చరిత్ర
Jump to navigation
Jump to search
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర (ఆంగ్లం: History). ఒక శాస్త్రముగా నిర్వచించినప్పుడు ప్రాథమికముగా రాతల ద్వారా భద్రపరచబడిన, జరిగిన కాలములోని మనుషుల, కుటుంబాల, సమాజాల యొక్క పరిశీలన, అధ్యయనమే చరిత్ర అని చెప్పవచ్చు. ఈ విధముగా చరిత్రను పూర్వ చరిత్రతో భేదిస్తారు. చరిత్ర యొక్క జ్ఞానము సాధారణంగా జరిగిన సంఘటనల యొక్క జ్ఞానముతో పాటు చరిత్ర ఆలోచనా సాధనాల యొక్క జ్ఞానమును కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మనిషి చరిత్రను తెలుగుసుకొనుటవల్ల పూర్వం జరిగిన దురాచారాలను, నష్టాలను భవిష్యత్తులో నివారించడానికి తోడ్పడుతుంది.
సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనము మానవీయ శాస్త్రములలో భాగముగా పరిగణిస్తారు. అయితే ఆధునిక విద్యావర్గము చరిత్రను కాలక్రమము (క్రోనాలజీ), హిస్టోరియోగ్రఫీ అను ఉపవిభాగములతో సామాజిక శాస్త్రములలో భాగముగా వర్గీకరిస్తున్నారు.