Jump to content

మోజార్ట్

వికీపీడియా నుండి
సాల్జ్‌బర్గ్ లో మోజార్ట్ పుట్టిన స్థలం

మోజార్ట్ గా పిలవబడే వుల్ఫ్‌గ్యాంగ్ అమెడ్యూస్ మోజార్ట్ (1756 జనవరి 27 – 1791 డిసెంబరు 5) పాశ్చాత్య సాంప్రదాయ సంగీతంలో పేరెన్నికగన్నవాడు.

హోలీ రోమన్ సామ్రాజ్యంలోని సాల్జ్‌బర్గ్ లో జన్మించిన మోజార్ట్ చిన్నతనం నుంచే బాల మేధావిగా పేరుగాంచాడు. కీబోర్డు, వయొలిన్ లో నిష్ణాతుడైన మోజార్ట్ ఐదు సంవత్సరాల వయసు నుంచే సంగీతం స్వరపరచడం, రాజ కుటుంబాల ముందు ప్రదర్శనలివ్వడం చేశాడు. 17 సంవత్సరాల వయసుకు సాల్జ్‌బర్గ్ కోర్టులో సంగీతకారుడుగా నియమితుడయ్యాడు. కానీ ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందక ఇంకా మంచి ఉద్యోగం కోసం కొన్ని చోట్ల తిరిగాడు. 1781 లో వియన్నా లో సంచరిస్తుండగా సాల్జ్‌బర్గ్ కోర్టు ఉద్యోగం నుంచి తీసివేశారు. దాంతో అతను వియన్నాలోనే ఉండాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ అతనికి కీర్తి దక్కింది కానీ ఆర్థికంగా స్థిరపడలేకపోయాడు. వియన్నాలో అతని చివరి సంవత్సరాలలో సుప్రసిద్ధమైన సింఫనీలు, కాన్‌సెర్టో, ఒపెరాలు స్వరపరిచాడు. 35 సంవత్సరాలకే మరణించాడు. అతని మరణానికి కారణాలపై పూర్తి స్థాయి స్పష్టత లేదు.

అతను మొత్తం 600కి పైగా సంగీత కళాఖండాలను స్వరపరిచాడు. ప్రపంచంలో సాంప్రదాయ సంగీత స్వర కర్తల్లో అత్యుత్తమమైన వారిలో ఒకడిగా పరిగణిస్తారు.[1][2] పాశ్చాత్య సంగీతం మీద అతను చాలా గాఢమైన ముద్ర వేశాడు. బీతోవెన్ తన తొలిరోజుల్లో మోజార్ట్ నీడలోనే అనేక స్వరాలు సృష్టించాడు. జోసెఫ్ హేడెన్ మోజార్ట్ లాంటి సంగీతజ్ఞుడు మరో 100 సంవత్సరాల దాకా ఉండడని వ్యాఖ్యానించాడు.[3][4]

జీవితం

[మార్చు]

వుల్ఫ్‌గ్యాంగ్ అమెడ్యూస్ మోజార్ట్ 1756, జనవరి 27 న లియోపోల్డ్ మోజార్ట్, అన్నా మారియా దంపతులకు హోలీ రోమన్ సామ్రాజ్యంలో భాగమైన సాల్జ్‌బర్గ్ లో జన్మించాడు.[5] ఈ ప్రాంతం ప్రస్తుతం ఆస్ట్రియాలో ఉంది. ఇతను ఏడుమంది సంతానంలో ఆఖరివాడు. వీళ్ళలో ఐదుమంది చిన్నతనంలోనే మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. "Mozart: An Appreciation". classicfm.com.
  2. "The 50 Greatest Composers of All Time". www.classical-music.com.
  3. Landon 1990, p. 171
  4. Landon 1990, p. 171
  5. Arnold, Rosemarie; Taylor, Robert; Eisenschmid, Rainer (2009). Austria. Baedeker. ISBN 978-3-8297-6613-5. OCLC 416424772.
"https://te.wikipedia.org/w/index.php?title=మోజార్ట్&oldid=3094216" నుండి వెలికితీశారు