Jump to content

సూర్యుడు

వికీపీడియా నుండి
సూర్యుడు ☉
సూర్యుడు
సూర్యుడు
పరిశీలన డేటా
సగటు దూరం
భూమి నుంచి
1.496×1011 m
8.31 min at light speed
దృశ్య ప్రకాశం  (V) 26.74m [1]
Absolute magnitude 4.83m [1]
Spectral classification G2V
కోణీయ పరిమాణం 31.6' - 32.7' [2]
విశేషణాలు సౌర
కక్ష్యా ధర్మాలు
సగటు దూరం
పాలపుంత కేంద్రం నుంచి
~2.5×1020 m
26,000 light-years
గాలక్టిక్ period 2.25–2.50×108 a
వేగం 2.17×105 m/s
(orbit around the center of the Galaxy)

2×104 m/s
(relative to average velocity of other stars in stellar neighborhood)
భౌతిక ధర్మాలు
సగటు వ్యాసార్ధం 1.392×109 m [1]
109 భూమి
సౌరమధ్యరేఖ వద్ద వ్యాసార్థం 6.955×108 m [3]
సౌరమధ్యరేఖ వద్ద చుట్టుకొలత 4.379×109 m [3]
Flattening 9×106
ఉపరితల వైశాల్యం 6.088×1018 [3]
11,900 భూమి
పరిమాణము 1.4122×1027 [3]
1,300,000 భూమి
ద్రవ్యరాశి 1.9891 ×1030 kg[1]
332,946 భూమి
సగటు సాంద్రత 1.409 ×103 kg/m³ [3]
సౌరమధ్యరేఖ వద్ద ఉపరితల సాంద్రత 274.0 m/s2 [1]
27.94 g
పలాయన వేగం
(ఉపరితలం నుండి)
617.7 km/s [3]
55 భూమి
ఉపరితల
ఉష్ణోగ్రత (సార్థక)
5,778 K [1]
కొరోనా
ఉష్ణోగ్రత
~5,000,000 K
కోర్
ఉష్ణోగ్రత
~15,710,000 K [1]
ప్రకాశత్వం (Lsol) 3.846×1026 W [1]
~3.75×1028 lm
~98 lm/W efficacy
సగటు ఇంటెన్సిటీ (Isol) 2.009×107 W m-2 sr-1
భ్రమణ ధర్మాలు
వక్రత 7.25° [1]
(to the ecliptic)
67.23°
(to the galactic plane)
రైట్ ఎసెన్షన్
-ఉత్తర-ధ్రువానిది[4]
286.13°
19 h 4 min 30 s
డిక్లనేషన్
ఉత్తర ధ్రువానిది
+63.87°
63°52' North
సైడిరియల్ భ్రమణ కాలం
(16° అక్షాంశం)
25.38 days [1]
25 d 9 h 7 min 13 s[4]
(సౌరమధ్యరేఖ వద్ద) 25.05 రోజులు [1]
(at poles) 34.3 రోజులు [1]
భ్రమణ వేగం
(సౌరమధ్యరేఖ వద్ద)
7.284 ×103 km/h
సౌరావరణంలోని భాగాలు (ద్రవ్యరాశి పరంగా)
హైడ్రోజన్ 73.46 %
హీలియం 24.85 %
ఆక్సిజన్ 0.77 %
కార్బన్ 0.29 %
ఇనుము 0.16 %
గంధకము (సల్ఫర్) 0.12 %
నియాన్ 0.12 %
నైట్రోజన్ 0.09 %
సిలికాన్ 0.07 %
మెగ్నీషియమ్ 0.05 %

సూర్యుడు సౌర వ్యవస్థకు మధ్యలో ఉన్న నక్షత్రం. ఇది వేడి ప్లాస్మాతో కూడుకుని ఉన్న దాదాపు పరిపూర్ణమైన గోళాకారపు భారీ ఖగోళ వస్తువు. దాని కేంద్రంలో జరిగే అణు సంలీన చర్యల కారణంగా వేడెక్కి, ప్రకాశిస్తుంది. దాని ఉపరితలం నుండి శక్తిని ప్రధానంగా కనిపించే కాంతి రూపంలోను, పరారుణ వికిరణం రూపంలోనూ 10% అతినీలలోహిత శక్తి లాగానూ ప్రసరింపజేస్తుంది. సూర్యుడు భూమిపై జీవానికి ప్రధానమైన శక్తి వనరు. పురాతన కాలం నుండి సూర్యుడు అనేక సంస్కృతులలో పూజనీయమైన వస్తువు. ఇది ఖగోళ పరిశోధనలకు కేంద్ర అంశంగా కూడా ఉంది.

సూర్యుడు గెలాక్సీ కేంద్రం నుండి 24,000 నుండి 28,000 కాంతి సంవత్సరాల దూరంలో గెలాక్సీ కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. భూమి నుండి దాని సగటు దూరం దాదాపు 1.496×108 కిలోమీటర్లు లేదా దాదాపు 8 కాంతి నిమిషాలు. సూర్యుడికి, భూమికీ మధ్య ఉన్న దూరాన్ని ఏస్ట్రనామికల్ యూనిట్ అంటారు. దీన్ని ఖగోళ దూరాలను నిర్వచించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఏస్ట్రనామికల్ యూనిట్ అంటే 149.5978707×106 కిలోమీటర్లు. సూర్యుడి వ్యాసం దాదాపు 1,391,400 km ఇది భూమికి 109 రెట్లు. సూర్యుని ద్రవ్యరాశి భూమి కంటే దాదాపు 330,000 రెట్లు. సౌర వ్యవస్థ మొత్తం ద్రవ్యరాశిలో 99.86% సూర్యుడే. సూర్యుని ఉపరితల పొరను ఫోటోస్పియర్అంటారు. దీనిలో ఎక్కువగా హైడ్రోజన్ (~73%), హీలియం (~25%) లు ఉంటాయి. ఆక్సిజన్, కార్బన్, నియాన్, ఇనుము వంటి భారీ మూలకాలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి.

సూర్యుడు ఒక G-రకం ప్రధాన శ్రేణి నక్షత్రం (G2V). ఈ రకం నక్షత్రాలను అనధికారికంగా పసుపు మరుగుజ్జులు (యెల్లో డ్వార్ఫ్) అని అంటారు. అయితే వాస్తవానికి దాని కాంతి తెల్లగా ఉంటుంది. ఇది సుమారుగా 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద పరమాణు మేఘంలో, ఒక ప్రాంతంలో ఉన్న పదార్థం గురుత్వాకర్షణ పతనం చెంది సూర్యుడు ఏర్పడింది. ఈ పదార్థంలో ఎక్కువ భాగం మధ్యలో గుమిగూడింది; మిగిలినది దాని చుట్టూ కక్ష్యలో తిరుగుతూ, చదునుగా చక్రం రూపంలోకి మారింది. అదే సౌర వ్యవస్థగా మారింది. సూర్యుడి కేంద్రంలో ద్రవ్యరాశి చాలా వేడిగాను, సాంద్రంగానూ అవుతూ పోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే, ఆ వేడికి దాని కేంద్రంలో అణు సంలీనం మొదలైంది. ఈ సంలీన చర్యలో ప్రతి సెకండుకు, సూర్యుని గర్భంలో సుమారు 600 బిలియన్ కిలోగ్రాముల (కిలోలు) హైడ్రోజన్‌ హీలియంగా మారిపోతూ ఉంటుంది. అదే సమయంలో 4 బిలియన్ కిలోగ్రాముల పదార్థం శక్తిగా మారుతుంది.

ఇప్పటి నుండి దాదాపు 4 నుండి 7 బిలియన్ సంవత్సరాల తర్వాత, సూర్యుని కేంద్రంలో హైడ్రోజన్ సంలీనం తగ్గిపోయి, హైడ్రోస్టాటిక్ సమతుల్యత లేని స్థితికి చేరుకుంటుంది. దాని కేంద్రంలో సాంద్రత, ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతాయి. దీని వలన సూర్యుడి బయటి పొరలు విస్తరించి, చివరికి రెడ్ జయంట్‌గా మారుతుంది. రెడ్ జయంట్‌ దశ తర్వాత, సూర్యుడు దాని బయటి పొరలను విసర్జించి దట్టమైన శీతలీకరణ నక్షత్రం (తెల్ల మరగుజ్జు) గా మారుతుందనీ, అపై సంలీనచర్య ద్వారా శక్తిని ఉత్పత్తి చేయదనీ నమూనాలు చూపిస్తున్నాయి. కానీ, అప్పటికీ అది ప్రకాశిస్తూనే ఉంటుంది. గతంలో జరిగిన సంలీన చర్య నుండి వెలువడిన వేడిని బహుశా కొన్ని ట్రిలియన్ల సంవత్సరాల పాటు విడుదల చేస్తూనే ఉంటుంది. ఆ తరువాత, ఇది చాలా దట్టమైన నల్ల మరగుజ్జుగా మారుతుందనీ, ఆ స్థితిలో దాదాపుగా శక్తిని విడుదల చేయదనీ సిద్ధాంతీకరించారు.

సాధారణ లక్షణాలు

[మార్చు]
సూర్యుడితో సహా సౌర వ్యవస్థలోని ప్రధాన ఖగోళ వస్తువుల పరిమాణ పోలిక

సూర్యుడు ఒక G-రకం ప్రధాన శ్రేణి నక్షత్రం,. సౌర వ్యవస్థ మొత్తం ద్రవ్యరాశిలో దాదాపు 99.86% సూర్యుడి లోనే ఉంటుంది. దీని యాబ్సల్యూట్ మాగ్నిట్యూడ్ +4.83. ఇది పాలపుంతలోని 85% నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా ఉంటుందని అంచనా వేసారు. ఈ నక్షత్రాల్లో ఎక్కువ భాగం ఎర్ర మరగుజ్జులు.[5] సూర్యుని నుండి 23 కాంతి సంవత్సరాల దూరం లోపల ఉన్న నక్షత్రాల్లో 95% కంటే ఎక్కువ భారీగా ఉంటుంది. సౌర వ్యవస్థలో బంగారం, యురేనియం వంటి భారీ మూలకాల సమృద్ధి ఎక్కువగా ఉంటుంది. అందుచేత సూర్యుడు, పాపులేషన్ I నక్షత్రం, లేదా భారీ మూలకాలతో కూడిన [a] నక్షత్రం అని వర్గీకరించారు.[6] దీని పుట్టుక, సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం, సమీపంలో కరిగిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సూపర్నోవాల నుండి వెలువడ్డ షాక్‌వేవ్‌ల ద్వారా ప్రేరేపితమై ఉండవచ్చు. పాపులేషన్ II నక్షత్రాలలో భారీ-మూలకాలు తక్కువ సమృద్ధిగా ఉంటాయి. ఈ భారీ మూలకాలు, సూపర్నోవా సమయంలో ఎండోథెర్మిక్ అణు చర్యల ద్వారా గానీ, భారీగా ఉండే రెండవ తరం నక్షత్రంలో న్యూట్రాన్ శోషణ వలన జరిగే ట్రాన్స్‌మ్యుటేషన్ ద్వారా గానీ ఉత్పత్తి అయి ఉండవచ్చునని భావిస్తున్నారు.[6]

భ్రమణం

[మార్చు]

సూర్యుడు దాని ధ్రువాల వద్ద కంటే దాని మధ్యరేఖ వద్ద వేగంగా తిరుగుతాడు. ఉష్ణప్రసరణ కదలిక, సూర్యుని భ్రమణం కారణంగా కోరియోలిస్ శక్తి వల్ల సంవహనం ఏర్పడి ఈ అవకలన భ్రమణం సంభవిస్తుంది. నక్షత్రాల రిఫరెన్స్ ఫ్రేము నుండి చూస్తే, సూర్యమధ్యరేఖ వద్ద భ్రమణ కాలం సుమారు 25.6 రోజులు ఉండగా, ధ్రువాల వద్ద ఇది 33.5 రోజులు ఉంటుంది. సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమి నుండి చూస్తే, సూర్యమధ్యరేఖ వద్ద సూర్యుని భ్రమణ కాలం దాదాపు 28 రోజులు.[7] దాని ఉత్తర ధ్రువం పైనుండి చూస్తే, సూర్యుడు దాని భ్రమణాక్షం చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతుంది.[b][8]

సౌర సారూప్యాల సర్వే ప్రకారం, ప్రారంభంలో సూర్యుడు నేటి కంటే పది రెట్లు వేగంగా తిరిగేది. అందువల్ల ఉపరితలం మరింత చురుకుగా ఉండేది. ఎక్స్-రే, UV ఉద్గారాలు ఎక్కువగా ఉండేవి. సన్‌స్పాట్లు ఉపరితలంలో 5%–30% వరకూ విస్తరించి ఉండేవి.[9] సూర్యుని అయస్కాంత క్షేత్రం బయటకు ప్రవహించే సౌర గాలితో సంకర్షణ చెందడంతో, అయస్కాంత బ్రేకింగ్ జరిగి భ్రమణ వేగం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆదిమ కాలం నాటి ఈ వేగవంతమైన భ్రమణపు అవశేషం ఇప్పటికీ సూర్యుని కేంద్రంలో ఉంది - కేంద్రం వారానికే ఒక భ్రమణం పూర్తి చేస్తుంది. ఈ వేగం సగటు ఉపరితల భ్రమణ వేగానికి నాలుగు రెట్లు ఉంటుంది.[10]

కూర్పు

[మార్చు]

సూర్యుడిలో ప్రధానంగా హైడ్రోజన్, హీలియం మూలకాలు ఉంటాయి. సూర్యుని జీవితంలోని ప్రస్తుత సమయంలో, ఫోటోస్పియర్‌లో సూర్యుని ద్రవ్యరాశిలో అవి 74.9%, 23.8% ఉంటాయి. బరువైన మూలకాలన్నీ - వీటిని ఖగోళ శాస్త్రంలో లోహాలు అంటారు - కలిసి సూర్యుని ద్రవ్యరాశిలో 2% లోపే ఉంటాయి. ఈ లోహాల్లో ఆక్సిజన్ (సూర్యుని ద్రవ్యరాశిలో దాదాపు 1%), కార్బన్ (0.3%), నియాన్ (0.2%), ఇనుము (0.2%) అత్యంత సమృద్ధిగా ఉంటాయి.[11]

సూర్యుని లోని ఒరిజినల్ రసాయనిక కూర్పు, అది ఏర్పడిన ఇంటర్‌స్టెల్లార్ మాధ్యమం నుండి వారసత్వంగా వచ్చింది. తొలుత ఇందులో దాదాపు 71.1% హైడ్రోజన్, 27.4% హీలియం, 1.5% బరువైన మూలకాలూ ఉండేవి. సూర్యునిలోని హైడ్రోజన్, హీలియంలలో ఎక్కువ భాగం విశ్వపు మొదటి 20 నిమిషాలలో, బిగ్ బ్యాంగ్ న్యూక్లియోసింథసిస్ ద్వారా ఉత్పత్తి అయినవే. బరువైన మూలకాలు సూర్యుడు ఏర్పడటానికి ముందరి మునుపటి తరాల నక్షత్రాల నుండి ఉత్పత్తి అయ్యాయి. ఆ నక్షత్రాల జీవితపు చివరి దశలలోను, సూపర్నోవా వంటి సంఘటనల ద్వారానూ ఇంటర్స్టెల్లార్ మాధ్యమంలోకి ఇవి వ్యాపించాయి.[12]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 NASA "Sun Fact Sheet"
  2. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. "Eclipse 99 - Frequently Asked Questions". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: October 16, 2007.
  3. 1 2 3 4 5 6 Sun:Facts & figures NASA Solar System Exploration page
  4. 1 2 Seidelmann PK, Abalakin VK, Bursa M, Davies ME, de Bergh C, Lieske JH, Oberst J, Simon JL, Standish EM, Stooke P, Thomas PC (2000). "Report Of The IAU/IAG Working Group On Cartographic Coordinates And Rotational Elements Of The Planets And Satellites: 2000". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2006-03-22.
  5. Than, K. (2006). "Astronomers Had it Wrong: Most Stars are Single". Space.com. ఒరిజినల్ నుండి 21 December 2010 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 August 2007.
  6. 1 2 Zeilik, M. A.; Gregory, S. A. (1998). Introductory Astronomy & Astrophysics (4th ed.). Saunders College Publishing. p. 322. ISBN 978-0-03-006228-5.
  7. Phillips, K. J. H. (1995). Guide to the Sun. Cambridge University Press. pp. 78–79. ISBN 978-0-521-39788-9.
  8. "The Anticlockwise Solar System". Australian Space Academy. ఒరిజినల్ నుండి 7 August 2020 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 July 2020.
  9. Guinan, Edward F.; Engle, Scott G. (June 2009). The Sun in time: age, rotation, and magnetic activity of the Sun and solar-type stars and effects on hosted planets. The Ages of Stars, Proceedings of the International Astronomical Union, IAU Symposium. Vol. 258. pp. 395–408. arXiv:0903.4148. Bibcode:2009IAUS..258..395G. doi:10.1017/S1743921309032050.
  10. Darling, Susannah (1 August 2017). "ESA, NASA's SOHO Reveals Rapidly Rotating Solar Core". NASA. ఒరిజినల్ నుండి 1 June 2024 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 May 2024.
  11. Hansen, C. J.; Kawaler, S. A.; Trimble, V. (2004). Stellar Interiors: Physical Principles, Structure, and Evolution (2nd ed.). Springer. pp. 19–20. ISBN 978-0-387-20089-7.
  12. Hansen, C. J.; Kawaler, S. A.; Trimble, V. (2004). Stellar Interiors: Physical Principles, Structure, and Evolution (2nd ed.). Springer. pp. 77–78. ISBN 978-0-387-20089-7.

వివరణలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "heavy elements" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "rotation" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
"https://te.wikipedia.org/w/index.php?title=సూర్యుడు&oldid=4886394" నుండి వెలికితీశారు