దేవతలు

దేవతలు అంటే దివిలో (స్వర్గం) నివసించేవాళ్ళు అని అర్థం. దేవతలు సృష్టి నిర్వహణ శక్తులు. దేవతలు రెండు రకాలు. జన్మదేవతలు, కర్మ దేవతలు. అగ్ని, ఇంద్రుడు, యముడు, వాయువు, వరుణుడు మొదలగు వారంతా జన్మ దేవతలు. భూలోకం, ఇతర లోకాల్లో పుణ్య కర్మలు చేసి వాటికనుగుణంగా స్వర్గాది భోగాలను అనుభవించడానికి వెళ్ళే నహుషుడు మొదలగువారు కర్మ దేవతలు. మొదటి తరగతి వారు అష్ట వసువులు, ఏకాదశ రుద్రలు, ద్వాదాశాదిత్యులు, ఇద్దరు అశ్వినీ దేవతలు మొత్తం 33 వర్గాలు. 33 కోట్ల దేవతలని కూడా ప్రసిద్ధి.[1]
పౌరాణిక కథనాల ప్రకారం, అదితి , దితి ఇద్దరూ సోదరీమణులు, వారిద్దరూ కశ్యపు మహర్షిని వివాహం చేసుకున్నారు. ధర్మబద్ధమైన అదితి సద్గుణవంతులైన కుమారులకు జన్మనిచ్చింది, వారు దేవతలుగా మారారు, అసూయపడే దితి క్రూరమైన అసురులకు (రాక్షసులు) జన్మనిచ్చింది. [2]
మనల్ని పాలించే లోకాలకు అధిపతి అయిన వాళ్ళ దేవుళ్ళు అయితే మనల్ని కన్నా మన తల్లిదండ్రులు అంటే మన మాతృమర్తులు కూడా మనకు దేవుల్లే. బ్రహ్మ ,విష్ణు, పార్వతి ,మహేశ్వర వీళ్ళందర్నీ కలిపి కూడా దేవతలు దేవుళ్ళుగా వర్గీకరించుకోవచ్చు.[3]
దేవతల వర్గాలు
[మార్చు]యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను తెలియజేసాయి. వీరే త్రయత్రింశతి కోటి (33 కోటి) దేవతలు. వాస్తవముగా ఈ 'కోటి' సంఖ్యను సూచించే కోటి కాదు. సంస్కృత భాషలో 'కోటి' అనగా 'విధము' 'వర్గము' అని అర్థమూ ఉంది. అందువలన 33 విధములైన దేవలనున్నారు. వారు: వసువులు 8, రుద్రులు 11, ఆదిత్యులు 12 మొత్తం కలిపితే ముప్పది ఒకటి. వీటితో పాటు ఇంద్రుడు , ప్రజాపతి అనే ఇద్దరితో కలిపి 33 అవుతుంది.[4]
హిందూ పురాణాలలో "అదితి", కశ్యపుని యొక్క 12 మంది పుత్రులను ద్వాదశాదిత్యులు అంటారు. ధాత, మిత్ర, అర్యమా, పూషా, సవిత, భగ, వివస్వాన్, తాప భాను, భాస్కర, అంశు సూర్య అనే ద్వాదశ ఆదిత్యులు.
మహాభారతం, ఆదిపర్వంలోని శ్లోకాలలో (65-15,16) చెప్పబడిన పేర్లు:
- ధాతా మిత్రః ఆర్యమా శక్రో వరుణ స్త్వంశ ఏవచ
- భగో వివస్వాన్ పూషా చ, సవితా దశమస్తథా
- ఏకాదశస్తథా త్వష్టా, ద్వాదశో విష్ణురుచ్యతే
- జఘన్యజస్తు సర్వేషా మాదిత్యానా గుణాధికః
(ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణువు)
"ఆదిత్యానామహం విష్ణుః" - ఆదిత్యులలో నేను విష్ణువును - అని భగవద్గీతలో (10-21) చెప్పబడింది.
శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిచ్చును.
- అజపాదుడు
- అహిర్భుద్న్యుడు-
- త్రయంబకుడు
- వృషాకపి
- శంభుడు
- కపాలి
- దైవతుడు
- హరుడు
- బహురూపుడు
- ఉగ్రుడు
- దీక్షాదేవి
అష్ట వసువులు (8)
[మార్చు]అష్ట వసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు.[5] పురాణాల ప్రకారం అష్ట వసు గణాలు: అనిలః., అనలః, ఆపః, ధర్మః., ప్రత్యూషః, ప్రభాసః, ధ్రువః, సోమః. ఇందులో అనిలః అనగా వాయుదేవుడు. అనలః అనగా అగ్నిహోత్రుడు. ఆపః అనగా వరుణదేవుడు. ధర్మః అనగా ధర్మదేవుడు. అష్ట సిద్ధుల్ని అనుగ్రహించేవారు అష్ట వసువులు. వసు అనగా సంపద. అనగా సంపదను అనుగ్రహించెవారు. వీరు వరుసగా దిక్పాలకత్వం కూడా వహించారు.
అశ్వినీ దేవతలు
[మార్చు]హిందూ గ్రంథాల ప్రకారం ఇద్దరు సవతుల మధ్య వైరం వల్ల అశ్వినీ దేవతలు జన్మించారు. సంధ్య సూర్యుడి భార్య . సూర్య తాపానికి తట్టుకోలేక ఆవిడ వెళ్తూ తన దాసి అయిన ఛాయకు సపర్యలు చేయమని వదిలి వెళుతుంది . ఆ సమయంలో వారిరువురి కలయికలో యముడు అతని చెల్లెలు యమి పుడతారు. తిరిగి వచ్చిన సంధ్య కోపించుకొని వెళ్ళి అశ్వరూపం గుర్రము లాగా తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు వెతుకుతూ పోయి అశ్వరూపంలో ఉన్నా భార్యను కలుస్తాడు. వాళ్లకు అశ్విని కుమారులు కవలలు పుడతారు. వారినే అశ్విని దేవతలుగా పూజిస్తారు.[6]
మహాభారతంలో మాద్రికి అశ్విని దేవతల వరంగా నకుల సహదేవులు పుడతారు.
- కంచి కామాక్షి.
- మధుర విూనాక్షి.
- కాశీ విశాలాక్షి.
అగ్ని దేవుళ్ళు ఎనమండుగురని పురాణ వచనం. వారు 1. అగ్ని, 2. అజరాప్రభుడు, 3. జాతవేదుడు, 4. నర్యాపసుడు, 5. పంక్తిరథుడు, 6. విసర్పుడు, 7. వైశ్వానరుడు, 8. సహోజుడు.
అధి దేవతలు
[మార్చు]మనో బుద్ధీంద్రియాలను అనుగ్రహించే చంద్రుడు, బృహస్పతి మొదలైన దేవతలు. మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తానికి క్షేత్రజ్ఞుడు, అహంకారానికి రుద్రుడు, శ్రవణేంద్రియానికి దిగ్దేవతలు, త్వగింద్రియానికి (చర్మం) వాయువు, కంటికి సూర్యుడు, జిహ్వకు వరుణుడు, నాసికకు అశ్వినీ దేవతలు, వాక్కునకు అగ్ని, హస్తానికి ఇంద్రుడు, పాదానికి విష్ణువు, పాయువుకు (గుదము) మృత్యువు, ఉపస్థేంద్రియానికి ప్రజాపతి, పంచప్రాణాలకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు అధి దేవతలు.[9]
మూలాలు
[మార్చు]- ↑ Webdunia. "God | Religion | Indra | Varuna | Yagna | Yaga | దేవతలు ఎంత మందో మీకు తెలుసా..!?". Webdunia. Retrieved 2025-11-30.
- ↑ "Aditi, The Mother of Gods, Goddess Aditi Worship,". Astroved Astropedia (in ఇంగ్లీష్). Retrieved 2025-11-30.
- ↑ "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. Retrieved 2025-12-18.
- ↑ Charya, M. N. (2021-09-03). "హిందువుల దేవతలు 33 కోట్ల మంది ఎవరు..దేవతల గురించి వేదాలు ఏం చెబుతున్నాయి..?". https://telugu.oneindia.com. Retrieved 2025-11-30.
{{cite web}}: External link in(help)|website= - ↑ selvi. "భీష్ముడు గంగాదేవికి ఎలా పుత్రుడిగా జన్మించాడు." telugu.webdunia.com. Retrieved 2020-08-24.
- ↑ అశ్వనీదేవతలు : పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
- ↑ అక్షి దేవతలు / అక్షి త్రయం : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
- ↑ అగ్ని దేవతలు : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
- ↑ అధి దేవతలు : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010