Jump to content

మరీచి మహర్షి

వికీపీడియా నుండి
(మరీచి నుండి దారిమార్పు చెందింది)
బ్రహ్మ కుమారుడైన మరీచి .

మరీచి మహర్షి (మరీచి అంటే కాంతి రేఖ అని అర్థం) బ్రహ్మ కుమారుడు. సృష్టి కార్యమునకు తనకు సాయముగా ఉండేందుకు శక్తి సంపన్నులగు 10 మంది ప్రజాపతులను సృష్టించాడు. వారిలో మరీచి ఒకరు. అందులో తొమ్మండుగురిని తన శరీరము ద్వారా ఒకరు మానసము నుండి ఉద్భవించారు. మరీచి బ్రహ్మ మానస పుత్రుడు. బ్రహ్మ మానస పుత్రులలో మరీచి ఒకరు. మరీచి భార్య కళ. మరీచి కుమారుడు కశ్యపుడు లేదా కశ్యప ప్రజాపతి.

జీవిత విశేషాలు

[మార్చు]

మరీచి మహర్షి యొక్క జీవితము ఆయన సంతతి వల్ల ఎక్కువగా తెలియబడుతుంది. ముఖ్యంగా ఆయన కుమారుడైన కశ్యపమహర్షి వల్ల. మరీచి మహర్షి కళ అను యువతిని పెండ్లియాడి కళ వల్ల కశ్యపునికి శ్రీమహావిష్ణువు అంశగా జన్మనిచ్చాడు. (కశ్యప మహర్షి తన తండ్రినుండి ప్రజపతిత్వాన్ని కూడా పొందినట్టు చెప్పబడినది).[1] రాజస్తాను రాష్ట్రములోని పుష్కర్ ప్రాంతములో బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినట్టు, ద్వాపరయుగములో మహాభారత కాలములో భీష్మునికి అంపశయ్య మీదనుండగా దర్శనమిచ్చినట్టు కూడా చెప్పబడింది. బ్రహ్మాండపురాణము తదితర పురాణములలో మరీచి ప్రస్తావన ఉంది. కృతయుగమునందు ధ్రువునికి తపస్సు చేయమని సలహా ఇచ్చినవాడు మరీచి.[2]

శ్రీహరి నాభినుండి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ తనకు సహాయకారులుగా నవబ్రహ్మలను సృష్టించాడు. వారిలో మరీచి ఒకడు.

మరీచి కర్ధముని కుమార్తెయగు కళను వివాహం చేసికొన్నాడు. కర్దమ ప్రజాపతి, దేవహుతిల తొమ్మిది మంది సంతానలో పెద్ద కుమార్తె కళ.

ఒకనాడు కళ మనసులోని మాటను తన భర్తతో; మనకన్నా మిన్న అయిన, సర్వ జీవ రాశులను సృష్టించ గల సామర్ద్యము గల ఓక పుత్రుడు కనాలని కోరిక అన్నది . కొంత కాలమునకు మరీచి అనుగ్రహంతో కళ గర్భవతి అయింది. మాసములు నిండగానే ఒక పుత్రుని కన్నది. అతనే కశ్యపుడు. కశ్యపుడు పెద్దవాడయి, దక్షప్రజాపతి పుత్రికలను పెండ్లాడి, సృష్టి ప్రారంభించాడు. సమస్త లోకముల యందు కీర్తి నీయురాలు అగు ఒక ఉత్తమ పుత్రికను ప్రసాదించమని, కోరుకోవడము జరుగుతుంది. అనంతరం కొంతకాలమునకు కళ మరల గర్భవతి అయినది. పూర్ణిమ అను కుమార్తెకు జన్మనిచ్చింది.

మరీచిస్మృతి

[మార్చు]
  • మరీచి మహర్షి మహాతపస్వి, విరాగి, మహాజ్ఞాని, స్మృతికర్త. మరీచి మహర్షి పేరున ఒక ధర్మశాస్త్రము మరీచి స్మృతి ఉంది. మరీచి స్మృతి మనకు లభించుట లేదు. పరమ పవిత్రుడు. నవ బ్రహ్మలలో ఒకడు, కశ్యపుని తండ్రియగు మరీచి మనకు ప్రాత:స్మరణీయమైనది.

మూలాలు

[మార్చు]
  1. Wilkins, W.J (2003). Hindu Mythology. New Delhi: D.K. Printworld (P) Limited. p. 370. ISBN 81-246-0234-4.
  2. Sathyamayananda, Swami. Ancient sages. Mylapore, Chennai: Sri Ramakrishna Math. pp. 14–16. ISBN 81-7505-356-9.