti (eds.). Mona Lisa: Leonardo's hidden face. Polistampa. ISBN 9788859602583.
  3. Lorusso, Salvatore; Natali, Andrea (2015). "Mona Lisa: A comparative evaluation of the different versions and copies". Conservation Science. 15: 57–84. Retrieved July 26, 2017.
  4. Asmus, John F.; Parfenov, Vadim; Elford, Jessie (28 November 2016). "Seeing double: Leonardo's Mona Lisa twin". Optical and Quantum Electronics. 48 (12): 555. doi:10.1007/s11082-016-0799-0.
  5. Carrier, David (2006). Museum Skepticism: A History of the Display of Art in Public Galleries. Duke University Press. p. 35. ISBN 978-0822387572.
  6. "Highest insurance valuation for a painting". Guinness World Records (in ఇంగ్లీష్). Retrieved 2017-07-25.
"https://te.wikipedia.org/w/index.php?title=మోనాలిసా&oldid=3018177" నుండి వెలికితీశారు