తొమ్మిది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
8 9 10
−1 0 1 2 3 4 5 6 7 8 9
Cardinalnine
Ordinal9th
(ninth)
Factorization32
Roman numeralIX
Unicode symbol(s)Ⅸ, ⅸ
Greek prefixennea-
Latin prefixnona-
Binary10012
Ternary1003
Quaternary214
Quinary145
Octal118
Duodecimal912
Hexadecimal916
Vigesimal920
Base 36936
Amharic
Arabic-Indic numeral٩
Armenian numeralԹ
Bengali
Chinese/Japanese
/Korean numeral
九 (jiu)
玖 (formal writing)
Devanāgarī (Nao)
Greek numeralθ´
Hebrew numeralט (Tet)
Tamil numeral
Khmer
Telugu numeral
Thai numeral

తొమ్మిది (9) ఒక సహజ సంఖ్య, దీనికి ముందు గల సంఖ్య ఎనిమిది (8), తరువాత వచ్చే సంఖ్య పది (10).

వాడుకలో తొమ్మిదవ, తొమ్మిదో అనే పదాలను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల తొమ్మిదికి బదులు నవ ఉపయోగిస్తారు. ఉదాహరణకు తొమ్మిది గ్రహాలను నవగ్రహాలు అంటారు.

భారతీయ సంస్కృతి[మార్చు]

“తొన్ను” ని “పది” తో సంధించగా “తొమ్మిది” వచ్చిందని అనుకుంటే ఈ మాట యొక్క వాచ్యార్థం “పది కంటె ఒకటి తక్కువ.” ఇక్కడ ఏ రకం సంధి కార్యం జరిగిందో నాకు తెలియదు కాని ఈ రకం ప్రయోగం – అనగా “పది కంటె ఒకటి తక్కువ,” “ఇరవై కంటె ఒకటి తక్కువ”, వగైరా - ఇతర భాషలలో కూడ కనిపిస్తుంది. ఒక భాష నుండి మరొక భాషలోకి ఇది ఎలా వ్యాపించిందో పరిశోధన చేసి చూడాలి.

తొమ్మిదిని సంస్కృతంలో “నవ” అంటారు. కాని తెలుగులో “నవ” అన్న మాటని మూడర్థాలులో వాడతారు: కొత్త, తొమ్మిది, దురద. ఈ మూడర్థాలతోటీ ఏ విధమైన సంబంధమూ లేని “నవ” మాటలు కూడ ఉన్నాయి. ఉదాహరణకి మెట్రిక్ పద్ధతి అమలు లోకి రాడానికి పూర్వం కృష్ణా జిల్లాలో వాడుకలో ఉండే “నవటాకు” అంటే సేరులో ఎనిమిదో వంతు, తొమ్మిదో వంతు కాదు. పైపెచ్చు ఒక “నవటాకు” = 10 తులాలు. .

ఇదే విధంగా “నవరసు” అన్న మాటలో “నవ” నేతిబీరకాయలో నెయ్యి లాంటిది. “నవరసు” అనే మాట “సావరిన్” (sovereign) అనే ఇంగ్లీషు మాటకి బ్రష్టరూపం. తెలుగులో ఈ మాటని కేవలం బంగారపు నాణేలని ఉద్దేశించి మాత్రం వాడేవారు. ఇదే విధంగా నవారు, నవాబు, నవాసారం అనే మాటలలో “నవ” కి కొత్తదనంతో కాని, తొమ్మిదితో కాని, దురదతో కాని ఏ విధమైన సంబంధం ఉన్నట్లు తోచదు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి లగాయతు నవమి వరకు నడిచే కాలాన్ని నవరాత్రులు అంటారు. దీనినే దసరా అని కూడ అంటారు. “దశరాత్రి పండుగ” అనే సమాసానికి క్లుప్త రూపమే దసరా అని ఎంతమందికి తెలుసు? అంటే “నవరాత్రులు” లో చివరి రోజుని విజయదశమి అంటారా? ఇక్కడ ఎదో లెక్క తప్పింది!

శృంగారము, హాస్యము, కరుణము, వీరము, రౌద్రము, భయానకము, బీభత్పము, అద్భుతము, శాంతము - అనే తొమ్మిది రసములను నవరసములు అంటారు.

నవధాన్యాల పేర్లు: వడ్లు, ఉలవలు, పెసలు, మినుగులు, నువ్వులు, గోధుమలు, అనుములు, కందులు, సెనగలు.

నవరత్నాలు ఏవేవో నాకు ఇప్పటికి ఇదమిత్థంగా తెలియదు. ఒకొక్క చోట ఒకొక్కలా ఉన్నాయి. ఈ సందిగ్ధతకి కారణం ఇంగ్లీషు పేర్లకి, తెలుగు (సంస్కృతం) పేర్లకి మధ్య పొత్తు లేకపోవడం. అమరకోశం ప్రకారం Emeralds అంటే పచ్చలు. కానీ గరుత్మతం, మరకతం, అశ్వగర్భం, హరిన్మణి అన్నా పచ్చలే. అనగా ఈ నాలుగూ పచ్చలలో రకాలో లేక “పచ్చలు” అన్న మాటకి నానాఅ ర్థాలో నాకు తెలియదు. అలాగే Rubies అంటే కెంపులు. ఈ కెంపులలో కూడా రకాలు ఉన్నాయి: శోణరత్నం, లోహితకం, పద్మరాగం. పగడం తెలుగు, ప్రవాళం సంస్కృతం. ముత్యం తెలుగు, మౌక్తికం సంస్కృతం. ఈ సందర్భంలో gem అంటే రత్నం కానీ మణి కాని అవుతుంది.

ఈ రకం వైవిధ్యతని మనస్సులో పెట్టుకుంటే, ఒక జాబితా ప్రకారం నవరత్నాలు ఇవి:: 1. వజ్రం (diamond), 2. వైడూర్యం (cat ‘s eye or lapis lazuli), 3. నీలం (blue sapphire), 4. గోమేధికం (topaz or onyx), 5. పుష్యరాగం (topaz), 6. గరుడ పచ్చ (emerald), 7. కెంపు (ruby), 8. పగడం (red coral), 9. ముత్యం, (pearl). ఇంగ్లీషులో చూస్తే, “these gems are 1. diamond, 2. chrysoberyl cat's eye, 3. blue sapphire, 4. orange hessonite garnet, 5. yellow sapphire, 6. emerald, 7. ruby, 8. red coral, and 9. pearl” అని ఉంది. నిజానికి ఆభరణాలలో వాడే విలువైన రాళ్ళు తొమ్మిది కంటే ఎక్కువే ఉన్నాయి!

నవగ్రహాలలో తొమ్మిదో గ్రహం అయిన ప్లూటో “గ్రహం కాదు” అని వాదించి దానిని గ్రహాల జాబితాలోంచి దింపేశారు. ప్లూటోకి ఈ దుర్దశ ఎన్నాళ్లు ఉంటుందో తెలియదుకాని, ఇటుపైన అల్లుడిని “జామాతా నవమ గ్రహః” అని అనాలో ఏమో అని నేను కంగారు పడ్డ మాట మాత్రం వాస్తవం. కాని మనకి ఆ బెంగ అక్కరలేదు. ప్లూటో గ్రహం అయినా కాకపోయినా మన నవగ్రహ పూజలకి ఢోకా లేదు. మనం ప్లూటోనే కాదు యూరెనస్ (ఉచ్చారణ యురేనస్ కాదు) ని కూడ గ్రహాల జాబితాలో ఎప్పుడూ వెయ్యలేదు. మన జ్యోతిష శాస్త్రపు దృష్టిలో ఒక నక్షత్రమైన సూర్యుడూ గ్రహమే, ఉపగ్రహమైన చంద్రుడూ గ్రహమే, మిధ్యాబిందువులయిన రాహు, కేతువులూ గ్రహాలే. కనుక తెలుగులో “గ్రహం” ఇంగ్లీషులో “ప్లేనెట్” కి సమానార్థకం కాదు.

నవజని లో “నవ” అంటే తొమ్మిదీ కాదు, కొత్తా కాదు. నవాసారాన్ని సున్నాన్ని కలపగా వచ్చే గాఢమైన అమ్మోనియా వాయువుకి నేను పెట్టిన తెలుగు పేరు. ఉదజని, నత్రజని లాగే నవజని ఒక వాయువు.

“నవామ్లం” అన్నది “ఎమీనో ఏసిడ్” కి నేను పెట్టిన తెలుగు పేరు. ప్రాణ్యాలు (proteins ) అనే గొలుసులలో నవామ్లాలు పూసల లాంటివి. ఈ గొలుసులు-పూసలు నమూనాలో పూసలు గుండ్రంగా, సౌష్టవంగా ఉండకుండా, కొంచెం కోలగా, గురువింద గింజ మాదిరి ఒక పక్క ఎర్రగా, రెండవ పక్క నల్లగా ఉన్నట్లు ఊహించుకోవాలి. అప్పుడు ఎర్రగా ఉన్న మొనని “ఎమీన్ శీర్షం” లేదా “నవ శీర్షం” అనిన్నీ, నల్లగా ఉన్న మొనని “ఆమ్ల శీర్షం” అనిన్నీ పిలవొచ్చు. నవ శీర్షం, ఆమ్ల శీర్షం ఉన్న ఈ బణువులని “నవామ్లాలు” (amino acids ) అంటారు.

పూర్వం, రోజుకి పన్నెండు గంటలే ఉండే రోజుల్లో, తొమ్మిదో (ఇప్పటి లెక్కలో మధ్యాహ్నం మూడు) గంట వేళప్పుడు చేసే దేవతార్చనని లేటిన్‌లో “నోన్” అనే వారు. ఇందులోంచే ఇంగ్లీషు “నూన్” వచ్చింది.

గణితంలో తొమ్మిదికి ప్రత్యేక స్థానం ఉంది. తొమ్మిదిని ఉపయోగించి రకరకాల లెక్కలు, చమత్కారపు గారడీలు (“ట్రిక్కులు”) చెయ్యవచ్చు.

మొదటి గారడీ. ఒక సంఖ్యలోని అంకెలని కూడగా వచ్చిన మొత్తం 9 కి గుణకం అయితే ఆ సంఖ్యని 9 చేత నిశ్శేషంగా భాగించవచ్చు. ఉదాహరణకి 6363 ని తీసుకుందాం. ఈ సంఖ్యలో అంకెలని కూడగా వచ్చిన మొత్తం 18. ఇది 9 యొక్క గుణకమే కదా. కనుక 6363 ని 9 చేత భాగిస్తే శేషం ఉండదు.

రెండవ గారడీ. ఏదైనా ఒక సంఖ్యని తీసుకొండి. మచ్చుకి 26 అనుకుందాం. దీనిని తిరగేస్తే 62 వచ్చింది కదా. ఈ రెండింటిలో పెద్ద దాని నుండి చిన్న దానిని తీసివెయ్యగా 36 వచ్చింది. ఈ 36 ని 9 చేత నిశ్శేషంగా భాగించవచ్చు.

మూడో గారడీ . మన 9 ని 1 చేత, 2 చేత, 3 చేత, … అలా గుణించుకుంటూ పోయినప్పుడు వచ్చే లబ్దాలు 9, 18, 27, 36,… వగైరా కదా. ఈ లబ్దాలలో ఉన్న అంకెలని కూడగా వచ్చే మొత్తం ఎల్లప్పుడూ తొమ్మిదే.

భారతీయ గణితశాస్త్రంలో “నవాధికేన” అనే సూత్రం ఉంది. దీన్ని ఇంగ్లీషులో “కేస్టింగ్ ఔట్ ద నైన్స్” అంటారు. కేలుక్యులేటర్లు లేని రోజుల్లో కూడికలు, గుణకారాలు సరిగ్గా చేసేమో లేదో చూసుకుందుకి నవాధికేన సూత్రం వాడేవారు. ఉదాహరణకి 239 ని 4649 తో గుణించగా వచ్చిన లబ్దం 111 111 1 అని ఎవరో చెప్పేరనుకుందాం. మన దగ్గర కలనయంత్రాల వంటి పరికరాలు లేవనుకుందాం. అప్పుడు పైన నుడివిన గుణకారపు ఫలితం తప్పా, ఒప్పా అని ఎలా నిర్ణయించటం? ఈ సందర్భంలో నవాధికేన సూత్రం ఉపయోగించేవారు. అదెలాగో చెబుతాను. మొదట 2, 3, 9 లని కూడగా 14 వచ్చింది కదా. ఇందులోంచి 9 తీసెయ్యగా 5 మిగిలింది. దీనిని అలా ఉంచి, ఇప్పుడు 4649 లో ఉన్న అంకెలని కలిపితే 23 వచ్చింది. ఇందులోంచి 9 ని రెండు సార్లు తీసివెయ్యగా 5 మిగిలింది. ఇందాకటి 5 నీ ఈ 5 నీ గుణిస్తే 25 వచ్చింది. ఇందులో ఉన్న 2, 5 కలపగా 7 వచ్చింది. ఇహ ఇందులోంచి 9 తీసెయ్యటానికి కుదరదు కనుక ఈ 7 ని అలా ఉంచి, ఇప్పుడు లబ్దంలో ఉన్న ఏడు ఒకట్లని కలపగా మళ్లా 7 వచ్చింది కనుక మనం చేసిన గుణకారం మూడొంతులు ముప్పాతిక తప్పు కాదు అని నిర్ణయిస్తాం. మనం చేసిన గుణకారం ఖరాఖండీగా ఒప్పు అని చెప్పటానికి వీలు లేదు. వ్యాస విస్తరణ భీతి వల్ల ఆ వివరాలన్నీ ఇక్కడ ఉటంకించటానికి కుదరదు. కుతూహలం ఉన్నవాళ్లు మెదడుకి మేత వేసి చూసుకోవచ్చు – ఇదేమీ అంత బ్రహ్మ విద్య కాదు.లేదా, గూగులమ్మని సంప్రదించండి.

గణితంలోనే కాకుండా మన ప్రాచీన సంస్కృతిలో తొమ్మిదికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రెండు చిన్న ఉదాహరణలు ఇస్తాను. నూట ఎనిమిది మనకి చాల పవిత్రమైన సంఖ్య. దేవుడిని అష్టోత్తరశతనామాలతో స్తుతిస్తాం. ఉపనిషత్తులు 108. ఈ 108 లో ఉన్న అంకెలని కలిపితే 9 వస్తుంది.

మరొక ఉదాహరణ. కలియుగం పొడుగు 4,32,000 సంవత్సరాలు. ఈ సంఖ్యలో అంకెల మొత్తం 9. ద్వాపర యుగం పొడుగు దీనికి రెండింతలు, అనగా 8,64,000 సంవత్సరాలు. ఈ సంఖ్యలో ఉన్న అంకెలని కలపగా 18, వీటిని కలపగా 9. ఇదే విధంగా త్రేతాయుగం, కృతయుగం. ఈ నాలుగు యుగాల కాలం అయిన ఒక మహాయుగంలో 43,20,000. ఈ సంఖ్యలో అంకెలని కూడగా 9. ఒక కల్పంలో 71 మహాయుగాలు కనుక కల్పంలో 30,67,20,000 సంవత్సరాలు. ఇందులో ఉన్న అంకెలన్నీ కలిపితే 18, వీటిని కలిపితే 9. ఇలా తొమ్మిది పదే పదే రావటాన్ని చూస్తే ఎవ్వరో లెక్కల మీద పిచ్చి ఉన్న వ్యక్తి తయారు చేసిన ప్రణాళికలా కనిపిస్తుంది.
 • తొమ్మిది సంఖ్యకు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధిక ప్రాధాన్యత నిస్తారు. ఎందుకంటే వివిధ డిజిట్ సంఖ్యలలో పెద్ద సంఖ్యగా ఉదాహరణకు ఒక అంకె సంఖ్యలలో 9 పెద్ద సంఖ్య, రెండు అంకెల స్థానంలో 99 పెద్ద సంఖ్య, అంతేకాక ఆధ్యాత్మిక పరంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు నవగ్రహాలు, నవరాత్రులు, నవరత్నాలూ మొదలగునవి.

వివిధ భాషలలో[మార్చు]

నైన్ nine ఆంగ్లం
నౌ नौ హిందీ
.. కన్నడం
.. తమిళం
.. మళయాళం
.. బెంగాలీ
.. ఒరియా
.. మరాఠీ
.. గుజరాతీ
.. పంజాబీ
.. కష్మీరీ
.. నేపాలీ భాష
.. మణిపురి భాష
.. అస్సామీ భాష
.. కష్మీరీ
.. సంస్కృతం

గణితం[మార్చు]

తొమ్మిది ఒక మిశ్రమ సంఖ్య, దీని సరైన విభాజకములు 1, 3. ఇది 3 సార్లు 3, అలాగే 3 యొక్క స్క్వేర్ నంబర్. తొమ్మిది ఒక Motzkin సంఖ్య. ఇది మొదటి మిశ్రమ అదృష్ట సంఖ్య, దానితో పాటు మొదటి మిశ్రమ బేసి సంఖ్య. దశాంశ వ్యవస్థలో తొమ్మిది అత్యధిక సింగిల్ డిజిట్ నెంబర్. It is the second non-unitary square prime of the form (p2) and the first that is odd. All subsequent squares of this form are odd. It has a unique aliquot sum 4 which is itself a square prime. Nine is; and can be, the only square prime with an aliquot sum of the same form. The aliquot sequence of nine has 5 members (9,4,3,1,0) this number being the second composite member of the 3-aliquot tree. It is the aliquot sum of only one number the discrete semiprime 15.

There are nine Heegner numbers.[1]

Since 9 = 321, 9 is an exponential factorial.

8 and 9 form a Ruth-Aaron pair under the second definition that counts repeated prime factors as often as they occur.

In bases 12, 18 and 24, nine is a 1-automorphic number and in base 6 a 2-automorphic number (displayed as '13').

A polygon with nine sides is called a nonagon or enneagon.[2] A group of nine of anything is called an ennead.

In base 10 a positive number is divisible by nine if and only if its digital root is 9.[3] That is, if you multiply nine by any natural number, and repeatedly add the digits of the answer until it is just one digit, you will end up with nine:

 • 2 × 9 = 18 (1 + 8 = 9)
 • 3 × 9 = 27 (2 + 7 = 9)
 • 9 × 9 = 81 (8 + 1 = 9)
 • 121 × 9 = 1089 (1 + 0 + 8 + 9 = 18; 1 + 8 = 9)
 • 234 × 9 = 2106 (2 + 1 + 0 + 6 = 9)
 • 578329 × 9 = 5204961 (5 + 2 + 0 + 4 + 9 + 6 + 1 = 27; 2 + 7 = 9)
 • 482729235601 × 9 = 4344563120409 (4 + 3 + 4 + 4 + 5 + 6 + 3 + 1 + 2 + 0 + 4 + 0 + 9 = 45; 4 + 5 = 9)

తొమ్మిది యొక్క గుణింతాలకు సంబంధించిన ఆసక్తికరమైన ఇతర నమూనాలు:

 • 12345679 x 9 = 111111111
 • 12345679 x 18 = 222222222
 • 12345679 x 81 = 999999999

This works for all the multiples of 9. n = 3 is the only other n > 1 such that a number is divisible by n if and only if its digital root is n. In base N, the divisors of N − 1 have this property. Another consequence of 9 being 10 − 1, is that it is also a Kaprekar number.

The difference between a base-10 positive integer and the sum of its digits is a whole multiple of nine. Examples:

 • The sum of the digits of 41 is 5, and 41-5 = 36. The digital root of 36 is 3+6 = 9, which, as explained above, demonstrates that it is divisible by nine.
 • The sum of the digits of 35967930 is 3+5+9+6+7+9+3+0 = 42, and 35967930-42 = 35967888. The digital root of 35967888 is 3+5+9+6+7+8+8+8 = 54, 5+4 = 9.

Subtracting two base-10 positive integers that are transpositions of each other yields a number that is a whole multiple of nine. Examples:

 • 41 - 14 = 27 (2 + 7 = 9)
 • 36957930 - 35967930 = 990000, a multiple of nine.

This works regardless of the number of digits that are transposed. For example, the largest transposition of 35967930 is 99765330 (all digits in descending order) and its smallest transposition is 03356799 (all digits in ascending order); subtracting pairs of these numbers produces:

 • 99765330 - 35967930 = 63797400; 6+3+7+9+7+4+0+0 = 36; 3+6 = 9.
 • 99765330 - 03356799 = 96408531; 9+6+4+0+8+5+3+1 = 36; 3+6 = 9.
 • 35967930 - 03356799 = 32611131; 3+2+6+1+1+1+3+1 = 18; 1+8 = 9.

Casting out nines is a quick way of testing the calculations of sums, differences, products, and quotients of integers, known as long ago as the 12th Century.[4]

Every prime in a Cunningham chain of the first kind with a length of 4 or greater is congruent to 9 mod 10 (the only exception being the chain 2, 5, 11, 23, 47).

Six recurring nines appear in the decimal places 762 through 767 of pi. This is known as the Feynman point.

If an odd perfect number is of the form 36k + 9, it has at least nine distinct prime factors.[5]

If you divide a number by the amount of 9s corresponding to its number of digits, the number is turned into a repeating decimal. (e.g. 274/999 = 0.274274274274...)

Nine is the binary complement of number six:

9 = 1001
6 = 0110

ప్రాథమిక గణనల జాబితా[మార్చు]

గుణకారం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 50 100 1000
9 18 27 36 45 54 63 72 81 90 99 108 117 126 135 144 153 162 171 180 189 198 207 216 225 450 900 9000
భాగాహారం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
9 4.5 3 2.25 1.8 1.5 1.285714 1.125 1 0.9 0.81 0.75 0.692307 0.6428571 0.6
0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 1 1.1 1.2 1.3 1.4 1.5 1.6
ఘాతాంకం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
9 81 729 6561 59049 531441 4782969 43046721 387420489 3486784401 31381059609 282429536481 2541865828329
1 512 19683 262144 1953125 10077696 40353607 134217728 387420489 1000000000 2357947691 5159780352 10604499373
రాడిక్స్ 1 5 10 15 20 25 30 40 50 60 70 80 90 100
110 120 130 140 150 200 250 500 1000 10000 100000 1000000
1 5 119 169 229 279 339 449 559 669 779 889 1109 1219
1329 1439 1549 1659 1769 2429 3079 6159 13319 146419 1621519 17836619

Numeral systems[మార్చు]

Base Numeral system
2 binary 1001
3 ternary 100
4 quaternary 21
5 quinary 14
6 senary 13
7 septenary 12
8 octal 11
9 novenary 10
over 9 (decimal, hexadecimal) 9

Probability[మార్చు]

In probability, the nine is a logarithmic measure of probability of an event, defined as the negative of the base-10 logarithm of the probability of the event's complement. For example, an event that is 99% likely to occur has an unlikelihood of 1% or 0.01, which amounts to −log10 0.01 = 2 nines of probability. Zero probability gives zero nines (−log10 1 = 0). A 100% probability is considered to be impossible in most circumstances: that results in infinite improbability. The effectivity of processes and the availability of systems can be expressed (as a rule of thumb, not explicitly) as a series of "nines". For example, "five nines" (99.999%) availability implies a total downtime of no more than five minutes per year - typically a very high degree of reliability; but never 100%.

మూలాలు[మార్చు]

 1. Bryan Bunch, The Kingdom of Infinite Number. New York: W. H. Freeman & Company (2000): 93
 2. Robert Dixon, Mathographics. New York: Courier Dover Publications: 24
 3. Martin Gardner, A Gardner's Workout: Training the Mind and Entertaining the Spirit. New York: A. K. Peters (2001): 155
 4. Cajori, Florian (1991, 5e) A History of Mathematics, AMS. ISBN 0-8218-2102-4. p.91
 5. Eyob Delele Yirdaw, "Proving Touchard's Theorem from Euler's Form" ArXiv preprint.

ఇవి కూడా చూడండి[మార్చు]

ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తొమ్మిది&oldid=2881203" నుండి వెలికితీశారు