ఆస్ట్రియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిపబ్లిక్ ఆస్టర్రీచ్
Republik Österreich
రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా
Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా యొక్క చిహ్నం
జాతీయగీతం

ఆస్ట్రియా యొక్క స్థానం
ఆస్ట్రియా యొక్క స్థానం
Location of  ఆస్ట్రియా  (ముదురు ఆకుపచ్చ)

– in ఐరోపా  (లేత ఆకుపచ్చ & ముదురు బూడిద)
– in the ఐరోపా సమాఖ్య  (లేత ఆకుపచ్చ)  —  [Legend]

రాజధానివియన్నా
48°12′N 16°21′E / 48.200°N 16.350°E / 48.200; 16.350
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు జర్మన్,
ప్రాంతాలవారీగా స్లొవీన్, క్రొయేషియన్ , హంగేరియన్ కూడా
ప్రజానామము ఆస్ట్రియన్
ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్య గణతంత్ర సమాఖ్య
 -  President en:Alexander Von der Bellen
 -  Chancellor en:Karl Nehammer
Independence
 -  en:Austrian State Treaty in force
July 27, 1955 
 -  Declaration of Neutrality October 26, 1955 (before: en:Austrian Empire: 1804, en:First Austrian Republic: 1918) 
Accession to
the
 European Union
January 1, 1995
 -  జలాలు (%) 1.7
జనాభా
 -  2022-04 అంచనా 9,027,999 (93వ)
 -  2022-01-01 జన గణన 8,978,929 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $582.130 billion[1] (43th)
 -  తలసరి $64,750[1] (IMF) (14th)
జీడీపీ (nominal) 2022 est. అంచనా
 -  మొత్తం $479.820 billion[1] (33rd)
 -  తలసరి $53,320[1] (IMF) (17th)
జినీ? (2021) 26.7 (low
మా.సూ (హెచ్.డి.ఐ) (2021) Increase 0.916 (very high) (25th)
కరెన్సీ యూరో () ² (EUR)
కాలాంశం CET (UTC+1)
 -  వేసవి (DST) CEST (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .at ³
కాలింగ్ కోడ్ +43
1 స్లొవీన్, క్రొయేషియన్ , హంగేరియన్ భాషలు అధికారిక భాషలుగా గుర్తింపు పొందగా ఆస్ట్రియన్ సంజ్ఞా భాష దేశవ్యాప్తంగా రక్షిత అల్పసంఖ్యాక భాషగా ఉంది.
2 1999 ముందు: ఆస్ట్రియన్ షిల్లింగ్.
3 The .eu domain is also used, as it is shared with మిగతా ఐరోపా సమాఖ్య సభ్యదేశాలతో పాటుగా .eu డొమైన్ కోడ్ వాడబడుతోంది.

ఆస్ట్రియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా) మధ్య ఐరోపాలోని ఒక భూపరివేష్టిత దేశం. ఈ దేశము స్లొవేనియా, ఇటలీలకు ఉత్తర దిశలో, స్విట్జర్లాండ్, లీక్టెన్స్టెయిన్లకు తూర్పులో, స్లొవేకియా, హంగేరీలకు పశ్చిమాన, జర్మనీ, చెక్ రిపబ్లిక్లకు దక్షిణ దిశలో ఉంది. ఈ దేశ రాజధాని నగరమైన వియన్నా డానుబే నదీ తీరాన ఉంది.

తొమ్మిదవ శతాబ్దంలో ఆస్ట్రియా భూభాగాలలో జనసాంద్రత పెరగడంతో ఈ దేశచరిత్ర మూలాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. 996లో వెలువడిన ఒక అధికార పత్రములో మొట్టమొదటిసారిగా "ఆస్టర్రీచీ" అన్న పేరు వాడబడింది. కాలక్రమంలో ఈ పేరు ఆస్టర్రీచ్గా రూపాంతరం చెందింది.

ఆస్ట్రియా తొమ్మిది రాష్ట్రాలతో కూడిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఐరోపాలోని ఆరు నిరంతర తటస్థ దేశాలలో ఆస్ట్రియా ఒకటి; అనంత తటస్థత విధానాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన బహు కొద్ది దేశాలలో ఆస్ట్రియా ఉంది. 1955 నుండి ఐక్య రాజ్య సమితిలో సభ్యదేశంగా ఉన్న ఆస్ట్రియా 1995లో ఐరోపా సమాఖ్యలో చేరింది.

నైసర్గిక స్వరూపము[మార్చు]

  • వైశాల్యం: 83, 883 చదరపు కిలోమీటర్లు
  • జనాభా: 89, 78, 929 (2022 అంచనాల ప్రకారం)
  • రాజధాని: వియన్నా
  • ప్రభుత్వం: పార్లమెంటరీ రిపబ్లిక్
  • కరెన్సీ: షిల్లింగ్
  • భాషలు: జర్మన్, మాగ్యార్, స్లోవీన్‌లు
  • మతం: క్రైస్తవులు 88%
  • వాతావరణం: జనవరి -4 నుండి 1 డి గ్రీలు, జూలై 15 నుండి 25 డిగ్రీలు ఉంటుంది.
  • పంటలు: పశుపోషణ, గొర్రెల పెంపకం, గోధుమలు, మొక్కజొన్నలు, బంగాళాదుంపలు, బార్లీ, చెరుకు, ద్రాక్ష.
  • పరిశ్రమలు: ఇనుము, ఉక్కు, యంత్ర పరికరాలు, కలప, రసాయనాలు, దుస్తులు, చమురు, సహజ వాయువులు, చమురుశుద్ధి, వైన్, బీర్, ఫుడ్ ప్రాసెసింగ్, పాల ఉత్పత్తులు.
  • స్వాతంత్య్రం: మొదటిసారి 1918లో... రెండోసారి 1945లో...
  • సరిహద్దులు: పశ్చిమ జర్మనీ, చెకొస్లోవేకియా, హంగేరి, యుగోస్లోవియా, స్విట్జర్లాండ్

చరిత్ర[మార్చు]

క్రీస్తు పూర్వం 500లో కెల్ట్ అనే తెగ ప్రజలు ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని తమ ఆధిపత్యాన్ని చూపించారు. ఆ తర్వాత రోమన్‌లు, వండాల్‌లు, విసిగోత్‌లు, హన్‌లు, హంగేరియన్ మాగ్యార్‌లు, జర్మనీ తెగలు ఈ ప్రాంతాన్ని వందలాది సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు ఆస్ట్రియా భూభాగంలో చెకొస్లోవేకియా, హంగేరి, యుగోస్లావియా దేశ భూభాగాలు కలిసి ఉండేవి.క్రీస్తుశకం 1246లో స్విట్జర్లాండ్‌కు చెందిన ఆల్సేసియన్ కుటుంబం ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని పరిపాలన ఆరంభించింది. ఆ కుటుంబమే హాప్స్‌బర్గ్ కుటుంబం. ఈ రాజులే ఆ కాలంలో ఆ భూభాగానికి వియన్నాను రాజధానిగా నిర్మించింది. 1530 నాటికి వియన్నా ఒక గొప్పనగరంగా విస్తరించింది. ఈ రాజులు ఇటలీ, నెదర్‌లాండ్, స్పెయిన్ వరకు తమ భూభాగాన్ని విస్తరించారు. ప్రతిసారీ రాజకుటుంబం పవిత్ర రోమన్ చక్రవర్తిని ఎన్నుకునేది. ఈ హాప్స్‌బర్గ్ కుటుంబం ఆస్ట్రియాను దాదాపు 600 సంవత్సరాల వరకు పరిపాలించింది. 1914 జూన్ 28న సరజోనో అనే ప్రాంతంలో ఒక సెర్బియన్ వ్యక్తి రాజ కుటుంబపు యువరాజు ఆర్చిడ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌ను పిస్తోలుతో కాల్చి చంపాడు. ఈ సంఘటన క్రమంగా పెద్దదై మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసింది.

సంస్కృతి - ప్రజలు[మార్చు]

దేశంలో 8% ప్రజలు రోమన్ క్యాథలిక్కులు. ఇక్కడి సమాజంలో చర్చి ఒక గొప్ప శక్తిమంతమైన కేంద్రం. కన్నె మేరీ చర్చిలు ఎక్కువ. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఆదివారం రోజున చర్చిని సందర్శిస్తారు. ప్రజలకు మతం పట్ల ఎంతో నమ్మకం. ఇక ప్రతీ కుటుంబానికి తప్పకుండా ఇల్లు ఉంటుంది. దేశంలో నిరుద్యోగ సమస్య లేదు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మాతృభూమి ఆస్ట్రియా. కాని ఆయన జర్మనీకి వలస వెళ్లి అక్కడ అధికారం చూపించాడు. దేశంలో జర్మన్ల జనాభా అధికం కావడం వల్ల జాతీయ భాషగా జర్మనీ భాషను గుర్తించారు. ఇంకా టర్కిష్‌లు, హంగేరియన్‌లు, పోలిష్, సెర్బియన్‌లు, క్రొయేషియన్‌లు ఇలా అనేక దేశాలవాళ్లు ఉన్నారు.

దేశంలో వివిధ జాతుల వాళ్లు ఉండడం వల్ల వాళ్ల మూలాలను కాపాడుకోవడానికి తమ జాతిపరమైన ఆచార వ్యవహారాలను పాటిస్తుంటారు. వీరిలో అధికశాతం క్రైస్తవులు కావడం వల్ల క్రీస్తు ఆరాధన అధికంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆధునిక శైలి దుస్తులనే ధరిస్తారు. వ్యవసాయం చేసే రైతులు కూడా ఆధునికంగానే ఉంటారు.

ఈ దేశపు ప్రముఖ వ్యక్తులు[మార్చు]

ఆహారం[మార్చు]

ఒక ఆస్ట్రియా మాంసాహార వంటకము

ఆస్ట్రియా దేశంలో ప్రజల ముఖ్య ఆహారం మాంసం. మాంసంతో చేసిన వంటకం పూర్వ కాలం నుండి ఒక ప్రధాన వంటకంగా వస్తోంది. దీనిని రాయల్ క్యూసిన్ హాఫ్‌కాచి అంటారు. ఆఫ్రికాటజామ్‌తో చేసిన క్రాప్‌ఫెన్, ఆపిల్స్‌తో చేసిన ఆఫ్‌ఫెల్ స్ట్రుడెల్, టాప్‌ఫెన్ లాంటి పేర్లు గల వంటకాలను భుజిస్తారు. వీరు పాల ఉత్పత్తులను బాగా తింటారు. దేశంలో వివిధ దేశాల ప్రజలు ఉండటం వల్ల ఇక్కడ వివిధ దేశాల వంటకాలు లభ్యమవుతాయి. ఐన్‌స్పేనర్ అని పిలిచే కాఫీ ఈ దేశపు ప్రత్యేకత. ప్రజలు బీరు, వైన్ బాగా తాగుతారు.

పరిపాలనా పద్దతులు[మార్చు]

ఆస్ట్రియా దే శాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం తొమ్మిది రాష్ట్రాలుగా విభజింకారు. ఈ రాష్ట్రాలు తిరిగి జిల్లాలుగా విభజింపబడి ఉన్నాయి. తొమ్మిది రాష్ట్రాలు

  1. బర్గెన్‌లాండ్
  2. కారింధియా
  3. లోయర్ ఆస్ట్రియా
  4. సార్జ్‌బర్గ్
  5. స్ట్రెరియా
  6. టైరోల్
  7. అప్పర్ ఆస్ట్రియా
  8. వియన్నా
  9. వోరల్‌బెర్గ్

దేశంలో పెద్ద నగరాలు వియన్నా, గ్రాజ్, సార్జ్‌బర్గ్, ఇన్నిస్‌బ్రక్, క్లాగెన్‌ఫర్ట్, విల్లాచ్, వెల్స్ మొదలైనవి ఉన్నాయి. దేశంలో ఫెడరల్ రాజ్యాంగం అమలులో ఉంది. ఫెడరల్ అధ్యక్షుడు దేశాధిపతి. ఇతనితో పాటు ఫెడరల్ ఛాన్సలర్ కూడా ఉంటాడు. అధ్యక్షుడిని నేరుగా ప్రజలు ఎన్నుకుంటారు. దేశంలో ప్రజలకు 16 ఏళ్లు నిండగానే ఓటు హక్కు లభిస్తుంది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

దర్శనీయ ప్రాంతాలు[మార్చు]

ఆస్ట్రియా ద్వారా ఎగుమతి చేయబడే ఉత్తత్తుల వివరాలు

వియన్నా[మార్చు]

వియన్నా నగరం దేశానికి రాజధాని. ఇది 12 శతాబ్దంలో నిర్మితమైంది. ఎందరో రాజులు ఈ నగరం నుండే తమ పరిపాలనను కొనసాగించారు. దేశంలో అతి పెద్ద నగరం వియన్నానే. 1275లో నిర్మితమైన ఈ నగరం నడిబొడ్డున అద్భుతమైన హాఫ్‌బర్గ్ రాజప్రాసాదం నగరానికే తలమానికమైన రాజప్రాసాద భవనం. 88 సంవత్సరాల తర్వాత కూడా ఈ భవనం చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. దేశాధ్యక్షుడు ఈ రాజప్రాసాదం నుండే వ్యవహారాలను నడుపుతాడు. 59 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ భవనంలో 2600 గదులు, 19 వసారాలు ఉన్నాయి. వియన్నా నగరంలో ఇంపీరియల్ పాలెస్‌తో పాటు సెసేషన్ మ్యూజియమ్, అప్లైడ్ ఆర్ట్ మ్యూజియం, స్ట్రాట్సోపర్ నేషనల్ ఓపెరా భవనం, స్టీఫెన్స్‌డమ్ క్యాథడ్రల్, డోనాటర్మ్ టవర్, స్పానిష్ రైడింగ్ పాఠశాల, హెర్మిస్ విల్లా, ఫెర్రీవీల్, ఎంపరర్స్ టోంబ్ ఇలా అనేక అద్భుత కట్టడాలు ఉన్నాయి. వియన్నా నగరంలోని ఆ కాలం నాటి విశాలమైన, అద్భుతమైన భవనాలను చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. విశాలమైన రోడ్లు, పురాతన, అధునాతన భవనాలు చూపరులను ఎంతో ఆకర్షిస్తాయి. దేశంలో వియన్నా నగరాన్ని చూడడానికి సంవత్సరంలో లక్షలాది సందర్శకులు వస్తూ ఉంటారు.

ఇన్స్‌బ్రక్[మార్చు]

ఆల్పైన్ పర్వత పాదాల వద్ద నెలకొన్న ఇన్స్‌బ్రక్ నగరం ప్రకృతి శోభను వెదజల్లే ఒక అందమైన నగరం. పర్వతాలను ట్రెక్కింగ్ చేయడానికి, నగరానికి పరిసరాల్లో ఉన్న 25 రిసార్ట్ గ్రామాలను పర్యటించి అందాలను ఆస్వాదించాలన్నా తప్పక ఇన్స్‌బ్రక్ వెళ్లాల్సిందే. ఈ నగరం టైరోల్ రాష్ట్రానికి రాజధాని. 15వ శతాబ్దంలో ఈ నగరం నిర్మించబడింది. పాతనగరంలో 15వ శతాబ్దం నాటి భవనాలు, రాజుల నివాసాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ నగరంలోనే ఎక్కువగా వింటర్ ఒలింపిక్స్ జరుగుతూ ఉంటాయి. స్కై రిసార్సులు అనేకం ఇక్కడ ఉన్నాయి. ఆస్ట్రియా దేశంలో ఈ నగరం ఆటలకు ప్రసిద్ధి. చలికాలంలో ఈ నగరంలో మంచు పరుచుకుని ఎంతో అందంగా కనబడుతుంది.

ఈ నగరంలో సెయింట్ జాకబ్ క్యాథడ్రల్, మారియాహిఫ్ భవనం. బెర్గిసెల్ స్కై జంపింగ్ కొండ, అన్నాసాలే, నోర్డ్‌పార్క్, ఎనిమిది మ్యూజియంలు, గోల్డెన్ రూఫ్, ట్రయంఫ్ ఆర్చ్, స్ల్కాన్ అంబ్రాస్ ప్రాసాదం, విల్టెనర్ బాలిసికా, ఇలా ఎన్నో వింతలు, విశేషాలు ఈ నగరంలో కనిపిస్తాయి.

గ్రాజ్[మార్చు]

దీనిని విద్యార్థుల నగరంగా కూడా పిలుస్తారు.మొత్తం దేశంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్న నగరం గ్రాజ్. ఈ నగరంలో ఆరు విద్యాలయాలు ఉన్నాయి. దాదాపు 50 వేల మంది విద్యార్థులు ఈ విద్యాలయాల్లో చదువుతూ ఉన్నారు. నగరంలో అనేక మ్యూజియాలు ఉన్నాయి. ఈ నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. మూర్‌నది తీరంలో ఈ నగరం ఉంది. 12వ శతాబ్దం నాటి కట్టడాలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి.

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త జొహన్నన్ కెప్లర్ ఈ నగరంలోనే పుట్టాడు. నివాస గృహాలు ఎంతో విచిత్రంగా ఉంటాయి. పైకప్పులు ఎరుపు రంగులో ఉంటాయి. పాతనగరంలో టౌన్‌హాల్ భవనం, స్ల్కాస్‌బర్, క్లాక్‌టవర్, ఆర్ట్ మ్యూజియం, లాండ్‌హౌస్, లాండెస్ జుగాస్, ఓపెర్నాస్, క్యాథడ్రల్, ఫెర్డినాండ్ మాసోలియం, ఫ్రెడరిక్ బుర్జ్, పెయింటింగ్ హౌస్, ఆధునిక ఆర్ట్ మ్యూజియం మొదలైన పురాతన కట్టడాలు, దాదాపు 21 మ్యూజియంలు, 228 అతి ఎత్తై భవనాలు ఉన్నాయి. ఈ నగరం 17 జిల్లాలుగా విభజింపబడి ఉంది.

వాచౌ[మార్చు]

ఇది దేశంలో అత్యంత పురాతన నగరం.క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి ఈ నగరం ఉనికిలో ఉందని చ రిత్ర చెబుతుంది. ఎందరో రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ నగరంలోనే ఒకప్పుడు ఇంగ్లండు రాజు రిచర్డు కొంతకాలం బందీగా ఉన్నాడు. ఈ నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. క్రీ.పూ. 15వ శతాబ్దంలో రోమన్‌లు ఈ ప్రాంతాన్ని పాలించారు. సా.శ. 995లో క్రేమ్స్‌లు పాలించారు. వాచే అనే పేరు అప్పుడు పెట్టిందే. ఆ తరువాత అనేకమంది రాజులు ఈ ప్రాంతాన్ని పాలిస్తూ వచ్చారు.

ఈ నగరంలో ఉన్న మెల్క్ అచే, కెనన్స్ అచే కట్టడాలు ఆ కాలంలో కట్టినవే. అవి నేటికీ నిలిచి ఉన్నాయి. డాన్యూబ్ నదీ తీరంలో వెలిసిన ఈ నగరంలో చూడదగిన కట్టడాలు అనేకం ఉన్నాయి. మెల్క్ అచే, గోట్టిగ్ అచే, డర్న్‌స్టీన్ కాజిల్, కూన్‌రింగర్ క్యాజిల్, షాలాబర్గ్ క్యాజిల్, గోతిక చర్చి, 15వ శతాబ్దంలో నిర్మించిన స్టీనర్‌టో గేటు, ఎరెన్ ట్రూడిస్ చాపెల్.

12వ శతాబ్దంలో నిర్మించిన బర్‌గ్రూయిన్ ఆగస్టీన్ క్యాజిల్, స్ల్కాస్ షాన్‌బెహల్, ఇలా ఎన్నో శతాబ్దాల నాటి కట్టడాలు నేడు మనం చూడవచ్చు. డాన్యూబ్‌నది ఎక్కడెక్కడ మలుపులు తిరుగుతుందో అక్కడక్కడ చిన్న చిన్న పట్టణాలు వెలయడం వల్ల వాచౌ నగరం ఒక గొప్ప ప్రకృతి రమణీయమైన పాత కొత్త కలయికల అపూర్వ నగరంగా విరాజిల్లుతోంది.

సాల్జ్‌బర్గ్ నగరం[మార్చు]

సాల్జ్‌బర్గ్ నగరం

ఆస్ట్రియా దేశపు కథల పుస్తకం సాల్జ్‌బర్గ్ అని ప్రసిద్ధి. ఈ నగరం సాల్జాక్ నది తీరంలో ఉంది. కొండ మీద 900 సంవత్సరాల క్రితం నిర్మించబడిన రాజ భవనం ఈ రోజు ఈ నగరానికి ఒక గొప్ప ఆకర్షణ కేంద్రంగా నిలిచింది. ఈ నగరాన్ని ఐరోపా దేశపు గుండె కాయ అంటారు. దేశం మొత్తంలో జాతీయ పండగల నిర్వహణ ఈ నగరంలోనే జరుగుతుంది. ప్రపంచ ప్రసిద్ధ సంగీతకారుడు వెలుజార్ట్ జన్మస్థానం ఈ నగరమే. అందువల్ల ఈ నగరంలో నేషనల్ ఓపెరా భవనం నిర్మింపబడింది.

ఇదొక అద్భుత కట్టడం. ఇక్కడ సంగీత కార్య్రకమాల్లో పాల్గొనడానికి ఎన్నో దేశాల నుండి కళాకారులు, సంగీత ప్రియులు ఇక్కడికి వస్తారు. నగరానికి చుట్టూ సరస్సులు, పర్వత సానువులు ఉండడం వల్ల ఈ నగరం పూర్తిగా ఒడిలో ఉన్నట్టుగా కనబడుతుంది. పాతనగరంలోని పురాతన కట్టడాలు చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.

ఆస్కార్ ఆర్నథర్ భవనం, సాల్జ్‌బర్గ్ గుమ్మటాలు, చర్చి భవనాలు, రాజ ప్రాసాదాలు, క్యాజిల్స్ నగరంలో పర్యాటకులను ఆకర్షించే నిర్మాణాలు. ఈ పాత నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేది. సెయింట్ పీటర్స్ అనీ, మోడరన్ ఆర్ట్ మ్యూజియం భవనాలు కూడా చూడదగ్గవి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Austria, economic data". International Monetary Fund. Retrieved 2008-09-30.

బయటి లంకెలు[మార్చు]