బుధుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుధుడు ☿
బుధుడు
బుధుడు

అసహజ రంగులో బుధుడు
కక్ష్యా లక్షణాలు[1]
Epoch J2000
అపహేళి: 69,816,900 km
0.466697 AU
పరిహేళి: 46,001,200 km
0.307499 AU
Semi-major axis: 57,909,100 km
0.387098 AU
అసమకేంద్రత (Eccentricity): 0.205630
కక్ష్యా వ్యవధి: 87.9691 d
(0.240846 a)
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: 115.88 d[2]
సగటు కక్ష్యా వేగం: 47.87 km/s[2]
మీన్ ఎనామలీ: 174.796°
వాలు: 7.005°
3.38° to Sun’s equator
Longitude of ascending node: 48.331°
Argument of perihelion: 29.124°
దీని ఉపగ్రహాలు: లేవు
భౌతిక లక్షణాలు
సగటు వ్యాసార్థం: 2439.7 ± 1.0 km[3][4]
0.3829 Earths
ఉపరితల వైశాల్యం: 7.48×107 km²
0.108 Earths[3]
ఘనపరిమాణం: 6.083×1010 km³
0.054 Earths[3]
ద్రవ్యరాశి: 3.3022×1023 kg
0.055 Earths[3]
సగటు సాంద్రత: 5.427 g/cm³[3]
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: 3.7 m/s²
0.38 g[3]
పలాయన వేగం: 4.25 km/s[3]
సైడిరియల్ రోజు: 58.646 day (58 d 15.5 h)[3]
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: 10.892 km/h
అక్షాంశ వాలు: 0.01°[2]
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: 18 h 44 min 2 s
281.01°[2]
డిక్లనేషన్: 61.45°[2]
అల్బిడో: 0.119 (bond)
0.106 (geom.)[2]
ఉపరితల ఉష్ణోగ్రత:
   0°N, 0°W
   85°N, 0°W
కనిష్ఠసగటుగరిష్ఠ
100 K340 K700 K
80 K200 K380 K
Apparent magnitude: up to -1.9[2]
Angular size: 4.5" — 13"[2]
విశేషాలు: Mercurian
వాతావరణం
ఉపరితల పీడనం: trace
సమ్మేళనం: [ఆధారం చూపాలి]
31.7% Potassium
24.9% Sodium
9.5% Atomic Oxygen
7.0% Argon
5.9% Helium
5.6% Molecular Oxygen
5.2% Nitrogen
3.6% Carbon dioxide
3.4% Water
3.2% Hydrogen

బుధుడు సౌరమండలములోని ఒక లోపలి గ్రహం. సూర్యునికి అత్యంత దగ్గరలో ఉంది. దీనికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టేకాలం 88 రోజులు.

భౌతికంగా బుధుడు చంద్రుడంతటివాడు. దీనిపై క్రేటర్లు ఎక్కువ. దీనికి ఉపగ్రహాలు లేవు.

బుధ గ్రహం గురించి ఇతర వివరాలు:

[మార్చు]
  1. అన్నింటికన్నా సూర్యునికి అతి దగ్గరగా వున్న గ్రహం. బుధుడు.
  2. భుధుని వ్యాసం: 4878 కిలో మీటర్లు.
  3. సూర్యునికి... బుధునికి మద్య దూరం: సుమారు 57909100 కిలోమీటర్ల దూరం.
  4. బుధుడు తన చుట్టు తాను తిరగడానికి పట్టే కాలం; 58 రోజుల, 10 గంటలా, 30 నిముషాల, 34 సెకండ్లు.
  5. బుధుడు సూర్యుని చుట్టు తిరగడానికి పట్టే కాలం: 88 రోజులు.
  6. బుధుడు సూర్యుఇ చుట్టు తిరిగే వేగం: గంటకు 17 లక్షలా 60 వేల కిలో మీటర్లు.

వేదాలలో బుధుడు

[మార్చు]

వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు.అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును.తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము.అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది.సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.

సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము.గ్రహశబ్దమునకు గ్రహణ' మనియు అర్ధము ఉంది. భానోర్ గ్రహే, సకలగ్రహే అని సూర్యసిద్ధాంతము. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. రాహువు ఆక్రమితును కావున రాహువు గ్రహము.

అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు.

చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక ఉంది. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను.

గ్రహముల పరస్పర సామీప్యముగాని, గ్రహనక్షత్రముల సామీప్యముగాని కలిగినప్పుడు సంగ్రామము కలుగును. క్రాంతివృత్తమున ఉత్తరార్ధమున దేవగణమును, దక్షిణార్ధమున అసురగణమును ఉండునని ప్రసిద్ధము. ఇవియే గ్రహముల సంధానము.

బుధుడు

వాయు పురానములో సూర్యచంద్ర నక్షత్ర శుక్రబుధకు కుజ బృహస్పతి శనులు ఒకరిపై ఒకరు ఉన్నరని తెలియపరచబడింది. బుధాది గ్రహము 5దును కామరూపము గల ఈశ్వరుడు లని ఉంది.వాయువు, బుధ, శని, కుజ, శుక్రలు అష్టమూర్తి యగు ఈశ్వరుని సంతానమని విష్ణు పురాణములో ఉంది. బుధునకు కుమారుడను ఒక పేరు. వేదమునందు అగ్ని కుమారుడు. పురాణములందు కార్తికేయుడు కుమారుడు. బుధ కార్తికేయులిరువురును ఇషీకాస్తంబ జాతులు. తారకాసురుడు వధకథకు కార్తికేయుడును, అసురవధకు బుధుడును పుట్టినారని పరాశరుడు వ్రాసినాడు. ధనష్ఠతో కూడిన ద్వాదశినాడు బుధుడు పుట్టెనని గ్రహయజ్ఞతత్వము. ధనిష్ఠలో అయనము నివృత్తమగుడు కృత్తికలో విషువముఉండుటజేసి ధనిష్ఠాకృత్తికల సంబంధము విదితము.

ఇవీ చూడండి

[మార్చు]

నోట్స్, మూలాలు

[మార్చు]
  1. JPL HORIZONS System
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 Williams, Dr. David R. (September 1, 2004). "Mercury Fact Sheet". NASA. Retrieved 2007-10-12.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 "NASA: Solar System Exploration: Planets: Mercury: Facts & Figures". Archived from the original on 2014-04-08. Retrieved 2008-03-25.
  4. Seidelmann, P. Kenneth; Archinal, B. A.; A’hearn, M. F. (2007). "Report of the IAU/IAGWorking Group on cartographic coordinates and rotational elements: 2006". Celestial Mechanics and Dynamical Astronomy. 90: 155–180. doi:10.1007/s10569-007-9072-y. Retrieved 2007-08-28.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బుధుడు&oldid=4148443" నుండి వెలికితీశారు