నెపోలియన్
నెపోలియన్ | |||||
---|---|---|---|---|---|
| |||||
పరిపాలన | 18 మే 1804 – 6 ఎప్రిల్ 1814 | ||||
ఫ్రాన్స్ దేశ మొదటి కౌన్సిల్,చక్రవర్తి | 2 డిసెంబర్ 1804 | ||||
ఉత్తరాధికారి | లూయిస్ XVIII | ||||
Predecessor | లూయిస్ XVIII | ||||
జననం | కోర్సికా, ఫ్రాన్స్ | 1769 ఆగస్టు 15||||
మరణం | 1821 మే 5 సెయింట్ హెలీనా | (వయసు 51)||||
Burial | |||||
Spouse | మూస:జోసెఫిన్ డి బౌహర్నైస్ మేరీ లూయిస్ (before 1821) | ||||
వంశము Detail | నెపోలియన్II | ||||
| |||||
తండ్రి | కార్లో బోనపార్టీ | ||||
తల్లి | లెటిజియా రామోలినో | ||||
Signature |
నెపోలియన్ బోనపార్టీ (ఆగష్టు 15, 1769 - మే 5, 1821) ఫ్రాన్స్కు చెందిన సైన్యాధ్యక్షుడు, రాజకీయ నాయకుడు. ఐరోపా చరిత్రపై బలమైన ముద్ర వేశాడు.
జననం
[మార్చు]నెపోలియన్ బోనపార్టీ 1769 ఆగస్టు 15 న కొర్సికా దీవిలో అజోసియాలో, ఒక న్యాయవాది కుటుంబంలో జన్మించాడు. పారిస్లో చదువుకున్నాడు. అతనికి చరిత్ర, రాజనీతి శాస్త్రము, గణితం, తత్వ శాస్త్రాల మీద ఆసక్తి వుండేది. నెపోలియన్ మీద రూసో ప్రభావం అధికంగా వుండేది.1785 లో ఫ్రెంచి సైన్యంలో లెఫ్ట్‌నెంట్‌గా నియమితుడయ్యాడు.
సైనిక జీవితం
[మార్చు]1792 లో ఫ్రెంచి విప్లవం జరుగుతున్న రోజుల్లో నెపోలియన్, విప్లవాత్మకమయిన అరాచకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఫ్రెంచి విప్లవాన్ని అంతం చేయడానికి యూరోపియన్ దేశాలు చేసిని ప్రయత్నాల్లో భాగంగా 1793 వ సంవత్సరంలో నౌకదళం టేలర్ను పట్టుకోవడానికి ఆంగ్ల నౌకాదళం ఫ్రాన్స్ మీద దాడి చేసింది. నెపోలియన్ వారిని సమర్ధవంతంగా నిలవరించాడు. ఈ విజయం తరువాత అతనిని బ్రిగేడియర్ జనరల్‌గా పదోన్నతిని కల్పించారు. 1795 అక్టోబరులో ఫ్రాన్స్ ప్రజలు జాతీయ సమావేశానికికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, విప్లవ, రాజరిక వాదుల నుండి రాజ్యాంగమును రక్షించుటలో మరొకసారి విజయం సాధించాడు. నెపోలియన్ సాధించిన ఈ విజయం వల్ల అతనిని సైనికాధిపతిగా నియమించారు.
సైనికాధిపతిగా నెపోలియన్ విజయాలు
[మార్చు]నెపోలియన్ ఆస్ట్రియా,ఇటలీ (సార్డీనియా) దేశాలమీద దాడిచేసి విజయం సాధించాడు. నెపోలియన్ ఇటలీ మీద చేసిన దాడి ఇటలీ కూడా ఫలప్రదంగా ఉపయోగపడింది. అప్పటివరకు అనేక ప్రాంతాలుగా విడివడి వున్న ఇటలీలో రాజకీయపూర్వకమయిన ఐక్యత లోపించివుండింది. అయితే, నెపోలియన్ తన సంస్కరణలతో ఇటలీ రిపబ్లిక్ ను ఏర్పాటుచేసాడు. ఆ పద్ధతిలో ఇటలీలో జాతీయవాదాన్ని ప్రేరేపించాడు. ఆస్ట్రియా, ఇటలీ (సార్డీనియా) యుద్ధాలు నెపోలియన్ వ్యక్తిగత ఘనతను పెంచాయి. నెపోలియన్ అద్భుతవిజయాల వల్ల అతనిని ఫ్రెంచి ప్రజలు గొప్పనాయకుడిగాను గౌరవించారు.
ఫ్రాన్స్ శత్రువయిన ఇంగ్లాండును ఓడించడానికి సిద్ధపరిచిన సైన్యానికి నెపోలియన్‌ను అధిపతిగా డైరెక్టరీ నియమించింది. విస్తృతమయిన నౌకబలం లేకుండా ఇంగ్లాండు ఓడించడం కష్టమని, ఇంగ్లాండుకు కీలకమయిన ఈజిప్టు మీద 1798 మేలో దాడిచేసాడు. పిరమిడ్ యుద్ధంలో విజయం సాధించినప్పటికి, ఇంగ్లాండు నౌకాధిపతి నెల్సన్ చేతిలో పరాజయం చెందాడు. నెపోలియన్ ఫ్రాన్స్కు తిరిగివచ్చాడు. ఆ సమయంలో ఫ్రాన్స్ను 5 సభ్యులతో కూడిన డైరెక్టరీ పాలకమండలి పరిపాలించేది. ఈ పాలకమండలిలో ఐక్యత కొరవడింది. శక్తివంతమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటలో విఫలం చెందింది. డైరెక్టర్ల మధ్య కాని, డైరెక్టరీకి, శాశనసభకు మధ్య కాని సరిగా సంబంధాలు లేవు. తగాదాలు, కుట్రలతో పాటుగా సాంఘిక ఆర్థిక అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. డైరెక్టరీ విధానం ప్రజల మద్దతును పొందలేకపోయింది. ఫ్రాన్స్ యొక్క అంతరంగిక పరిస్థితి దెబ్బతింది. ఖర్చు మితిమీరిపొయింది. ప్రజలు పాలనలో మార్పును కోరుకున్నారు. పటిష్ఠమయిన, సమర్దవంతమయిన పరిపాలన కోసం ఎదురుచూశారు. అదే సమయానికి నెపోలియన్ ఫ్రాన్స్ చేరి సైన్యంతో పాటు శాశనసభ లోకి ప్రవేశించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నడు. నెపోలియన్ అధికారాన్ని చేపట్టిన తరువాత, కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాడు. ఈ ప్రభుత్వం 1799-1804 ల మధ్య కొనసాగింది.
మొదటి కౌన్సిల్‌గా నెపోలియన్ సంస్కరణలు
[మార్చు]నెపోలియన్ ఫ్రాన్స్కు వ్యతిరేకంగా వున్న ఇంగ్లాండు, ఆస్ట్రియా దేశాలతో సంధులు కుదుర్చుకొని యుద్ధాలనుండి ఫ్రాన్స్ను కాపాడి శాంతి ఏర్పరిచాడు. అనంతరం ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని పునర్మించడానికి తన కాలాన్ని వినియోగించాడు. ప్రజల మధ్య సాంఘిక, ఆర్థిక సమానత్వాన్ని కల్పించుటకు ప్రయత్నించాడు. కాని స్వేచ్ఛ సిద్ధాంతాలను వ్యతిరేకించాడు. నెపోలియన్ దృష్టిలో "ఫ్రాన్స్ ప్రజలకు కావలిసినది సమానత్వం కాని స్వేచ్ఛ కాదు". దేశ శాంతిభద్రతల కోసం బలమయిన కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయుటకు ప్రయత్నించాడు.
సంస్కరణలు
[మార్చు]మత సంస్కరణలు
[మార్చు]"ప్రజలకు కావలిసినది మతం, కాని ఆ మతం ప్రభుత్వ ఆధినంలో వుండాలి" విప్లవకాలంలో రూపొందించిన రాజ్యాంగం కారణంగా సమాజంలో ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుందని గ్రహించి రోమన్ కేథలిక్ చర్చి యొక్క మతాధికారి అయిన పోప్తో ఒప్పందం కుదుర్చుకొని ఫ్రాన్స్లో మతాచార్యుల నిర్వాహణ బాధ్యతలను నెపోలియన్ స్వీకరించాడు. చర్చి ఆస్తులను ప్రభుత్వం స్వాధినపరుచుకొనుటకు పోప్ అంగీకరించాడు. మతాచార్యులను ప్రభుత్వం నియమిస్తే వారిని పోప్ అనుమతిస్తాడు. వారంతా ప్రభుత్వానికి విధేయత ప్రకటించాలి.
న్యాయ సంస్కరణలు
[మార్చు]ఫ్రెంచ్ విప్లవంకు మునుపు ఫ్రాన్స్లో నిర్ణీత న్యాయవ్యవస్థ లేదు. విభిన్న న్యాయవిధానములు అమలులో ఉండేవి. నెపోలియన్ వీటన్నింటిని క్రోడికరించి, ప్రఖ్యాత న్యాయవేత్తల సహాయంతో నెపోలియన్ న్యాయస్మృతిని రూపొందించాడు. దీనిని సివిల్, క్రిమినల్, వాణిజ్య స్మృతులుగా విభజించారు. నెపోలియన్ రూపొందించిన న్యాయస్మృతి వల్ల ప్రజలకు స్థిరమయిన, క్రమమయిన న్యాయం లభించుటకేగాక, త్వరగాను, తక్కువ ఖర్చుతోనూ, విశ్వాసపాత్రమయినదిగాను లభించింది.
ఆర్ధిక సంస్కరణలు
[మార్చు]ఫ్రెంచి విప్లవం సంభవించుటకు ఆర్థిక సమస్య ముఖ్యకారణమని నెపోలియన్ గుర్తించాడు.ఫ్రాన్స్ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుటకు ప్రయత్నించాడు. దేశంమొత్తానికి క్రమబద్ధమయిన శిస్తు వసులు చేయు విధానాన్ని ప్రవేశపెట్టి,అవినీతి ఉద్యోగులను కఠినంగా శిక్షించాడు.వ్యయంలో దుబారా తగ్గించాడు. దేశీయ పరిశ్రమలను ప్రొత్సహించాడు. నదులమీద ఆనకట్టలు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేసాడు. 1800 వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ ను స్థాపించాడు. నాణాల చెలమణీని క్రమబద్దం చేసాడు.
నెపోలియన్ చక్రవర్తి కావడం
[మార్చు]మొదటి కౌన్సిల్ గా అధికారం చేపట్టిన తరువాత నెపోలియన్ తన స్థానమును భద్రపరచుకొనుటకు వీలుగా అనేక చర్యలు చేపట్టాడు.క్రమక్రమంగా ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. 1804 డిసెంబరు 2 న పోప్ చేత నెపోలియన్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనాడు. ఫ్రాన్స్లో తిరిగి రాజరికం పునరుద్దరింబడినప్పటికీ,ఫ్రెంచి విప్లవ ఫలితాలు ప్రజలకు అందించబడినవి.
చక్రవర్తి గా నెపోలియన్ సైనిక విజయాలు
[మార్చు]ఫ్రాన్స్ చక్రవర్తిగా నెపోలియన్ పట్టాభిషక్తుడైన తరువాత తన విజయవంతమయిన దాడుల ద్వారా ఐరోపా చిత్రపటమును తిరిగి గీయించడు. ఇంగ్లాండును అణచివేయడానికి అనేకమార్లు ప్రయత్నించాడు.
పరోక్ష యుద్ధంలో ఇంగ్లాండును ఓడించడానికి ప్రసిద్ద ఖండాంతర విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధానం ద్వారా ఇంగ్లాండు వర్తకాలను ధ్వంసం చేయాలని భావించాడు. తమ ఓడరేవులలో ఇంగ్లాండు ఓడల ప్రవేశాన్ని నిషేధించమని తన సామంత రాజ్యాలను కోరాడు.ఫలితంగా వివిధ రకాల వస్తువుల ధరలు పేరిగిపోయాయి. పేద ప్రజలు తమ నిత్యావసరాలకు కూడా కష్టాలను ఎదుర్కోవలసివచ్చింది. అందువల్ల ప్రజలు తమ కష్టాలకు నెపోలియన్ కారకుడిగా భావించి నిందించడం ప్రారంభించారు. తన ఖండాంతర విధానాన్ని సమర్ధవంతంగా అమలుపరచడానికి రష్యా,పోర్చుగల్, స్పెయిన్ దేశాలమీద యుద్ధాలు ప్రకటించవలసి వచ్చింది. ఈ విధాన్నాన్ని విజయవంతం చేయడానికి అతడు చేప్పట్టిన చర్యలన్ని అతని పతనానికి కారణం అయ్యాయి.
నెపోలియన్ ను అణచివేయడానికి ఇతర ఐరోపా దేశాలన్ని కూటమిగా ఏర్పడటం ద్వారా ప్రయత్నాలు చేసాయి.స్వీడన్,రష్యా,ఆస్ట్రియా లతో అప్పటి ఇంగ్లాండు ప్రధానమంత్రి పిట్ ఒక నూతన కూటమిని ఏర్పరిచాడు. ఈ విధంగా ఫ్రాన్స్ వ్యతిరేకంగా మూడవ కూటమి ఏర్పడింది. కూటమి విషయం తెలిసిన వెంటనే నెపోలియన్ ఆస్ట్రియా మీదకు సైన్యాలను పంపించి ఆస్టర్ విడ్జీ వద్ద రష్యా, ఆస్ట్రియా సైన్యాల మీద ఘనవిజయం సాధించాడు. ఈ యుద్ధంతో మూడవ కూటమి విచ్చిన మగుటయే కాక ఆస్ట్రియా అవమానకరమైన ప్రెస్ బర్గ్ సంధికి అంగీకరించవసివచ్చింది. ఈ సంధితో నెపోలియన్ ఖ్యాతి మరింత విస్తరించింది. ఈ యుద్ద విజయం తరువాత నెపోలియన్ తన దృష్టిని రష్యా మీద నిలిపి 1807 లో ఫ్రీడ్ లాండ్ యుద్ధంలో రష్యన్ సైన్యాలపై గొప్ప విజయం సాధించి, నాటి రష్యా చక్రవర్తి జార్‌తో టిల్ సిట్ సంధి కుదుర్చుకున్నాడు. ఈ సంధి అనంతరం నెపోలియన్ రాజ్యం గణనీయముగా అభివృద్ధి చెందింది. ఖండాంతర విధానాన్ని వ్యతిరేకించిన కారణంగా నెపోలియన్ తన సోదరుడైన లూయి నెపోలియన్ ను హాలెండ్ రాజ్య సింహాసనం నుండి తిలగించి హాలెండ్‌ను స్వాధీనం చేసుకున్నాడు.ఉత్తర జర్మనీలో బాల్టిక్ సముద్రం వరకు గల విశాల ప్రాంతాన్ని ఆక్రమించాడు.స్పెయిన్,ఫ్రాన్స్కు సామంత రాజ్యంగా కుదించబడింది. స్పెయిన్ పాలకునిగా నెపోలియన్ సోదరుడు జోసఫ్ నియమింపబడినాడు.పోర్చుగల్ కూడా స్పెయిన్ను అనుసరించింది. ఆస్ట్రియా కూడా బలహీనంగా మారింది.జర్మనీ కూడా ఫ్రాన్స్కు లోబడివుండు విధంగా రైన్ సమఖ్యను ఏర్పాటుచేసి తాను దానికి సంరక్షకుడిగా తన అధికారాన్ని స్థాపించాడు. ఈ విధంగా నెపోలియన్ యూరప్ మొత్తానికి అధిపతి అయినాడు. ఫ్రాన్స్, యూరప్కు రాజకీయ రాజధాని అయింది.
పతనం
[మార్చు]1808 నాటికి నెపోలియన్ యొక్క అధికారం ఫ్రాన్స్ లోనే గాక యూరప్ మొత్తానికి విస్తరించింది.నాటి యూరప్ రాజ్యాలన్ని నెపోలియన్ పట్ల భయంతో కూడిన గౌరవాన్ని ప్రదర్శించాయి.ఆ తరువాత అతికొద్ది కాలంలోనే నెపోలియన్ పతనం ఆరంభమయింది.
భూఖండ విధాన వైఫల్యం
[మార్చు]ఇంగ్లాండు అధికారాన్ని,ఐశ్వర్యాన్ని ధ్వంసం చేయలంటే భూఖండ విధానాన్ని అన్ని వేళల,అన్ని చోట్ల అమలుచేయాలి.ఇంగ్లాండు సరుకులు ఐరోపా చేరకుండా గస్తీ ఏర్పరిచాలి.ఈ విధానం అమలులో ఎటువంటి అలసత్వం కనిపించినా ఇంగ్లాండును ఆర్థికంగా ఇబ్బంది కలిగించలేడు.దీని ఫలితంగా ఇతర దేశాల మీద దురాక్రమణలు చేయవసివచ్చింది.
భూఖండ విధాన అమలులో నెపోలియన్ పోర్చుగల్,స్పెయిన్ లతో వినాశకమైన యుద్ధము చేయవలసి వచ్చింది.పోర్చుగల్కు మొదటినుండి ఇంగ్లాండుతో గల రాజకీయ,ఆర్దిక సంబంధాల వల్ల భూఖండ విధానమును వ్యతిరేకించింది.ఆ కారణంగా నెపోలియన్ పోర్చుగల్ను జయించి స్పెయిన్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.పోర్చుగల్ ఆక్రమణ సందర్భంగా నెపోలియన్ తన సైన్యాలను స్పెయిన్లో ప్రవేశపెట్టాడు.స్పెయిన్ యొక్క రాజు బలహీనతను గుర్తించి స్పెయిన్ ఆక్రమణ కొరకు ప్రయత్నాలు చేసి దానిని జయించి,తన సోదరుడైన జోసఫ్ ను స్పెయిన్ రాజుగా ప్రకటించాడు.స్పెయిన్లో ఫ్రాన్స్ అధికారానికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. వీటిని అణచుటకు నెపోలియన్ తన సైన్యాన్ని అధికంగా వినియోగించవసివచ్చింది.అయినా వైఫల్యం తప్పలేదు.సముద్రాదిపత్యం లేకపోవడం కూడా నెపోలియన్ పతనానికి కారణం అయింది.
జాతీయతా భావ అవిర్భావం
[మార్చు]జాతీయతా భావం ఫ్రెంచి విప్లవం నుండి ఐరోపా అంతటికి విస్తరించింది. నెపోలియన్ ఈ జాతీయతా భావాన్ని నిరోధించలేకపోయాడు.మేధావులు,కవులు,వేదాంతులు,అధ్యాపకులు జాతీయ తత్వ ప్రేరణకు నిరంతర కృషి సలిపారు.జాతీయ అవమానపు లోతులనుండి ఓ చైతన్య భావము ఆవిద్భవించి ప్రతికార సమయం కోసం వేచివున్నది.
రష్యా దండయాత్ర
[మార్చు]1807 లో రష్యాను ఫ్రాన్స్ ఓడించగా జరిగిన తిల్ సిట్ సంధి 5 సంవత్సారాలపాటు కొనసాగినప్పటికి ఈ రెండు రాజ్యాల మద్య అనేక అభిప్రాయ భేదాలు ఏర్పడినవి.నెపోలియన్ భూఖండ విధానము రష్యాకు తీవ్ర నష్టం కలిగించింది.ఈ కారణాల వల్ల రష్యా,ఫ్రాన్స్ ల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.భూఖండ విధానమును బలవంతముగా అమలుజరుపుటకు నెపోలియన్ ఆరు లక్షల సైస్యముతో రష్యా మీద దాడి చేసాడు.రష్యా సైన్యాలు ఎదురునిలువకుండా తిరోగమిస్తు గ్రామాలను పంటలను శత్రువుల వశం కాకుండా పాడు చేసారు.అనేక వ్యయ ప్రయాసలకొనర్చి నెపోలియన్ సైన్యం మాస్కో చేరింది.రష్యా సంధికి వస్తుందని నెపోలియన్ భావించి,కొన్ని వారాలపాటు అక్కడే వేచి వున్న ప్రయోజనము లేక సైన్యాన్ని వెనక్కి రమ్మని ఆదేశించాడు.అయితే తీవ్రమయిన చలి,ఆహార పదార్దాల కొరత,రష్యా సైన్యాల గెరిల్లా దాడుల వల్ల నెపోలియన్ సైన్యాలు తీవ్రంగా నష్టపోయాయి.
బాటిల్ ఆఫ్ నేషన్
[మార్చు]రష్యా,ఆస్ట్రియా,ప్రష్యా దేశాలు కలిసి సంయుక్త సైనిక శక్తిని రూపొందించాయి.వీటికి ఇంగ్లాండు ఆర్థికసహాయమును అందించింది.1813 లో నెపోలియన్ సేనలకు,సంయుక్త సైన్యాలకు మద్య లిప్ జిగ్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నెపోలియన్ సేనలు అధ్బుతంగా పోరాడినప్పటికి ఘోరంగా ఓడింపబడినాడు.నెపోలియన్ చక్రవర్తి బిరుదుతో ఎల్బా అను చిన్న దీవికి పాలకునిగా పంపివేశారు.ఫ్రాన్స్కు లూయి 18 ని రాజుగా నియమించారు.
100 రోజుల నెపోలియన్ పాలన
[మార్చు]నెపోలియన్ తరువాత ఫ్రాన్స్కు రాజైన లూయి 18తన తెలివి తక్కువ పనుల వల్ల అనతికాలంలో నే ప్రజ విశ్వాసాన్ని కోల్పోయాడు.విజేతలైన రాజ్యాలు భుభాగాల పంపకంలో కలహించుకోవడం ఆరంభించాయి.దీన్ని అవకాశంగా తీసుకొని నెపోలియన్ ఎల్బా నుండి తప్పించుకొని పారిస్,1815 మార్చి 1 చేరుకున్నాడు.వెంటనే లూయి 18 ఫ్రాన్స్ వదిలి పారిపోయాడు.నెపోలియన్ తననుతాను తిరిగి రాజుగా ప్రకటించుకున్నాడు.కాని ఇది 100 రోజులు మాత్రమే కొనసాగింది.మరలా ఐరోపా రాజ్యాలు అన్ని తిరిగి ఒక్కటై నెపోలియన్ తో వాటర్లూ యుద్ధంలో తలపడ్డాయి.ఈ యుద్ధంలో నెపోలియన్ ఓడి సెయింట్ హెలినా అను దీవికి పంపబడినాడు.
మరణం
[మార్చు]సెయింట్ హెలినా అను దీవిలో అతనిపై అనేక నిర్భందాలు విధింపబడ్డాయి.కాన్సర్ వ్యాధితో భాదపడుతూ నెపోలియన్ తన 52వ ఏట మరణించాడు.నెపోలియన్ మృతదేహమును సెయింట్ హెలినా దీవిలో సమాధి చేసినప్పటికి తిరిగి అక్కడినుండి తీసుకువచ్చి పారిస్లో ఖననం చేసారు
మూలాలు
[మార్చు]జీవితచరిత్ర అధ్యయనాలు
[మార్చు]- Abbott, John (2005). Life of Napoleon Bonaparte. Kessinger Publishing. ISBN 1-4179-7063-4.
- Bell, David A. (2015). Napoleon: A Concise Biography. Oxford and New York: Oxford University Press. ISBN 978-0-19-026271-6. only 140pp; by a scholar
- Blaufarb, Rafe (2007). Napoleon: Symbol for an Age, A Brief History with Documents. Bedford. ISBN 0-312-43110-4.
- Chandler, David (2002). Napoleon. Leo Cooper. ISBN 0-85052-750-3.
- Cronin, Vincent (1994). Napoleon. HarperCollins. ISBN 0-00-637521-9.
- Dwyer, Philip (2008). Napoleon: The Path to Power. Yale University Press. ASIN B00280LN5G.
- Dwyer, Philip (2013). Citizen Emperor: Napoleon in Power. Yale University Press. ASIN B00GGSG3W4.
- Englund, Steven (2010). Napoleon: A Political Life. Scribner. ISBN 0-674-01803-6.
- Gueniffey, Patrice. Bonaparte: 1769–1802 (Harvard UP, 2015, French edition 2013); 1008 pp.; vol 1 of most comprehensive recent scholarly biography by leading French specialist; less emphasis on battles and campaigns excerpt; also online review
- Johnson, Paul (2002). Napoleon: A life. Penguin Books. ISBN 0-670-03078-3.; 200 pp.; quite hostile
- Lefebvre, Georges (1969). Napoleon from 18 Brumaire to Tilsit, 1799–1807. Columbia University Press. influential wide-ranging history
- Lefebvre, Georges (1969). Napoleon: from Tilsit to Waterloo, 1807–1815. Columbia University Press.
- Lyons, Martyn (1994). Napoleon Bonaparte and the Legacy of the French Revolution. St. Martin's Press.
- Markham, Felix (1963). Napoleon. Mentor. Archived from the original on 2010-04-20. Retrieved 2018-05-07.; 303 pp.; short biography by an Oxford scholar online
- McLynn, Frank (1998). Napoleon. Pimlico. ISBN 0-7126-6247-2. ASIN 0712662472.
- Roberts, Andrew (2014). Napoleon: A Life. Penguin Group. ISBN 978-0-670-02532-9.
- Thompson, J. M. (1951). Napoleon Bonaparte: His Rise and Fall. Oxford U.P., 412 pp.; by an Oxford scholar
మౌలిక ఆధారాలు
[మార్చు]- Gourgaud, Gaspard (1903) [1899]. Talks of Napoleon at St. Helena. Translated from the French by Elizabeth Wormeley Latimer. Chicago: A. C. McClurg.
ప్రత్యేక అధ్యయనాలు
[మార్చు]- Alder, Ken (2002). The Measure of All Things—The Seven-Year Odyssey and Hidden Error That Transformed the World. Free Press. ISBN 0-7432-1675-X.
- Alter, Peter (2006). T. C. W. Blanning and Hagen Schulze (ed.). Unity and Diversity in European Culture c. 1800. Oxford University Press. ISBN 0-19-726382-8.
- Amini, Iradj (2000). Napoleon and Persia. Taylor & Francis. ISBN 0-934211-58-2.
- Archer, Christon I.; Ferris, John R.; Herwig, Holger H. (2002). World History of Warfare. University of Nebraska Press. ISBN 0-8032-4423-1.
- Astarita, Tommaso (2005). Between Salt Water And Holy Water: A History Of Southern Italy. W. W. Norton & Company. ISBN 0-393-05864-6.
- Bell, David (2007). The First Total War. Houghton Mifflin Harcourt. ISBN 0-618-34965-0.
- Bordes, Philippe (2007). Jacques-Louis David. Yale University Press. ISBN 0-300-12346-9.
- Brooks, Richard (2000). Atlas of World Military History. HarperCollins. ISBN 0-7607-2025-8.
- Chandler, David (1966). The Campaigns of Napoleon. New York: Scribner. ISBN 9780025236608. OCLC 740560411.
- Chandler, David (1973) [1966]. The Campaigns of Napoleon.
- Chesney, Charles (2006). Waterloo Lectures:A Study Of The Campaign Of 1815. Kessinger Publishing. ISBN 1-4286-4988-3.
- Connelly, Owen (2006). Blundering to Glory: Napoleon's Military Campaigns. Rowman & Littlefield. ISBN 0-7425-5318-3.
- Cordingly, David (2004). The Billy Ruffian: The Bellerophon and the Downfall of Napoleon. Bloomsbury. ISBN 1-58234-468-X.
- Cullen, William (2008). Is Arsenic an Aphrodisiac?. Royal Society of Chemistry. ISBN 0-85404-363-2.
- Driskel, Paul (1993). As Befits a Legend. Kent State University Press. ISBN 0-87338-484-9.
- Flynn, George Q. (2001). Conscription and democracy: The Draft in France, Great Britain, and the United States. Greenwood Publishing Group. ISBN 0-313-31912-X.
- Fremont-Barnes, Gregory; Fisher, Todd (2004). The Napoleonic Wars: The Rise and Fall of an Empire. Osprey. ISBN 1-84176-831-6.
- Fulghum, Neil (2007). "Death Mask of Napoleon". University of North Carolina. Archived from the original on 22 జూన్ 2013. Retrieved 4 August 2008.
- Gates, David (2001). The Spanish Ulcer: A History of the Peninsular War. Da Capo Press. ISBN 0-306-81083-2.
- Gates, David (2003). The Napoleonic Wars, 1803–1815. Pimlico. ISBN 0-7126-0719-6.
- Godechot, Jacques; et al. (1971). The Napoleonic era in Europe. Holt, Rinehart and Winston.
- Grab, Alexander (2003). Napoleon and the Transformation of Europe. Macmillan. ISBN 978-0-333-68275-3.
- Hall, Stephen (2006). Size Matters. Houghton Mifflin Harcourt. ISBN 0-618-47040-9.
- Harvey, Robert (2006). The War of Wars. Robinson. ISBN 978-1-84529-635-3.
- Hindmarsh, J. Thomas; Savory, John (2008). "The Death of Napoleon, Cancer or Arsenic?". Clinical Chemistry. 54 (12). American Association for Clinical Chemistry: 2092. doi:10.1373/clinchem.2008.117358. Archived from the original on 26 డిసెంబరు 2010. Retrieved 10 October 2010.
- Karsh, Inari (2001). Empires of the Sand: The Struggle for Mastery in the Middle East, 1789–1923. Harvard University Press. ISBN 0-674-00541-4.[permanent dead link]
- Mowat, R.B. (1924) The Diplomacy of Napoleon (1924) 350pp online
- O'Connor, J; Robertson, E F (2003). "The history of measurement". St Andrew's University. Retrieved 18 July 2008.
- Poulos, Anthi (2000). "1954 Hague Convention for the Protection of Cultural Property in the Event of Armed Conflict". International Journal of Legal Information (vol 28 ed.).
- Richardson, Hubert N.B. A Dictionary of Napoleon and His Times (1920) online free 489pp
- Roberts, Chris (2004). Heavy Words Lightly Thrown. Granta. ISBN 1-86207-765-7.
- Schom, Alan (1997). Napoleon Bonaparte. HarperCollins. ISBN 978-0-06-017214-5.
- Schroeder, Paul W. (1996). The Transformation of European Politics 1763–1848. Oxford U.P. pp. 177–560. ISBN 978-0-19-820654-5. advanced diplomatic history of Napoleon and his era
- Schwarzfuchs, Simon (1979). Napoleon, the Jews and the Sanhedrin. Routledge. ISBN 0-19-710023-6.
- Watson, William (2003). Tricolor and crescent. Greenwood Publishing Group. ISBN 0-275-97470-7. Retrieved 12 June 2009.
- Sicker, Martin (2001). The Islamic World in Decline: From the Treaty of Karlowitz to the Disintegration of the Ottoman Empire. Greenwood. p. 99.
- Wells, David (1992). The Penguin Dictionary of Curious and Interesting Geometry. Penguin Books. ISBN 0-14-011813-6.
- Pages using the JsonConfig extension
- క్లుప్త వివరణ ఉన్న articles
- Marriage template anomalies
- All articles with dead external links
- AC with 24 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with ORCID identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BPN identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with ULAN identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with RKDartists identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- ప్రపంచ ప్రసిద్ధులు
- ఫ్రాన్స్